.
బతుకమ్మ చప్పట్లకు ఓ రిథమ్ ఉంటుంది… ఆ పాటలకు ఓ రీతిరివాజు ఉంటాయి… ఆ అడుగులకు ఓ లయ ఉంటుంది… పదిమందీ చుట్టు తిరుగుతూ పదం, పాదం కలిపితే అందులో ఓ సొగసు ఉంటుంది… పూలను బతుకమ్మలా పేర్చడంలో ఓ కళ, ఓ నేర్పు ఉంటాయి… గౌరమ్మ పూజలో ఓ భక్తి ఉంటుంది… కానీ ఇప్పుడు..?
మనకు పైత్యాలు ఎక్కువ కదా… మన పెళ్లిళ్లలో సంగీత్లు, హల్దీలు, మెహందీలు గట్రా పెత్తనాలు చేస్తున్నట్టే… మన బతుకమ్మ ఉత్సవాల్లో గర్బా, దాండియా విహారం చేస్తున్నాయి… మనల్ని మరిచి, మందిని మోసే మన పైత్యమే ఇది… గర్భా, దాండియా తప్పు కాదు, బతుకమ్మను వాటిని కలిపేయడం తప్పు… దేని ప్రత్యేకత దానిదే…
Ads
ఎస్, నానా పరాయి దుష్ట సంస్కృతుల తాకిడికి తట్టుకుని బతుకమ్మ పండుగ బతికింది… అది తెలంగాణ మహిళ గుండెలో ఉండే పండుగ… సగటు తెలంగాణ ఆడబిడ్డ ఏడాదంతా ఎదురుచూసే పండుగ… బతుకమ్మను ఉమ్మడి పాలనలో వలసదారులు వెక్కిరించినా అదేమీ చిన్నబోలేదు… అధికారిక ఉత్సవాలు అంటూ మగవాళ్లు కూడా బూట్లు ధరించి, బతుకమ్మ పేరిట పూలకుండీలను మధ్య పెట్టి గంతులేసినా… డీజే సినిమా పాటలతో డాన్సులు చేసినా బతుకమ్మ నవ్వుకుంది ఆ అజ్ఙానాలను చూసి…
https://www.facebook.com/reel/1895985088430249
క్రమేపీ బతుకమ్మలను పక్కనపెట్టి నవరాత్రులు, దుర్గ విగ్రహాలు- ఉత్సవాలు పెరిగాయి… తప్పుకాదు… గతంలో బతుకమ్మ ఆటల్లో కోలాటాలు కనిపించేవి… ఇప్పుడు దాండియా, గర్బా డాన్సులే కాదు… మరీ చిల్లర, సినిమా వెగటు, అశ్లీషపాటలు వేస్తూ చిల్లర స్టెప్పులు వేస్తున్నారు… మొన్న దీనక్క దానక్క మాయక్క మీయక్క అని ఎవరో వీడియో రిలీజ్ చేశారు… బతుకమ్మల చుట్టూ వెకిలి, రోత స్టెప్పులు వేస్తున్నారు…
https://www.facebook.com/reel/2351515732319535
ఇవన్నీ ఒకెత్తు… మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి మరో ఎత్తు… పే-ద్ద బతుకమ్మను కాలేజీల ప్రాంగంణలో పెట్టేసి… ఏక్దోతీన్ అనే పాత బూతు పాటకు డాన్స్ చేస్తోంది ఓ వీడియోలో… అసలు బతుకమ్మను మరింతగా భ్రష్టుపట్టించే పోకడ ఈ మల్లారెడ్డి కాలేజీల్లోనే స్టార్టయిందేమో… విద్యాలయాలను చివరకు సినిమా ఫంక్షన్ల వేదికగా చేయడం దగ్గర నుంచి బతుకమ్మ పేరిట పిచ్చి కోలాహలాన్ని రుద్దే దుష్ట సంప్రదాయం…
దీన్ని ఎంవీఎస్ఆర్ కాలేజీ మరో పది మెట్లు దిగజార్చింది… ఈమధ్య కొత్తతరహా లైటింగ్, ఈవెంట్లు వచ్చాయి కదా… భారీ లైటింగ్ ట్రస్ (ఇనుప స్తంభాల నిర్మాణం), స్క్రీన్లు, కలర్ లైట్లు, డీజే స్పీకర్లు… అన్ని వందలు, వేల మంది పిల్లలతో ఈవెంట్ నిర్వహిస్తుంటే ఎన్ని జాగ్రత్తలు ఉండాలి..? అవేవీ లేవు… హంగామా… ఆ లైటింగ్ ఏర్పాట్లు కూలి ప్రాణనష్టం, కొందరు గాయపడటం, వందల మంది పిల్లలు పరుగులు తీయడం… ఏమిటీ విషాదం..? ఎవరు బాధ్యులు..? అసలు కాలేజీల్లో దాండియా ఉత్సవాలు ఏమిటి..?

గతంలో ఇంజినీరింగ్, ఇతర ప్రొఫెషనల్ కాలేజీల్లో ఫ్రెషర్స్ డేలు ముఖ్యం… విద్యావేత్తలను, సైంటిస్టులను పిలిచేవాళ్లు… ఓ పద్దతి ఉండేది… ఇప్పుడు ఈవెంట్లు చేస్తున్నారు… సినిమా వాళ్లను పిలుస్తున్నారు… డీజేలు హోరెత్తుతున్నాయి… చివరకు బతుకమ్మలనూ బలి చేస్తున్నారు… ఎస్, మనదే పైత్యం, వీటినే ఆదరిస్తున్నాం కదా…
ఎంవీఎస్ఆర్ ప్రమాద దృశ్యాల వీడియోల కింద ఓ కామెంట్ కనిపించింది… ‘‘పుష్ప – సంధ్య తొక్కిసలాటకు అల్లు అర్జున్ను బాధ్యుడిని చేసి కేసు పెట్టారు, అరెస్టు చేశారు కదా… మరి ఎంవీఎస్ఆర్ దుర్ఘటనకు ఎవరిని లోపలేయాలి..? ఈ పోకడలకు ఆద్యుడైన మల్లారెడ్డి మీద ఏం కేసులు పెడతారు..? అసలు ఈ ఈవెంట్లను పోలీసులు ఎలా అనుమతిస్తున్నారు..?’’…… అవును, ఆలోచించాల్సిన ప్రశ్నలే..!!
అన్నీ ఇలాంటివేనా..? కావు, కనెక్టయ్యేవీ ఉన్నాయి… మల్కాజిగిరి పోలీసులు నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల వీడియోలు బాగున్నాయి… ఖాకీ డ్రెస్సులకు బదులు పట్టుచీరెల తళతళలు ఈ మట్టి సంస్కృతిని అద్దుకుని మెరిసిపోయాయి… తెలంగాణ ఇంటి కోడలు ఒక రష్మిక మందాన బతుకమ్మ ఎత్తుకుని, ఓ రిథమ్ ప్రకారం తోటి మహిళలతో పద్దతిగా బతుకమ్మ ఆడిన వీడియో కనిపించింది… బాగుంది… పీవీ సింధు ఓ వెండి బతుకమ్మను ఎత్తుకుని సంబరంగా పాల్గొంది… (తెలంగాణ సంస్కృతిలో తొలి బతుకమ్మ వాయినం కూడా ముఖ్యమే… వెండి బతుకమ్మ అందులో భాగమే, అజ్ఞానంతో వెక్కిరించకండి…)
https://x.com/Pvsindhu1/status/2111836292212563980
Share this Article