.
బిగ్‌బాస్ 10వ సీజన్ ప్రారంభమే నాన్సెన్స్… చరణ్ మహాదేవ్ అనే కంటెంస్టెంట్ అగ్నిపరీక్షలో మూడు వారాలు రకరకాల పిచ్చి టాస్కుల్లో సైతం పాల్గొని, నెగ్గి, హౌజులోకి వస్తే… బిగ్‌బాస్ క్రియేటివ్ దిక్కుమాలిన ప్లానింగుకు బలై మూడేరోజుల్లో హౌజు వీడాల్సి వచ్చింది…
బయట మూడు వారాల మంచి పర్‌ఫార్మర్ మూడే రోజుల్లో ఎలా అసమర్థుడయ్యాడు..? హౌజుకు అలవాటు పడటానికే ఓ వారం పడుతుంది… ఎవరి గేమ్ ఏమిటో అర్థం చేసుకుని, అడ్జస్ట్ కావడానికి ఆ వ్యవధి తప్పదు… కానీ మూడే రోజుల్లో తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఏ చాన్సూ ఇవ్వకుండా పంపించేయడం మూర్ఖత్వం…
Ads
తను హౌజు వీడినట్టు లైవ్ ప్రసారంలో అర్థమవుతోంది… 10 మంది సెలబ్రిటీలు, ఆరుగురు కామనర్లు… రెండు టీమ్స్‌గా విభజించారు… టీమ్‌కు ఒకరి చొప్పున తమలోతామే ఎంపిక చేసి, హైరిస్క్ జోన్‌లోకి పంపించాలని బిగ్‌బాస్ ఆదేశం… హైరిస్క్ జోన్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్లలో ఒకరిని ఎలిమినేట్ చేసే అవకాశం ఉందనీ హింట్ ఇచ్చాడు…
ఒక టీమ్‌ను లీడ్ చేస్తున్న ఆటో రాంప్రసాద్ నేనే హైరిస్క్ జోన్‌లోకి వెళ్తాను అన్నాడు… అక్కడ తన స్ట్రాటజీ ఏమిటంటే..? ఎలాగూ తనకు ‘పవర్’ ఉంది, దాని సాయంతో ఎలిమినేషన్ ప్రమాదం నుంచి బయటపడగలడు… కానీ రిస్క్ తీసుకుని హీరో అవుతాడు, వోటింగులో ముందుకు పోతాడు… అదీ తన ధీమా…
రాంప్రసాద్, చరణ్… వీరిలో ఎవరిని బయటికి పంపించాలో కూడా హౌజ్ మేట్స్ నిర్ణయించాలని మరో ఆదేశం ఇచ్చాడు బిగ్‌బాస్… మరో తిక్క నిర్ణయం… ఆ ఇద్దరి నడుమ పోటీలో రాంప్రసాద్‌కు హౌజ్ మేట్స్ మద్దతు పలికారు… (నిజానికి చరణ్ గట్టి కంటెస్టెంటే)…
సో, చరణ్ బలయ్యాడు… చరణ్ టీమ్‌లోని రోహిత్ గేమ్‌ప్లాన్‌లో భాగంగా చరణ్‌ను బయటికి పంపించాడని ఓ ప్రచారం ఉంది… కానీ ఇది ప్రేక్షకుల వోటింగుకు సంబంధం లేకుండా, హౌజులో ఆటతీరుతో సంబంధం లేకుండా జరిగిన ఎలిమినేషన్… అందుకే నాన్సెన్స్ అనేది… కనీసం ఒక వారమైనా ఉండకుండా బయటికి పంపించడం ఏమిటి..?
ఈ మాత్రం దానికి అన్నివారాల తిక్క టాస్కులు పెట్టి నిగ్గుతేల్చడం దేనికి..? ఆ అగ్నిపరీక్షల్లో నెగ్గితే కొన్నాళ్లు హౌజులో ఉండేందుకు అర్హుడనే కదా…? మరి ఆ అగ్నిపరీక్ష విలువను కూడా బిగ్‌బాసే దిగజార్చుకున్నాడు… అది మరో బ్లండర్…
కానీ ఇక్కడ బిగ్‌బాస్ నిజంగానే తనను బయటికి పంపించేశాడా..? లేక సీక్రెట్ రూమ్‌లో పెట్టాడా, పూర్తిగా హౌజు నుంచి బయటికి వచ్చినట్టు కనిపించడం లేదు, రాంప్రసాద్ తన స్పెషల్ పవర్ వినియోగించాడా, లేక మరో షాకింగ్ ఎలిమినేషన్ వంటి ఇంకేవో ప్లాన్లతో ఆటను రక్తికట్టించే మరో ఆలోచనలో ఉన్నాడా తేలాల్సి ఉంది… అసలు కథేమిటో నాగార్జున వీకెండ్ షోలలో తేలుతుందేమో!!
Share this Article