.
Pardha Saradhi Potluri …. జార్జ్ సోరోస్ స్టయిల్ మనకి తెలిసిందే!
ఏ దేశంలోనైనా అలజడి సృష్టించి ప్రభుత్వాన్ని కూల్చాలంటే ఆ దేశ పౌరులలో ఎవరన్నా అమెరికా లేదా లండన్ లలో చదువుకోవడానికి వచ్చిన వాళ్లలో తనకి అవసరం పడే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాడు!
సెలక్షన్ చేసుకునే విధానం!
మొదటి అర్హత నాస్తికుడు అయిఉండాలి. రెండవ అర్హత పేదవాడు అయిఉండాలి. మూడవ అర్హత భావోద్వేగాలకి తేలికగా లొంగిపోయే గుణం ఉండాలి! ఇక్కడ పేదవాడు అంటే స్వంత దేశంలో అప్పు చేసి అమెరికా లేదా లండన్ లలో చదువుతూ పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ స్వంత దేశంలో అప్పు తీర్చడానికి డబ్బు పంపేవాడు పేదవాడి కింద లెక్క అన్నమాట.
Ads
కాక్రోచ్ జనతా పార్టీ పెట్టిన వాళ్ళు….
అభిజిత్ చిప్కే : మాజీ AAP సోషల్ మీడియా ఇంచార్జ్! బోస్టన్ యూనివర్సిటీలో కమ్యూనికేషన్స్ లో డిగ్రీ చదివాడు, కేజ్రీవాల్ ఖర్చు భరించాడు. CJP వ్యవస్థాపకుడిగా వ్యవహరిస్తున్నాడు. బోస్టన్ వెళ్ళింది కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపరుచుకోవడానికి. తండ్రి మహారాష్ట్రలో నీటి పారుదల శాఖలో జూనియర్ ఇంజినీర్.
అభిజిత్ అమెరికా వెళ్ళింది తండ్రి సంపాదనని చూపించి కానీ ఒక జూనియర్ ఇంజినీర్ సంపాదనతో అమెరికా వెళ్లి చదువుకోవచ్చా? అభిజిత్ అమెరికా వెళ్లే క్రమంలో ఆదాయ వివరాలని మానిపులెట్ చేసాడని తెలుస్తున్నది! అభిజిత్ ని CJP కోసం చేసిన ఎంపిక చాలా నాశిరకంగా ఉన్నది. పూర్ కమ్యూనికేషన్ స్కిల్స్!
అభిజిత్ బోస్టన్ యూనివర్సిటీ నుండి పబ్లిక్ రిలేషన్స్ మీద డిగ్రీ చేసినట్లుగా చూపించిన సర్టిఫికెట్ AI జెనరేటెడ్ అని తేలింది!
కొంతమంది బోస్టన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ వివరాలని ఆ యూనివర్సిటీ అధికారిక వెబ్సైటులో వెతకాగా అభిజిత్ చిప్కే పేరు ఎక్కడా కనపడలేదు. 2022, 2023, 2024, 2025, 2026 అకడమిక్ ఇయర్స్ లలో అన్ని విభాగాలలో సెర్చ్ చేయగా ఎక్కడా అభిజిత్ పేరు కనపడలేదు.
బోస్టన్ యూనివర్సిటీ నుండి స్కాలర్షిప్ వచ్చినట్లుగా చూపించిన పేపర్స్ కూడా AI జెనరేటెడ్.
బోస్టన్ యూనివర్సిటీలో స్నాతకోత్సవం ( convocation ) సందర్భంగా వేసుకునే గౌన్, కాప్ లు వేరు అభిజిత్ తాను చూపించిన ఫోటోలో ఉన్న గౌన్, కాప్ వేరు.
అభిజిత్ తండ్రి MIDC ( Maharashtra Industrial Development Corporation ) ఉద్యోగి. జీతం నెలకి 65,000/-. తన సేవింగ్స్ నుండి కొడుకుని అమెరికా పంపాడా? తండ్రి స్థానిక మీడియాకి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అభిజిత్ బ్యాంక్స్ నుండి ఒక కోటి 60 లక్షలు అప్పుచేసి అమెరికా వెళ్లాడని చెప్పాడు.
ఒకవేళ బ్యాంక్ నుండి స్టూడెంట్ లోన్ తీసుకొని ఉంటే ఇప్పటికే ఆ విషయం బయటికి వచ్చేది కానీ అలా జరగలేదు!
So! మనీ లాండరింగ్ జరిగింది!
*************
సౌరవ్ దాస్ : CJP కి చీఫ్ స్పోక్ పర్సన్, ఇన్వెస్టిగెటివ్ జర్నలిస్ట్ కమ్ యాక్టివిస్ట్ అని చెప్పుకుంటున్నాడు.
సౌరవ్ దాస్ పాండిచేరిలో విద్యాభ్యాసం చేశాడు. తరువాత నోయిడాలోని అమిటి యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ పూర్తిచేసాడు. పాండిచేరిలో చదువుతున్నప్పుడు నేపాలి భాష మాట్లాడేవాడని, ఇంట్లో మేము నేపాలిలోనే మాట్లాడుకుంటామని తోటి విద్యార్థులతో చెప్పేవాడు.
సౌరవ్ దాస్ నేపాలీ పౌరుడా లేక భారత పౌరుడా అనేది సమస్య కాదు. అతను నేపాల్ పౌరుడు అయినా సరే మనకు అభ్యంతరం ఉండకూడదు.
అభ్యంతరం ఎక్కడ ఉంది?
పాండిచేరిలోని ఎన్నికల కమిషన్ లో ఓటర్ లిస్ట్ లో తన తండ్రి పేరు ‘సుబీర్ దాస్ ’ గా రికార్డ్ అయి ఉన్నది. చెన్నై హైకోర్టులో ఒక వివాదానికి సంబంధించిన కేసులో తన తల్లి పేరుని ‘సీమా చెత్రి ’ ( Seema Chetree ) గా పేర్కొన్నాడు. ఢిల్లీలోని ఓటర్ లిస్టులో తన తండ్రి ‘దీపక్ దాస్ ’ గా పేర్కొన్నాడు.
Well… సౌరవ్ దాస్ తల్లి తన భర్తకి విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకుందని అనుకుందాం. అది తప్పు కాదు కానీ సౌరవ్ దాస్ తన తండ్రి పేరుని దీపక్ దాస్ గా పేర్కొనడం చట్ట విరుద్ధం!
జర్నలిస్టుల తల్లి తండ్రుల పేర్లు గోప్యంగా ఉంచాలి అని మరో వాదన…
ఏదో విదేశీ టెర్రరిస్ట్ ల గురుంచి తరుచూ ఆర్టికల్స్ వ్రాసే జర్నలిస్టుల కుటుంబ సభ్యుల వివరాలు గోప్యంగా ఉంచడంలో అర్ధం ఉంది, సమర్ధనీయం కూడా!
సౌరవ్ దాస్ వ్రాసే ఆర్థికల్స్ టెర్రరిస్టులకి అనుకూలంగా ఉంటాయి! సౌరవ్ దాస్ కంటెంట్ రైటర్! సౌరవ్ దాస్ కంటెంట్ ప్రచురించే మీడియా సంస్థలు అన్నీ లెఫ్ట్ వింగ్ కి సంబంధిచినవే! The Wire, Scroll.In, The Quint, News Laundry లు ప్రధానంగా సౌరవ్ దాస్ కంటెంట్ వాడుకుంటాయి. కాబట్టి ఉగ్రవాదుల నుండి ముప్పు ఉండే అవకాశం లేదు.
భారత్ తుకడే గ్యాంగ్ లీడర్ షర్జిల్ ఇమామ్ తో సన్నిహితంగా మెలిగిన సౌరవ్ దాస్ కి ఉగ్రవాదుల నుండి ముప్పు ఉంటుందా?
ఒక ఉదాహరణ!
తవ్లీన్ సింగ్, సీనియర్ జర్నలిస్ట్. తను మన తెలుగు రాష్ట్రాలలో పెద్దగా తెలియదు కానీ 1980 ల నుండి తను జర్నలిజంలోనే ఉంటూ వచ్చింది, ఇప్పటికీ The Indian Express, The Financial Express లకి వీక్లీ కాలమ్స్ రాస్తూనే ఉంది.
తవ్లీన్ సింగ్ భారతీయురాలే కానీ పాకిస్తాన్ కనెక్షన్ ఉంది!
సల్మాన్ తసీర్!
సల్మాన్ తసీర్ పాకిస్తాన్ లో అత్యంత ధనిక బిజినెస్ మాన్, రాజకీయ నాయకుడు కూడా. 2008 నుండి 2011 వరకూ పాకిస్థాన్ పంజాబ్ కి గవర్నర్ గా పనిచేసాడు. సల్మాన్ తసీర్ కి ఇద్దరు భార్యలు. వాళ్ళ ద్వారా కలిగిన సంతానం ఉంది.
1980వ దశకంలో తవ్లీన్ సింగ్, సల్మాన్ తసీర్ లకి ఒక కొడుకు పుట్టాడు లండన్ లో, పేరు ఆతిష్ తసీర్! తవ్లీన్ సింగ్ ఆతిష్ తసీర్ ని లండన్ లోనే పెంచింది!
తవ్లీన్ సింగ్, సల్మాన్ తసీర్ పెళ్లి చేసుకోలేదు కానీ సల్మాన్ తసీర్ మాత్రం ఆతిష్ తసీర్ నా కొడుకే అని చెప్పుకుంటాడు. తవ్లీన్ సింగ్ ఎప్పుడూ తన కొడుకు అయిన ఆతిష్ తసీమ్ తండ్రి సల్మాన్ తసీర్ అనే చెప్పుకుంటుంది.
ఇక తవ్లీన్ సింగ్, సల్మాన్ తసీర్ కొడుకు ఆతిష్ తసీర్ కూడా జర్నలిస్ట్ అయ్యాడు! సీనియర్ జర్నలిస్ట్ అయిన తవ్లీన్ సింగ్ కి లేని ఇబ్బంది సౌరవ్ దాస్ కి ఎందుకు? ఇద్దరూ జర్నలిస్టులే కదా?
అతీష్ తసీర్ vs కబీర్ బేడీ!
2019 లో TIME మాగ్జైన్ ప్రధాని రేంద్ర మోడీని ఉటంకిస్తూ కవర్ పేజీ కధనం ప్రచురించింది. కవర్ పేజీ మీద మోడీ ఫోటోతో పాటు హెడ్ లైన్ ఇలా వ్రాసింది..
‘India’s Divider in Chief ’ అంటే భారత్ ని విభజించే చీఫ్ అని.
TIME కి ఈ ఆర్టికల్ వ్రాసింది ఆతిష్ తసీర్!
TIME మాగ్జైన్ కవర్ పేజీ కధనం వ్రాసింది ఆతిష్ తసీర్ కాబట్టి ఒక పాకిస్థానీ జాతీయుడు భారత ప్రధానిని ఉద్దేశిస్తూ భారత్ విభజన కారకుడు అనే అర్ధం వచ్చేలా కధనం వ్రాయడం దానిని TIME మాగ్జైన్ ప్రచురించడం అదీ జెనరల్ ఎలక్షన్స్ జరుగుతున్న వేళ అసహ్యంగా ఉంది అని కబీర్ బేడీ ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు.
దీని మీద తవ్లీన్ సింగ్ స్పందిస్తూ మేము పెళ్లిచేసుకోలేదు కాబట్టి నా కొడుకు భారతీయుడే అని వాదించింది.
బీజేపీ అభిమానులు ఎవరూ తవ్లీన్ సింగ్ మీద అక్షర దాడిచేయలేదు! ఆవిడ ఇప్పటికీ ఆర్థికల్స్ వ్రాస్తూనే ఉంది.
కపిల్ సిబల్ వాదన!
కపిల్ సిబల్ సౌరవ్ దాస్ తరుపున ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసి తన క్లెయింట్ అయిన సౌరవ్ దాస్ ఇంటి అడ్రస్, తల్లి తండ్రుల వివరాలు, ఆదాయం లాంటి విషయాలని సోషల్ మీడియాలో ప్రచురించకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతున్నాడు!
ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ లో ఒక అపార్ట్మెంట్ 3 BHK ఫ్లాట్ అద్దెకి తీసుకొని ఉంటున్నాడు సౌరవ్ దాస్! సోషల్ మీడియాలో గ్రేటర్ కైలాష్ లోని సౌరవ్ దాస్ ఫ్లాట్ అద్దె నెలకి లక్ష రూపాయలు అంటూ, ఉద్యోగం లేని సౌరవ్ దాస్ అంత అద్దె కడుతూ రోజూ పార్టీ చేసుకునేంత డబ్బు ఎక్కడనుండి వచ్చింది అని ప్రశ్నించినందుకు కపిల్ సిబల్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాడు!
Well… ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరెట్ పెట్టిన కేసుల్లో ఒక శాతం కంటే తక్కువ కేసుల్లో శిక్ష పడుతున్న సంగతి తెలిసిందే!
డబ్బు ఏ రూపంలో ఎలా చెలామణి చేస్తే అది మనీ లాండరింగ్ కిందకి రాదో కపిల్ సిబల్ కి అనుభవం ఉంది కాబట్టి ముందే జాగ్రత్త పడ్డారు!
ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ నుండి విరాళాల రూపంలో డబ్బు వచ్చింది అని, ఆ ఫౌండేషన్ కి ఓపెన్ సోర్స్ ఫౌండేషన్ కి లింకులు ఉన్నాయని మీడియాలో చెప్పుకోవడానికే పనికివస్తుంది తప్పితే ఒక వేళ కేసులు పెట్టినా శిక్షలు పడవు కాబట్టి, వాటి వివరాల కోసం వెతకడం టైమ్ పాస్ అవుతుంది తప్పితే వేరే లాభం ఉండదు!
పొరపాటు అంటే సరిదిద్దుకోగలది! తప్పు అంటే సరిదిద్దుకోలేనిది!
తప్పు జరిగిపోయింది!
2014 నుండి 2026 వరకూ ED ఎన్ని కేసులు పెట్టింది? ఎన్ని కేసులలో నేరం ఋజువు అయ్యి శిక్షలు పడ్డాయి?
అపర చాణక్యుడు అమిత్ షా అనే సోది కబుర్లకి కొదువ లేదు!
గత పదేళ్లలో కనీసం రెండో మూడో ED కేసులలో శిక్ష పడి ఉంటే భయం ఉండేది! అన్నీ తెర వెనుక లాలూచీలే!
జంధ్యాల గారి సినిమా కామెడీలాగా ఉంది ED కేసుల తీరు…..
సుత్తి వీరభద్రరావు కవిత్వం వినిపిస్తాను అని దారిన పోతున్న నరేష్ ని ఆపి, కూర్చోపెట్టి కవిత వినిపిస్తాడు ఇలా..
సుత్తి : నడుస్తోంది నడుస్తోంది నడుస్తోంది జీవితం! నడుస్తోంది నడుస్తోంది నడుస్తోంది జీవితం! నడుస్తోంది నడుస్తోంది నడుస్తోంది జీవితం!
నరేష్ : అలా ఎంతసేపు నడుస్తుందండి?
సుత్తి : జీవితం కదుటోయ్ నీ మొహం మండ అలానే నడుస్తుంది!
ఇక్కడ జీవితం అనే పదం తీసేసి ED అని పెడితే అదే స్థాయిలో కామెడీ పండుతుంది!
అక్టోబర్ 3, 2025 న ED అదనపు చార్జీషీట్ ఫైల్ చేసింది నేషనల్ హెరాల్డ్ కేసులో! మళ్ళీ ఈ సంవత్సరం చివరలో మరో అదనపు ఛార్జ్ షీటు ఫైల్ చేస్తుంది అన్నమాట!
మెల్లగా వృద్దాప్యం మీద పడి ఖర్గే వెళ్ళిపోతాడు. వృద్దాప్యం మీద పడి సోనియా మంచాన పడుతుంది! రాహుల్ కి 70 ఏళ్ళు వచ్చినా యువ నాయకుడిగానే ఉంటాడు కాబట్టి ఖంగారు పడకండి! అప్పుడు వస్తుంది తీర్పు నేషనల్ హెరాల్డ్ లో ఎలాంటి అక్రమాలు జరగలేదని!
కానీ ఇది రాస్తున్న నాతో పాటు చదువుతున్న కొందరు పాఠకులు కూడా భూమి మీద ఉండరు అప్పటికే!
అంచేత… అపర చాణుక్యులు కొంచెం కళ్ళు తెరవండి!
చట్టం అంటే భయపడేలా చేయాలి!
Gen Z తో సఫలం కాలేదు కాబట్టి Gen ఆల్ఫా, వాళ్ళ తల్లితండ్రులతో సమావేశం అయ్యి దేశం బాగుపడాలంటే ఏం చేయాలో చర్చలు జరుపడానికి సన్నాహాలు చేస్తున్నాడు కేజ్రీవాల్ అనే శుంఠ !
Share this Article