Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పులివెందుల కంచుకోట బద్ధలు – వై నాట్ సిరిసిల్ల? వై నాట్ సిద్దిపేట?

October 28, 2026 by M S R

.

ముందుగా ఓ తాజా వార్త చదవండి… వైకాపా అధినేత జగన్‌ (YS Jagan) కంచుకోటను తెదేపా(TDP) బద్దలు కొట్టింది… కడప జిల్లా పులివెందులలో కూటమి అభ్యర్థులు ప్రభంజనం సృష్టించారు… నియోజకవర్గంలోని 65 ఎంపీటీసీ స్థానాలకుగాను 64 ఏకగ్రీవమయ్యాయి… 7 జడ్పీటీసీ స్థానాలకుగాను 3 ఏకగ్రీవమైనట్టు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు…

పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లి మండలంలో 18 ఎంపీటీసీలకు గాను 17 ఏకగ్రీవం… అన్నీ అధికార కూటమి వశం… పులివెందుల మండలంలోని ఐదు ఎంపీటీసీ స్థానాల్లో తెదేపా అభ్యర్థులు, వేముల మండలంలోని 8 ఎంపీటీసీ స్థానాల్లో తెదేపా అభ్యర్థులు, చక్రాయపేట మండలంలోని 9 ఎంపీటీసీల్లోనూ తెదేపా అభ్యర్థులు, తొండూరు మండలంలోని 8 ఎంపీటీసీ స్థానాల్లోనూ తెదేపా అభ్యర్థులు, సింహాద్రిపురం మండలంలోని 8 ఎంపీటీసీ స్థానాల్లోనూ తెదేపా అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు…

Ads

సింహాద్రిపురం, చక్రాయపేట, తొండూరు జెడ్పీటీసీలను టీడీపీ ఏకగ్రీవం చేసుకుంది… పులివెందుల మున్సిపాలిటీలో 20 వార్డులను కూటమి కైవసం చేసుకుంది ఏకగ్రీవంగా…

నిజమే… పులివెందుల అంటే అప్పట్లో వైఎస్, ఇప్పుడు జగన్‌కు కంచుకోట… కానీ బద్దలైంది… ఎహె, స్థానిక ఎన్నికల్లో… భయపెట్టి, పోలీసులను దింపి, ఎవరినీ నామినేషన్లే వేయనివ్వడం లేదు రాష్ట్రమంతటా… పులివెందులలోనూ అంతే, ఇదొక గెలుపా..? అని తీసిపారేయకండి… ఇంకొన్ని విషయాలు చెప్పుకుందాం…

pulivendula

ఇవి రాజకీయాలు… ఏ ప్రాంతమూ ఏ కుటుంబం చెప్పుచేతల కింద ఎల్లకాలమూ ఉండబోదు.,. పైగా పొలిటికల్ మర్యాదల కాలం ఎప్పుడో పోయింది… జగన్ వైఎస్ కాదు, లోకేష్ చంద్రబాబూ కాదు… ఎస్, కుప్పం జోలికి వైఎస్ పెద్దగా పోయేవాడు కాదు, పులివెందుల జోలికి చంద్రబాబూ వెళ్లేవాడు కాదు… కొన్ని అలిఖిత మర్యాదలుంటాయి రాజకీయాల్లో…

కానీ ఇది లోకేష్ కాలం, ఇది జగన్ కాలం… వై నాట్ కుప్పం? వై నాట్ 175 అన్నాడు జగన్… ఏమైంది..? తనే పదకొండుకు పడిపోయాడు… కాలం అంతే… అంతకుముందు చంద్రబాబునూ 23కు దింపేశారు జనం… సరిగ్గా కొడితే పులివెందులను కొట్టలేమా అనుకున్నాడు లోకేష్, కొట్టేశాడు… తోడుగా సతీషులు, రాజేషులు ఏలుతున్న రాజ్యం ఇది…

appolitics

గత స్థానిక ఎన్నికల్లో జగన్ చేసిన పనే ఇప్పుడు లోకేష్ చేస్తున్నాడు అంటారా..? అవును, నిజమే… స్థానిక ఎన్నికల అరాచకంలో జగన్ రెండు చేస్తే లోకేష్ పది చేస్తున్నాడు… రేప్పొద్దున జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ఇక మామూలుగా ఉండదు… ఎందుకంటే… తను వైఎస్ కాదు గనుక… సరే, దీన్నలా వదిలేస్తే… ఇవన్నీ రాస్తుంటే… ఓ పాత ముచ్చట యాదికొచ్చింది…

చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన కొత్తలో… ఈ పవనులు, ఈ నాగబాబులు కాదు… యవ్వారాలన్నీ అల్లు అరవింద్ చూస్తున్న కాలం అది… ఎవరో అడిగితే, అన్నీ గెలుస్తాం, కుప్పం- పులివెందుల మాత్రం మర్యాదకు వదిలేస్తాం అన్నాడు… పొలిటికల్ మాటలు ఇలాంటివి… జనం చెబుతారు అసలు తీర్పులు..!

వైనాట్ కుప్పం అని జగన్ పలికినా… వైనాట్ పులివెందుల అనుకుని లోకేష్ కాన్సంట్రేట్ చేసినా… అవేమీ అసాధ్యాలు కావు… ఎస్, రేవంత్ రెడ్డి చెబుతున్నట్టు సిరిసిల్లలో కేటీయార్, సిద్దిపేటలో హరీష్ రావు, గజ్వెల్‌లో కేసీయార్‌లను ఓడించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు, పూర్తిగా కాన్సంట్రేట్ చేస్తే..!

ఏ ప్రాంతమూ ఒకరి చెప్పుచేతల్లోనే ఉండిపోదు… కామారెడ్డిలో కేసీయార్ ఓడిపోలేదా..? ఏమో రేపు తెలంగాణలోనూ పులివెందుల ఫలితాలు ఉండకూడదని ఏముంది..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పులివెందుల కంచుకోట బద్ధలు – వై నాట్ సిరిసిల్ల? వై నాట్ సిద్దిపేట?
  • కార్పొరేట్ వైద్య మాఫియా ! సుప్రీంకోర్టు వ్యాఖ్యలు అక్షరసత్యాలు !!
  • డ్రగ్ డాన్ వెళ్లిపోయాడు – ఆ నీడలు పెరిగి భయపెడుతున్నయ్ !!
  • హేట్సాఫ్ అమెరికా… 1930 లోనే 13 నెలల్లో 102 అంతస్తుల అద్భుతం !!
  • 418 … కేజీఎఫ్ దర్శకుడి సినిమా అంటే ఎక్కువ ఊహించాం… కానీ..?
  • జిలపురుగుల ఎఫెక్ట్..? అదే నిజమైతే మరి ‘వారణాసి’ మాట..?!
  • కైసే కహూఁ కుచ్ కెహనా సకూఁ … మహేంద్రన్ సినిమాల తీరే వేరు !!
  • అయ్యా, నేతాజీ మునిమనవడు గారూ..! ప్రభాస్ గ్లింప్స్‌లో తప్పేం లేదు..!!
  • అసలు నీకు బుద్దుందా వాసూరావ్..? సాయిపల్లవిపై ఈ కూతలేంటి..?
  • నీటికి Expiry Date ఉందో లేదో మీకు తెలుసా..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions