Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘నాణ్యమైన వీర్యాని’కి మస్తు గిరాకీ – ‘మంచి సంతానం’ కోసం అడ్డగోలు రేట్లు !!

September 1, 2026 by M S R

.

ఓసారి ప్రపంచ సుందరి మార్లిన్ మన్రో ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌ను అడుగుతుంది… మనం పెళ్లి చేసుకుందాం, నీ అంత తెలివైన, నా అంత అందమైన పిల్లల్ని కందాం… దానికి ఆయన సరే గానీ, నీ అంత తెలివైన, నా అంత అందమైన పిల్లలు పుడితే ఎలా అని చమత్కరిస్తాడు… ఇది ఎన్నేళ్లుగానో బాగా ప్రాచుర్యంలో ఉన్న జోక్…

నిన్న ఆంధ్రజ్యోతిలో ఓ వార్త చదివాక ఇదే గుర్తొచ్చింది… ‘‘పేరుకు వీర్యదానం (sperm donors and sperm donation) అంటున్నాం గానీ అది పెద్ద దందాగా మారింది… నేటి యువతతో వీర్యం నాణ్యత (కౌంట్) తగ్గి సంతానం కోసం ఐవీఎఫ్ సంతాన సాఫల్యకేంద్రాలను ఆశ్రయిస్తున్నారు… స్పెరమ్ బ్యాంకుల వద్దకు పరుగులు తీస్తున్నారు… వాళ్లు అడ్డగోలు రేట్లకు అమ్ముతున్నారు…’’ ఇదీ ఆ వార్త సారాంశం…

Ads

ఐతే అందులో మరికొన్ని ఇంట్రస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి… కొందరు యువకులు వీర్యదానాన్ని సారీ, వీర్యం అమ్మకాన్ని ఉపాధి మార్గంగా మార్చుకున్నారు… మరీ ఐఐటీ, ఐఐఎం, మెడిసిన్ తదితర ఉన్నత విద్యావంతుల వీర్యానికి బాగా డిమాండ్ ఉంది… అందులోనూ మంచి శరీరాకృతి, ఛాయ, పొడవు ఉంటే మరింత గిరాకీ…

నిజమే… ఎలాగూ పరాయి వీర్యం తప్పదని తెలిసినప్పుడు… అన్నిరకాల నాణ్యమైన సరుకు ( వీర్యం ) కావాలని కోరుకోవడంలో తప్పేమీ లేదు గానీ… సదరు ‘వీర్య తండ్రి’ లక్షణాలే పుట్టబోయే పిల్లలకు వస్తాయనే గ్యారంటీ ఏమీ లేదు… పండిత పుత్ర పరమశుంఠ అని మనకు ఓ జీవనవాస్తవ సూత్రం ఉంది కదా… పండితుని పుత్రుడు పండితుడే కావాలనేమీ లేదు… డార్విన్ పరిణామ సిద్ధాంతమూ అదే చెబుతుంది… ఐనా ఈ వెంపర్లాట, ఈ అధిక ధరలు ఆగవు… ఆశ… ఆశ… డిజైనర్ బేబీల కోసం… క్యాటలాగుల్లో ఆ వీర్య తండ్రి లక్షణాలు చూసి ఎంచుకుంటున్నారు…

నిజానికి వీర్య తండ్రి లక్షణాలు ఏమిటో, వివరాలు ఏమిటో గోప్యంగా ఉంచాలి… అన్నిరకాల ఆరోగ్య పరీక్షలు చేయించుకున్న వారి నుంచే వీర్యం సేకరించాలి… కానీ ఈ దందాలో అవన్నీ పట్టించుకునే వాడెవడు..? వాడికి ఏం రోగాలున్నాయో తెలియదు… అందుకని కొందరైతే సహజ పద్ధతుల్లో సంతానం కోసం పరాయి మొగుడిని ఆశ్రయించాలని ఒత్తిళ్ల సలహాలు ఇస్తుంటారు… ఐవీఎఫ్ సెంటర్ల దోపిడీ తప్పుతుంది కదాని… (నిజానికి భర్త నిస్సహాయతలో సంతానం కోసం సొంత కుటుంబంలోని మరో యోగ్యుడిని ఆశ్రయించొచ్చునని భారతమే చెప్పింది కదా)…

ఇక్కడ ఓ నిపుణుడి ఆందోళన, సందేహం కాస్త నవ్వు పుట్టించింది… ‘‘ఒకే డోనర్‌ డబ్బు కోసం పదుల సంఖ్యలో వేర్వేరు ప్రాంతాల్లో వీర్యదానం చేేస్తే… భవిష్యత్తులో ఒకే తండ్రికి పుట్టిన పిల్లలు తెలియకుండా పెళ్లిళ్లు చేసుకునే ప్రమాదం పొంచి ఉంది…’’

అసలు వీర్య తండ్రి (జెనెటివ్ ఫాదర్) వివరాలు తెలిస్తే కదా… కానీ ఒకవేళ అదే జరిగితే, ఇదొకరకం మేనరికం, అంటే… సొంత నెత్తురు… దానివల్ల జన్యుపరమైన లోపాలతో పిల్లలు పుట్టే ప్రమాదాన్ని మాత్రం సందేహించొచ్చు… కాకపోతే తల్లులు వేర్వేరు కాబట్టి, వేర్వేరు రక్తాలు కాబట్టి ఈ ప్రమాదమూ పెద్దగా పరిగణనలోకి తీసుకోవాల్సిన పనిలేదు…

బహుశా నాకు తెలిసి… ప్రెస్, పోలీస్, పొలిటిషియన్, ప్లీడర్ (Four P s)… వీళ్ల వీర్యానికి అస్సలు గిరాకీ ఉండదేమో… సమాజం ఏమాత్రం నమ్మదు కదా వీళ్లను !! (వీర్యానికి సంబంధం లేని మరో P ఉంది, దాన్నీ సమాజం నమ్మదు, ఇష్టపడదు… ప్రాస్టిట్యూట్)… 😆😆 (సరదాగా)…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘నాణ్యమైన వీర్యాని’కి మస్తు గిరాకీ – ‘మంచి సంతానం’ కోసం అడ్డగోలు రేట్లు !!
  • ఆల్ ది బెస్ట్ సుజయ్ S/o ETV సుమన్… రామోజీ ఏకైక మగవారసుడు…
  • రేవంత్ రెడ్డి తిట్టాడు సరే – కానీ ఒక్క ప్రశ్నకూ జవాబివ్వలేని BRS క్యాంపు !!
  • అల్లు అరవింద్ మాటల్లో తప్పు లేదు- తను యశ్‌ను కించపరచలేదు !!
  • బ్రెజిల్‌లో ఈ ఆవు ధర 36 కోట్లు !! ఆ జాతికి పూర్వీకులు మన పశువులే !!
  • ఏశ నాగుల కట్ట మీద – కంట్రవర్సీ ఏమిటి..? తప్పెవరిది..? రైట్స్ ఎవరివి..?
  • సమాజం అంతే, సర్కారూ అంతే – స్పందనను పూర్తిగా కోల్పోయాయి
  • చెలరేగిపోతున్న హిజ్రా మాఫియా ! చెక్కగాళ్లు కనిపిస్తే చాలు వణుకే !!
  • Prof Nageshwar … ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయావు సారూ…
  • సోనియా జ్ఞాపకాల ప్రచురణపై పెంగ్విన్ వెనుకంజ – ఓ విశ్లేషణ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions