.
ప్రతి సీజన్‌కు బిగ్‌బాస్ దిగజారిపోతోంది అనేది నిజం… తెలుగులో మరీనూ… అది సాక్షాత్తూ బిగ్‌బాస్ టీమ్, ప్రసారం చేసే స్టార్‌మాటీవీ కూడా అంగీకరిస్తుందేమో లోలోపల… ఇక ఈసారి అయితే ఒక్కసారిగా ఫ్లయ్ దుబాయ్ ఫ్లయిట్ కొన్ని వేల అడుగులు హఠాత్తుగా పడిపోయినట్టుగా… ఈ బిగ్‌బాస్ పదో సీజన్ కూడా సేమ్ అంతే వేగంగా కిందకు దూసుకుపోయింది…
ఫస్ట్ ఆఫ్ ఆల్… ఆ చరణ్ అనేవాడిని మొదటి వారమే బయటికి పంపడం ఓ బ్లండర్… మళ్లీ తీసుకురావడం మరో బ్లండర్… చైత్రను బయటికి పంపించడం ఇంకో బ్లండర్… ఇదయిపోయింది కదా… మిగతావాళ్లను చూద్దాం…
Ads
చరణ్… ఓ ఎక్సెంట్రిక్ ఫెలో… మొన్న నాగార్జున యెల్లో కార్డు చూపించి, ఇకపై సహించను నిన్ను… బిగ్‌బాస్ నిన్ను ఏం పీకలేడు అన్నావుగా, బయటికి తరిమేస్తాను నిన్ను అని బెదిరించాడు… బట్, అంతా స్క్రిప్టే కదా, ఉత్త నాటకం… చరణ్ చెప్పినట్టే బిగ్‌బాస్ ఏమీ పీకలేకపోయాడు…

చరణ్ రీఎంట్రీ ఓ ఫ్లాప్ నిర్ణయం అని అందరికీ అర్థమైపోయింది… మరో పిచ్చి కేరక్టర్ త్రిగుణ్… యాంగర్ మేనేజ్‌మెంట్ లేదు, ఏం మాట్లాడుతున్నాడో తనకే అర్థం కాదు… తనకూ ఓ యెల్లో కార్డు చూపించాడు నాగార్జున అదేదో ఫుట్ బాల్ మ్యాచులో చూపించినట్టు… తననూ బిగ్‌బాస్ ఏమీ పీకలేకపోయాడు…
మరొక కేరక్టర్ అమన్… ఉత్త హోప్‌లెస్ కేరక్టర్, మనం గతంలోనూ చెప్పుకున్నాం… తనకూ ఓ యెల్లో కార్డు… తననూ ఏమీ పీకలేకపోయాడు బిగ్‌బాస్… యథేచ్ఛగా బూతులు, దాడులు… ఎవడికీ ఇంగితం లేదు… వీళ్లే కాదు, షాలిని, అపూర్వలకు కూడా అక్షింతలు… ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటంటే..? వీళ్ల సెలక్షనే ఓ బిగ్ ఫ్లాప్ షో… అదే అగ్నిపరీక్ష షో…
ఆడిషన్స్‌లో తలతిక్క టాస్కులు పెట్టారు, ఏవో పరీక్షలు పెట్టారు… చివరకు సెలక్ట్ చేసింది ఇలాంటి స్క్రాప్ కేరక్టర్లనా..? ఆ ఆడిషన్స్ టీమ్ సిగ్గుపడాలి… శ్రీముఖి, నవదీప్, బిందుమాధవి ఎట్సెట్రా… ఏం చూసి ఈ నాసిరకం సరుకును హౌజులోకి పంపించినట్టు..? పైగా వైల్డ్ కార్డులుగా కూడా మళ్లీ వీళ్లదే ఎంట్రీ… హతవిధీ…
ఆడిషన్స్ ఫెయిల్యూర్‌కు మరో క్లాసిక్ ఉదాహరణ… మిథిలేష్… 15 లక్షలు అనగానే, తీసుకుని చక్కా వెళ్లిపోయాడు… మొత్తం పది బిగ్‌బాస్ సీజన్లు, ఓటీటీ సీజన్ సహా ఈ ఎపిసోడ్ అంతటి దరిద్రం మరొకటి లేదు… అప్పట్లో సోహెయిల్… కాకపోతే తను చివరిదాకా హౌజులో కొట్లాడాడు… తను కాస్త నయం…
అగ్నిపరీక్ష నుంచి వచ్చినవాళ్లలో ఈరోజుకూ ఝాన్సీయే నయం… వోట్ల దందా, రివ్యూయర్ల పక్షపాతాలతో ఆమెకు తక్కువ వోట్లు పడుతున్నా సరే, స్టిల్, ఆమే మేలు… షాలిని వేస్ట్, ఏం మాట్లాడుతుందో తనకే తెలియదు, కోపిష్టి… సేమ్, వర్షిణి, కోపం లేదు గానీ, అంత బెటర్ ప్లేయర్ ఏమీ కాదు… ఉన్నంతలో దేబ్‌జానీ చాలా బెటర్…
సుధీర్, వంశీ సోసో… చివరకు రాంప్రసాద్‌కూ నాగార్జున అక్షింతలు వేసే ప్రయత్నం చేశాడు గానీ, తను నరేష్‌తో కలిసి ఏదో ఓరకంగా వినోదాన్ని అందిస్తున్నాడు ప్రేక్షకులకు..! విచిత్రం ఏమిటంటే..? తిక్క కేరక్టర్లకే బిగ్‌బాస్ ప్రేక్షకులు ఎక్కువ వోట్లు వేస్తారేమో… లేక బయట వాళ్ల సోషల్ టీమ్స్ ఏం మేనేజ్ చేస్తాయో గానీ… త్రిగుణ్, చరణ్, షాలిని వంటి కేరక్టర్లకే ఎక్కువ వోట్లు నమోదవుతుంటాయి… అది మరో ట్రాజెడీ..!!
Share this Article