.
అధికార పక్షం నా చావు కోరుకుంటోంది… కేసీయార్ ఉవాచ..! దళిత వ్యతిరేక దొర ఉంటే ఎంత, పోతే ఎంత… గడీ ఎదుట చావు డప్పు- దళితుల ఆత్మాభిమాన ఘోష..! అవును, కేసీయార్ ఈ రాష్ట్రానికి పట్టిన శని… చావాలనే కోరుకుంటున్నాం… ఓ ఎమ్మెల్యే వాచాలత్వం..!
ఇవే కదా, నిన్న మీడియా హోరెత్తించిన వార్తలు… కథనాలు… విశ్లేషణలు… బీభత్సపు బీజీఎంతో ఊకదంపుడు స్కోలింగ్స్, ప్లేట్స్… కానీ ఒక వార్తను మెయిన్ ఫస్ట్ పేజీలో ఎవరూ ఎందుకు పబ్లిష్ చేయలేకపోయారు… దళిత డప్పుల ఆత్మాభిమాన ఘోషను బీఆర్ఎస్ ఎలా కాలరాచి తన దొరహంకారాన్ని ప్రదర్శించిందో ఎందుకు చూపలేకపోయారు…
Ads

కేసీయార్ గడీ ముట్టడికి పిలుపునిచ్చి…, తన పార్టీ ఎమ్మెల్సీల నీచ వ్యాఖ్యలకు, అధినేతగా తను సారీ చెప్పని దొరహంకారానికి నిరసనగా ప్రదర్శన నిర్వహించారు కదా దళిత సంఘాలు… కానీ దళిత వ్యతిరేక పార్టీకి మండిపోయింది… పాత దొరతనపు అవశేషాలు భగ్గుమన్నాయి… మరింత అవమానిస్తూ… ఇదుగో డప్పులు ఊరేగిన ఆ దారిని పసుపు నీళ్లతో శుద్ధి చేసింది బీఆర్ఎస్ మహిళా విభాగం…
మల్లిఖార్జున ఖర్గే ఉత్తరాఖండ్, హల్ద్వానీలో ప్రసంగించిన వేదికను తరువాత కొందరు ఇలాగే శుద్ధి చేస్తే ఎట్టకేలకు జాతీయ స్థాయి ఆందోళన అనంతరం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు… మరి బీఆర్ఎస్ మహిళా విభాగం అదే పనిచేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తోంది..? ఈ ‘సంప్రోక్షణ’ దేనికి సంకేతం..?!

ఇక్కడ ఓ క్లారిటీ… నీ ఇంట్ల పీనుగెళ్ల, నీకు పిండం పెట్ట… వంటి తిట్లు మనిషిలోని ఆగ్రహాన్ని, నిరసనను ప్రకటించేవి… అలాగే చావు డప్పులు ఇంటి ముందు మోగించడం కూడా ఓ నిరసన ప్రదర్శనే… నువ్వు ఎప్పుడు చస్తవురా అనే తిట్టు కూడా ఓ ఆగ్రహ ప్రకటనే… ఐతే దొర ఇక్కడి దాకా తెచ్చుకోవడమే తన జీవితంలో పెద్ద ఫెయిల్యూర్…
మొత్తం దళిత సమాజం, తెలంగాణ సమూహం ఈరోజు ఛీత్కరిస్తున్నది కేసీయార్ అనే వ్యక్తిని కాదు… నిజానికి తనలో మిగిలిపోయిన పాత దొరహంకారపు డీఎన్ఏను, ఆ అవశేషాల్ని… దానికి పసుపు నీళ్లతో శుద్ది అనేది మరోసారి మొత్తం దళిత సమాజాన్ని ఛీత్కరించడం, అవమానించడం, పాత అస్పృశ్యత పోకడల్ని ప్రదర్శించడం..!

స్పీకర్‌ను ఇద్దరు అగ్రవర్ణాల నేతలు దారుణంగా తిడతారు… కానీ దొరహంకారం సారీ చెప్పనివ్వదు… చెప్పదు… అది గడీస్వామ్యం ప్రతీక… సేమ్, హరీష్ రావు, సేమ్ కేటీయార్… కేటీయార్ వంటి చిన్నదొర ఒక రేవంత్ రెడ్డిని, అదీ సీఎంను చిల్లర నా కొడుకు అన్నాడంటే అదుగో ఆ దొరతనమే… ఆ డీఎన్ఏ మాట్లాడిస్తున్నదే…
https://www.facebook.com/reel/1888971109153288
నేను జాతి పితను అని చెప్పించుకునే కేరక్టర్… ఆ రేంజ్ విజ్ఞతను, వివేచనను, రాజకీయ- సామాజిక సంస్కారాన్ని ప్రదర్శించాలి కదా… పైగా ఆ చావు డప్పుల రోడ్డును పసుపు నీళ్లతో శుద్ధి చేయిస్తాడా..? నా ఎమ్మెల్సీలు తప్పు మాట్లాడారు అనే విజ్ఞత కలిగిన క్షమాపణ ఏది..? చెబితే తన చరిత్రకు ఎంత శోభ..? కానీ ఇప్పుడు ఏం జరిగింది..? తన రాజకీయ- వ్యక్తిత్వ చరిత్రే మైలపడింది..!!

ఏ మీడియా ఏం రాస్తోందో పక్కన పెడితే… ఇది మరీ నీచం అనిపించింది… కేసీయార్ శిఖర సమానుడట… తానేం తప్పులు చేసినా పర్లేదు, మాఫీ చేయొచ్చు అన్నట్టుగా…. మరీ నమస్తే తెలంగాణకన్నా దిగజారి రాస్తోంది… కేసీయార్ క్యాంపు ప్రదర్శించే దొరహంకారపు, దళిత వ్యతిరేక ధోరణికి ఇది వత్తాసు పలుకుతున్నట్టుగా ఉన్నాయీ రాతలు..?
- నాటి తెలంగాణ సాయుధ పోరాటం నుంచి… దశాబ్దాలు సాగిన పీపుల్స్‌వార్, మావోయిస్టు సాయుధ పోరాటాలు… అనేక సామాజిక సంస్థల ప్రతిఘటన పోరాటాలు… ఇవన్నీ ఎవరిపై..? దొరతనంపై..!! గడీల లైంగిక దోపిడీ, శ్రమ దోపిడీ, వనరుల దోపిడీ, అణిచివేత, పెత్తందారీ పోకడలపైనే కదా… ఏం పోయింది..? ఏమీ పోలేదు… గడీలు ఫామ్ హౌజుల రూపుదాల్చాయి… నాడు పేదలు ఆక్రమించుకున్న భూములన్నీ ధరణి పేరుతో తిరిగి హస్తగతం అయ్యాయి..!! ఇదీ అసలైన ట్రాజెడీ!!! రాజకీయ పార్టీలు పెట్టి… మళ్లీ అదే అదే ఆ పాత జమీందారీతనమే..!!
Share this Article