.
బిగ్‌టీవీకి చెందిన స్వేచ్ఛ అనే ఈ-పేపర్లో ఓ వార్త కనిపించింది… తమ టీవీని పోలిన లోగోతో ఫేక్ ప్రచారాలకు పాల్పడుతున్న గులాబీ కాలకేయులు అనేది ఆ వార్త స్థూల సారాంశం… అందులో కొన్ని అంశాలు డిస్టర్బింగ్ అనిపించాయి…
ముందుగా ఇందులో కొన్ని అంశాలు… ఇండియా నుంచి ఈ ఫేక్ ప్రచారాల్ని సాగిస్తే పట్టుబడతామని, బీఆర్ఎస్ సోషల్ మీడియా టీమ్ కోట్లకుకోట్లు ఖర్చు చేస్తూ దుబయ్ నుంచి నడిపిస్తున్నారు… నడిపించేది తెలంగాణ భవన్ నుంచి… నిజంగా మీ ప్రచారాలకు ఆధారాలుంటే మీ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంది కదా, అందులో ఎందుకు ప్రసారం చేయరు, ఎందుకు పబ్లిష్ చేయరు… ఇదీ స్థూలంగా బిగ్‌టీవీ ప్రశ్న…
Ads
సరే, దుబయ్ కేంద్రంగా బీఆర్ఎస్ కోట్ల ఖర్చుతో సోషల్ మీడియా వెగటు- అబద్దపు ప్రచారాల్ని సాగిస్తుందనే విషయం జర్నలిస్టు సర్కిళ్లలో చాలామందికి తెలుసు… ప్రస్తుతం దేశంలో సోషల్ మీడియా అసత్యపు ప్రాపగాండాకు బీఆర్ఎస్ ఖర్చు చేస్తున్నంతగా మిగతా ఏ పార్టీలకూ చేతకావడం లేదు… వోకే, అంత సంపాదించారు, ఖర్చు పెడుతున్నారు… కానీ టార్గెట్..?

నిజానికి ఈ ప్రాపగాండా టీమ్ చేసే ప్రచారాల అసలు టార్గెట్ రేవంత్ రెడ్డి… గాలి పోగేసి వేల కోట్లు, లక్షల కోట్ల అక్రమాలు, అక్రమ బంధాలు అంటూ అటు గులాబీ మెయిన్ స్ట్రీమ్, ఇటు సోషల్ మీడయా టీమ్స్ రెచ్చిపోతున్నాయి… చూస్తున్నదే, చదువుతున్నదే… అధికారంలో ఉన్నప్పుడు అనేకానేక అక్రమాలకు పాల్పడిన కేసీయార్ కుటుంబానికి తమ అధికారాన్ని లాక్కున్నాడనీ, అక్రమాలకు తెరపడిందనీ రేవంత్ రెడ్డి మీద ఓ కసి…
ఏదో పేరుకు బీజేపీపైన… (బండి సంజయ్ టార్గెట్)… కాంగ్రెస్ ప్రభుత్వంపైన… కాంగ్రెస్ పార్టీ విధానాలపైన… వ్యతిరేక ప్రచారం ఉంటుంది… కానీ 90 శాతం టార్గెట్ రేవంత్ రెడ్డే… వ్యక్తిగతంగా…! వాళ్ల మీడియాలో ఏం రాసినా, ఏం చెప్పినా జనం నమ్మే స్థితి లేదు, ప్రత్యేకించి కేసీయార్ సహా బీఆర్ఎస్ పెద్దల భూకబ్జాలను రేవంత్ రెడ్డి బయటపెట్టాక… ప్రత్యేకించి కేటీయార్ మూడు స్టార్ హోటళ్లు, భవనాలు… ఆ పార్టీ, ఆ మీడియాకు రాజకీయంగా, క్రెడిబులిటీపరంగా పెద్ద దెబ్బ…
బిగ్‌టీవీ రేవంత్‌కు అనుకూలమని ఓ ప్రచారం ఉంది కదా, చూశారా ఆయన చానెళ్లలోనే ఈ వార్తలు వస్తున్నాయి అనే భ్రమల్ని జనం మెదళ్లలో జొప్పించడానికి అలా బిగ్‌టీవీ ఫేక్ లోగోను వాడుకోవడం అన్నమాట… ప్చ్, రాను రాను… రాజకీయ సమరం సిద్ధాంతాలు, అక్రమాలు, అక్రమ సంపాదనలపై పోరాటం గాకుండా… ప్రజాసమస్యలు గాకుండా… వ్యక్తిగత దాడి ‘పాత్రికేయంగా’ చెలామణీ కావడం ఓ విషాదం…

వీళ్ల అసలు టార్గెట్ మాత్రం స్త్రీల బతుకులు.., స్త్రీ శరీరాలపై సోషల్ మీడియాలో లిటరల్‌గా వ్యాపారం చేస్తున్నారు… ఆడవాళ్లు, సెలబ్రిటీస్, నాయకుల కేరక్టర్లు అసాసిన్ చేస్తున్నారు… ఇది ఆ వార్తలో ఓ వాక్యం… స్త్రీల శరీరాలపై వ్యాపారం ఏమిటి..? అసలు ఏమిటబ్బా ఇది..?! కొంపదీసి సురేఖావాణి మీద ప్రచారాలు కాదు కదా..!!
Share this Article