.
మరో బిగ్ వికెట్ దొరికింది… భూపాలపల్లి జిల్లా మైనింగ్ ఏడీ జయరాజ్, ఆయన బంధువుల ఇళ్లు కలిపి 12 చోట్ల దాడులు చేస్తే 100 కోట్ల అక్రమాస్తులు బయటపడ్డాయి… ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం కదా, ఏసీబీ ఎవరిని తన్నినా మినిమం వంద కోట్ల రాలుతున్నాయని ! ఇది మరో డైనోసార్ !!
ఇది చదువుతుంటే మీడియాలో ఓ లిస్టు కనిపించింది… కొన్నాళ్ల ఆ లిస్టులో 25 మంది ఆఫీసర్ల అక్రమాస్తుల విలువ 4320 కోట్లు అట… దాదాపు 56 మందిపై ఆదాయాన్ని మించిన ఆస్తుల కేసులు బుక్కయ్యాయి… ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటంటే..? తెలంగాణ ఏర్పడ్డాక బాగుపడింది ఎవరు..? ఇదీ అసలు ప్రశ్న…
Ads
కేసీయార్ కుటుంబం, బంధుగుణం, తన సామాజికవర్గం, తన అస్మదీయులే కాదు… తన అక్రమాలే కాదు, మొత్తం సమాజాన్నే కలుషితం చేశాడు అవినీతితో… ఇదీ అర్థమవుతున్న అసలైన విషాదం…

కళ్లు తిరిగే స్థాయిలో అధికారుల అవినీతి కనిపిస్తోంది… వీళ్లే కాదు… గొర్రెల స్కీమ్, చేపల స్కీమ్, బర్రెల స్కీమ్ నుంచి ప్రతిదీ అవినీతి మయమే… కాళేశ్వరం నుంచి ఫార్ములా వన్ దాకా… ఏది చూసినా అవినీతి కంపు యవ్వారమే… చివరకు వందల మంది రైస్ మిల్లర్లు వేల కోట్లు తిన్నారు, అందులో ఎక్కువగా బీఆర్ఎస్ సానుభూతిపరులు, నాయకులు కూడా..!
మరి అధికారులే ఈ రేంజులో సంపాదించారంటే… కీలకమైన స్థానాల్లో ఉండే మంత్రులు, నాయకులు, ఇతర ప్రజాప్రతినిధుల మాటేమిటనే ప్రశ్న సహజంగానే ఓ సగటు తెలంగాణవాసి మనసులో పుట్టే ప్రశ్న… బయటపడేవి జస్ట్ కొన్ని ఉదాహరణలు మాత్రమే… the tip of the iceberg … కనిపించని అనకొండలు ఎన్నో…
కేసీయార్ పాలనలో మరో దరిద్రం ఏమిటంటే..? ఏసీబీని పూర్తిగా నిర్వీర్యం చేశాడు… అసలు అవినీతి అనేది పెద్ద ఇష్యూయే కాదు అన్నట్టు పాలించాడు దొర… ప్రత్యేకించి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎవరికి ఎంత అందితే అంత తిన్నారు… చివరకు మేడిగడ్డ ఈ పాపభారాన్ని మోయలేక తస్కింది… అదీ ఫలితం…
ఇప్పుడు ఏసీబీ సెలెక్టెడ్గానైనా పెద్ద పెద్ద అనకొండల్నే టార్గెట్ చేస్తోంది… ఇంకా 100 మంది దాకా ఏసీబీ హిట్ లిస్టులో ఉన్నారని సమాచారం… రేవంత్ రెడ్డి ఆ విభాగానికి స్వేచ్ఛ ఇచ్చిన ఫలితం అది… ఒక్కసారి ఆలోచించండి, ఆఫ్టరాల్ ఒక జిల్లా మైనింగ్ ఏడీ ఆస్తులే 100 కోట్లు అంటే, ఇంకా పెద్ద స్థానాల్లో ఉన్నవాళ్ల సంపాదన..?
పవర్ ప్రాజెక్టులు, పవర్ కొనుగోళ్లు, ఇరిగేషన్ పనులు, ఇవే కాదు… చివరకు క్విడ్ ప్రోకో పద్ధతిలో హరీష్ రావు దాదాపు వేయి కోట్ల పాలను అమ్మాడట కార్పొరేట్ హాస్పిటల్స్, కాలేజీలకు..! ఎవరో కాదు, కవితే స్పష్టంగా ప్రెస్ మీట్లలోనే చెబుతోంది… ఇదీ తాజాగా బయటపెట్టబడిందే… ఊహించలేని మార్గాల్లో, ఊహించనంత అక్రమార్జన…
ఇంకా విషాదం ఏమిటంటే… అవినీతి సొమ్ముతో తెగబలిసిన విలాసం… ఓ రైస్ మిల్లర్ తన కోరిక తీర్చుకోవడానికి సినిమా తీస్తాడు, ఓ ఇంజనీర్ తన కొడుకు పెళ్లిని ఏకంగా థాయ్‌లాండ్‌లో చేస్తాడు… అక్కడే ఎందుకో తెలుసు కదా… చివరకు రైస్ మిల్లర్లకు ఆ అసోసియేషన్ మద్దతు పోరాటాలు చేయడం మరో ట్రాజెడీ… రెవిన్యూ రికవరీ యాక్ట్, చివరకు గ్రేహౌండ్లను ఉపయోగిస్తున్నా… బలిసిన మిల్లర్లు ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు మనీ మిల్లింగ్ !!
బీఆర్ఎస్ క్యాంపు పదే పదే చెప్పే పిచ్చి డైలాగ్… తెలంగాణ వస్తే ఏమొచ్చింది? అవును, ఏమొచ్చింది, ఇదుగో ఇలాంటి ఓ క్షుద్ర రాక్షసగణాన్ని క్రియేట్ చేసింది… తెలంగాణ రావడం శుభం, ఇలాంటి అవినీతి అనకొండలు తెగబలిసిపోవడం అశుభం… అదీ కేసీయార్ పాలన బాపతు దుర్లక్షణాలు!!
ఇక ధరణి బాగోతాలు, హైదరాబాద్ భూకబ్జాలు గట్రా యవ్వారాలు తవ్వితే… ఆ పెంట దుర్వాసన కొన్ని కిలోమీటర్లు వ్యాపించొచ్చు… ఎటొచ్చీ రేవంత్ రెడ్డి ఓ ధైర్యం చేయగలడా..? కేసుల్లో పట్టుబడిన వాళ్లు ఏ స్థితిలోనూ తిరిగి కొలువుల్లో చేరకుండా… తమ కుటుంబ, బినామీ ఆస్తులు అమ్ముకోకుండా ఓ చట్టం తీసుకురాగలడా..? అదీ లోపరహితమైన చట్టం..! అక్రమార్కుడు జైళ్లలోనే మగ్గిపోవాల్సిన కఠినచట్టం !!
చివరగా… కేసీయార్ పాలనలో అవినీతి హిమాలయాల రేంజుకు పెరిగింది కదా… అది “GLOF” (Glacial Lake Outburst Flood) రేంజులో మనల్ని ముంచేయకూడదని ప్రార్థిద్దాం… నిన్న నేపాల్‌ను ముంచేసిన విపత్తు పేరు అదే…
Share this Article