Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సారూ, ఒక్కరిని… ప్లీజ్ ఇలాంటి ఒక్క గురువును చూపించండయ్యా…

September 5, 2026 by M S R

.

అనుకోకుండా ఓ ముసలాయన్ని ఓ యువకుడు పలకరించి కాళ్లు మొక్కాడు… ఆయనలో హాశ్చర్యం, పాపం ఊహించి ఉండడు కదా….
‘సర్, నన్ను గుర్తుపట్టారా..?‘ అనడిగాడు ఆ యువకుడు…
ఆయన గుర్తుపట్టలేదు అన్నాడు… ‘సర్, నేను మీ స్టూడెంట్‌ను…’
‘ఓహ్, నిజమా..? సంతోషం, నాకు గుర్తులేదు, ఏం చేస్తున్నావ్ బాబూ ఇప్పుడు..?’
‘నేను టీచర్‌ను అయ్యాను మాస్టారూ…’

‘గుడ్, వెరీ గుడ్, నాలాగే టీచర్ అయ్యావన్నమాట..?’
‘అవును సర్, నిజానికి టీచర్ కావడానికి మీరే స్పూర్తి’
‘అదేంటి..?’
‘బహుశా మీకు గుర్తుండదు, నేను చెబుతా వినండి…’

Ads


‘‘ఓసారి నా దోస్త్ ఒకడు మంచి ఖరీదైన, మోడరన్ వాచీ తెచ్చుకున్నాడు… దాన్ని చూడగానే నాలో దొంగ బుద్ధి ప్రవేశించింది, ఎలాగైనా దాన్ని సొంతం చేసుకోవాలని అనుకున్నాను, వాడి జేబులో నుంచి దొంగతనం చేశాను… కాసేపటికి వాడికి వాచీ పోయిందని తెలిసొచ్చింది… లబోదిబో ఏడ్చాడు… టీచర్‌కు కంప్లయింట్ చేశాడు… అప్పుడు ఆ టీచర్ మీరే…

ఒరేయ్ పిల్లలూ, ఇది మంచి పని కాదు, ఎవరు వాడి వాచీ తీశారో తిరిగి ఇచ్చేయండి, ఎవరినీ ఏమీ శిక్షించను అన్నారు మీరు… నేనేమీ భయపడలేదు, తిరిగి వాచీ ఇవ్వలేదు, ఇవ్వాలనే ఉద్దేశం నాకు ఉంటే కదా…
మీరు కిటికీలు, తలుపులు మూసేశారు, అందరినీ ఓ సర్కిల్‌గా నిలబెట్టారు… ప్రతి ఒక్కరి జేబూ చెక్ చేస్తానన్నారు… కాకపోతే అందరినీ కళ్లుమూసుకోవాలని చెప్పారు… జేబుల చెకింగ్ అయిపోయేవరకు కళ్లు తెరవొద్దని గట్టిగా అన్నారు…

తప్పదు కదా మరి, మీరు ఒక్కొక్కరి జేబూ చెక్ చేస్తూ వెళ్లారు, నా జేబులో దొరికింది మీకు, తీసుకున్నారు, ఆ తరువాత కూడా మిగతా అందరి జేబులూ చెక్ చేశారు… నాకు అర్థం కాలేదు…
వాచీ దొరికింది, కళ్లు తెరవండి అన్నారు మీరు అన్ని జేబుల తనిఖీ అయిపోయాక…
ఫలానా వారి జేబులో దొరికిందని మీరు చెప్పలేదు, నన్ను పట్టుకుని నాలుగు తగిలించలేదు, నలుగురిలో నా డిగ్నిటీని మీరు కాపాడారు, అది తరువాత అర్థమైంది… ఒకసారి నాపై మీరు ఆరోజే దొంగ అనే ముద్ర వేసి ఉంటే, నిజంగానే దొంగగా మారిపోయి ఉండేవాడినేమో…

నాలో ఓ మార్పు తెచ్చింది ఆనాటి ఎపిసోడ్… కనీసం మీరు పక్కకు తీసుకుపోయి నన్ను మందలించలేదు కూడా… నా అంతట నేనే మారిపోయేలా చేశారు… ఇప్పుడు గుర్తొచ్చిందా సర్..? కానీ నా దగ్గర వాచీ దొరికాక కూడా, నన్నెందుకు మందలించలేదు..? ఇప్పటికీ జవాబు దొరకని ప్రశ్న సర్, ఇప్పుడైనా చెప్పరా ప్లీజ్…’’
.
.
.
.
అప్పుడు ఆ టీచర్ చెప్పాడు… ‘‘ఒరేయ్, అందరి జేబులూ చెక్ చేశాను… నీ దగ్గర వాచీ దొరికాక నీ మొహం చూసి, నిన్ను మందలిస్తే, ఇక నిన్ను చూసినప్పుడల్లా వీడు దొంగ అనేదే గుర్తొస్తుంది నాకు, ఫలితంగా బోధనలో వివక్షకు కారణం కావొచ్చు… అందుకేరా అబ్బాయ్, నేను కూడా ఫలానా వాళ్ల దగ్గర వాచీ దొరికింది అనే సంగతి నాకే తెలియకుండా ఉండటం కోసం…. నేను కూడా కళ్లు మూసుకునే అందరి జేబులూ చెక్ చేశాను…’’
.
.
.
.
హేపీ టీచర్స్ డే... (ఫేస్‌బుక్‌లో కనిపించిన ఓ ఇంగ్లిష్ పోస్టుకు ఎప్పటిలాగే నా స్వేచ్చానువాదం... కాకపోతే ట్రాజెడీ ఏమిటంటే, కొన్ని వేల షేర్లు ఎవరెవరి పేర్లపైనో నడుస్తూనే ఉన్నాయి ఐదారేళ్లుగా... సర్వేజనా సుఖినో భవంతు, ఓసారి గుర్తుచేసుకోవడానికి ఆ పాత పోస్టే మరోసారి... గమనించగలరు... ష్, గప్‌చుప్, నా పోస్టు నాకే వాట్సపులో పంపించి, రాయొచ్చు కదా గురూ అని సలహా ఇచ్చిన వారికి నమోనమః... అబ్బా, ఇక్కడ నమో అంటే నరేంద్ర మోడీ కాదబ్బా...)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సారూ, ఒక్కరిని… ప్లీజ్ ఇలాంటి ఒక్క గురువును చూపించండయ్యా…
  • ఈసారి బిగ్‌బాస్ ఎంపికలు- వైవిధ్యం తక్కువ ! తెలిసిన మొహాలూ తక్కువ !
  • ఉండవల్లి అంటే ఉడుంపట్టు ! కానీ పోరాటమార్గాలు ఏం మిగిలాయి !?
  • అమెరికా ఆధిపత్యానికి అంతిమరోజులు – చైనా నోస్ట్రడామస్ జోస్యం
  • పాపం టాక్సిక్ – ఈ హాలీవుడ్ అద్దకం మరింత వికటించింది !
  • ఈ సినిమా తరువాత ‘రష్మి’ మళ్లీ ఏ సినిమాలోనూ కనిపించినట్టు లేదు!!
  • ఉచ్చకు హిమాలయాలే కరిగిపోతున్నాయట! ఓ స్టడీ చెబుతోంది!!
  • కీలకాంశాల్లోనూ కేసీయార్ వాయిస్‌లో లోపించిన విజ్ఞత!
  • ఎంతగా బుర్ర చించుకున్నా- ఈ హోదా ఏమిటో అర్థం కాలేదు !!
  • ప్రతి లిక్కరూ విస్కీ కాదు – ప్రతి మద్యానికీ ఓ కథ ఉంది

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions