Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సజ్జనార్ స్టెప్పుల్లో తప్పేముంది? విమర్శించడమే ‘రాంగ్ స్టెప్ !!

September 27, 2026 by M S R

.

ముందుగా ఓ ముచ్చట చెప్పుకుని మిగతా కథనంలోకి వెళ్దాం… రీడర్‌కు ముందస్తుగా ఓ క్లారిటీ కోసం… సమ్మక్క- సారలమ్మ జాతర… లక్షల మంది ఆదివాసీలకు అది రెండేళ్లకోసారి తప్పనిసరిగా ఓ ఆచారంగా వెళ్లి మరీ దేవతలను దర్శించుకుని పులకించే జాతర… ఎవరి స్థోమతను బట్టి వాళ్లు దాన్ని ఓ ‘ఉత్సవంగా’ జరుపుకుంటారు…

మద్యం, మాంసం, దర్శనం… పుట్టు వెంట్రుకలు, పూనకాలు, స్నానాలు అన్నీ… సమ్మక్క వచ్చేటప్పుడు పోలీసులు తుపాకుల్ని గాలిలోకి కాల్చి స్వాగతం పలుకుతారు… అది ఓ అతి పెద్ద సామాజిక ఉత్సవానికి వెల్‌కమ్ చెప్పడం… ఇక్కడ నాస్తికత్వం, పోలీసుల సెక్యులరిజం అనే మాటలుండవ్… అంత పెద్ద జాతర బందోబస్తులో నిమగ్నమై తాము కూడా మమేకం కావడం… అవును, మమేకం కావడం… దానివల్ల మరింత నిబద్ధత…

Ads

ఎస్, నిన్నటి హైదరాబాద్ మహానిమజ్జనం వేళ చాలాచోట్ల పోలీసులు ఇలాగే అందరు భక్తుల్లాగే డాన్సులు చేశారు… అది ఓ ఉద్వేగం… ఎందుకంటే… సున్నితమైన హైదరాబాద్ వినాయక నిమజ్జనాన్ని అనుకున్న టైమ్‌కు సజావుగా కంప్లీట్ చేయడం, ట్రాఫిక్ బందోబస్తులు, నిఘాలు… ఓ పెద్ద టాస్క్ పూర్తయ్యే ఆనందం… అన్నింటికీ మించి ‘ఉత్సవంలో మమేకం కావడం’…

అది డ్యూటీ విస్మరణ కాదు, అప్రమత్తతతోపాటు అందరితోనూ కలిసిపోయి టాస్క్ కంప్లీట్ చేయడం, అదేసమయంలో మానవసహజమైన ఉద్వేగ ప్రదర్శన… తప్పేముంది..? నేనయితే హైదరాబాద్ సిటీ పోలీసులను అభినందిస్తున్నాను… నాలుగు స్టెప్పులు వేసిన సజ్జనార్ చర్యలో తప్పేమీ లేదు… కానీ కొందరు జర్నలిస్టులు విపరీత బాష్యాలకు, విమర్శలకు పోతున్నారు…

sajjanar

పోలీసులు చేసింది తప్పట… యూనిఫామ్‌లో ఉండి డాన్స్ చేయకూడదట… తప్పేముంది అనేది నా ప్రశ్న.., సమ్మక్కకు స్వాగతం పలికే అవే ఖాకీలు ఖైరతాబాద్ గణుషుడికి సాదరంగా వీడ్కోలు పలుకుతారు… అదేసమయంలో ఎవరైనా ఇష్యూస్ క్రియేట్ చేయాలని చూస్తే తాటతీస్తారు, దేనికదే…

అసలు సమస్య జర్నలిస్టుల ఆలోచనా విధానంలోనే ఉంది… ఈ స్టెప్పులు సోషల్ మీడియా లైకుల కోసం కాదు, అదొక ఎమోషన్… పదిమందిలో కలిసిపోవడం… సెక్యులరిజం వేరు- నాస్తికత్వం వేరు… పోలీసులు కూడా మనుషులే, వాళ్లకీ ఉద్వేగాలుంటాయి… వాళ్ల ఇళ్లల్లో వినాయక చవితి జరుపుకోరా..? ఓ సోషల్ ఉత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు.., వాట్ ఈజ్ రాంగ్..?

కొందరైతే మరీ ఆ పోలీసులను సస్పెండ్ చేయాలని కామెంట్లు… ఇదే అసలు సమస్య… ఎక్కడైనా బందోబస్తులో చిన్న పొరపాటు జరిగిందా, ఒక్క పోలీసైనా తమ డ్యూటీని నిర్లక్ష్యం చేశాడా..? అత్యంత ప్రశాంతంగా సాగిపోయింది… పర్‌ఫెక్ట్… మరి గణేషుడి ఎదుట డాన్సులు చేస్తే తప్పేమిటి.,.? ‘మేమూ అందరిలాగే, మీలో ఒకరమే’ అని చాటుకునే పాజిటివ్ ధోరణి అది…

ఓ కాంగ్రెస్ నాయకుడు మంచె మీద నిలబడి భక్తులకు స్వాగతం పలుకుతాడు, వినాయకులపై పూలు జల్లుతాడు… ఓ బీజేపీ నాయకుడు అన్నదానం చేస్తూ బిజీగా ఉంటాడు… ఓ బీఆర్ఎస్ నాయకుడు ఓ లారీలో వెళ్తూ ప్రసాదాలు పంచుతాడు… వాట్ ఈజ్ రాంగ్… వాళ్లు సెక్యులర్ పాతివ్రత్యానికి భంగం ఏమీ వాటిల్లలేదు కదా…

కొన్నిచోట్ల ముస్లింలు కూడా మజ్జిగ అందిస్తూ పాలుపంచుకుంటారు… అది సోషల్ హార్మనీ… వినాయక మహానిమజ్జనం ఓ సోషల్ ఈవెంట్.., జనం వదిలేసిన నాస్తిక కమ్యూనిస్టులు, ఆ అనుబంధ భావజాలిస్టులు తప్ప మిగతా జనం సెలబ్రేట్ చేసుకుంటారు… అందులో పోలీసులూ ఉంటారు, ఎందుకంటే, వాళ్లూ జనమే కాబట్టి…!!

.

#hyderabadcitypolice #sajjanar #telanganapolice

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రక్తికడుతున్న ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలు – పాత సీన్ మారిపోయింది !!
  • సజ్జనార్ స్టెప్పుల్లో తప్పేముంది? విమర్శించడమే ‘రాంగ్ స్టెప్ !!
  • యథా కేసీయార్- తథా హరీష్ రావు… పక్కా యాంటీ దళిత్ పాలసీ…
  • ప్యారడైజ్‌ మూవీలో సవారీ కులదేవత, ఆ ఉగ్రశక్తి ఎవరో తెలుసా..?
  • మహానటి బోల్డ్ కేరక్టర్ – అసలు డోరోతి కంట్రవర్సీ ఏమిటంటే..?
  • సర్కారూ బీ అలర్ట్ ! సన్నబియ్యం ధర వందకు చేరే సూచనలు !!
  • తిను, తినను… ఇదేం తెలుగు భాషరా మీ మొహాలు మండా…
  • ఆటే సవాల్ అన్నాడు నాగార్జున – అంతే, ఆట చూడటమూ సవాలే !!
  • ఉల్టా చోర్ కొత్వాల్‌కు డాంటే… కేసీయార్ మరో బిగ్ బ్లండర్…
  • మన జేమ్స్ బాండ్… ‘దురంధర్‌’ల నిర్మాత… తెరపైకి ఆ మహా గూఢచారి!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions