Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఔను, వాళ్లు చాలా క్లారిటీతో ఉన్నారు – అందుకే బీజేపీకి ఒకేఒక వోటు !!

September 16, 2026 by M S R

.

రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఢంకా బజాయించిందనీ, బీజేపీ ఆధిపత్యాన్ని గణనీయంగా తగ్గించేసిందనీ, బీజేపీ ప్రముఖులకు చెమటలు పట్టించిందనీ పలు గణాంకాలతోసహా అనేకానేక పోస్టులు కనిపిస్తున్నాయి…

నిజమే, అధికారంలో ఉన్న పార్టీ సాధారణంగా ఎక్కువ స్థానాల్ని గెలుచుకోవడం పరిపాటి… కానీ ఈ ఎన్నికల్లో బీజేపీ మరీ అంత ప్రాబల్య ప్రదర్శన చేయలేదు, కాంగ్రెస్ మంచి పోటీ ఇచ్చింది, అక్కడి వరకూ నిజమే… కానీ ఇంకొన్నీ చెప్పుకోదగిన ప్రాముఖ్య అంశాల్ని మాత్రం అందరూ విస్మరిస్తున్నారు…

Ads

మిత్రుడు Pardha Saradhi Upadrasta పోస్టు నాణేనికి మరో కోణం చూపిస్తోంది… చదవండి…



రాజస్థాన్‌లోని దీద్వానా- కూచామన్ జిల్లా, పర్బత్సర్ మున్సిపాలిటీలోని 13వ వార్డులో బీజేపీ అభ్యర్థికి కేవలం ఒక్కటంటే ఒక్క ఓటు మాత్రమే వచ్చింది.

అక్కడ బీజేపీ తరఫున కైలాష్ చంద్ర అనే అభ్యర్థి పోటీ చేశారు. ఫలితాల తర్వాత కైలాష్ చంద్ర మీడియాకు అసలు కారణం వివరించారు. ఆయనకు ఓటు హక్కు ఉన్నది 12వ వార్డులో, కానీ పార్టీ ఆయనను పక్కనే ఉన్న 13వ వార్డు నుండి పోటీకి నిలబెట్టింది. 13వ వార్డులో ఆయనకు ఓటు హక్కు లేదు కాబట్టి కనీసం ఆయన ఓటు కూడా ఆయన వేసుకోలేకపోయారు. ఆయన కుటుంబ సభ్యుల ఓట్లు కూడా వేరే వార్డులోనే ఉన్నాయి. దీంతో 13వ వార్డుకు చెందిన ఎవరో ఒక్క గుర్తుతెలియని ఓటరు మాత్రమే ఆయనకు ఓటు వేశారు.

ముస్లింలు అధికంగా ఉన్న ఈ వార్డులో మొత్తం 573 అధికారిక చెల్లుబాటయ్యే ఓట్లు పోల్ కాగా, కాంగ్రెస్ అభ్యర్థి (హీనా ఖానం) కు 376 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి (రషీద్ ఖాన్) కు 195 ఓట్లు, బీజేపీ అభ్యర్థి (కైలాష్ చంద్ర) కు ఒక ఓటు, నోటా (NOTA) కు ఒక ఓటు పడ్డాయి…

అంటే కాంగ్రెస్ అభ్యర్థి హీనా ఖానం 181 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే, మొత్తం పర్బత్సర్ మున్సిపాలిటీలోని 25 వార్డులలో కాంగ్రెస్ 13, బీజేపీ 12 వార్డులను గెలుచుకుని హోరాహోరీగా నిలిచాయి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డుల విభజన చేసేటప్పుడు కొన్ని వార్డులు నిర్దిష్ట సామాజిక వర్గాలు ఎక్కువగా ఉండేలా మారుతుంటాయి. ఈ 13వ వార్డు కూడా ముస్లిం ఓటర్లు అత్యధికంగా ఉన్న ప్రాంతం కావడం, పైగా అక్కడ పోటీ చేసిన ఇద్దరు బలమైన అభ్యర్థులు కూడా అదే వర్గానికి చెందిన వారు కావడం వల్లే ఓట్లన్నీ వారిద్దరి మధ్యే పంచుకోబడ్డాయి.

పైగా ఆ చిన్న వార్డుకు కేవలం ఒక్కటే పోలింగ్ బూత్ మాత్రమే ఉంది. వారు ఎవరికి వేయకూడదు అనేది చాలా క్లారిటీగా ఉన్నారు, ఆఖరికి స్వతంత్ర అభ్యర్థికి వేశారు కానీ బీజేపీకి కాదు. ఒక్కటంటే ఒక్క వోటు కూడా డీవియేట్ కాలేదు, అవును, వాళ్లు చాలా క్లారిటీతో ఉన్నారు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఔను, వాళ్లు చాలా క్లారిటీతో ఉన్నారు – అందుకే బీజేపీకి ఒకేఒక వోటు !!
  • ఒకరోజు బిచ్చగాడి వేషంతో – ఆ ప్రచారంతో సాదాసీదాతనం రాదు !
  • హెరిటేజ్ ఆనవాళ్ల పరిరక్షకుడు- ఈ ఆగాఖాన్ ఎవరో తెలుసా?
  • KTR ట్వీట్లు, ఆరోపణలు సరే… ఇంతకీ ఠాణాలో దాడి ఘటన జరిగిందా?
  • ట్రూ కామ్రేడ్ వెళ్లిపోయాడు – ఆ ఎరుపు రంగూ వెలిసిపోయింది !!
  • అచ్యుతం కేశవం … బాగున్నట్టే ఉంది… కానీ ఏదో తెలియని అసంతృప్తి !!
  • GDN – మాధవన్ మరో మంచి పాత్ర! చూడదగిన ఓ బయోపిక్ !!
  • 72 వేల మందికి పీఆర్సీ కట్?… అపోహలేమిటి – నిజాలేమిటి?
  • ‘ది హిందూ’ ఎందుకు గుంజీలు తీసింది? తను చేసిన తప్పేమిటంటే?
  • తెలంగాణ రెడ్లు, కోమట్లు – వందల తరాలుగా ఓ జన్యులోప వారసత్వం!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions