.
మండోదరి అలిగింది… అవును, 4 వేల కోట్ల హైబజ్ రామాయణ సినిమాలో యశ్ రావణుడి భార్య మండోదరి పాత్ర పోషించిన కాజల్ అగర్వాల్ అలిగింది… దర్శకుడిపై, నిర్మాతపై… అందుకే ప్రమోషన్లకు వెళ్లడం లేదు, తన సోషల్ ఖాతాలో ప్రస్తావన లేదు… యశ్, రణబీర్, సాయిపల్లవి, రకుల్ తదితరులు ప్రమోషన్లలో కనిపిస్తున్నా కాజల్ జాడ మాత్రం లేదు… ఎందుకని..?
పాపం, త్వరలో రిలీజ్ కాబోయే ఫస్ట్ పార్ట్ లో ఆమె సీన్లను లెంత్ ఎక్కువైందనే కారణంతో కట్ చేశారట.., అందుకని అలిగింది, మీడియాలో ఈమేరకు చాలా వార్తలు వచ్చాక, సినిమా టీమ్ ఆమె ధోరణితో అసంతృప్తి వ్యక్తం చేసేసరికి… అబ్బే, రామాయణ మొదటి భాగంలో నా పాత్ర అంతే, రెండో భాగంలో ఈ పాత్రకు ప్రయారిటీ ఉంటుంది… అందులో నేను బాగా కనిపిస్తాను అని కవర్ చేస్తోందట ఇప్పుడు…
Ads
నిజానికి ఆమె కవరింగు తప్పు… రామాయణ ఫస్ట్ పార్టులో రావణుడి ఎదుగుదల, తన జీవితమే ఎక్కువ… అందులోనే మండోదరితో పెళ్లి కథ కూడా… సెకండ్ పార్టులో ప్రధానంగా కిష్కింధకాండ, సీత అన్వేషణ, రామసేతు నిర్మాణం, యుద్ధం, రామ పట్టాభిషేకం ముఖ్యం… అందులో మండోదరికి పెద్ద చాన్సే ఉండదు… బహుశా యశ్‌ను వారించే ఒకటీరెండు సీన్లు, ఇంద్రజిత్తు మరణం వంటివి ఉండొచ్చు…

కేవలం ఈ కథ రావణాయణం, అంటే రావణుడి ప్రస్థానం గురించే అయితే అందులో మండోదరి పాత్రకు ప్రయారిటీ ఉంటుంది… కానీ ఇది యశ్ రామాయణం, అంటే ప్రధానంగా రాముడు, రావణుడు పాత్రలను సమాంతరంగా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండేలా తీస్తున్నారు… సో, కాజల్ పోర్షన్‌కు అంత పెద్ద సీనేమీ ఉండదు…
తనకు చెప్పింది వేరు, తీరా తీస్తున్నది వేరు, అసలు నాకు తగిన స్క్రీన్ స్పేస్ ఎక్కడుంది అని ఒక దశలో ప్రాజెక్టు నుంచే ఎగ్జిట్ అవుతాను అని చెప్పిందట… కానీ అగ్రిమెంట్లు ఉంటాయి కదా, చూపించారు… దాంతో ఇక సైలెంట్… ఇరుక్కుంది, తప్పుకోలేదు… అందుకని అలా అసంతృప్తితో దూరం దూరం ఉంటోంది, అదీ అసలు కథ…
సినిమా టీమ్‌తో ఆమెకు విభేదాలు నిజం… ఆమె ఇలాగే అసహనంతో వ్యవహరిస్తే రెండో పార్టులోనూ మండోదరి పోర్షన్‌ను మరింత కుదిస్తామనీ, దాంతో కథకు పెద్ద ఫరక్ పడదనీ హెచ్చరించిందట టీమ్… మరోవైపు మండోదరి పోర్షన్ ఫస్ట్ పార్టులో మరీ పరిమితంగా ఉండటానికి ఇవీ కారణాలు అని కొన్ని వార్తలు రాయించుకుంటోంది టీమ్…
మొదటి భాగంలో లంకకు సంబంధించిన కథ, రావణుడి అంతఃపురం సీన్లు చాలా తక్కువగా ఉంటాయి… అందుకని కావాలని, అంటే ఉద్దేశపూర్వకంగా ఆమె నటించిన సీన్లు కట్ చేయలేదని, కథ డిమాండ్ మేరకే మొదటి భాగంలో మండోదరి పాత్ర తక్కువ సమయం కనిపిస్తుందని ఆ వార్తల సారాంశం…
సాధారణంగా నితీష్ తివారీ తన సినిమాలకు సంబంధించి ఏ రూమర్లు వచ్చినా పెద్దగా పట్టించుకోడు, అసలు స్పందించడు… ఇప్పుడు కూడా కాజల్ కంట్రవర్సీని తన టీమ్‌కు వదిలేసి, పూర్తి దృష్టిని సినిమా పోస్ట్-ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనులపైనే, అంటే ఫినిషింగ్ టచ్‌ల మీదే పెట్టాడు..!!
Share this Article