Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ సీరియల్ కిల్లర్ ఓ క్రైమ్ రిపోర్టర్ – ఆ పత్రికకు ఎడిటర్- పబ్లిషర్…

November 7, 2026 by M S R

.

చాలామంది ఆ సీరియల్ కిల్లర్‌ను ఓ క్యాబ్ డ్రైవర్ అనే రాస్తూ వచ్చారు… కానీ మరో కోణం ఉంది… అతను ఓ జర్నలిస్టు… తనకు ఓ పత్రిక ఉంది… తనే పబ్లిషర్… పేరు ఠాణావరది (అంటే పోలీస్ స్టేషన్ రిపోర్ట్, ఠాణా నివేదిక)… దీనికి ఎడిటర్… క్రైమ్ వార్తలు రాసీ రాసీ, దానికితోడు క్యాబ్ డ్రైవర్‌గా పనిచేసే అతను నిజంగానే ఓ క్రిమినల్‌గా మారాడు…

మామూలు క్రిమినల్ కాదు… అత్తింటి వారిని ఏడుగురిని వరుసగా చంపుతూ పోయాడు… పేరు ఇందుశేఖర్… వార్తలు రాసేవాడు తనే వార్తగా మారడం కొత్త విషయమేమీ కాదు… కానీ ఏడుగురిని హతమార్చాడు అంటే తనది ఏ రేంజ్ నేరమనస్తత్వమో, ఎంతటి కూృర స్వభావమో అర్థమవుతోంది… కారణాలు ఏమున్నా సరే, ఓ సీరియల్ కిల్లర్‌గా మారడం అనేది ఇప్పుడు జాతీయ స్థాయి వార్తాంశం అయ్యింది…

Ads

కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో వెలువడే స్థానిక మాస పత్రిక అది… క్రైమ్ వార్తలకు ప్రాధాన్యమిస్తుంది… బెంగుళూరులోని రాజాజీనగర్ నివాసి… భార్య పేరు సునీత… ఎక్కడ మనస్పర్థలు స్టార్టయ్యాయ్యో ఇంకా క్లారిటీ రాలేదు కానీ గొడవలు జరుగుతూ ఉండేవి… తరచూ ఆమె పుట్టింటికి వెళ్లేది… దాంతో తను కోపం పెంచుకున్నాడు…

serial killer

ఈ హత్యలు ఒకేసారి జరగలేదు… మొదట భార్య సునీతను రోకలి బండతో కొట్టి హత్య చేశాడు… ఆమె మృతదే హాన్ని గోనెసంచిలో కుక్కి నందిహిల్స్ సమీపంలో పడేశాడు… ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి విహారయాత్రకు వెళ్లిందని ఇరుగుపొరుగును నమ్మించాడు…

ఆ తర్వాతి రోజు ఇద్దరు బావ మరుదులు శివకుమార్, శంకర్లను పార్టీ పేరుతో ఇంటికి ఆహ్వానించి హత్య చేశాడు… వారి భార్యలు దివ్య, నళిని, అత్త రూపావతి, శివకుమార్ ఏడేండ్ల పునీత్‌ను కూడా హతమార్చాడు… అత్తింటి మీద కోపం సరే, పాపం, బావమరుదుల భార్యలను, ఏడేళ్ల బాలుడిని కూడా హతమార్చడం అంటే విచారణలో వెల్లడైన వివరాలు వింటూ పోలీసులే షాక్ తిన్నారట…

ఎలా బయటపడింది…? నళిని (ఒక బావమరిది భార్య) కన్పించడం లేదంటూ ఆమె తల్లి శ్రీరాంపుర పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదుతో తీగ కదిలింది… పోలీసులకు మొదట సందేహం కలిగింది శేఖర్‌పైనే… ఎందుకంటే..? అసలు వాడి భార్య కనిపించకపోవడం… తన ఇంటికి వచ్చినవాళ్లందరూ తిరిగి సొంత ఇళ్లకు చేరకపోవడం… దాంతో తమదైన శైలిలో ‘విచారించారు…’ వాడు నేరం అంగీకరించాడు… ఇదీ సంగతి…

అసలు ఇన్ని హత్యలు ఒకే చోట జరిగినా స్థానికులు, ఇరుగుపొరుగువారికి ఎలా తెలియలేదనే అంశంపైనా పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు… ఈ హత్యల్లో నిందితుడి కుమార్తె పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు… మృతదేహాల తరలింపునకు వాడిన కారు స్వాధీనం చేసుకున్నారు… కానీ తను ఎక్కడ పారేశానని చెబుతున్నాడో ఆ ప్రాంతాల్లో గాలిస్తున్నా మిగతా మృతదేహాలు మాత్రం దొరకడం లేదు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ సీరియల్ కిల్లర్ ఓ క్రైమ్ రిపోర్టర్ – ఆ పత్రికకు ఎడిటర్- పబ్లిషర్…
  • ఈ ‘రామయణం’లో నాకు నచ్చిన నటుడు- వివేక్ విద్యుత్‌జిహ్వుడు!!
  • ఏం తక్కువైంది రెహమాన్ నీకు..? ఎందుకు ఈ సాకులు, ఈ శోకాలు..?
  • స్టార్ హీరోలకు దీటైన ‘మహాశక్తి’ … ఇలాంటి సినిమాలతోనే ‘కొడిగట్టేది’…
  • వీడియోకాన్ – దేశ బ్యాంకింగ్ చరిత్రలోనే అతి పెద్ద దివాలా కేసు !
  • రామాయణ సినిమా మాత్రమే కాదు… ఈ మహాభారతం ఘనత కూడా చదవండి!
  • మరీ అంత ‘సీన్’ లేదు ! సో సో… అక్కడక్కడా బాగున్నట్టు అనిపిస్తుంది !!
  • ఔను… రామాయణంతోపాటే రావణాయణం కూడా… తప్పేముంది..?
  • వై నాట్ సిద్దిపేట..? ఏదీ ఎవరికీ కోట కాదు..! రేవంత్ చెబుతున్నది ఇదే..!!
  • సోషల్ మీడియా దిగ్గజాలకు భారత్ నుంచి కొత్త సవాల్ !

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions