.
ఆట అంటే అర్థంతరంగా ఆట నుంచి పంపించేయడం కాదు… ఆటలో ఎవరేమిటో తేల్చడానికి అవకాశాలు ఇవ్వడం…. కానీ బిగ్‌బాస్‌కు ఇలాంటి నీతులు పట్టవు… అసలు దాని ధోరణే ‘సరైన దారి’లో ఉండదు… దానికి ఓ క్రియేటివ్ టీమ్ ఉంటుంది…
ఆ టీమ్ సభ్యుల బుర్రల్లో ఏది మెదిలితే అదే క్రియేటివిటీ… అలాంటి భ్రమల్లోనే పడి ఆటను నాశనం చేస్తుంటారు… లేకపోతే ఈ 10వ సీజన్‌లో నాలుగే రోజుల్లో ఇద్దరిని ఎలిమినేట్ చేయడం ఏమిటి..? అబ్సర్డ్…
Ads
ఎవరు హౌజు నుంచి బయటికి పోయారనేది కాదు… ఎలా పంపించారనేది చూడాలి… 10 మంది సెలబ్రిటీలు, ఆరుగురు కామనర్లు… రాగానే పెంట పంచాయితీ పెట్టాడు బిగ్‌బాస్… ఏదో హైరిస్క్ అంటాడు, ఈజీ గేమ్ అంటాడు… అసలు ఎవరికి ఆడే అవకాశం వస్తుందో రావడం లేదో కూడా తెలియదు… అంతా మెంటల్ యవ్వారం…
అంతకుముందు అగ్నిపరీక్ష ఆడిషన్స్‌లో చరణ్ అనే పిల్లాడు బాగా ఆడాడు, ఎంతోమందిని దాటి బిగ్‌బాస్ హౌజులోకి వచ్చాడు… కానీ తనకు ఆడే అవకాశం దొరికిందెక్కడ… రెండే రోజుల్లో పంపించేశారు… ఇప్పుడు తాజాగా చైత్రను పంపించేశారు…
ఇదేమైనా పబ్లిక్ ఓటింగుతోనా అంటే… అదీ కాదు! వాళ్లలో వాళ్లే వోట్లు వేసుకుని, వాడు ఔట్, వీడు పాస్ అని రిజల్ట్ చెప్పేసుకుంటారు… పక్కా దరిద్రపు ఆట… నిజానికి హౌజులో ఉన్నవాళ్లలో కాస్త పద్ధతిగా కనిపిస్తున్నది చైత్ర…
ఇద్దరు పిల్లల తల్లి అయి ఉండీ, హఠాత్తుగా బరువు పెరిగితే సాధనతో 20 కిలోలు తగ్గించుకున్న సక్సెస్ స్టోరీని కూడా ఇదే బిగ్‌బాస్‌లో చూపించారు కదా… మరి నాలుగు రోజుల్లోనే బయటికి తరిమేస్తే ఆమె తన ఆటతీరును ప్రూవ్ చేసుకునే చాన్స్ ఎక్కడ ఇచ్చినట్టు…? నిజానికి ఆమె గొంతునొప్పి, ఫీవర్‌తో బాధపడుతోంది, కానీ సైలెంటుగా ఉంది, యాక్టివ్‌గా లేదు అంటూ నెగెటివ్ ముద్రలు వేసి పంపించేయడం ‘చిల్లరతనం’…
సో, మొదటి రెండు ఎలిమినేషన్లూ బిగ్‌బాస్ పైత్య సూచికలే… అబ్బే, వీళ్లిద్దరినీ బయటికి పంపలేదు, ఇదొక డ్రామా, సీక్రెట్ రూమ్స్‌లో దాచిపెట్టి, మళ్లీ తీసుకొస్తారు, పోటీపెడతారు, ఎవరు గెలిస్తే వాళ్లు ఉంటారు, ఓడిన వాళ్లు వెళ్లిపోతారు అని ఓ ప్రచారం…
అసలు మొదటివారం ఎలిమినేషన్లు ఎందుకు ఉండాలి… కనీసం రెండు వారాలు ఉంచాలి… అప్పుడే ఆటలో మజా… ఈ సీజన్ లాంచింగ్ షోలో నాగార్జున చెబుతున్నాడు… ఆటలో సవాల్ కాదు, ఆటే సవాల్ అని… బిగ్‌బాస్ పైత్యాన్ని అర్థం చేసుకోవడం కూడా సవాలే అన్నట్టు మారింది… (నిజానికి శాలిని ఓవరాక్షన్ దుర్భరం… ఆమెను బయటికి అందరికన్నా ముందే గెంటేస్తే బెటర్)…
ఆటో రాంప్రసాద్ ఏకంగా బిగ్‌బాస్ కెమెరా వైపే చూస్తూ చెబుతున్నాడు… బిగ్‌బాస్ చరిత్రలో లేదేమో, 4 రోజుల్లోనే ఇద్దరిని పంపించేయడం అని..! (రాంప్రసాద్ ఎప్పటికప్పుడు తన ఆదరణ పెంచుకుంటున్నాడు, బిగ్‌బాస్ ధోరణిని విమర్శించడం, ప్రశ్నించడంతో కూడా…)
అవును, ఈ 10వ సీజన్ ఇంకెన్ని పైత్యాల్ని ప్రదర్శించబోతున్నదో !! ఇంకా ఈ దరిద్రానికి త్వరలోనే ఆరుగురిని వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా ప్రవేశపెడతారట…!! మీ తల్కాయ్ !!
Share this Article