Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మన వ్యవస్థలు ఎంత గుడ్డివో ఇంత క్లియర్‌గా చెప్పిన కేసు లేదు !!

August 27, 2026 by M S R

.

ఈరోజు చాలా పేపర్లలో బాగానే కవరైంది ఈ వార్త… మన సిస్టమ్స్ ఎంత దరిద్రంగా పనిచేస్తాయో చెప్పేందుకు ఓ ఉదాహరణ… కొందరు దశాబ్దాలుగా విచారణకు నోచుకోక జైళ్లలోనే కునారిల్లుతూ, కడతేరిపోతూ ఉంటే… కొందరు బెయిల్‌పై బయటికి వచ్చేసి దర్జాగా తిరిగేస్తూ ఉంటారు… కొన్ని కేసుల్లో 20 రూపాయల లంచానికి 30 ఏళ్లు విచారణ… ఏకంగా హైకోర్టు జడ్జిల ఇళ్లల్లోనే వందల కోట్ల తగలబడిపోతే ఏ శిక్షా ఉండదు…

ఆ వార్త సంక్షిప్తంగా చెప్పుకుందాం… ఓ హత్య కేసులో నందుల వీరన్నకి వరంగల్ కోర్టు 1983 జూన్ లో జీవితఖైదు విధించింది… అతన్ని చంచల్ గూడ జైలుకు తరలించగా… అదే ఏడాది డిసెంబరులో పెరోల్‌పై బయటికి వెళ్లాడు. 1984 మార్చి 17న గడువు ముగిసినా లొంగిపోలేదు. 1983 నుంచి వీరన్న మహబూబాబాద్ ప్రాంతంలోనే నివసిస్తున్నా అధికారులు సంప్రదించలేదు. కానీ 2024 మే 16న పోలీసులు ఇంటికి వచ్చి అరెస్ట్ చేశారు.

Ads

ఇక పెరోల్ ఇవ్వకూడదని మూడేళ్లు బ్యాన్ పెట్టారు, ఠాట్, ఇది అక్రమం, అన్యాయం అంటూ వీరన్న భార్య చారమ్మ ఏకంగా హైకోర్టులో పిటిషన్ వేసింది… ఏమిటి ఇందులో తీవ్రత అంటారా..? పెరోల్‌పై వచ్చి, తిరిగి జైలుకు వెళ్లకపోతే ఏకంగా 40 ఏళ్లపాటు సిస్టమ్ ఏమీ చేయలేకపోయింది… ఈలోపు తను టీచర్‌గా సెలక్ట్ అయ్యాడు… ఎంచక్కా కొలువు చేస్తూ బతికాడు… బయటే జీవితం, అందరిలాగే… పేరుకు జీవిత ఖైదీ…

సరే, అతను తన నేరచరిత్రను దాచి ఏకంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది… ఈ పెరోల్ గడువు ముగిసినా తిరిగి రాని కేసులపై ప్రత్యేకంగా ఓ టాస్క్‌ఫోర్స్ అవసరమనీ చెప్పింది… ఈ మొత్తం వార్తలో మరికొన్ని విషాదాలు, విస్మయాలు ఏమిటంటే..?

ప్రభుత్వ కొలువులోకి తీసుకుంటున్నప్పుడు సాధారణంగా ఏమైనా క్రిమినల్ రికార్డు ఉందా చెక్ చేస్తారు… కానీ ఓ జీవిత ఖైదీ అనే విషయం కూడా రికార్డ్ కాలేదు, రిపోర్ట్ చేయబడలేదు, ఎంక్వయిరీ చేసిన పోలీసులకు ఓ పే-ద్ద నమస్కారం… అన్నింటికీ మించిన ఆసక్తికరమైన విషయం… 2004 లో అతనికి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు సైతం వచ్చింది… మండల, రాష్ట్ర స్థాయి అధికారులు అంత గుడ్డిగా ఎలా ప్రతిపాదించారు..? అంతా గందరగోళం… వీరన్నా నువ్వు గ్రేట్ బ్రో… సిస్టమ్స్ ఎంత గుడ్డివో భలే నిరూపించావు… ఈ ఘనతను గుర్తించైనా నీకు మళ్లీ బెయిల్ ఇవ్వొచ్చు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘పంచనామా’ కాదు… పాత యాంకర్ ఉదయభాను ఇజ్జత్ పంచనామా!
  • రాముడికన్నా లక్ష్మణుడు కాస్త పొడుగు ఉండకూడదా ఏం?!
  • దానం అనర్హత కేసులో సుప్రీంకోర్టుకు టీబీజేపీ!
  • హార్వర్డ్ హైదరాబాద్‌కు..! ఇక విదేశీ విద్యకూ భాగ్యనగరం!!
  • ఫస్ట్ నుంచీ దానం జర్నీ అంతే … అదృష్టం- దురదృష్టం సమాంతరంగా!
  • ఆస్కార్‌కు గొందల్ ! భారీ పోటీ నడుమ ఈ మూవీయే ఎందుకు ఎంపిక?!
  • మమతకు దెబ్బ మీద దెబ్బ… డెస్టినీ ఎదురుతంతే… అంతే…
  • ఫస్ట్ కెప్టెన్ ఝాన్సీ! సరైన ఫలితమే! కానీ యాదృచ్ఛికమేనా?!
  • మీనాక్షి నటరాజన్! వదలక వెంటాడుతున్న ఆ రెండు కేసులూ !!
  • తెలంగాణ అమరుల కథలు వేర్వేరు- ఏ సోయీ లేని పార్టీల ప్రముఖులు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions