.
ఫాఫం, చంద్రబాబు టీమ్‌లో పాత స్పిరిట్ ఏదో లోపించినట్టుంది… ఒకప్పుడు నానా అతిశయోక్తుల్ని కూడా నిజాలని నమ్మించేంత బలంగా, క్రియేటివ్‌గా చంద్రబాబు ఇమేజ్ బిల్డింగ్ ఎపిసోడ్లు, ఫోటోలు, సీన్లు క్రియేట్ చేసేది టీమ్… మరి ఇప్పుడు ఎందుకింత దరిద్రంగా, జనం నవ్వుకునేట్టు తయారైంది పాపం…
మోదీ ఎక్కడికో వెళ్లాడు,, జాల్ముడి తిన్నాడు, అదీ అరేంజ్‌డే… ఇలాంటి క్రియేటెడ్ పబ్లిసిటీ స్టంట్లలో మోదీని కొట్టేవాళ్లు లేరు, కాకపోతే సహజం, కాకతాళీయం అన్నట్టు క్రియేట్ చేస్తుంది తన సోషల్ మీడియా టీమ్… అదుగో అక్కడే పూర్తిగా కాపీ కొట్టబోయి చంద్రబాబు టీమ్ అడ్డంగా బోల్తాకొట్టింది… నవ్వులపాలైంది…
Ads
మొన్న విశాఖ పర్యటనకు వెళ్లాడు… ఆర్కే బీచ్, స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగం అట… తన టీమ్ ఓ సీన్ ప్లాన్ చేసింది… బీచ్‌లో ఓ మహిళ… అదే మోదీ కొన్న జాల్ముడి అమ్ముతున్నట్టు ప్రాపర్టీ… ఎవరో పాపం ఓ నటి… చుట్టూ ఎవరూ లేరు, జాల్ముడి అమ్మే చుట్టుపక్కల జనం ఉంటారు కదానేది మన పిచ్చి భ్రమ…
వెనుక సముద్రం, పక్కాగా సెట్ వేసినట్టు స్పష్టంగా ఓ జాల్ముడి బండి… బండి పక్కనే డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ పేర్లతో కొత్త డస్ట్ బిన్లు… (నిజానికి జాల్ముడి అనేది ఆంధ్రా స్టయిల్ మిక్చర్ కాదు, ఇది మురి మిక్చర్…)… ఆ ‘‘ఒంటరి మహిళ’’ దగ్గరకు బాబు వెళ్తుంటాడు… వెనుక నుంచి కలెక్టర్ సహా ఉన్నతాధికారగణం, తన పీఆర్ టీమ్, కెమెరాలు గట్రా చూస్తూ ఉంటారు…

సారు గారు వెళ్లారు… అప్పటికే అరటిపళ్లు, బత్తాయిలు, సేపులు మంచిగా అమర్చి పెట్టారు… మామిడి కాయలు కూడా… అవీ కోత మామిడికాయలు, ఇప్పుడు మామిడి కాయలు ఏమిటని ప్రశ్నార్థకం మొహాలు పెట్టకండి… సీన్ నిండుగా ఉండాలంటే రాఘవేంద్రరావు బాపతు పళ్లు అవసరం అక్కడ…
ఏమ్మా, ఏంటి స్పెషల్ అనడిగాడు సారు గారు… ఓ ప్లేట్ మిక్చర్ తీసుకున్నాడు, పర్‌ఫెక్ట్ ప్లాన్ ప్రకారమే క్వశ్చన్స్ వేశాడు, ఆమె బదులిచ్చింది… మామూలుగా పేపర్ పొట్లంలో వేసి ఇస్తుంటారు… కానీ వచ్చింది బాబు గారు కదా, వస్తాడనీ ఆమెకు తెలుసు కదా… ఓ పేపర్ ప్లేటు పెట్టి, స్పూన్ సహా ఇచ్చింది… సారు గారు తిరుమల ప్రసాదాన్నే అలా అరకొరగా చెంచాతో తినే బ్యాచ్ కదా… ఏదో తిన్నట్టు నటించాడు…
కలెక్టర్ అని పిలిచాడు… అప్పటికే లోలోపల పగలబడి నవ్వుకుంటున్న కలెక్టర్ వచ్చాడు భయం నటిస్తూ… ఈమెకు ఒంటరి మహిళ పెన్షన్ ఇచ్చెయ్, నెలకు 4 వేలు అని ఆదేశించాడు… ఆమె నిజంగా అర్హురాలే అయితే మరి ది గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు చెప్పేదాకా ఆమెకు ఆ పెన్షన్ ఎందుకు రావడం లేదు..?

సరే, కలెక్టర్ అడ్డదిడ్డంగా ఏదో తలూపాడు.., తీరా చూస్తే అందరూ లెక్కలేశారు… ఆమె రోజుకు 500, వీకెండ్స్‌లో 2 వేల దాకా ప్లేట్లు అమ్ముతుందట, ఒక్కొక్కటి 30 రూపాయలట… మరి అంత ఆదాయం వస్తున్నప్పుడు ఆమెకు ఈ పెన్షన్ దేనికి..? (ఒకాయన ఏకంగా ఆమెకు నెలకు లక్ష, లక్షన్నర ఆదాయం అని లెక్కలేశాడు కూడా)
నాయకులందరికీ ఇలాంటి పీఆర్ టీమ్స్ ఉంటాయి… ఇమేజ్ బిల్డింగ్ ఎపిసోడ్స్ జనంలోకి వదులుతూ ఉంటాయి, జనం నమ్ముతారనేది వాళ్ల భ్రమ… నమ్మాలనేది వాళ్ల ప్రయాస… క్లైమాక్స్ చెప్పలేదు కదూ… పైన ఫోటో చూశారు కదా, సీన్ అయిపోగానే ఆ జాల్ముడి సెట్ (బండి) ఎత్తుకెళ్లిపోయారు… శుభం…!! దీని దర్శకుడెవరో గానీ… అర్జెంటుగా బాబు, బాలయ్య ఫ్యామిలీ ఆ బోయపాటిని వదిలేసి, ఈ మిక్చర్‌పాటిని ఎంకరేజ్ చేయాలి..!!
Share this Article