Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను ఇండియా త్వరలో స్వాధీనం చేసుకోబోతున్నదా?

November 8, 2026 by M S R

.

Pardha Saradhi Potluri …. భారత్ PoJK ని స్వాధీనం చేసుకోబోతున్నదా? Part 1
నాలుగు ప్రధాన కారణాలు కనపడుతున్నాయి అవి…
1.జమ్మూ కాశ్మీర్ లో ప్రభుత్వం ఏర్పాటుకి సన్నాహాలు జరుగుతున్నాయి.
2.భారత్ స్వంత GPS NaVIC సిస్టం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది.
3.అగ్నివీర్ కింద కాలపరిమితి తీరిన అగ్నివీర్ లకి మరో రెండేళ్లు పొడిగింపు ఇవ్వడం.
4.పాకిస్థాన్ ముందెన్నడూ లేని విధంగా తన సైనిక సంపత్తిని వేగంగా ఆధునీకరించడం.

******************
జమ్మూకాశ్మీర్ లో బీజేపీ స్వంతగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నది.
జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి 56 ఏళ్ళ ఒమర్ అబ్దుల్లా ndtv న్యూస్ రీడర్ నిధి రజ్దాన్ తో పెళ్లి హడావిడిలో ఉండగానే మరో వైపు నేషనల్ కాన్ఫరెన్స్ కి చెందిన 21 మంది MLA లు ఒమర్ అబ్దుల్లాకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఇటీవలే ఒమర్ అబ్దుల్లా మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్టికరించాడు కానీ 21 మంది mla లకి తమకి పార్టీ లోనూ, మంత్రివర్గంలోనూ తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఫరూక్ అబ్దుల్లాకి మెమోరాండం సమర్పించారు.

Ads

అసంతృప్త mla లు తమ మెమోరాండంలో జమ్మూకాశ్మీర్ లో అభివృద్ధి, పరిపాలన, పార్టీలో అవకతవకలు, మంత్రులకి ఇచ్చిన పోర్ట్ఫోలియోలు, వివిధ అంశాల మీద నాయకత్వ వైఫల్యం ఉందని సారాంశం! అలా అని తాము పార్టీలో తిరుబాటు చేయట్లేదని కేవలం వైఫల్యాలని ప్రశ్నిస్తున్నామని పేర్కొన్నారు!
కానీ రాజకీయ విశ్లేషకులు మాత్రం పార్టీని వీడి బీజేపీతో జతకట్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే ముందు జరిగే తంతు ఇది అని పేర్కొంటున్నారు! ఫరూక్ అబ్దుల్లా మాత్రం ఏదో చిన్న చిన్న విషయాల మీద కొంతమంది mla లు చర్చ చేస్తున్నరని, వీళ్లెవరూ పార్టీని వీడే ప్రసక్తి లేదని అన్నాడు!

ఫరూక్ అబ్దుల్లా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే 21 మంది mla లు పార్టీని వీడి ప్రభుత్వాన్ని కూల్చడానికి సిద్ధమయ్యారు అనేది నిజం.
ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్య…: జమ్మూకాశ్మీర్ ని రక్షిస్తున్నది పాకిస్తాన్, అంతే కానీ భారత్ కాదు అని ఒక వివాదాస్పద స్టేట్మెంట్ ఇచ్చాడు ఫరూక్ అబ్దుల్లా!
ఇదేమి కాజువల్ గా చేసిన వ్యాఖ్య కాదు! పాకిస్తాన్ నుండి వచ్చిన సందేశాన్ని యధాతధంగా పలికేసాడు ఫరూక్ అబ్దుల్లా!
ఇలాంటి వ్యాఖ్యలు ఫరూక్ అబ్దుల్లా బహిరంగంగానే అన్నాడు అంటే వెనుక ఎవరు ఉండి ఆ మాటలు అనిపించారో తెలుసుకోవడం పెద్ద కష్టమేమి కాదు!

ఫరూక్ అబ్దుల్లా ఇంకా 1990 లలోనే ఉండిపోయాడు! మార్పుని అంగీకరించే స్థితిలో లేడు!
ఈ వివాదాస్పద వ్యాఖ్యలే పార్టీలో చీలికకి కారణం అయింది. Mla లు వాళ్లంతటవాళ్ళే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంటే అమిత్ షా ఊరకనే ఉండడు కదా!

ఒకసారి జమ్మూకాశ్మీర్ అసెంబ్లీలో పార్టీల బలాబలాలు చూద్దాం :
మొత్తం అసెంబ్లీ సీట్లు: 90
నేషనల్ కాన్ఫరెన్స్:42
బీజేపీ :29
ఇండిపెండెంట్స్ :7
కాంగ్రెస్ :6
PDP :3
JPC :1
AAP :1
CPI (M) :1

2024 లో నేషనల్ కాన్ఫరెన్స్ 42, ఇండిపెండెంట్స్ 7, కాంగ్రెస్ 6, CPI (M )1 లతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి, బీజేపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నది!
ఇప్పుడు NC నుండి 21 మంది, ఇండిపెండెంట్స్ 7 గురు + బీజేపీ 29 కలిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు.

కావాల్సింది జమ్మూకాశ్మీర్ లో బీజేపీ ప్రభుత్వం ఉండడం, అదీ PoJK ని స్వాధీనం చేసుకోబోయే సమయంలో ఇది అత్యవసరం! మంత్రివర్గ పోర్టుఫోలియోలు అనేవి సెకండరీ! ముఖ్యమంత్రి, హోమ్ శాఖలు తప్ప ఎవరు ఏది అడిగితే అది ఇచ్చేయవచ్చు.
ఒమర్ అబ్దుల్లా హనీమూన్ ఎంజాయ్ చేయలేడు!
బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేస్తుంది అనేది వేచి చూడాల్సిందే!
బహుశా దీపావళి తరువాత జమ్మూకాశ్మీర్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు!

navIC
********************
భారత్ స్వదేశీ GPS సిస్టమ్ NavIC ని సిద్ధం చేసింది!
NavIC ( Navigation with Indian Constellation )
అసలుపేరు IRNSS ( Indian Regional Navigation Satellite System ) అయితే ఇప్పుడు NavIC అని పిలుస్తున్నారు.
భారత్ ఇప్పటి వరకూ మొత్తం 12 నావిగేషన్ ఉపగ్రహాలని భూ స్థిర (Geostationary Orbit ) కక్ష్యలో ప్రవేశపెట్టింది.
వీటిలో మొదటి తరం ఉపగ్రహాలు అయిన IRNSS తో పాటు కొత్త తరం ఉపగ్రహాలు అయిన NVS సీరీస్ లని ప్రయోగించింది.

మన స్వంత నావిగేషన్ సిస్టమ్ అనేది కేవలం భారత్, చైనా, పాకిస్థాన్, బాంగ్లాదేశ్, శ్రీలంక, మియాన్మార్ లని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేశారు.
భారత NavIC సిస్టమ్ లో బెస్లైన్ కన్స్టలేషన్ ( Baseline Constellation ) 7 యాక్టివ్ ఉపగ్రహాలలో 3 ఉపగ్రహాలు భూస్థిర కక్ష్యలో( Geostationary Orbit  )ఉంటాయి. మరో 4 ఉపగ్రహాలు వంపుతో కూడిన భూ సమకాలీన కక్ష్య ( Inclined Geosynchronous Orbit ) లో ఉంటాయి.

ఇస్రో గత సంవత్సరం ప్రయోగించిన NVS-2 ఉపగ్రహం భూస్థిర కక్ష్యలోకి ప్రవేశించకుండా విఫలం అయిన సంగతి తెలిసిందే!

ఇస్రో వివరణ! విద్రోహ చర్య కాదు!
NVS-02 ప్రయోగం విఫలం అవడానికి కారణం తుది దశలో ( Final stage ) స్పేస్ క్రాఫ్ట్ లో ఉండే ‘పైరో వాల్వ్స్ ’ ( Pyro valves ) తెరుచుకోక చివరి దశలో ఆగిపోయింది!
NVS-02 ఉపగ్రహాన్ని రాకెట్ కక్ష్యలో ప్రవేశపెట్టడంతో దాని పని ముగిసిపోతుంది. అంటే రాకెట్ కక్ష్యలో ప్రవేశపెట్టడానికే పరిమితం అవుతుంది. ఉపగ్రహంకి చిన్న ఇంజిన్ ఉంటుంది. దానిలో ఇంధనంతో పాటు ఆక్సిడైజర్ ఉంటుంది ఇంధనం మండటానికి.

కక్ష్యలో ఎక్కడ ఉపగ్రహం ఉండాలో అక్కడికి వెళ్ళడానికి, ఉపగ్రహంలో ఉండే ఇంజిన్ ని మండించి, సరైన స్థానంలోకి తీసుకెళ్లడానికి ఇంజిన్ కి ఉండే ‘పైరో వాల్వ్స్ ’ ఆటోమేటిక్ గా తెరుచుకొని ఆక్సిడైజర్ ని వదలడంతో ఇంధనం మండి ఇంజిన్ ఉపగ్రహాన్ని ముందే నిర్దేశించిన ప్రదేశం వరకు నెడుతుంది. On board కంప్యూటర్ ఆదేశాలతో ఇంజిన్ పనిచేస్తుంది.

అయితే చివరి దశలో కంప్యూటర్ కమాండ్ ఇచ్చినా ఒక కాంటాక్ట్ లో లోపం వలన పైరో వాల్వ్స్ తెరుచుకోక పోవడంతో, ఇంజిన్ ఆన్ అవక ఉపగ్రహం సరైన దిశలోకి వెళ్ళలేదు. మిషన్ ఫెయిల్ అయింది.
గత అక్టోబర్ 30 న NVS-03 ని ప్రయోగించినపుడు ‘పైరో వాల్వ్స్ ’ ని తెరిచి ఉంచే ప్రయోగించారు. ఈసారి విజయవంతంగా ఆన్ బోర్డ్ కంప్యూటర్ ఇచ్చిన ఆదేశాలతో ఇంజిన్ ఆన్ అయిపోయి ఉపగ్రహాన్ని సరైన దిశలో కూర్చోపెట్టింది.

మరి పైరో వాల్వ్స్ ని ముందే తెరిచి ఉంచి ఎందుకు ప్రయోగించలేదు?
Well, అంతరిక్షంలో ఆక్సిజన్ ఉండదని మనకి తెలుసు! స్పేస్ క్రాఫ్ట్ నడవడానికి ఇంధనంతో పాటు అది మండడానికి ఆక్సిడైజర్ అవసరం ఉంటుంది కానీ ఆక్సిడైజర్ అనేది చాలా త్వరగా మండుతుంది. రాకెట్ ప్రయోగించినపుడు పెద్ద కుదుపుతో పైకి లేస్తుంది తరువాత జెర్క్ లతో ముందుకు వెళుతుంది. ఒక దశలో పక్కకి ఒంగిపోయి ప్రయాణిస్తుంది కాబట్టి ఆక్సిడైజర్ కి వాల్వ్స్ పెడతారు, అవసరం అయినప్పుడే తెరుచుకునే విధంగా!

గత అక్టోబర్ 30 న ప్రయోగించిన NVS-03 స్పేస్ క్రాఫ్ట్ లో పైరో వాల్వ్స్ ముందే తెరిచి ఉంచి ప్రయోగించాము అని ఇస్రో డైరెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. కానీ టెక్నీకల్ గా అది ఎలా సాధ్యం అయిందో చెప్పలేదు. బహుశా కీలకమైన విషయం కాబట్టి సాంకేతిక విషయాలని బయటపెట్టలేదు!
NVS-3 ఉపగ్రహ ప్రయోగం విజవంతం అవడంతో భారత్ తన స్వంత GPS కి కావాల్సిన కనీస ఉపగ్రహ సముదాయం ( minimum operating configuration of four satellites for Navigation with Indian Constellation ) సమకూర్చుకుంది!

ఫుల్ కన్స్టలేషన్ కోసం మరో రెండు ఉపగ్రహాలు NVS -04 మరియు NVS -05 లని వచ్చే 2027 ఆగస్టు నెలలోపు ప్రయోగించడానికి ISRO సన్నాహాలు చేస్తున్నది!
అయితే ఇప్పుడున్న NavIC సిస్టంతో ఆపరేషన్ సిందూర్ కొనసాగించవచ్చు!
ముఖ్యంగా పాకిస్థాన్ మొత్తం , బాంగ్లాదేశ్ లో మొత్తం , చైనాలో కొంత భాగం మన NavIC పరిధిలోకి 24/7 రియల్ టైమ్ డాటాకి యాక్సెస్ దొరుకుతుంది!

ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్, లడాక్, జమ్మూ కాశ్మీర్, సిలిగురి కారిడార్ లతో పాటు మణిపూర్, మియాన్మార్ సరిహద్దులలో తీవ్రవాదుల కదలికలని రియల్ టైమ్ డాటాతో గుర్తించవచ్చు!
NVS -02 విఫలం అవడానికి కారణాలతో పాటు NVS-03 విజయవంతం అవడం వలన కలిగే ప్రయోజనాలని విడిగా ఒక పోస్టులో చెప్పే బదులు PoJk స్వాధీనంతో కలిపి చెప్పే ప్రయత్నం చేసాను!
Contd…part 2

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను ఇండియా త్వరలో స్వాధీనం చేసుకోబోతున్నదా?
  • సీతమ్మ శౌర్యం ! ఆ ఇంగ్లిష్ వెర్షన్ సీన్ ఇండియాలో ఎందుకు తీసేశారు..?!
  • ఓహ్, అదా అసలు సంగతి – స్థానిక గెలుపు బాబు ఘనత ఏమీ కాదన్నమాట..!!
  • సో కాల్డ్ హీరో మెటీరియల్ కాదు- సో వాట్, నిఖార్సయిన నటుడు..!!
  • మహారాష్ట్ర రాజకీయాల్లో మలుపులు? ఎన్సీపీ వర్గాల పునఃకలయిక?
  • పది భారీ సైలోలు… ఆహారధాన్యాల నిల్వపై రేవంత్ ప్రభుత్వ కొత్త ఆలోచన భేష్…
  • కాలిపోయేది మా పర్సులు..! నీ గల్లాపెట్టె నిండకపోతే మాదా తప్పు..?!
  • సమాజం మారుతోంది- రియల్ హీరోలు ఎవరో గుర్తించి ప్రేమిస్తోంది !
  • రణ్‌బీర్‌ నోట తెలుగు పలికింది! బ్రహ్మ AI నేర్పిన ‘డబ్బింగ్ కళ !!
  • రాముడు తనే- సీత తనే..! మాటల్లేవ్… టాకీసులోనే లైవ్ బీజీఎం..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions