Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నూకలు బాకీ ఉంటే… యముడే దిగొచ్చినా ప్రాణాలు తీయలేడు !!

October 8, 2026 by M S R

.

భూమ్మీద నూకలు బాకీ ఉంటే అంతే మరి! హిరణ్యకశిపుడు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ప్రహ్లాదుడి ప్రాణం తీయలేకపోయిన కథ గుర్తొస్తుంది. ఇప్పుడు అమెరికాలో జరిగిన ఈ ఘటన కూడా అలాంటిదే అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ప్రహ్లాదుడు లేడు.. దేవుడి అద్భుతం లేదు.. మరణశిక్ష అమలు చేయడానికి ఇచ్చిన ప్రాణాంతక ఇంజెక్షనే రెండుసార్లు విఫలమైంది!

అమెరికాలోని టెన్నెస్సీకి చెందిన క్రిస్టా పైక్ (50) 1995లో 19 ఏళ్ల కాలేజీ విద్యార్థిని కొలీన్ స్లెమ్మర్‌ను హత్య చేసిన కేసులో మరణశిక్ష పడిన ఖైదీ. దాదాపు మూడు దశాబ్దాలుగా డెత్‌ రోలో ఉన్న ఆమెకు సెప్టెంబర్ 30న మరణశిక్ష అమలు చేయాలని నిర్ణయించారు. కోర్టు పోరాటాల తర్వాత చివరికి శిక్ష అమలుకు మార్గం సుగమమైంది.

Ads

  • అంతే… ఇక ప్రాణం పోవాల్సిందే అనుకున్నారు.
    మొదటి ఇంజెక్షన్ ఇచ్చారు. ప్రాణం పోలేదు.
    రెండోసారి ఇచ్చారు. అయినా గుండె కొట్టుకోవడం ఆగలేదు!

మరణశిక్ష గదిలో ఉన్న సాక్షుల కథనం ప్రకారం… ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా పైక్ ఊపిరి తీసుకుంటూనే ఉంది. ఒక దశలో నొప్పిగా ఉందని, తన చేతి బాగా ఉబ్బుతున్నట్టుగా ఉందని చెప్పింది. ఆ తర్వాత ఆమె నుంచి గురకలాంటి శబ్దాలు కూడా వినిపించాయి. చివరకు అధికారులు ప్రక్రియను ఆపేసి ఆమెను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.
అక్కడి నుంచి మొదలైంది మరో విచిత్రమైన అధ్యాయం.

  • మరణశిక్ష అమలు చేయడానికి వెళ్లిన రాష్ట్ర వైద్య సిబ్బందే.. కొద్దిసేపటికే ఆమె ప్రాణాలు కాపాడేందుకు ఆసుపత్రిలో చికిత్స చేయాల్సి వచ్చింది!
    అంటే.. ఒకే వ్యక్తి కోసం ఒక చోట “చంపేందుకు” ప్రయత్నం.. మరో చోట “బతికించేందుకు” ప్రయత్నం.

ఇది సాధారణ వైద్య ఘటన కాదు. మరణశిక్ష అమలు ప్రక్రియలో ఏం తప్పు జరిగిందన్నదానిపై ఇప్పుడు తీవ్ర ప్రశ్నలు తలెత్తాయి. టెన్నెస్సీ గవర్నర్ మిగిలిన మరణశిక్షల అమలును తాత్కాలికంగా నిలిపివేసి, ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.
అయితే ఈ కథలో అసలు మలుపు ఇంకా ఉంది.

“ఇక ఆమె పరిస్థితి ఎలా ఉంది?” అన్న ప్రశ్నకు తాజాగా వచ్చిన సమాధానం మరింత ఆశ్చర్యకరం.
మరణశిక్ష నుంచి బయటపడిన పైక్ ప్రస్తుతం స్పృహలోకి వచ్చి మాట్లాడుతున్నట్లు ఆమె న్యాయవాదులు తెలిపారు. రెండు ప్రాణాంతక మోతాదులు ఇచ్చినా, ఆసుపత్రికి చేరిన తర్వాత తీవ్ర చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలతో బయటపడింది. చేతులకు తీవ్రమైన నష్టం జరిగినప్పటికీ ఆమె కోలుకునే ప్రయత్నంలో ఉంది.

ఇక్కడ ఒక విషయం మాత్రం స్పష్టం చేయాలి. ఆమె చేసిన నేరం చిన్నది కాదు. 19 ఏళ్ల యువతి ప్రాణం పోయింది. ఆ కుటుంబం అనుభవించిన వేదనను ఈ ఘటనతో తక్కువ చేయలేం. మరణశిక్షపై చర్చ వేరే విషయం.
కానీ ఒక మనిషి ప్రాణం గురించి చూస్తే మాత్రం.. ఈ ఘటనలో ఒక వింత మానవ కోణం కనిపిస్తుంది.
మరణం తలుపు దగ్గరకు రెండుసార్లు వచ్చి తట్టింది.
“తలుపు తీయండి” అంది.
లోపల నుంచి మాత్రం ప్రాణం.. “ఇంకా నా టైం కాలేదు” అన్నట్టుంది!

మూడు దశాబ్దాలుగా జైలు గోడల మధ్య గడిపిన ఓ మహిళ.. మరణశిక్షకు చేరుకున్న క్షణంలో కూడా ప్రాణాలతో బయటపడటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
ఇది ఆమె నిర్దోషి అని చెప్పే కథ కాదు.
ఆమె నేరాన్ని సమర్థించే కథ అంతకన్నా కాదు.
కానీ చావు ఖాయం అనుకున్న చోట.. రెండుసార్లు మరణాన్ని తప్పించుకుని తిరిగి ఊపిరి పీల్చిన మనిషి కథ మాత్రం.
అందుకే మన పెద్దలు అన్న మాట గుర్తొస్తుంది…
“భూమ్మీద నూకలు బాకీ ఉంటే.. యముడొచ్చినా ఏం చేయలేడు!”

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నూకలు బాకీ ఉంటే… యముడే దిగొచ్చినా ప్రాణాలు తీయలేడు !!
  • బ్లడీ రోమియో – కాదు, బ్లడ్ రోమియో – మరో బ్లడీ ప్యారడైజ్ !!
  • నకిలీ బతుకులు … BRS సోషల్- ఫేక్ ప్రచారాలపై బిగ్‌టీవీ ఫైర్..!!
  • అవతలి వైపు వచ్చిన ప్రశ్న – ఎన్‌కౌంటర్ కథ తెలియదా? ఫీల్డ్‌కు కొత్తా..?
  • అచ్చం కరోనా పుట్టుకలాగే..? బయోవెపన్ తయారీ దశలో ప్రమాదం..?
  • ఏది నిజం? సర్దార్ పటేల్‌ నేతాజీ బోస్‌కు వ్యతిరేకంగా కోర్టుకెక్కాడా?!
  • క్షణాల్లో టికెట్లన్నీ ‘మాయం’ – ఏం జరుగుతోంది నాయుడూ..?!
  • లెంపలేసుకున్న ఈనాడు – ఆ వార్త పొరపాటే అని ఒప్పుకోలు !!
  • 100 రోజుల బందిఖానా కాదు… 4 వారాల్లోనే ‘ఖేల్ ఖతం’!
  • విమానంలో సీటు పోయిందా..? ఆ ఒక్క మాట చెప్పండి.. కథే మారిపోతుంది!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions