.
Bharadwaja Rangavajhala …. జేగంటలు కథ ….
జేగంటలు అనే సినిమాకు సంబంధించిన విషయాలు చాలా ఇంట్రస్టింగ్ వే ఉన్నాయి.
విజయబాపినీడు, కాట్రగడ్డ మురారి కలిసి ఓ సినిమా తీయాలనుకున్నారు.
కథ, మాటలు, పాటలు బాధ్యతను ఆత్రేయ మీద పెట్టారు. ఆయన సహజంగానే పట్టించుకోలేదు.
దాంతో వేటూరితో పాటలు రాయించారు.
పాటలకు అనుగుణంగా కథ రాసుకున్నారు.
Ads
- ఈ సినిమాలో హీరో వేషానికి చిరంజీవి కూడా వెళ్లారు పాపం.
విచిత్రమేమంటే తర్వాత రోజుల్లో చిరంజీవితో గ్యాంగ్ లీడర్, మగమహారాజు లాంటి హిట్స్ తీసిన విజయబాపినీడు హీరోగా చిరంజీవిని కాదన్నారు. అని మురారి గారు రాశారు.
దీంతో రామ్ జీ అనే దాసరి కాంపౌండ్ నటుడ్ని తీసుకున్నారు.
అతనికి నట కిరీటి రాజేంద్రప్రసాద్ డబ్బింగ్ చెప్పారు.
దర్శకుడుగా సింగీతం శ్రీనివాసరావును తీసుకున్నారు. ఆయన వైఖరి నచ్చక దర్శకత్వం ఎస్. శ్రీనివాసరావు అని టైటిల్స్ లో వేసి తన కసి తీర్చుకున్నాడు మురారి.

భారతీరాజా కలుక్కుం ఈరమ్ లో నటించిన ముచ్చర్ల అరుణను హీరోయిన్ గా తీసుకున్నారు.
ఈ సినిమాకు వంశీ అసిస్టెంటు డైరక్టర్ గా పనిచేశారు.
కొన్ని సీన్లు ఆయనే రాశారు కూడా.
మహదేవన్ సంగీతం వేటూరి సాహిత్యం పాటలు మాత్రం చాలా పెద్ద హిట్టయ్యాయి. ప్రత్యేకించి ఇది ఆమని సాగే చైత్రరథం, వందనాలు వందనాలు వలపుల హరిచందనాలు…
సినిమా మాత్రం అట్టర్ ఫ్లాపయ్యింది.
1981లో విడుదలైన ఈ సినిమా చాలా చేదు అనుభవాలు మిగిల్చిందంటారు సింగీతం.
సత్యానంద్ మాటల్లో మురారి అసలు సింగీతాన్ని డైరక్ట్ చేయనీయలేదు.
మురారి ది ఓ బ్యాక్ గ్రౌండు.
బాపినీడుది మరో రకం నేపధ్యం.
ఈ ఇద్దరూ కలిసి జ్యోతి చిత్ర అనే పేరు పెట్టుకుని తీసిన ఈ సినిమా పాటలు యుట్యూబులో పెట్టడం చాలా బాగుంది…
Share this Article