Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వై నాట్ సిరిసిల్ల – వై నాట్ సిద్దిపేట – రేవంత్ ‘అఫెన్స్ గేమ్ ప్లాన్’…

September 22, 2026 by M S R

.

వై నాట్ సిరిసిల్ల, వై నాట్ సిద్దిపేట… ఫైనల్లీ వై నాట్ గజ్వెల్..! రాజకీయాల్లో ఫలానా స్థానంలో ఫలానా లీడర్‌ను ఓడించలేం అనేదేమీ ఉండదు… కామారెడ్డిలో కేసీయార్‌ కూడా ఓటమి పాలు కాలేదా..?

ఇదెందుకు చెప్పుకుంటున్నాం అంటే… రేవంత్ రెడ్డి గేమ్ స్ట్రాటజీ… ఈనెల 30న సిరిసిల్లలో కాంగ్రెస్ భారీ సభ పెట్టబోతోంది… కేటీయార్ మార్క్ జన్వాడ, ఇతర భూఅక్రమాలు, సిరిసిల్ల యవ్వారాలతోపాటు చాలా అంశాల్ని కేటీయార్ అడ్డాలోకే వెళ్లి మరీ జనానికి చెప్పడం..! ఇదుగో మీరు ఎన్నుకున్న మీ లీడర్ బాగోతం ఇదీ అని చెప్పడం..!

Ads

సిరిసిల్లలో కేటీయార్ మొదటిసారి పోటీచేసిన 2009లో కేవలం 171 వోట్లతో నెగ్గాడు… కేకే మహేందర్ రెడ్డి మీద… తనకే కాంగ్రెస్ టికెట్ ఇచ్చి ఉంటే కథ వేరే ఉండేదేమో… పీఆర్పీకి కూడా మంచి వోట్లు వచ్చాయి… తరువాత సిద్దిపేటలో కూడా మీటింగ్ పెడుతుంది కాంగ్రెస్… మీరు కంచుకోటలుగా భావిస్తున్న మీ సీట్లలో మిమ్మల్నే ఓడిస్తాం అనే ఓ సంకేతాన్ని హరీష్, కేటీయార్‌‌లకు ఇవ్వడమే కాదు, రాష్ట్రవ్యాప్తంగా జనం అటెన్షన్ డ్రా చేయడం..!

గెలుపో ఓటమో జానేదేవ్… ఓ మైండ్ గేమ్ ప్లస్ ఈసారి నిజంగానే కాన్సంట్రేట్ చేయడం..! నిజానికి ఇదే కాదు… చాలా అంశాల్లో రేవంత్ రెడ్డి ఆడుతున్న గేమ్, పన్నుతున్న స్ట్రాటజీ బీఆర్ఎస్ పెద్ద తలకాయలకు కక్కలేక మింగలేక అన్నట్టుగా మారింది…

కాళేశ్వరం నుంచి పరిశీలించండి… నిన్నామొన్నటి భూఅక్రమాల దాకా… అనేక అంశాల్లో రెండుమూడు నెలలకు ఒకటి చొప్పున బీఆర్ఎస్ పాలనలో జరిగిన భారీ అవినీతి, అక్రమాల బాగోతాల్ని బయటపెడుతున్నాడు రేవంత్ రెడ్డి… నేరుగా కేసీయార్, కేటీయార్, హరీష్ రావుల్నే దోషులుగా నిలబెడుతున్నాడు…

బీఆర్ఎస్ ఖండించేకొద్దీ అది మరింతగా జనంలోకి వెళ్తోంది… చర్చ జరుగుతోంది… అలాగని కౌంటర్ చేయకుండా ఉండలేరు… ఇది కేసీయార్‌కు తెలుసు, అందుకే మాటాపలుకూ లేకుండా స్వీయబందిఖానాలో ఉండిపోతున్నాడు…

ఈ విచారణలు, దర్యాప్తులు, కమిషన్ల రిపోర్టులు, కోర్టులు… ఎలా సాగుతాయో అందరికీ తెలుసు కదా… అందుకని అవన్నీ ఓవైపు నడుస్తూనే ఉంటాయి… మరోవైపు ప్రజాకోర్టులో ప్రధానంగా ఆ ముగ్గురిని దోషులుగా పదే పదే నిలబెడుతున్నాడు రేవంత్ రెడ్డి… ఈసారి భూయవ్వారాలకు సంబంధించి బీఆర్ఎస్ నోటెడ్ లీడర్ల బాగోతాలూ బయటపెట్టాడు… కమలాకర్, దయాకర్ ఎట్సెట్రా నాయకులవి…

కాంగ్రెస్ దూకుడు, దాడి కూడా బాగా పెరిగింది ఇప్పుడు… గతంలోలాగా బీఆర్ఎస్ ఆరోపణలకు ఒకరిద్దరు స్పందించి, కౌంటర్లు ఇవ్వడం కాదు… డిఫెన్స్ కాదు, అఫెన్స్ మొదలైంది… భూబాగోతాల్ని ఆధారాలుసహా బయటపెట్టడమే కాదు… గ్రూపులుగా కేటీయార్, కేసీయార్, హరీష్ ఫామ్ హౌజుల దగ్గరకు వెళ్లడం ఈ అక్రమాల్ని మరింతగా జనంలో చర్చను రాజేయడం కోసమే..!

దీనికితోడు స్పీకర్‌పై బీఆర్ఎస్ నాయకుడొకరు అనుచితంగా చేసిన లం-కొడుకు అనే వ్యాఖ్యను కాంగ్రెస్ పర్‌ఫెక్ట్‌గా వాడుకుంది, కేసీయార్ క్షమాపణ చెప్పకపోవడం, దళిత సంఘాల చావుడప్పు కేసీయార్‌పై యాంటీ దళిత్ అనే ముద్ర వేయగా… చావుడప్పు బాటను పసుపు నీళ్లతో శుద్ధి చేసి, మరో తప్పు చేసింది కేసీయార్ క్యాంప్… దాని మీద కూడా కేసీయార్ స్పందన లేదు… ఈరోజుకూ..!!

నిజానికి ఓ ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వ వైఫల్యాలనో, నాయకుల అక్రమాలనో ప్రశ్నించకూడదని ఎవరూ అనరు… ప్రజాస్వామిక పాలన వ్యవస్థలో అభిలషణీయమే… కానీ అబద్ధాలు, అతిశయోక్తులతో బురద జల్లే పనినే నిరంతరం చేయడంతో బీఆర్ఎస్ విమర్శలకు క్రెడిబులిటీ, వాల్యూ లేకుండా పోతోంది… ఇక ఇప్పుడు కాంగ్రెస్ పూర్తిగా ‘అఫెన్స్’ మోడ్‌లోకి వచ్చేసింది…

సాధారణంగా అధికార పక్షం డిఫెన్స్‌లో ఉంటుంది, ప్రతిపక్షం అఫెన్స్ మోడ్‌లో ఉంటుంది… కానీ ఇప్పుడు అంతా రివర్స్…!! ఉల్టాపల్టా..!! ఏదో ఓరకంగా ఈ భూయవ్వారాల నుంచి డైవర్ట్ చేయడానికి బీఆర్ఎస్  జూరాల ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను రైతులతో ఓపెన్ చేయించినా, అదీ పెద్దగా ఫలించలేదు… ఎన్నికలకు ఇంకా రెండేళ్లుంది కదా, ఐనా ఆట ఇప్పటికే తెలంగాణ రాజకీయం రక్తికడుతోంది..!! తనదైన ఆట ఆడాల్సిన బీజేపీ మాత్రం చేష్టలుడిగి దిక్కులు చూస్తోంది..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వై నాట్ సిరిసిల్ల – వై నాట్ సిద్దిపేట – రేవంత్ ‘అఫెన్స్ గేమ్ ప్లాన్’…
  • కండ్లల్ల కన్నీళ్లు సమ్మక్కా, నీ రొమ్ములకెట్లొచ్చే సమ్మక్కా..!!
  • మై జాల్ముడి ఖా రహాథా… ఈమధ్య ఇంత నవ్వొచ్చిన స్కిట్ వేరే లేదు..!!
  • వైజాగ్ బీచ్ మురి మిక్చర్ ! ఈ కరకరల రుచికీ ఓ చరిత్ర ఉంది !!
  • రైతు బిడ్డగా చెప్పుకుంటే అదేమైనా నేరమా..? సిగ్గుచేటు యవ్వారమా..?
  • తోడబుట్టినోళ్లనూ నమ్మేట్టు లేదు! అక్క అంబికపై నటి రాధ క్రిమినల్ కేసు!
  • మరిక ‘ఉమ్మడి పౌరస్మృతి’ అనడం దేనికి..? సెలెక్టివ్ పౌరస్మృతి అనాలి!!
  • Cricketer Shami – యూపీ రాజకీయాల్లో స్టార్ పేసర్ షమి !!
  • ఓ ఆరోగ్యకరమైన చర్చ – ఏకశిల ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు !?
  • రాహుల్… నీకూ తల్లి ఉంది… కనీసం నీ డర్టీ టీమ్‌ను మార్చుకో…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions