Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇదేమైనా అట్లాస్ సైకిలా..? 40 రోజులకు ఓ వార్‌షిప్ నిర్మించడానికి !!

September 9, 2026 by M S R

.

Pardha Saradhi Potluri … ఇక నుండి ప్రతీ 46 రోజులకి ఒక యుద్ధ నౌక నిర్మిస్తుంది భారత్!
యుద్ధ నౌక ఏమన్నా సైకిల్ అనుకున్నారా?
ఎవరో ఒక సన్నాసి ఏదో నాలుగు లైన్ల పోస్టు పెడతాడు. దానిని వందల్లో షేర్ చేస్తారు! అసలు యుద్ధ నౌక అంటే తెలుసా వీళ్లకు?
1. విమాన వాహక యుద్ధ నౌక. 2.ఫ్రీగేట్. 3 డిస్ట్రాయర్. 4.కార్వట్టి. 5.క్రూయజర్.

విమాన వాహక యుద్ధ నౌక : 8 నుండి 11 ఏళ్ళు పడుతుంది వాడకానికి. ఈ లోపు కారియర్ మీద ఎగిరే ఫైటర్ జెట్స్ ని సమాకుర్చుకోవాలి. ఒక గంట సముద్రంలో గడపడానికి $46,000 డాలర్లు ఖర్చు అవుతుంది. అదే యుద్ధ సమయంలో అయితే ఒక లక్ష డాలర్లు ఖర్చు అవుతుంది గంటకి.

Ads

ఫ్రీగేట్ ( Friget ): మీడియం సైజ్ . ఎస్కార్ట్, ప్రొటెక్షన్ లు ప్రధాన బాధ్యతలు. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ వెంట నడుస్తుంది. యాంటీ సబ్ మెరైన్ వార్ ఫేర్ ( ASW ) సముద్రం అడుగున ఉండే శత్రు సబ్ మెరైన్లని గుర్తించి ధ్వంసం చేస్తుంది. దీనికి అడ్వాన్స్డ్ సోనార్, టార్పేడో  ప్రయోగించే సత్తా ఉంటుంది!

ఎయిర్ డిఫెన్స్ తో కారియర్ గ్రూపు మీదకి వచ్చే శత్రువిమానాలని, ఏంటీ షిప్ మిసైల్స్ ని ధ్వంసం చేస్తుంది. శాంతి సమయంలో స్మగ్లింగ్ ని నిరోధించడం, ఏవన్నా విపత్తులు కలిగినపుడు అత్యవసర సేవలు అందిస్తుంది.

డిస్ట్రాయర్ :మీడియం సైజ్ మల్టీ మిషన్ వార్ షిప్. చాలా వేగంగా ప్రయాణిస్తుంది, వేగంగా మెలికలు తిరుగగలదు ( Highly maneuverable ). డిస్ట్రాయర్ లో చాలా పెద్ద మొత్తంలో మిసైల్స్, టార్పేడోస్ తో పాటు నావల్ గన్స్ ఉంటాయి.
ఏంటీ ఎయిర్ వార్ ఫెర్ ( AAW ) ని కలిగివుంటుంది.
అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ తో శత్రు విమానాలు, ఏంటీ షిప్ మిసైల్స్ ని ఎదుర్కొగలదు.

డిస్ట్రాయర్స్ లో సోనార్, టార్పేడో వ్యవస్థతో పాటు అదనంగా ‘డెప్త్ చార్జర్ ’ (Depth Charger ) రిలీజ్ సిస్టమ్ ఉంటుంది. ఈ డెప్త్ చార్జర్స్ అనేవి డిస్ట్రాయర్ ప్రయోగించగానే సముద్రం అడుగుకి వెళ్లి నీటిలో తేలుతూ ఉంటాయి. సముద్రం పైన డిస్ట్రాయర్ ఉందని శత్రు సబమెరైన్లు తప్పించుకునే ప్రక్రియలో మరింత లోతుకి వెళ్లి ఈ డెప్త్ చార్జర్ కి తగిలి పేలిపోతాయి! డెప్త్ చార్జర్స్ ని సబ్ మెరైన్లు టార్పేడోలని గుర్తించినట్లుగా గుర్తించలేవు. దీనికి డిస్ట్రాయర్ అనే పేరు పెట్టడానికి కారణం ప్రధానంగా సబ్ మెరైన్లని వేటాడి డిస్ట్రాయ్ చేస్తుంది అని.

డిస్ట్రాయర్ సముద్రం మీద నుండి భూమి మీద కూడ దాడి (Land Attack ) చేయగలదు. వెస్ట్రన్ నావీ ఫ్లీట్ టోమ్ హాక్ మిసైల్స్ ని వాడుతున్నాయి. కానీ భారత్ రెండు వేరియంట్స్ ని అభివృద్ధి చేసింది.

బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిసైల్. ఇది నావీ వెర్షన్, హై యాక్యురసి కలిగి ఉంది అన్నవిషయం ఇప్పటికే నిరూపించబడ్డది. ఇప్పటికే INS TEG, INS CHENNAI లలో అమర్చారు!

రెండోది LRLACM ( Long Range Land Attack Cruise Missile ). ఇది కూడా డిస్ట్రయర్ నుండి ప్రయోగించే సబ్ సానిక్ ( శబ్ద వేగం కంటే తక్కువ ) వేగంతో సముద్రంలో నుండి డిస్ట్రాయర్స్, సబ్ మెరైన్స్ నుండి ప్రయోగించవచ్చు. LRLACM ని ప్రస్తుతానికి GHOST మిసైల్ అని ముద్దుగా పిలుస్తున్నారు.

వెస్ట్రన్ డిఫెన్స్ అనలిస్టులు LRLACM (ఘోస్ట్ ) మిసైల్ నిర్భయ్ క్రూయిజ్ మిసైల్ నుండి ఉద్భవించిన అమెరికన్ టోమ్ హాక్ వేరియంట్ అని అంటున్నారు కానీ అది వాస్తవం కాదు అహంకారం అని అనవచ్చు.
టోమ్ హాక్, LRLACM లు రెండూ క్రూయిజ్ మిసైల్, సముద్రం నుండి భూమి మీదకి ప్రయోగించే మిసైల్ కేటగిరీ కిందకి వస్తాయి కానీ చాలా స్పష్టమైన తేడాలు ఉన్నాయి.

టోమ్ హాక్ మిసైల్ ని 1983 లో అమెరికన్ నావీలో ప్రవేశపెట్టారు. అంటే డిజైన్ చేసింది, నిర్మించింది 1979లో! 1983 నుండి ఇప్పటివరకు 50 అప్గ్రేడ్స్ అంటే సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ రూపంలో జరిగాయి కానీ ఎయిర్ ఫ్రేమ్ మాత్రం మార్చలేదు! ఎయిర్ ఫ్రేమ్ అంటే బయటికి కనపడే మిసైల్ ట్యూబ్!

టోమ్ హాక్ మిసైల్ యాక్యురసి 70% లోపే! 2021 లో అమెరికన్ డిస్ట్రాయర్స్ ఒకే రోజున 52 టోమ్ హాక్ మిసైల్స్ ని సిరియాలోని ఎయిర్ బేస్ ల మీద ప్రయోగిస్తే వాటిలో 8 మిసైల్స్ టార్గెట్ ని రీచ్ అవ్వకముందే నేల మీద పడ్డాయి. మరో 10 మిసైల్స్ టార్గెట్ మీదుగా ఎగురుతూ వెళ్లి దూరంగా పడ్డాయి. మరో 10 మిసైల్స్ టార్గెట్ దగ్గరికి వెళ్లి పేలినా టార్గెట్ కి ఎలాంటి నష్టం జరగలేదు! మరో నాలుగు మిసైల్స్ ని అక్కడికి దగ్గరలోనే ఉన్న రష్యన్ S300 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చివేసింది. ప్రస్తుత రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా ఉక్రెయిన్ ప్రయోగించిన టోమ్ హాక్ లు పెద్దగా ప్రభావం చూపలేక పోయాయి!

LRLACM ఇటీవలే అభివృద్ధి చేసింది DRDO! ఎయిర్ ఫ్రేమ్ కంపోజిట్ మెటీరియల్ తో చేశారు కాబట్టి రాడార్ డిటెక్షన్ 50% కి పడిపోతుంది. సముద్రం మీద ప్రయాణించేటప్పుడు సముద్ర మట్టానికి 6 అడుగుల ఎత్తులో ఎగురుతూ ( Sea Skimming) భూమి మీదకి రాగానే ఎత్తు పెంచుకొని ( Terrain Hugging ) రాడార్స్ కి దొరకకుండా zigzag గా ప్రయాణించి టార్గెట్ ని ధ్వంసం చేస్తుంది!

టోమ్ హాక్ సీకర్ పాతది. అంటే డిజైన్ లో మార్పులేకుండా వాడుతున్నారు. జామ్ చేయవచ్చు. LRLACM అడ్వాన్స్‌డ్ సీకర్ ఉపయోగిస్తుంది జామ్ చేయలేరు. టోమ్ హాక్ GPS ని ఆధారం చేసుకొని ప్రయాణిస్తుంది. ఉక్రెయిన్ రష్యా మీద ప్రయోగించిన టోమ్ హాక్ లని GPS జామర్స్ ఉపయోగించి టార్గెట్ నుండి దారిమళ్లించి దూరంగా వెళ్ళేట్లు చేయగలిగింది.

LRLACM GPS ని వాడదు. ఇండియన్ నావిక్ సిస్టమ్ తో పనిచేస్తుంది. అది కూడా టార్గెట్ ఎక్కడ ఉందో లాంచ్ చేయకముందే ఫిక్స్ చేస్తారు కాబట్టి ఒకవేళ చైనా సహాయంతో NAVIC సిస్టమ్ ని జామ్ చేసినా టార్గెట్ ఎక్కడ ఉందో తెలుసు కాబట్టి ఖచ్చితంగా అక్కడికే వెళుతుంది!

కార్వెట్టే ( Corvette ): ఇది స్మాల్ సైజ్ వేసల్! కార్వెట్టే ఇంటర్సెప్ట్ ( Intercept ) పని చేస్తుంది. సైజు చిన్నది అవడం వలన వేగంగా ప్రయాణిస్తుంది.
కారియర్ బాటిల్ గ్రూప్ ( BCG ) లో భాగంగా ఎయిర్ క్రాఫ్ట్ కారియర్ కి నాలుగువైపుల నాలుగు కార్వేట్టేలు ఉంటాయి! అంటే ఫ్రీగెట్లు, డిస్ట్రాయర్లతోపాటు ఇవి ముందు ఉండి కదులుతూ ఉంటాయి. సబ్ మెరైన్స్ ని పసిగట్టి టార్పేడోలని ప్రయోగిస్తాయి. కార్వేట్టే వెనుక భాగంలో చిన్న హెలిపాడ్ ఉంటుంది హెలికాప్టర్ తో.
కర్వేట్టేలు తీర రక్షణ, బాక్ వాటర్స్ లోకి శత్రువు ప్రవేశించకుండా కాపలా కాస్తుంటాయి. ఎయిర్ క్రాఫ్ట్ కారియర్ కి సప్లైస్ ఇచ్చే కార్గో షిప్ లకి కాపలాగా ఉంటాయి.

ప్రస్తుతం కార్వేట్టేలని కొత్తగా ప్రవేశపెట్టడం ఆపేసారు ఎందుకంటే నావీ డ్రోన్స్ అందుబాటులోకి వచ్చాక వీటి అవసరం తగ్గిపోతున్నది!

క్రూజర్ షిప్ : Cruiser వార్ షిప్ అనేది ఎక్కువగా రష్యా ఉపయోగిస్తున్నది! రష్యా దగ్గర ఎయిర్ క్రాఫ్ట్ కారియర్ లేదు దాంతో ఫ్రీగెట్, డిస్ట్రాయర్లలో ఉండే ఫీచర్స్ ని ఒకే దానిలో అమర్చి క్రూజర్ వార్ షిప్స్ ని తయారుచేసి వాడుతున్నది!
2022 ఏప్రిల్ 14న బ్లాక్ సీ లో ఉన్న రష్యన్ క్రూజర్ షిప్ ‘మాస్కోవా ’ని ఉక్రెయిన్ ధ్వంసం చేసింది!
మనకి రెండు ఎయిర్ క్రాఫ్ట్ కారియర్స్ ఉన్నాయి కాబట్టి క్రూజర్ అవసరం లేదు.

navy

**********************
ఫ్రీగెట్, డిస్ట్రయార్, కార్వెట్టేలని తయారుచేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది, సన్నాహాలు ఎలా ఉంటాయో చూద్దాం….
డిజైన్, ప్లానింగ్ : ఎలాంటి వార్ షిప్ చేయాలి అనేది నిర్ణయించి దానికి అనుగుణంగా డిజైన్ చేస్తారు. వెపన్స్ ఏమిటి, రాడార్స్ ఏమిటి, సోనార్స్ ఏమిటి అనేవి డిజైన్ చేయకముందే నిర్ణయించి వాటిని ఆర్డర్ చేస్తారు. డిజైన్ బ్లూ ప్రింట్ బయటికి రావడానికి రెండేళ్లు పడుతుంది.

ఒకసారి బ్లూ ప్రింట్ బయటికి వచ్చాక మెటల్ ( steel ) కట్ చేయడంతో పని ప్రారంభం అవుతుంది. మెటల్ కట్ అయ్యాక వెల్డింగ్ ప్రారంభిస్తారు. వెల్డింగ్ పూర్తయ్యాక ఎక్కడన్నా వెల్డింగ్ లో లోపాలు ఉన్నాయేమో టెస్ట్ చేయడానికి రెండు నెలలు పడుతుంది. వెల్డింగ్ టెస్టింగ్ అయ్యాక షిప్ లో ఎలక్ట్రికల్ వైరింగ్ జరుగుతుంది.
హల్ అసెంబ్లీ (Hull Assembly ). హల్ అంటే షిప్ పొట్ట భాగం. కీలకమైన భాగాలు హల్ లోనే ఉంటాయి. ఇది పూర్తవడానికి 2 నుండి 4 ఏళ్ళు పడుతుంది.

ఔట్ ఫిట్టింగ్ ( Out Fitting ) ఇదయ్యాక ఇనిషియల్ ఆపరేటింగ్ సర్టిఫికెట్ ( IOC ) ఇస్తారు. IOC ఇచ్చాక సీ ట్రయల్స్ జరుగుతుంది! సీ ట్రయల్స్ లో ఎలాంటి లోపాలు తలెత్తకపోతే FOC ( Final Operation Certificate ) ఇస్తారు. అప్పుడు అధికారికంగా నావీలో కమిషన్ అవుతుంది!

మొత్తంగా చూస్తే ఫ్రీగెట్, డిస్ట్రాయర్, కార్వెట్టేలని నావీలో ప్రవేశపెట్టడానికి 4 నుండి 6 ఏళ్ళు పడుతుంది!
అదే ఎయిర్ క్రాఫ్ట్ కారియర్ అయితే పదేళ్లు పడుతుంది!
ప్రతీ 40 రోజులకి ఒక యుద్ధ నౌక తయారుచేయాలంటే భారతీయులు అందరూ రాళ్లు కొట్టి ఆ డబ్బులు ప్రభుత్వానికి ఇస్తే అప్పుడు సాధ్యం అవుతుంది!
ఇందుకు కదూ బత్తాయిలు, వాట్సాప్ యూనివర్సిటీ అని బీజేపీ వాళ్ళని అవహేళన చేసేది!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బర్తరఫ్ వైపే ! లేటయినా గట్టిగానే కొట్టే ప్రొసీజరల్ అడుగులు !!
  • ముంతాజ్ పేరు మార్చుకుంది ! వైసీపీ ‘స్వరం’ మారింది ! అంతా మాయ !!
  • ఇదేమైనా అట్లాస్ సైకిలా..? 40 రోజులకు ఓ వార్‌షిప్ నిర్మించడానికి !!
  • ఖడే హనుమాన్ ! భారీ యంత్రాలెన్ని తెచ్చినా ఇంచ్ కదలని విగ్రహం !!
  • అగ్రవర్ణ దురహంకార మనువాద శుష్క బాష్యాలూ డౌన్ డౌన్ !!
  • హమారా హైదరాబాద్… ఓ కొత్త ముఖం! ఐటీ, ఫార్మా దాటేసి డిఫెన్స్ హబ్!!
  • బుల్లెట్ల భయాన్ని వదిలి- కాశ్మీరంలో సినిమా మళ్లీ ప్రాణం పోసుకుంది!
  • డామిట్, స్కెచ్ అడ్డం తిరిగింది ! బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ బొక్కబోల్తా !!
  • పుట్టపర్తి మిస్టరీ ! ఏకంగా సాయిబాబాపైనే ఎక్కుపెట్టిన ఓ సినిమా !!
  • కొన్ని అద్భుతాలు జరిగిపోతాయి అంతే – అవి అనూహ్యం !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions