Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆటే సవాల్ అన్నాడు నాగార్జున – అంతే, ఆట చూడటమూ సవాలే !!

September 26, 2026 by M S R

.

ఆటలో సవాల్ కాదు, ఆటే సవాల్ అన్నాడు నాగార్జున… బిగ్‌బాస్ సీజన్ 10 గురించి చెబుతూ… నిజానికి తనకే కాదు, ఆ షో క్రియేటివ్ టీమ్‌కు కూడా అదేమిటో అర్థమైనట్టు లేదు… అడ్డదిడ్డంగా, మూర్ఖంగా కథ నడిపించడమే సరికొత్త క్రియేటివిటీ అనే భ్రమల్లో ఉంది ఆ టీమ్…

కొన్ని చూస్తుంటే అసలు ఈ టీమ్‌ను ఎర్రగడ్డ, వైజాగుల నుంచి ఎత్తుకొచ్చారా అనే తీవ్రమైన చిరాకు కూడా కలుగుతుంది… అసలే కంటెస్టెంట్ల ఎంపిక సరిగ్గా లేదు… త్రిగుణ్ ఓ ఎక్సెంట్రిక్… అంతా తిక్క యవ్వారం… కెప్టెన్సీ టాస్కులో బజర్ మోగించింది పొట్టి నరేష్ అని ముందు చెప్పి, వెంటనే వంశీ అంటాడు, దానికి ఓ అర్థంపర్థం లేని వివరణ…

Ads

ఎవరో రూల్స్ ఉల్లంఘిస్తే కెప్టెన్‌ను శిక్ష వేస్తాడు బిగ్‌బాస్, అదో పైత్యం… ఆ శిక్షను విధించింది త్రిగుణ్, అదే నాన్సెన్స్ అనుకుంటే, నువ్వు సరిగ్గా ఫ్లోర్ క్లీన్ చేయవేమిటి అని దబాయిస్తాడు… వంశీ, తను కలిసి ఏదేదో మాట్లాడుతుంటే, కాస్త ఆపండి అన్నందుకు ఝాన్సీకి ‘నోటికి అడ్డంగా వేసుకునే టేప్ తెప్పించు, మూసుకుంటాం’ అని బిగ్‌బాస్‌ను, ఝాన్సీని వెటకరిస్తాడు…

అసలు చరణ్ అనేవాడిని మొదటి మూడురోజుల్లోనే పంపించేయడం, జనం బూతులు తిట్టేసరికి తిరిగి ప్రవేశపెట్టడం ఓ బ్లండర్, చైత్రను పంపించడం మరో బ్లండర్… కృష్ణుడిని పంపించడం వరకూ వోకే… అగ్నిపరీక్షలో మిగిలిపోయిన సరుకు ఉంది కదా, ఒక్కొక్కరినీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని ప్రవేశపెడుతున్నారు…

మళ్లీ అందులోనూ పైత్యమే… హౌజ్‌మేట్స్ తక్కువ వోట్లు వేసిన వారిని లోపలకు పంపించి, అదే నేను చెప్పిన టెన్షన్ అంటే అని బిగ్‌బాస్ తన పైత్యాన్ని ప్రదర్శిస్తాడు… పైగా వాళ్లు వచ్చారో లేదో, నలుగురు కెప్టెన్సీ టాస్కులో మీరే ఇద్దరిని తీసిపారేయండి అని చెబుతాడు… మరి వాళ్లు అంతకుముందు ఫిజికల్ టాస్కుల్లో నెగ్గారు కదా, దానికి ఏ విలువా లేదా..? ఇదేం మూర్ఖత్వంరా బాబూ…

సరే, చివరకు ఝాన్సీ, ముకేష్ మిగిలారు… వాళ్లతో ఈ ఇద్దరు న్యూ ఎంట్రీలు మిథిలేష్, అపూర్వ కలిసి ఆడాలట, ఎవరు గెలిస్తే వాళ్లకు, ప్లస్ కలిసి ఆడిన వాళ్లకు కూడా ఇమ్యూనిటీ అట… ఇదొక మూర్ఖపు నిర్ణయం… మిథిలేష్ సరిగ్గా ఆడలేదు గానీ లేకపోతే ఝాన్సీ వరుసగా రెండోసారీ కెప్టెన్ అయి ఉండేది…

కాకపోతే త్రిగుణ్ అండ్ బ్యాచ్ ఇష్టారాజ్యంగా ఆమెను టార్గెట్ చేస్తున్నారు, వేధిస్తున్నారు, కాబట్టి ఆమె మళ్లీ కెప్టెన్ కాకపోవడమే కరెక్టు… పైగా ఆమె మీద భారీగా బయట సాగుతున్న ట్రోలింగ్ వల్ల ఆమె వోటింగులో మరీ దిగజారిపోయి చివరి రెండుమూడు స్థానాల్లో ఉంటోంది…

సరే, బిగ్‌బాస్ స్క్రిప్టు ప్రకారమే సాగుతుంది గానీ… ఒకవేళ ఈమె కెప్టెన్‌గా గెలిచి, వోటింగులో చివరి స్థానానికి పడిపోయి ఉంటే బిగ్‌బాస్ ఏం చేసేవాడు..? సరే, ఝాన్సీకి వోటింగులో పోటీగా వర్షిణి… నిజానికి ఈమె ఉన్నా బయటికి వెళ్లిపోయినా నష్టం లేదు… నామమాత్రపు ఉనికి ఆమెది…

నరేష్, రాంప్రసాద్ సేఫ్ గేమ్… సుధీర్, అమన్ వెనకబడిపోయారు… (బహుశా సుధీర్ ఎలిమినేట్ కావచ్చునని అనిపిస్తోంది ఈసారి)… రోహిత్ ఏదో తర్కంతో తరచూ స్క్రీన్ స్పేస్ సంపాదించే ఎత్తుగడ… త్రిగుణ్ కూడా అంతే, వంశీ హోప్‌లెస్… వర్షిణికి పోటీదారు వోటింగులో…

ఉన్నంతలో దేబ్‌జానీ బెటర్… సృష్టి మొన్ననే ఎలిమినేషన్ తృటిలో తప్పించుకుంది, ఇక రెచ్చిపోతోంది… స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్ అన్నట్టు ముకేష్ సైలంటుగా కెప్టెన్సీ కొట్టేశాడు..!! ఇక తనతో ఆడుకుంటారు రోహిత్, వంశీ, త్రిగుణ్ అనే కేరక్టర్లు!!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సర్కారూ బీ అలర్ట్ ! సన్నబియ్యం ధర వందకు చేరే సూచనలు !!
  • తిను, తినను… ఇదేం తెలుగు భాషరా మీ మొహాలు మండా…
  • ఆటే సవాల్ అన్నాడు నాగార్జున – అంతే, ఆట చూడటమూ సవాలే !!
  • ఉల్టా చోర్ కొత్వాల్‌కు డాంటే… కేసీయార్ మరో బిగ్ బ్లండర్…
  • మన జేమ్స్ బాండ్… ‘దురంధర్‌’ల నిర్మాత… తెరపైకి ఆ మహా గూఢచారి!
  • రేచర్ల రుద్రుడి విగ్రహం ! గుడ్ డెసిషన్… ఐతే ఇంతకీ తనెవరంటే ?
  • ఓహో… తెలంగాణ నటులు తెలుగు ఇండస్ట్రీకి పనికిరాని మొహాలా..?!
  • నరుకుడు రోగం! మితిమీరిన హింస- మతిమాలిన దర్శకత్వ ప్రతిభ!!
  • The Paradise – దర్శకుడు శ్రీకాంత్ ఓదెలను చరిత్ర క్షమించదు…
  • S I R – ఇప్పటికిదే అతి పెద్ద దరిద్రపు, హానికరపు అధికారిక ప్రోగ్రామ్ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions