.
మంచును నీళ్లుగా… నీళ్లను పంటలుగా… భూమి వేడిని పవర్‌గా!
లడఖ్‌లో కొత్త మోడల్… ప్రకృతినే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌గా మార్చే ప్రయత్నం!
లడఖ్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఏమిటి? మంచుకొండలు… సైన్యం… ఖార్దుంగ్ లా… ప్యాంగాంగ్ సరస్సు… బౌద్ధ మఠాలు… టూరిజం… కానీ ఆ అందమైన చిత్రానికి అవతల ఇంకో లడఖ్ ఉంది.
Ads
మైనస్ ఉష్ణోగ్రతల్లో జీవించాల్సిన లడఖ్. ఆక్సిజన్ తక్కువగా ఉండే ఎత్తుల్లో జీవించాల్సిన లడఖ్. నీరు కొరతగా ఉండే లడఖ్. వ్యవసాయానికి పరిమితమైన కాలం మాత్రమే ఉండే లడఖ్. రోడ్లు, విద్యుత్, నీరు, నిర్మాణం… ఏ పని చేయాలన్నా భౌగోళిక పరిస్థితులతో పోరాడాల్సిన లడఖ్.
అందుకే అక్కడ జరిగే అభివృద్ధిని మనం సాధారణ ప్రమాణాలతో కొలవకూడదు. హైదరాబాద్‌లో ఒక చెరువు పునరుద్ధరణ ఒక వార్తా విషయం అయితే… లడఖ్‌లో ఒక నీటి నిల్వను సృష్టించడం మరో కథన విశేషం. ఇక్కడే ప్రస్తుతం జరుగుతున్న కొన్ని కార్యక్రమాలు ఆసక్తి కలిగిస్తున్నాయి.
ఇవి కేవలం ప్రభుత్వ పనుల జాబితా కాదు. ప్రకృతి ఇచ్చిన పరిమితులనే టెక్నాలజీతో అవకాశాలుగా మార్చే ప్రయత్నాలు.
మొదట మంచు… ఇప్పుడు సాగునీరు! లడఖ్‌లో హిమానీనదాల నుంచి వచ్చే నీరు చాలా వరకు సహజ ప్రవాహంలో దిగువకు వెళ్లిపోతుంది. (రన్ ఆఫ్)… అదే నీటిని ఇప్పుడు పట్టుకుని, నిల్వ చేసి, పొలాలకు మళ్లించే ప్రయత్నం జరుగుతోంది.
ఒక ప్రాజెక్ట్‌లో రోజుకు సుమారు 9 కోట్ల లీటర్ల గ్లేసియర్ నీటిని కాలువల ద్వారా 12 గ్రామాల్లోని 1,000 ఎకరాలకు పైగా వ్యవసాయ భూములకు మళ్లించే వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఒక్కసారి ఆ సంఖ్యను ఊహించండి. రోజుకు 9 కోట్ల లీటర్లు!
మనం సాధారణంగా “గ్లేసియర్ కరిగిపోతోంది” అని వింటాం. కానీ ఇక్కడ ఆ కరిగిన నీటిని… వృథాగా పారిపోనివ్వకుండా వ్యవసాయానికి మళ్లిస్తున్నారు. ఇది నీటి నిర్వహణ. అంతకంటే ముఖ్యంగా… వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా జీవన విధానాన్ని మార్చుకోవడం.
Project Him Sarovar ఇక మరో ఆలోచన. మంచు కరిగి నీరు వచ్చింది. దాన్ని వెంటనే వదిలేయకుండా… నీటికి అడ్డుకట్టలు నిర్మించి నిల్వలుగా పట్టుకోవడం. Project Him Sarovar కింద లడఖ్‌లో నీటి వనరులను పెంచేందుకు అనేక water bodies నిర్మించే కార్యక్రమం చేపట్టారు.
Spitukలో నిర్మించిన ఒక reservoir సామర్థ్యం సుమారు 60 లక్షల లీటర్లు. అది కూడా అక్కడి పరిస్థితుల్లో కేవలం 60 రోజుల్లో పూర్తి చేశారు. ఇక్కడ అసలు పాయింట్ reservoir పరిమాణం కాదు. “నీరు వచ్చినప్పుడు పట్టుకో… నిల్వ పెట్టుకో, అవసరమైనప్పుడు వాడుకో” అనే ఆలోచన.
Indus లాంటి నది ప్రవహిస్తున్నా లడఖ్‌లో నీటి కొరత ఉండటం మొదట వినడానికి విచిత్రంగా ఉంటుంది. కానీ నది ప్రవహించడం ఒక్కటే నీటి భద్రత కాదు. నీరు ఎక్కడ ఉంది? ఎప్పుడు ఉంది? ఎంతకాలం నిల్వ ఉంటుంది? ఎంత భూగర్భంలోకి వెళ్తుంది? ఎంత వ్యవసాయానికి చేరుతుంది? అన్నదే అసలు ప్రశ్న.
అందుకే Rock Check Dams వంటి చిన్న నీటి నిర్మాణాల ద్వారా ప్రవాహ వేగాన్ని తగ్గించి, నీటిని నిలిపి, భూగర్భ జలాలను పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారీ డ్యామ్ ఒక్కటే పరిష్కారం కాదు. చిన్న చిన్న నీటి నిర్మాణాల నెట్‌వర్క్ కూడా ఒక ప్రాంతాన్ని మార్చగలదు.
పాత నీటి వనరులకూ కొత్త జీవితం … కొత్త reservoir నిర్మించడం ఒక పని. ఉన్న నీటి వనరును తిరిగి బతికించడం మరో పని. Gompa గ్రామంలోని T-Trench Water Bodyను పునరుద్ధరించగా, దాని నీటి ప్రవాహ సామర్థ్యం రోజుకు సుమారు 3 లక్షల లీటర్ల నుంచి 5 లక్షల లీటర్లకు పెరిగింది.
ఇలాంటి పనుల్లో పెద్ద యంత్రాలు, భారీ ప్రాజెక్టులు అవసరం లేకపోవచ్చు. కొన్నిసార్లు… ఉన్న వ్యవస్థను సరిచేయడమే అభివృద్ధి.
ఒకే చెరువు… రెండు పనులు! Mathoలో పునరుద్ధరించిన pond సామర్థ్యాన్ని సుమారు 1.5 కోట్ల లీటర్ల నుంచి 2.5 కోట్ల లీటర్లకు పెంచారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన ఆలోచన ఉంది. చలికాలంలో నీరు గడ్డకట్టినప్పుడు అదే ప్రాంతాన్ని Ice Hockey కోసం ఉపయోగించుకునే అవకాశం. అంటే ఒక infrastructure assetను సంవత్సరంలో వేర్వేరు కాలాల్లో వేర్వేరు అవసరాలకు ఉపయోగించుకోవడం.
నీరు కూడా… క్రీడ కూడా. ఇదే resource optimisation. ఇప్పుడు భూమి లోపలికి వెళ్లారు! ఇప్పటి వరకు నీటి కథ. ఇప్పుడు ఎనర్జీ కథ.
లడఖ్‌లోని పూగా వ్యాలీలో భూమి లోపల ఉన్న వేడిని ఉపయోగించుకునే geothermal project. ONGC Energy Centre రెండు geothermal wellsను ప్రారంభించింది. లోతు… 1,000 మీటర్లు. సుమారు 400 మీటర్ల లోతులోనే 135°C వరకు ఉష్ణోగ్రత నమోదైంది. అక్కడి నుంచి భూగర్భ వేడిని ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేసే pilot project దిశగా అడుగులు పడుతున్నాయి.
లక్ష్యం ప్రస్తుతం ఒక MW స్థాయి geothermal power demonstration. ఇది ఇంకా పెద్ద commercial power plant కాదు. కానీ దాని ప్రాముఖ్యత వేరే చోటుంది. భారత్‌కు లడఖ్‌లో geothermal energy practically ఎంతవరకు సాధ్యమో పరీక్షించడం. సూర్యుడి కోసం ఆకాశం వైపు చూశాం… Solar power కోసం సూర్యుడిని చూస్తాం. Wind power కోసం గాలిని చూస్తాం. Hydro కోసం నదిని చూస్తాం. Geothermal కోసం… భూమి లోతుల్లోకి చూస్తాం. అదే ఈ ప్రయోగం ఆసక్తికరంగా మారడానికి కారణం.

మంచుతో కప్పబడిన ప్రాంతం కింద 135°C వేడి ఉండటం ఒక ప్రకృతి విశేషం. దాన్ని టెక్నాలజీతో ఉపయోగించుకోవడం ఒక ఇంజినీరింగ్ విశేషం. కేవలం విద్యుత్తే కాదు… Geothermal energy అంటే కేవలం electricity generation కాదు. భూమి నుంచి లభించే వేడిని నేరుగా కూడా ఉపయోగించవచ్చు.
ఇళ్లను వేడి చేయడానికి… Greenhousesలో వ్యవసాయం చేయడానికి… వ్యవసాయ ఉత్పత్తులను ఎండబెట్టడానికి… కొన్ని industrial processesలో…
అంటే… భూమి లోపలున్న వేడి కూడా ఒక fuel resourceలా మారవచ్చు. ఇది లడఖ్ వంటి తీవ్రమైన చలిగల ప్రాంతంలో మరింత ప్రాధాన్యం పొందుతుంది.
పశ్మీనా కూడా ఒక resource … లడఖ్ అంటే కేవలం రాళ్లు, మంచు కాదు. అక్కడి Changpa సమాజానికి పశ్మీనా జీవనాధారం. అందుకే పశ్మీనా ఉత్పత్తిని పెంచడం, దాని value chainను బలోపేతం చేయడం, స్థానిక పశుపోషకులకు మెరుగైన ఆదాయం వచ్చేలా చేయడం వంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.
లడఖ్‌లోని చాంగ్పా పశుపోషకులు పెంచే ప్రత్యేక మేకల నుంచి లభించే అత్యంత సన్నని, ఖరీదైన ఉన్ని — పశ్మీనాను కూడా అక్కడి ప్రభుత్వం స్థానిక ఆర్థిక వ్యవస్థకు మరింత బలమైన వనరుగా మార్చే ప్రయత్నం చేస్తోంది…
ఇక్కడ కూడా philosophy ఒకటే. ప్రాంతంలో ఉన్న resourceను గుర్తించు… దానికి value addition చేయి… స్థానిక ఆర్థిక వ్యవస్థకు తిరిగి తీసుకురా.
60 వేల ఎకరాల భూమి కథ కూడా ఉంది… ఇంకో పెద్ద అంశం — Nautor land. దశాబ్దాలుగా వివాదంగా ఉన్న ప్రభుత్వ భూముల regularisation ద్వారా సుమారు 60,000 ఎకరాలకు పైగా భూమిపై స్థానికులకు హక్కులు కల్పించే ప్రక్రియ మొదలైంది. ఇది పూర్తిగా వేరే రంగానికి చెందిన విషయం. కానీ మొత్తం pictureలో చూస్తే ఒక లింక్ కనిపిస్తుంది.
భూమి → నీరు → వ్యవసాయం → స్థానిక జీవనోపాధి. అభివృద్ధి అంటే కేవలం రోడ్డు వేయడం కాదు. ఒక ప్రాంతంలోని resource ecosystemను బలోపేతం చేయడం కూడా అభివృద్ధే. మరి వీటన్నింటినీ కలిపితే? ఇదే అసలు కథ.
ఒక వైపు… హిమానీనదం నుంచి వచ్చిన నీటిని పట్టుకుంటున్నారు. మరో వైపు… చెరువులు నిర్మిస్తున్నారు. ఇంకో వైపు… పాత నీటి వనరులను పునరుద్ధరిస్తున్నారు. నదీ ప్రవాహాన్ని ఉపయోగించుకుంటున్నారు. వ్యవసాయ భూములకు నీరు తీసుకెళ్తున్నారు. పశ్మీనా వంటి స్థానిక వనరులను ఆర్థిక వ్యవస్థతో అనుసంధానిస్తున్నారు.
ఇక ఇప్పుడు… భూమి లోపలున్న వేడిని కూడా ఎనర్జీగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే… లడఖ్ తన దగ్గర ఉన్న ప్రతి natural resourceను గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్టుంది. ఇక్కడే అసలు అభినందించాల్సిన విషయం ఉంది. అభివృద్ధిని మనం తరచూ కిలోమీటర్ల రోడ్లలో కొలుస్తాం.
ఎన్ని flyovers కట్టారు? ఎన్ని ఎకరాల IT park వచ్చింది? ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయి? ఎన్ని factories వచ్చాయి? అవి కూడా అవసరమే. కానీ… ప్రపంచంలోని అత్యంత ఎత్తయిన మానవ నివాస ప్రాంతాల్లో ఒకటైన లడఖ్‌లో ఒక నీటి కాలువ నిర్మించడం కూడా ఒక engineering challenge. అక్కడ ఒక reservoir నిర్మించడం కూడా challenge. అక్కడ ఒక బావిని 1,000 మీటర్ల లోతు వరకు తవ్వడం మరింత పెద్ద challenge.
అక్కడ వ్యవసాయాన్ని నిలబెట్టడం ఒక ఆర్థిక సవాలు. అక్కడి ప్రజలను అక్కడే ఉంచి, అక్కడే జీవించే పరిస్థితులు కల్పించడం ఒక సామాజిక సవాలు. కాబట్టి… అక్కడ జరిగే ప్రతి చిన్న అభివృద్ధి కార్యక్రమాన్నీ దాని geographical contextలో చూడాలి…
అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా లడఖ్ దశను, దిశను మార్చే ప్రయత్నంలో ఉన్నాడు… లడఖ్ చాలా మారుతోంది… నివాసం క్లిష్టంగా ఉన్న హైఆటిట్యూడ్ ప్రాంతాల్లోనూ జీవనాన్ని సౌకర్యవంతం చేయడం అంత సులభమేమీ కాదు… కానీ ఆయన అడుగులు కొత్త ఆశలవైపు ఆ హిమప్రాంతాల్ని నడిపిస్తున్నాయి…!!
Share this Article