Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సర్కారూ బీ అలర్ట్ ! సన్నబియ్యం ధర వందకు చేరే సూచనలు !!

September 26, 2026 by M S R

.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్నబియ్యాల ధరపై వెంటనే అలర్ట్ కావల్సిన అవసరం ఉంది… ఎల్‌నినో ఎఫెక్ట్ సన్నబియ్యం ధరల్ని మరింత మండించి, ఈసారి ఏకంగా కిలో 100 రూపాయల ధరకు వెళ్లినా ఆశ్చర్యం లేదు… ఎల్‌నినో కరువు తాండవించబోతుందని తెలిసీ, జూరాలను ఖాళీ చేసి, కర్నాటకను అడుక్కున్నట్టు గాకుండా… బియ్యం ధరలపై తక్షణం దృష్టి సారించాలి…

నమ్ముతారా..? ఆల్రెడీ ఓరకం సన్నబియ్యం ధర కిలోకు 90 రూపాయలకు చేరింది… బాస్మతి రేట్లను సమీపిస్తోంది… ప్రస్తుతం సూపర్ మార్కెట్లలో కొలం రైస్ ఏకంగా 90 రూపాయలు… (ఫోటో చూడండి…)… అఫ్‌కోర్స్, అది వర్తమాన బియ్యం మార్కెట్‌లో బ్రహ్మాండమైన గిరాకీ, ఆమేరకు ధర కూడా ఉన్న రకం… ఒకసారి దీనికి అలవాటుపడితే ఇక రేటు ఎక్కువైనా కస్టమర్ వదలడు…

Ads

ఆ తరువాతే హెచ్ఎంటీ, జైశ్రీరాం తదితర రకాలు… ఒకప్పుడు రాజ్యమేలాయి ఈ రకాలు, ఇప్పుడు కొలం దెబ్బకు వెనుకపట్టు పట్టాయి… వీటి తరువాతే సన్న బీపీటీలు, సోనా మశూరీలు… ఐతే ఇందులో కూడా పాతవి, స్టీమ్, కొత్త, మిక్స్ రకాలుంటాయి, ప్రస్తుతానికి ఆ చర్చ జోలికి పోవడం లేదు ఇక్కడ…

fine rice

ఈసారి ఎల్‌నినో భయం ఉన్నప్పటికీ చాలామంది రైతులు ఎప్పటిలాగే సన్నరకాల్ని ముందుగానే బోర్లు, బావుల కింద వేశారు… ఎందుకైనా మంచిదని ఒకటీరెండు జిల్లాల్లో (పాత ఉమ్మడి) కోతలు కూడా స్టార్ట్ చేసేశారు… పచ్చివే, ఎండబెట్టకుండానే వ్యాపారులు కొనేస్తున్నారు, వాళ్లకు తెలుసు ఈసారి సన్నబియ్యం ధరలు మండిపోనున్నాయని..!!

ఆల్రెడీ కొన్నిచోట్ల క్వింటాల్ సన్న ధాన్యం ధర 3 వేలకు చేరుకుంది… తెలంగాణలోని ఇతర జిల్లాలకే కాదు, పొరుగు రాష్ట్రాలకూ ఆ ధాన్యం తరలుతోంది… సివిల్ సప్లయిస్ శాఖ చోద్యం చూస్తోంది… నిజానికి గతంలో ఏ ముఖ్యమంత్రికీ చేతకాని రీతిలో రేవంత్ రెడ్డి రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇస్తున్నాడు… మహిళల్లో అది తన పట్ల మంచి ఆదరణనూ తీసుకొచ్చింది…

rice

మొదట్లో సన్నబియ్యం ధరలు మార్కెట్‌లోకి కూడా తగ్గాయి ఈ స్కీమ్ ప్రారంభించగానే… కానీ ఇప్పుడు సిట్యుయేషన్ వేరు… ఎల్‌నినో దెబ్బకు సన్నబియ్యం ఉత్పత్తి తగ్గబోతోంది… సహజం… రేషన్ సరఫరాకు తగిన సన్నబియ్యం సరిపడా వస్తుందో లేదో చూసుకోవాల్సి ఉంది…

కేసీయార్ బాపతు సీఎంఆర్ పుణ్యమాని రైస్ మిల్లర్లు వేల కోట్ల పక్కా అక్రమార్కులైపోయారు కాబట్టి… సన్నబియ్యం బ్లాక్‌ మార్కెటింగ్‌కు కూడా పాల్పడే ప్రమాదమూ ఉంది… రేషన్ సన్నబియ్యం పంపిణీతో ప్రజలు కూడా దొడ్డుబియ్యం వండుకుని తినడం తగ్గిపోయింది… రైతులు కూడా రేవంత్ ప్రభుత్వం ఇచ్చే 500 బోనస్ ప్రైస్‌తో సన్నబియ్యం పండించడానికే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు…

low GI Rice

పైగా మార్కెట్‌లో కూడా సన్నరకాల ధాన్యానికి డిమాండ్ ఎప్పుడూ బాగానే ఉంటుంది… ఐనాసరే ఎల్‌నినో ఎఫెక్ట్ ఎలా ఉంటుందో అంచనా వేసి, ఇకనైనా సంబంధిత మంత్రి, ముఖ్యమంత్రి వెంటనే అలర్ట్ కావల్సిన అవసరం మాత్రం కనిపిస్తోంది..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సర్కారూ బీ అలర్ట్ ! సన్నబియ్యం ధర వందకు చేరే సూచనలు !!
  • తిను, తినను… ఇదేం తెలుగు భాషరా మీ మొహాలు మండా…
  • ఆటే సవాల్ అన్నాడు నాగార్జున – అంతే, ఆట చూడటమూ సవాలే !!
  • ఉల్టా చోర్ కొత్వాల్‌కు డాంటే… కేసీయార్ మరో బిగ్ బ్లండర్…
  • మన జేమ్స్ బాండ్… ‘దురంధర్‌’ల నిర్మాత… తెరపైకి ఆ మహా గూఢచారి!
  • రేచర్ల రుద్రుడి విగ్రహం ! గుడ్ డెసిషన్… ఐతే ఇంతకీ తనెవరంటే ?
  • ఓహో… తెలంగాణ నటులు తెలుగు ఇండస్ట్రీకి పనికిరాని మొహాలా..?!
  • నరుకుడు రోగం! మితిమీరిన హింస- మతిమాలిన దర్శకత్వ ప్రతిభ!!
  • The Paradise – దర్శకుడు శ్రీకాంత్ ఓదెలను చరిత్ర క్షమించదు…
  • S I R – ఇప్పటికిదే అతి పెద్ద దరిద్రపు, హానికరపు అధికారిక ప్రోగ్రామ్ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions