Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జెన్ జీ ! దీన్ని కూడా ఓ తిట్టులా మార్చేసింది జబర్దస్త్ ! ఖర్మరా బాబూ !!

August 28, 2026 by M S R

.

జెన్ జీ వేరు- కాక్రోచ్ పార్టీ వేరు… రెంటినీ ఒకే గాటన కట్టడం తప్పు… జెన్ జీ అంటే ఒక ఏజ్ గ్రూపు, ఒక తరం… (జెనరేషన్ జెడ్)… 1997- 2012 నడుమ పుట్టిన పిల్లలు… సరే, విషయానికి వద్దాం…

ఈటీవీలో వచ్చే జబర్దస్త్ అనే ఓ కామెడీ షో కంటెంటులో ఎంత వెగటు, ఎంత రోత ఉంటుందో అందరికీ తెలుసు… ఎన్ని విమర్శలు వచ్చినా సరే అదలాగే కొనసాగుతూ ఉంటుంది… రోజా, నాగబాబు వంటి ప్రజాజీవితంలో ఉన్న నాయకులు సైతం అక్కడ జడ్జిగా ఉండీ, అలాంటి వెకిలితనాన్ని ఎంజాయ్ చేస్తూ, నవ్వుతూ, అదే హాస్యంగా చూపిస్తూ ఉంటారు… అదొక విషాదం…

Ads

నిజానికి జెమినిలో వస్తున్న మాస్ జాతర కామెడీ షో బాగుంటోంది… జానీ మాస్టర్, బిందు మాధవి, నవదీప్, దీపిక, సుప్రీత, యాదమరాజు తదితరులతో, చాలామంది కొత్త కొత్త ఆర్టిస్టులతో స్కిట్లు బాగానే ఉంటున్నాయి… సద్దాం ఈటీవీకి జంపయ్యాడు… ఐనా జబర్దస్త్ మాత్రం మారదు, మారడం లేదు… ఈమధ్య స్కిట్లలోకి పాత వాళ్లను, గెస్ట్ సెలబ్రిటీలను కూడా తీసుకొచ్చి నటింపజేస్తున్నారు… బేసిక్‌గా కంటెంటు మాత్రం అదే…

ఓ ప్రోమో కనిపించింది… అందులో చంటి ఉన్నాడు ఓ సీసా పట్టుకుని, దేవదాసు పేరడీ… సీత అని మరో టీవీ సెలబ్రిటీ (రెగ్యులర్ ఆర్టిస్టు కాదు) వస్తుంది… చంటి ఆవేశంతో మాట్లాడుతూ ప్రేమ అన్నావు, ఇష్క్ అన్నావు, నాన్నకు అనారోగ్యం అన్నావు, తల్లికి కేన్సర్ అన్నావు, నా డబ్బులు దొబ్బేశావు, తరువాత వదిలేశావు అంటూ… జెన్ జీ అంటాడు సీత వైపు అసయ్యంగా చూస్తూ… అంటే అది ఓ తిట్టులాగా…

అదీ చంటి స్కిట్ రాసిన ఎవరో మహానుభావుడి అవగాహన… జెన్ జీ అంటే మోసగాళ్లు, ద్రోహులు అనా వీళ్ల భావన..? అదేనా చెప్పదలుచుకున్నది… అదేదో మస్తు పంచ్ ఉన్న జోక్ అనుకుని రష్మి, నాగబాబు, ఇంద్రజ పకపకా నవ్వారు ఎప్పటిలాగే… వాళ్ల సోయి కూడా అంతే అన్నమాట…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అయ్యా, దొరవారూ… స్వరాష్ట్ర పాలనలో ఇదా నీ దైత్య పాలన !!
  • జెన్ జీ ! దీన్ని కూడా ఓ తిట్టులా మార్చేసింది జబర్దస్త్ ! ఖర్మరా బాబూ !!
  • టాక్సిక్ డైలాగ్స్ ! ఇది తెలుగేనా..? ఓ ఆసక్తికరమైన చర్చ !!
  • ఓహ్.., బాబా రాందేవ్ వుమెన్ ఇన్నర్‌వేర్ కూడా అమ్ముతున్నాడా..?!
  • ఫుట్‌పాత్ ఎవరిది ? ఢిల్లీ హైకోర్టులో ఓ ఇంట్రస్టింగ్ కేసు – తీర్పు !
  • Toxic – ఎందుకు డిజాస్టర్ అయ్యిందో తెలుసా..? ఇదుగో ఇందుకు !!
  • ఒక చిరంజీవి- ఆ ముగ్గురు స్నేహితులు ! ఓ మంచి పాజిటివ్ వైబ్స్ !!
  • SIR – పెద్ద ట్విస్టు ఏమిటంటే… ముసాయిదాలో పేరున్నా ఫైనల్ కాదు !!
  • మన వ్యవస్థలు ఎంత గుడ్డివో ఇంత క్లియర్‌గా చెప్పిన కేసు లేదు !!
  • అంతే… ఈ క్షుద్ర ఆంధ్రా మీడియాకు మర్యాద దక్కొద్దు నాయకా !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions