.
( శివ రాచర్ల ) … ఖైరతాబాద్ ఉప ఎన్నిక అంత సులభం కాదు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఖైరతాబాద్ ఉప ఎన్నికకు పోలిక లేదు… పీజేఆర్ అనుచరుడిగా రాజకీయాల్లోకి వచ్చిన దానం నాగేందర్ కు 1989 లో తొలిసారి ఆసీఫ్ నగర్ టికెట్ దక్కింది.
1983 & 1985లో ఆసీఫ్ నగర్ నుంచి MIM గెలిచింది, 1989లో కూడా కాంగ్రెసుకు గెలుస్తామనే నమ్మకం లేదు. హైద్రాబాద్ సిటీలో పీజేఆర్ పెద్ద నాయకుడు కానీ ఆయన అంజయ్య శిష్యుడు కావటం వల్ల మర్రి చెన్నారెడ్డితో సఖ్యత ఉండేది కాదు. పీజేఆర్ మద్దతు లేకుండానే 1989 లో ఖైరతాబాద్ కు చెందిన దానం నాగేందర్ కు పక్క నియోజకవర్గం ఆసీఫ్ నగర్ టికెట్ చెన్నారెడ్డి ఇచ్చారు. ఆ ఎన్నికల్లో దానం ఓడిపోయి MIM గెలిచింది.
Ads
ఓటమితో మొదలైన దానం రాజకీయ జీవితం 1994, 1999 గెలుపుతో YSR కు సన్నిహితుడయ్యారు. 2004లో ఆసీఫ్ నగర్ టికెట్ ఇవ్వకుండా సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వటంతో రెబల్ గా నామినేషన్ వేసిన దానంకు టీడీపీ బి -ఫార్మ్ ఇచ్చింది.
దానం గెలిచారు కానీ ప్రమాణస్వీకారం రోజు నుంచే టీడీపీకి దూరంగా ఉండి YSR క్యాబినెట్ లో మంత్రి కావాలని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసి MIM చేతిలో ఓడిపోయారు.. పీజేఆర్ వర్గం, అప్పటి మంత్రి ముఖేశ్ గౌడ్ వర్గం, టీడీపీ కలిసి దానం నాగేందర్ ను ఓడించాయి.
2007లో పీజేఆర్ మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో పీజేఆర్ కొడుకు విష్ణు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో నియోజకవర్గాల పునః విభజనలో ఆఫీఫ్ నగర్ రద్దయింది . ఖైరతాబాద్ విడిపోయి ఖైరతాబాద్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్ – ఐదు నియోజకవర్గాలు ఏర్పడ్డా యి.
2009 ఎన్నికల్లో విష్ణు జూబ్లీహిల్స్ నుంచి, దానం ఖైరతాబాద్ నుంచి గెలిచారు. YSR క్యాబినెట్ లో దానం నాగేందర్ మంత్రి కావటంతో ఆయన జీవిత కల నెరవేరింది. తెలంగాణ ఆవిర్భావం తరువాత 2014లో కాంగ్రెస్. తరపున ఓడిపోయిన దానం 2018 & 2023లో TRS/BRS తరుపున గెలిచారు.
2004లో సికింద్రాబాద్ ఎంపీ టికెట్ వద్దని టీడీపీ బి- ఫారంపై తన సిట్టింగ్ స్థానం అసిఫ్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన దానం, 2023 లో BRS తరపున ఎమ్మెల్యేగా గెలిచి, మొన్న 2024లో కాంగ్రెస్ నుంచి గతంలో వద్దనుకొన్న సికింద్రాబాద్ ఎంపీ టికెట్ తీసుకొని పోటీచేసి ఓడిపోయి, ఫైనల్ గా యాంటి డిఫెక్షన్ లా కింద హైకోర్టు తీర్పుతో ఎమ్మెల్యే గా అనర్హత వేటుకు గురయ్యాడు…
ఆ విధంగా మళ్లీ ఉప ఎన్నికలు వస్తున్నాయి. దానం సుప్రీం కోర్టుకు వెళ్లారు కానీ అక్కడ ఆయనకు ఊరట దక్కకపోవచ్చు, ఉప ఎన్నిక అనివార్యం కావొచ్చు.
ఉప ఎన్నికలో దానం నాగేందర్ కు కాంగ్రెస్ టికెట్ వస్తుందా?, గ్రౌండ్ లో ఈ చర్చ ఎక్కువగా ఉంది. దానంకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారని ఆయన వర్గం చెబుతుంది కానీ అది అంత సులభం కాదు. ఒకవేళ దానంకు టికెట్ రాకుంటే?, దానం + రేవంత్ రెడ్డి ఇద్దరూ కూడా రోహిన్ రెడ్డికి మద్దతు ఇవ్వొచ్చు. పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి , KK కుమార్తె, మాజీ మేయర్ విజయలక్ష్మి కూడా రేసులో ఉంటారు.
BRS తరపున గతంలో రెండుసార్లు పోటీచేసిన మన్నే గోవర్ధన్ రెడ్డి మళ్లీ ప్రయత్నం చేయొచ్చు కానీ గట్టి అభ్యర్థి కాడు. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ , పీజేఆర్ కుమారుడు విష్ణు బలమైన అభ్యర్థులు అవుతారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు కూడా టికెట్ రేసులో ఉన్నారు.
2014 లో టీడీపీ పొత్తుతో గెలిచిన బీజేపీ తరపున మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి మరోసారి టికెట్ దక్కొచ్చు కానీ గట్టి పోటీ ఇవ్వలేరు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీజేపీ బలం తక్కువ. దాదాపు 60 వేల ముస్లిం ఓటర్లు ఉన్నారు కానీ MIM ప్రభావం కూడా తక్కువనే చెప్పాలి .
ఫలితాన్ని ఏ ఒక్క కులం కూడా ప్రభావితం చేయలేదు, పూర్తిగా బస్తీల వారీగా జరిగే పోలింగ్ మీదనే ఫలితం ఆధారపడి ఉంటుంది. ఖైరతాబాద్ లో ఇప్పటికీ పీజేఆర్ అనే పేరుకు పది పదహైదు వేల ఓట్లు ఉన్నాయి. తను మాస్ లీడర్, ఈరోజుకూ తనను తలుచుకునేవాళ్లు బస్తీల్లో వేలాది మంది..!!

మొదటి ఫోటో.. పీజేఆర్ అనుచరుడిగా ఉన్నరోజుల్లో దానం నాగేందర్ గారి ఫోటో.
రెండో ఫోటో ..పెద్దమ్మగుడి ప్రాంతంలో ఏదో కార్యక్రమంలో పీజేఆర్ పాల్గొన్న ఫోటో.
Share this Article