Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌పై సుప్రీం అధికారాల పరిధి ఏమిటనేదీ కీలకప్రశ్నే!!

October 5, 2026 by M S R

.

ఎడాపెడా హెడ్డింగులు పెట్టేశారు… సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు సుప్రీం షాక్… నోటీసులు జారీ… నోటీసులు జారీ చేయడం అంటే శిక్ష కాదు, నెగెటివ్ తీర్పు కాదు, అభిశంసన కాదు, నీ సమాధానం ఏమిటి అనడగడం, అంతే… అందులో షాక్ తినేదేముంది..? అసలు షాక్ అనే హెడింగులే షాక్…

ఇంకొన్ని వార్తలు…, తక్షణం జ్ఙానేశ్‌ను సస్పెండ్ చేయడానికి సుప్రీంకోర్టు తిరస్కరించింది… అవును, తనంతట తను సస్పెండ్ చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉందానేది కీలక ప్రశ్న… ఒకవేళ సస్పెండ్ చేసి ఉంటే పెద్ద రాజ్యాంగపరమైన ఇష్యూ క్రియేట్ అయి ఉండేది…

Ads

భారత రాజ్యాంగం, చట్టపరమైన నిబంధనల ప్రకారం, సుప్రీంకోర్టుకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) లేదా ఇతర ఎన్నికల కమిషనర్లను స్వయంగా సస్పెండ్ చేసే లేదా తొలగించే ప్రత్యక్ష అధికారం లేదు… సీఈసీకి ఆ ఇమ్యూనిటీ ఉంది… ఈ విషయానికి సంబంధించి ముఖ్యమైన అంశాలు…

రాజ్యాంగ రక్షణ (అధికరణ 324)… భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(5) ప్రకారం, చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే పద్ధతిలోనే, అదే కారణాలపై (అంటే నిరూపితమైన అసమర్థత లేదా దుర్వర్తన) మాత్రమే తొలగించవచ్చు… దీనికి పార్లమెంటు ఉభయ సభలలో ప్రత్యేక మెజారిటీతో అభిశంసన తీర్మానం (Impeachment) పాస్ కావాలి… ఇతర ఎన్నికల కమిషనర్లను అయితే కేవలం సీఈసీ సిఫారసుపై మాత్రమే తొలగించగలరు…

ఇక్కడ అసమర్థత లేదా దుర్వర్తన ఏమైనా ఉందానేది పార్లమెంటు చెప్పాలి… చర్య అదే తీసుకోవాలి… సరే, ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాలు, చట్టబద్ధత లేదా విధానపరమైన అంశాలను పరిశీలించే అధికారం మాత్రం సుప్రీంకోర్టుకు ఖచ్చితంగా ఉంది. తప్పుగా ఉన్న ఆదేశాలను కొట్టివేయగలదు కానీ, రాజ్యాంగబద్ధమైన పదవులలో ఉన్న CECని నేరుగా సస్పెండ్ చేసే అధికారం దీనికి లేదు…

చట్టాలు, రాజ్యాంగస్పూర్తికి విరుద్ధంగా ఏ వ్యవస్థ వ్యవహరిస్తున్నా సుప్రీంకోర్టుకు సమీక్షించే, విచారించే అధికారం ఉంది… కానీ దానికీ ఓ పద్ధతి ఉంటుంది… ఎవరో న్యాయవాదులు పిటిషన్లు వేసేసి, ఫలానా పత్రికలో ఓ వార్త వచ్చింది… ఇద్దరు కమిషనర్లు వ్యతిరేకిస్తున్నా చీఫ్ కమిషనర్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారట, వెంటనే సస్పెండ్ చేసేయండి అనగానే సుప్రీంకోర్టు ఆ పనిచేయలేదు… విచారణకు స్వీకరించడం వరకూ వోకే… అదీ తన విధి కాబట్టి…

అసలు మిగతా కమిషనర్లు వ్యతిరేకించినా సరే, సీఈసీ వీటో చేసి ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా? తీసుకున్నాడా? చట్టబద్దమేనా? మెజారిటీ నిర్ణయం తప్పనిసరా? ఇవి కదా అసలు ప్రశ్నలు… సర్ ప్రక్రియలో తప్పు లేదని ఆల్రెడీ సుప్రీమే చెప్పింది కదా…

కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసి చట్టపరమైన పరిశీలన జరిపినప్పటికీ, అత్యున్నత స్థాయి రాజ్యాంగ పదవిలో ఉన్న వారిపై మధ్యంతర కఠిన చర్యలు తీసుకోవడం సాధారణ న్యాయ ప్రక్రియ పరిధిలోకి రాదని ఇది స్పష్టం చేస్తోంది…

జ్ఞానేశ్‌ను తక్షణం సస్పెండ్ చేయాలనే డిమాండ్ మాత్రమే కాదు, మొత్తం సర్ ప్రక్రియనే ఆపేయాలట… పిటిషన్ల సారం… ఎందుకు..? సర్ సంకల్పం మంచిదే, ఆచరణే పరమలోపభూయిష్టం… అది తప్పు… ఎప్పుడో 20 ఏళ్ల నాటి రివిజన్, తరువాత ఇదే… కానీ సరైన ప్రక్షాళన ప్రాసెస్ లేదు… ఫామ్6 లో సవరణలకు సుప్రీం ఆమోదం ఉందని సీఈసీ చెబితే, అలాంటిదేమీ లేదని సీజే వ్యాఖ్య…

రాను రాను ప్రతిపక్షాలు, సమయం కోసం కాచుక్కూర్చున్న బొద్దింకలు జ్ఞానేశ్ ఇష్యూను రాజకీయ పోరాటంగా మార్చారు… కేరళలో ఓ పాత కేసును విజిలెన్స్ విచారణకు తిరిగి అప్పగించడం ఈ క్రమంలోనిదే… అసలు ప్రక్షాళన ఎలా జరగాలనేది పక్కకు వెళ్లిపోయి, మొత్తం *సర్ ప్రక్రియకే ఎసరు పెట్టే ప్రయత్నాలు… గతంలో ఎన్ఆర్‌సీ, సీఏఏలపై జరిగిన ఆందోళనల్లాగే… ప్రస్తుత *సర్ ఆందోళనలూ అటువైపే దారితీస్తున్నాయి..!!

మళ్లీ దీనికీ ఈవీఎంలకూ ముడిపెడుతున్నారు ఎఐసీసీ పెద్దలు… మొత్తం గందరగోళం… వాస్తవం ఏమిటంటే..? అధికార కూటమి ఎన్డీయే నుంచి కూడా సరైన వివరణలు, కౌంటర్లు లేకపోవడం..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌పై సుప్రీం అధికారాల పరిధి ఏమిటనేదీ కీలకప్రశ్నే!!
  • సేమ్… ఫ్రాన్స్‌లోనూ బొద్దింకలు – ఈ స్క్రిప్టులు రాస్తున్నదెవరు?!
  • విడాకులు – సెటిల్మెంట్ చిక్కులు ! న్యాయంలో ఏదో తేడా కొడుతోంది !!
  • దృశ్యం: ది కన్‌క్లూజన్ — మాతృకను వదిలి.. మ్యాజిక్‌ పట్టుకున్నారు..
  • తప్పులు చేసి జైలుకు వెళ్లొచ్చినా… ఇంకా దిగినట్టు లేదు ఈ *విలన్‌కు..?!
  • అది చదివితే ‘కాశీయాత్ర’ చేసినంత పుణ్యం- జ్ఞానం- విలువ !!
  • ఉత్త స్క్రాప్! ఈ సంతను యాణ్నుంచి పట్టుకొచ్చావురా బిగ్‌బాస్..!
  • సింగీతంకు తెలుగు సమాజం నుంచి సముచిత గౌరవం దక్కిందా?!
  • అక్షరధామ్! స్వామి నారాయణుడితో నేనెందుకు కనెక్ట్ కాలేకపోయాను?!
  • అమిత్ షా పర్యటనలు రెండుసార్లు రద్దు! ఏదో అడ్డుపడుతోంది, ఏమిటది?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions