Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓ ఆరోగ్యకరమైన చర్చ – ఏకశిల ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు !?

September 21, 2026 by M S R

.

సాధారణంగా ఏదైనా కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుడితే… కాంగ్రెస్ ముఖ్యమంత్రులు నెహ్రూ కుటుంబ సభ్యుల పేర్లను పెట్టేస్తుంటారు…. అది విధేయ ప్రకటన! దేశవ్యాప్తంగా అది ఓ అలిఖిత ఆనవాయితీ అయిపోయింది… కానీ రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లు వంటి ఆ బాటలోనే ఉన్నా సరే, వరంగల్ (మామునూరు) ఎయిర్‌పోర్టుకు సంబంధించి ఓ మంచి ప్రతిపాదనను జనం ఎదుట పెట్టాడు…

అది ఆ ప్రాంత విశిష్టతకు, ప్రజాభిప్రాయానికి గుర్తింపు ఇవ్వడం, గౌరవించడం..! ఎప్పుడో యుద్దావసరాల కోసం దశాబ్దాల క్రిితం ఏర్పాటైన ఎయిర్‌స్ట్రిప్ అది… దాన్ని ఓ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుగా డెవలప్ చేయడానికి సర్వం సిద్ధమైంది… కేంద్రమూ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది… ఐతే దానికి ఏ పేరు పెట్టాలో మీరే చెప్పండి అని ఓ ఆరోగ్యకరమైన ఆలోచనకు, డిబేట్‌కు తెరలేపాడు రేవంత్ రెడ్డి ఓ ట్వీట్ ద్వారా…

Ads

నిజంగానే ఓ మంచి చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో… పాన్ ఇండియా దర్శకుడు వంగ సందీప్ రెడ్డి రాణి రుద్రమ లేదా కాకతీయ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులు అని ప్రతిపాదించాడు… సోషల్ మీడియాలో బాగా ప్రతిపాదనకు వస్తున్న కొన్నిపేర్లు ఆసక్తికరంగా, ఆ ప్రాంతాన్ని ఓన్ చేసుకునే రీతిలో బాగున్నాయి…

1) కాకతీయ… రాణి రుద్రమ… ఈ పేర్లు నాటి కాకతీయ సామ్రాజ్యాన్ని, ఒకప్పటి రాణి రుద్రమ పాలనను గుర్తుతెచ్చేలా బాగున్నాయి… కానీ కేసీయార్ మార్క్ రాజరికపు పోకడలు, ఛాయలున్న తెలంగాణ తల్లి విగ్రహాన్నే సగటు తెలంగాణ ఆడపడుచు రూపానికి మార్చిన రేవంత్ రెడ్డి మళ్లీ అదే తరహాలో కాకతీయ, రాణి రుద్రమ పేరు పెడతాడా..? సందేహమే…

2) సీపీఐ రావి నారాయణరెడ్డి పేరు ప్రతిపాదించింది… దీనికి పెద్దగా జనామోదం ఉండకపోవచ్చు… పైగా ఒక వ్యక్తి పేరు గాకుండా ఓ ప్రాంత విశిష్టతను గుర్తుచేసే పేరయితే ఓ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాగుంటుందనేది స్థూలంగా జనాభిప్రాయంగా వినిపిస్తోంది…

3) కాళోజీ నారాయణరావు.., పద్మవిభూషణ్… వరంగల్ ఏరియా మార్క్ ధిక్కారి, కవి… కానీ ఆల్రెడీ కాళోజీ స్మారకం నిర్మాణంలో ఉంది… కాకపోతే దీన్ని వ్యతిరేకించేవాళ్లుండరు… కానీ ఓ వ్యక్తి పేరు…

4) పీవీ నరసింహారావు… మాజీ ప్రధాని… భారతదేశ దశను, దిశను మళ్లించిన స్టేట్స్‌మన్… ఖచ్చితంగా గౌరవించాల్సిన కేరక్టర్… కానీ పీవీ అంటే సోనియాకు పడదు, అందుకని రేవంత్ రెడ్డి అంగీకరించడు అనేది ఓ భావన… కానీ అదీ తప్పే… ప్రభుత్వం అధికారికంగా పీవీ వర్ధంతి, జయంతులను పాటిస్తోంది… పీవీ ఘాట్ కూడా హైదరాబాద్‌లో ఉంది…

5) సర్వాయి పాపన్న… అప్పట్లో బడా పాలకులపై ఎగిరిన ఓ తిరుగుబాటు పోరాట పతాక తను… మళ్లీ ఓ వ్యక్తి పేరు అవుతుంది… ఈమధ్యే ప్రభుత్వం అధికారికంగానే తన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసింది…

6) జయశంకర్… తనూ తలుచుకోదగిన పేరే… తెలంగాణ పదాన్ని కూడా నిషేధించిన చంద్రబాబు దుర్మార్గ పాలనలో సైతం  ఒక్కడు వెరవకుండా తెలంగాణ జెండా ఎత్తిన నిబద్ధత తనది… ప్రత్యేక రాష్ట్ర సాధన దిశలో తను చేయని కృషి లేదు… నిజానికి ఒకరకంగా తెలంగాణ జాతిపిత అనే పేరు తనకు ఆప్ట్… కానీ ఆల్రెడీ ఓ జిల్లాకు తన పేరు పెట్టారు…

7) సమ్మక్క- సారలమ్మ… దేశంలోకెల్లా అతిపెద్ద గిరిజన కుంభమేళా… ఈ ప్రభుత్వం వచ్చాకే 300 కోట్ల దాకా ఖర్చుపెట్టి ఆధునీకరించారు ఆ గుడి ప్రాంగణాన్ని… నిజానికి ఓ గిరిజన వర్శిటీకి ఆ పేరు పెడితే ఆప్ట్…

8) రామప్ప ఎయిర్‌పోర్ట్… ఇదీ బాగానే ఉంది… మన కాకతీయుల నాటి వాస్తువైభవానికి పతాక అది… కాకపోతే ఇంకా ఈ ప్రాంతానికి తగిన పేరుంటే బాగుంటుందనే భావన…

…. ఇవేకాదు, ఇంకా పలుపేర్లు వస్తున్నాయి, కొందరైతే ఏకంగా కేసీయార్ పేరు పెట్టొచ్చు కదా అని సెటైర్లు వేస్తున్నారు… ప్రస్తుతం ఆ పేరుకున్న వ్యతిరేకత దృష్ట్యా అది స్థూల జనామోదయోగ్యం కాకపోవచ్చు, ఏమో, కేటీయార్ గనుక సీఎం అయిఉంటే పెట్టేసేవాడేమో…

చివరగా… ఏకశిల… ఈ పేరుకు హిస్టారిక్, పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి… వరంగల్ నగరానికున్న పేరు… కాకతీయ, రుద్రమ, రామప్ప వంటి అన్ని పేర్లూ మిళితం చేసి, వ్యక్తీకరించే పేరు… అవును, బాగున్నట్టుంది… ఏకశిల ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు..!!

ఇది ఏ ఒక్క రాజకీయ నాయకుడి పేరు కాదు. ఏ ఒక్క పార్టీకి చెందిన పేరు కాదు. ఓ వ్యక్తి జీవిత చరిత్రను మోసుకొచ్చే పేరు కాదు. ఈ నేల చరిత్రను మోసుకొచ్చే పేరు. అందుకే... “ఏకశిల ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్” ... ఎలా ఉంది ఈ పేరు? లేదా "భద్రకాళి"...

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఓ ఆరోగ్యకరమైన చర్చ – ఏకశిల ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు !?
  • రాహుల్… నీకూ తల్లి ఉంది… కనీసం నీ డర్టీ టీమ్‌ను మార్చుకో…
  • Immortal – సరుకులన్నీ బాగానే ఉన్నయ్ … వంట కుదరలేదు, అంతే…
  • రోజులు మారాయ్ ! నువ్వెంత తోపు స్టార్ అయితేనేం- స్టోరీ ఏమిటో చెప్పు !
  • అమ్మగారు ఐరాస మెట్లు ఎక్కుతున్నారు – రచ్చ ముఖ్యం !!
  • ప్రొఫెనలిజం – ఎవరు నిజమైన దొంగలు ? ఓ బ్యాంకు చోరీ కథ !!
  • Only SunDay- Not FunDay… పరమ పేలవంగా నాగార్జున వీకెండ్ షో !
  • మైండ్ బ్లాకయ్యేలా… జన్వాడ భూముల ‘మోడస్ ఆపరెండి’…
  • పరిపక్వత – రాజకీయాల్లో, వ్యక్తిగత తత్వాల్లో… మంచి ఉదాహరణ !
  • బాలయ్య కొడుకు ఎంట్రీకి ఈ కథ సరిగ్గా కుదురుతుందేమో..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions