Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఏబీఎన్ రాధాకృష్ణ ‘కుట్ర వ్యాసాన్ని’ కార్నర్ చేసిన దేవులపల్లి అమర్..!!

October 25, 2026 by M S R

.

మొన్నీమధ్య ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ తన కొత్త పలుకు వ్యాసంలో ఏం రాసుకొచ్చాడు..? ‘‘మాజీ ఉపరాష్ట్రపతిని, అనిల్ అంబానీని ముందుపెట్టి విదేశీ శక్తులు మోదీని దింపేసి, రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయాలనే కుట్ర పన్నాయి… అనిల్ అంబానీ కేజ్రీవాల్ ఈ దిశలో కలిశారు… కానీ నితిశ్ విముఖంగా ఉండటంతో ఆ కుట్ర ఫలించలేదు, పైగా అది బయటపడి మోదీ నిర్దాక్షిణ్యంగా ధనఖర్‌ను కుర్చీ దింపేసి తరిమేశాడు…

లోకేష్ ధనఖర్‌ను కలిశాడనే ప్రచారం జరిగాక, నారా లోకేష్ మోదీకి వివరణ ఇచ్చుకున్నాడు, అసలు తను ఉపరాష్ట్రపతిని కలవనేలేదని చెప్పుకున్నాడు…’’ ఇదే కదా తన వ్యాసంలో సారాంశం… మోదీ తన ప్రభుత్వ మనుగడకు ఎవరిమీదనైతే ఆధారపడ్డాడో ఆ నాయకులు, అంటే నితిశ్, చంద్రబాబులే మోదీని అలర్ట్ చేశారనే అర్థమొచ్చేలా రాశాడు…

Ads

సో, మొత్తానికి చంద్రబాబు మీద, లోకేష్ మీద ఈగవాలనివ్వలేదు… వాలనివ్వడు, తెలిసిందే కదా… ఇదంతా బాగానే ఉంది… సరిగ్గా ఈ వ్యాసానికి పూర్తి విరుద్ధమైన వ్యాసం ఈరోజు మనతెలంగాణలో వచ్చింది… రాధాకృష్ణ సమకాలికుడు, ఈ పత్రిక సంపాదకుడు దేవులపల్లి అమర్ రాసిన వ్యాసం ఇది… ఆంధ్రజ్యోతి, రాధాకృష్ణ పేర్లు తీసుకోకపోయినా ఆ రాతల్ని కటువుగానే కార్నర్ చేస్తున్నట్టుగా ఉంది అమర్ వ్యాసం… కొన్ని ప్రశ్నలనూ లేవనెత్తింది… అవి ఆసక్తికరం… డిబేటబుల్ కూడా…

dhankhar

అందులో మొదటిది… లోకేష్ అసలు ధన్‌ఖర్‌ను కలవనేలేదు అన్నట్టుగా కలర్ ఇచ్చారు కదా, మరి ఇదే పత్రిక లోకేష్ ధన్‌ఖర్‌ను కలిసినట్టుగా ఆమధ్య ఫోటోతోసహా ప్రచురించిన సంగతేమిటి..? బహుశా… ఈ వార్త గురించి అయి ఉంటుంది… అది 2025 జూన్ 18న…

https://www.andhrajyothy.com/2025/andhra-pradesh/krishna/minister-nara-lokesh-meets-vice-president-jagdeep-dhankhar-in-delhi-anr-1416674.html

dhankhar

సో, లోకేష్ ధన్‌ఖర్‌ను కలిసిన మాట నిజం… ఏం మాట్లాడాడో తెలియదు… మోదీకి ఈ సమాచారం మొత్తం తెలుసు అనేదీ నిజం… ఎక్కడ మోదీకి కోపం వస్తుందో అనే భావనతో చంద్రబాబు గతంలో ఎన్నడూ లేనట్టు మోదీ భజనకు పూనుకున్నాడు అనేదీ నిజం… తన ప్రసంగాల్లో వ్యక్తమవుతూనే ఉంది… అబ్బే, టీడీపీకి ఆ విదేశీకుట్రకూ సంబంధం లేదు అని రాధాకృష్ణ కవర్ చేస్తున్నాడు అనేది అమర్ వ్యాసభావన…

సరే, రాధాకృష్ణ- టీడీపీ కథల్ని వదిలేస్తే… అమర్ రాసిన వ్యాసంలో కొన్ని కీలక ప్రశ్నలున్నాయి… మోదీ తన్ని తరిమేసిన అదే మాజీ ఉపరాష్ట్రపతిని, అదే ధన‌ఖర్‌ను ఆర్ఎస్ఎస్ కీలకమైన ఆర్ఎస్ఎస్ విజయదశమి (శతజయంతి కూడా) ఉత్సవాల కోసం ఎందుకు నాగపూర్‌కు ఆహ్వానించింది..? ఇంట్రస్టింగు ప్రశ్న… ఆ ఆహ్వానం నిజమే…

అదే వేదిక మీద గడ్కరీ ఉన్నాడు… మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఉన్నాడు… తెలుగు పత్రికలకు ఈ వార్త ఇంపార్టెన్స్ తెలుసుకునే సోయి లేదు, కానీ నేషనల్ మీడియా బాగానే కవర్ చేసింది… విదేశీ శక్తులకు సాయం చేయాలనుకున్న ధన‌ఖర్‌ను ఆర్ఎస్ఎస్ ఎందుకు ఓన్ చేసుకుంటోంది..? అంటే, మోదీకి ఆర్ఎస్ఎస్‌కూ నడుమ అగాధం ఇంకా పెరిగిపోయిందా..?

విదేశీ శక్తులు రాహుల్ గాంధీని గద్దెనెక్కించాలని అనుకుంటే, తనను ప్రబల ప్రత్యర్థిగా భావించే ఆర్ఎస్ఎస్ ఆ కుట్రకు సాయం చేయాలనుకున్న ధన‌ఖర్‌ను ఎందుకు అక్కున చేర్చుకుంటోంది..? అంటే కుట్ర నిజమేనా..? కట్టుకథా..? మరి రాధాకృష్ణ ఏం చెప్పాలనుకన్నాడు..? ఇదీ అమర్ వ్యాసంలోని మరో కీలక ప్రశ్న…

నిజానికి ఆర్ఎస్ఎస్, మోదీ నడుమ సయోధ్య చాన్నాళ్లుగా లేదు… కారణాలు అంత త్వరగా బయటపడవు ఆర్ఎస్ఎస్ క్యాంపు నుంచి..! కానీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మోదీపై పరోక్షంగా విసుర్లు సంధిస్తూనే ఉన్నాడు… సరే, అదంతా బీజేపీ- ఆర్ఎస్ఎస్ కాషాయ శిబిరం అంతర్గత వ్యవహారం అనుకుందాం… కానీ..?

విదేశీ శక్తుల కుట్ర అనేదేమీ లేదు అని ఆర్ఎస్ఎస్ చెప్పదలుచుకుందా..? అయితే మోదీ ధన‌ఖర్‌ను తరిమేసిన కారణం ఏమిటి..? రాత్రికిరాత్రి హెల్త్ బాగాలేదని రాజీనామా చేసి, మొన్నమొన్నటిదాకా అజ్ఞాతంలో ఉండిపోయేంత తీవ్రమైన తప్పు, నేరం, కుట్ర ధనఖర్ ఏం చేసినట్టు..? ఇదీ అసలు ప్రశ్న…

ఇండియాను అస్థిరతపాలు చేయాలనే విదేశీకుట్రలు నిజం… సీజేపీ జన్మస్థలి ఆ కుట్రవేదికే… దేశం నమ్ముతోంది… అయితే ఆ శక్తులకు ధనఖర్ నిజంగా సాయం చేయదలిచాడా..? మరి తనను కలిసిన లోకేష్ ఏం చర్చించినట్టు..? రాహుల్ గాంధీ ప్రధాని కావాలనే విదేశీ శక్తుల లక్ష్యానికి సాయం చేయదలిచాడా..? అసలు తను తరువాత మోదీకి ఎందుకు, ఏమని వివరణ ఇచ్చుకున్నట్టు..? ఆలోచనాత్మక ప్రశ్నలే..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏబీఎన్ రాధాకృష్ణ ‘కుట్ర వ్యాసాన్ని’ కార్నర్ చేసిన దేవులపల్లి అమర్..!!
  • రామాయణలో నేనెక్కడ ఉన్నాను..? మండోదరీ అగర్వాల్ అలిగింది !
  • ఓ సర్కారీ స్కూల్ టాయిలెట్‌లో ఇరుక్కున్న బడా గ్యాంగ్‌స్టర్… తరువాత..?
  • లోప్క తాగుడు- పీక్క తినుడు… ఇదా తెలంగాణ కల్చర్ అంటే..?!
  • ఇదేం పని..?! లేడీ సింగం ‘ఆయుధ పూజ’ తీరుపై సర్కారు నోటీసు !!
  • ప్రీతిరెడ్డి..! తెలంగాణ విద్యావ్యవస్థకు ఓ మణికిరీటం..!!
  • పాపం కేటీయార్… పాత తప్పుల్ని మరిచి… ఆకాశానికి మళ్లీ నిచ్చెనలు !!
  • వాట్సాప్, టెలిగ్రామ్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం అలర్ట్ !!
  • మోహన్‌లాల్ బాడీ డబుల్ ! ఇదో దిక్కుమాలిన సోషల్ రాద్దాంతం !!
  • అమెరికాకు అంబానీ సాయం దేనికి..? ఈ సంప్రదింపుల మర్మమేంటి..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions