Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Cricketer Shami – యూపీ రాజకీయాల్లో స్టార్ పేసర్ షమి !!

September 21, 2026 by M S R

.

Pardha Saradhi Potluri … 2027 ఉత్తరప్రదేశ్ ఎన్నికలకి సన్నాహమా? ఇండియన్ క్రికెట్ స్టార్ పేసర్ మొహమ్మద్ షమి రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నాడా?

నిన్న ఆదివారం ఢిల్లీలోని రాష్ట్రీయ లోక్ దళ్ ( RLD ) పార్టీ చీఫ్ జయంత్ చౌదరీని మొహమ్మద్ షమి కలిసినట్లు, జయంత్ చౌదురీ మొహమ్మద్ షమితో కలిసి ఉన్న ఫోటోని మీడియాకి విడుదల చేశాడు!

Ads

మొహమ్మద్ షమి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల కోసం నిర్వహించే ఫిటినెస్ టెస్ట్‌లలో విఫలం అవుతుండడంతో తుది జట్టులో స్థానం సంపాదించుకోలేకపోతున్నాడు!
అయితే షమి RLD చీఫ్‌ని కలవడం మీద పొలిటికల్ స్పెక్యూలేషన్స్ జోరందుకున్నాయి!

మొహమ్మద్ షమి వయస్సు 36 ఏళ్ళు! ఫాస్ట్ బౌలర్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యే వయస్సే  షమిది, కానీ ఇంతవరకు తన రిటైర్మెంట్  ప్రకటించలేదు షమి! ODI వరల్డ్ కప్ టీమ్‌లో ఉండాలని తన కోరిక అని వెల్లడించాడు కానీ సెలెక్టర్స్ ఫిట్‌నెస్ దృష్ట్యా, కొత్త కుర్రాళ్లకి అవకాశం ఇవ్వడం మీద దృష్టి పెట్టడంతో షమికి అవకాశాలు తగ్గుతున్నాయి. ప్రస్తుతం డోమెస్టిక్ క్రికెట్ లో బెంగాల్ / ఈస్ట్ జోన్ కి, IPL లో లక్నో సూపర్ జైంట్స్ కి ఆడుతున్నాడు!

RLD ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహ మీద కన్ను వేసిందా?
మొహమ్మద్ షమి రిటైర్మెంట్ ప్రకటించలేదు కానీ RLD చీఫ్ జయంత్ చౌదురిని కలవడంతో ఊహగానాలు జోరందుకున్నాయి!
అమ్రోహి నియోజకవర్గం!
మొహమ్మద్ షమి ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహలో పుట్టాడు! అమ్రోహతో షమికి అనుబంధం ఉంది!

అమ్రోహ రాజకీయ లెక్కలు!
అమ్రోహ అసెంబ్లీ స్థానానికి ప్రస్తుతం సమాజ్‌వాది పార్టీకి చెందిన మహబూబ్ అలీ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు!
అమ్రోహ నుండి మహబూబ్ అలీ వరసగా నాలుగు సార్లు గెలుస్తూ వస్తున్నాడు!
గత అసెంబ్లీ ఎన్నికలలో మహబూబ్ అలీ తన సమీప బీజేపీ అభ్యర్థి అయిన రామ్ సింగ్ మీద 71,036 ఓట్ల మెజారిటీతో గెలిచాడు.

2017 లో మహబూబ్ అలీ సమీప బహుజన సమాజ్ అభ్యర్థి మీద 15,042 ఓట్ల మెజారిటీ తో గెలిచాడు.
So! మొహమ్మద్ షమి అమ్రోహకి చెందిన వాడు కాబట్టి 2027 అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రీయ లోక్‌దళ్ టికెట్ మీద పోటీ చేయబోతున్నాడు అనే ఊహగానాలు మొదలయ్యాయి!
2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ బహుశా ఫిబ్రవరిలో ప్రకటించవచ్చు! 2027 మార్చిలో ఎన్నికలు ఉండవచ్చు!

2027 వరల్డ్ కప్ అక్టోబర్, నవంబర్ నెలలో జరగనుంది!
వచ్చే రెండు నెలలలో ఉత్తరప్రదేశ్ రాజకీయాలలో అనూహ్యమైన కూడికలు, తీసివేతలు ఉండబోతున్నాయి!
ఈసారి రాజకియ దాడి మోడీ, అజిత్ దోవల్ మీద ఎక్కువగా ఉండబోతున్నది!

రాహుల్ ఇప్పటికే అజిత్ దోవల్ ని టార్గెట్ చేయడం మొదలు పెట్టాడు!
నా గత పోస్ట్ లో స్పష్టంగా చెప్పాను మోడీ, దోవల్ , జై శంకర్ గార్లని టార్గెట్ చేస్తారు అని ఇప్పుడు మొదలయ్యింది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Cricketer Shami – యూపీ రాజకీయాల్లో స్టార్ పేసర్ షమి !!
  • ఓ ఆరోగ్యకరమైన చర్చ – ఏకశిల ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు !?
  • రాహుల్… నీకూ తల్లి ఉంది… కనీసం నీ డర్టీ టీమ్‌ను మార్చుకో…
  • Immortal – సరుకులన్నీ బాగానే ఉన్నయ్ … వంట కుదరలేదు, అంతే…
  • రోజులు మారాయ్ ! నువ్వెంత తోపు స్టార్ అయితేనేం- స్టోరీ ఏమిటో చెప్పు !
  • అమ్మగారు ఐరాస మెట్లు ఎక్కుతున్నారు – రచ్చ ముఖ్యం !!
  • ప్రొఫెనలిజం – ఎవరు నిజమైన దొంగలు ? ఓ బ్యాంకు చోరీ కథ !!
  • Only SunDay- Not FunDay… పరమ పేలవంగా నాగార్జున వీకెండ్ షో !
  • మైండ్ బ్లాకయ్యేలా… జన్వాడ భూముల ‘మోడస్ ఆపరెండి’…
  • పరిపక్వత – రాజకీయాల్లో, వ్యక్తిగత తత్వాల్లో… మంచి ఉదాహరణ !

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions