Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కాలిపోయేది మా పర్సులు..! నీ గల్లాపెట్టె నిండకపోతే మాదా తప్పు..?!

November 8, 2026 by M S R

.

ఒక రాజకీయ నాయకుడు ఓడిపోతే, వోటర్లే తప్పు చేశారని తను ఏడిస్తే ఎవరూ పట్టించుకోరు… ప్రజలు ఎవరిని మెచ్చితే వాళ్లనే గెలిపిస్తారు… ప్రజల తీర్పు అల్టిమేట్… అలాగే ఓ సినిమా చూడటానికి జనం థియేటర్లకు పెద్దగా రాకపోతే అది సినిమా ప్రేక్షకుల తప్పు కాదు, థియేటర్‌కు రప్పించలేని మేకర్స్ తప్పు… అలాగని ప్రేక్షకులను నిందిస్తే అది ఆత్మహత్యాసదృశం… అపరిణతి… సింపుల్‌గా చెప్పాలంటే… అడ్డగోలుతనం…

మొన్న సమ్మర్ హాలీడేస్ అనే సినిమా రిలీజైంది… మనల్ని పాత కాలంలోకి, బాల్యంలోకి తీసుకుపోయినట్టు ఉందని కొందరు పాజిటివ్ రివ్యూలే ఇచ్చారు… కానీ అందరూ కనెక్ట్ కావాలనేముంది..? ఆ జానర్ ఇష్టం లేనివాళ్లు థియేటర్‌కు వెళ్లరు… ఇంట్లో ఓటీటీలో చూడొచ్చులే అనుకుంటారు… లేదా టీవీలో వస్తే చూద్దాంలే అని వదిలేస్తారు…

Ads

  • కానీ సదరు నిర్మాత ధీరజ్ మొగిలినేని ప్రేక్షకులదే తప్పు అంటున్నాడు… ‘సమస్య ప్రేక్షకుల దగ్గరే ఉంది. రేపు చూద్దాం, నాలుగు రోజుల తర్వాత చూద్దాంలే అని వాయిదా వేస్తున్నారు. దయచేసి ఇలాంటి మంచి సినిమాలను ఆదరించండి. అప్పుడే ఇలాంటి మూవీస్ మరిన్ని వస్తాయి. తెలుగు ప్రేక్షకులు గొప్పోళ్లు. అన్ని భాషల సినిమాలు చూస్తారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే రోజూ పక్కింట్లో ఏం కూర వండుతున్నారో చూస్తున్నారు. మనం చేసేది ఏంటో చూడటం లేదు. ఓటీటీలో వచ్చినప్పుడు చూస్తున్నారు.. ఏడుస్తున్నారు.. చప్పట్లు కొడుతున్నారు. అది కాదు మాకు కావాల్సింది. మీ పిల్లలు, కుటుంబాలతో కలిసి థియేటర్లలో మా సినిమా చూడండి. సోషల్ మీడియాలో పోస్టులు, ట్వీట్స్ వేయడం వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. తెలుగులో గొప్ప సినిమాలు ఎందుకు రావడం లేదంటే, తీసినప్పుడు ప్రేక్షకులు చూడటం లేదు కాబట్టి!’

summer holidays

దీనికి జవాబు చాలా సింపుల్… ప్రేక్షకుడు ఎవరో నిర్మాతను ఉద్దరించడానికి థియేటర్‌కు రాడు, రావల్సిన పనిలేదు… ఇది వ్యాపారం… నిర్మాతది ఛారిటీ ఏమీ కాదు, సమాజాన్ని ఉద్దరించడానికి సినిమా తీయడం లేదు… సరుకు నచ్చితే కొంటాడు వినియోగదారుడు, లేకపోతే వద్దని తిరస్కరిస్తాడు… ఇదీ సరుకే… పైగా ఇప్పుడు థియేటర్‌కు వెళ్తే పర్సులు ఖాళీ అయిపోతాయి, కాలిపోతాయి…

థియేటర్‌కు వెళ్లడం అంటేనే నిలువు దోపిడీ… సో, థియేటర్ వెళ్లి చూస్తేనే ఈ సినిమా బాగుంటుంది అని ప్రేక్షకుడిని అనిపించాలి… తప్పకుండా వస్తాడు… ఇరుముడి సినిమాలో ఒక్క పాట కోసం వందల కోట్లు ధారపోశాడు ప్రేక్షకుడు… పైగా ఈ నిర్మాత తను తీసింది మంచి సినిమా, గొప్ప సినిమా అని తనే సర్టిఫికెట్ ఇచ్చుకుంటే సరిపోదు… అది ప్రేక్షకుడికి అనిపించాలి… మౌత్ టాక్ బాగుండాలి… అప్పుడే వస్తాడు…

అసలు తెలుగు సినిమా చూడాలంటే ఈతరం ప్రేక్షకుడికి విసుగు… ఒకేతరహా మూస… ఒక్క ప్రయోగమూ ఎవరికీ చేతకాదు… తెలుగు సినిమా అవలక్షణాలిక్కడ ఏకరువు పెట్టడం లేదు కానీ… అశ్లీలత, మితిమీరిన హీరోయిజం, హింస, నెత్తురు… ఇంకా బోలెడు… ఇక్కడ మరో ముఖ్యమైన అంశం…

ఓటీటీలో ప్రేక్షకుడు సినిమా చూస్తున్నాడు, సబ్‌స్క్రయిబ్ చేస్తున్నాడు, కాబట్టే ఓటీటీలు నిర్మాతలకు డబ్బులిస్తున్నాయి… అంటే అది జనం డబ్బే… మరి థియేటర్‌కే ఎందుకు రావాలి ప్రేక్షకుడు..? తనకు కంఫర్ట్ కావాలి, తాపీగా సినిమా చూడాలి… తన ఇష్టం… పోనీ, నువ్వు ఓటీటీకి రాను అని ప్రకటించు, సినిమా బాగుందని టాక్ వేస్తే ప్రేక్షకుడు, థియేటర్‌లో చూడటం తప్ప వేరే మార్గం లేదు అనుకుని వస్తాడు…

సినిమా సెలబ్రిటీల మాటల్లోని డొల్లతనం, అడ్డగోలుతనం ఈమధ్య చూస్తున్నదే కదా… ఈ నిర్మాత ఆవేదనను నేను తప్పుపట్టడం లేదు… కానీ ప్రేక్షకుల్ని నిందించడం తప్పు అనేదే నా భావన… రమ్మనే అప్పీల్ వేరు, చూడండనే అభ్యర్థన వేరు… ఎందుకు రారు అని తప్పుపట్టడం వేరు, అలా తప్పుపట్టడాన్ని తప్పు అంటున్నాను, అంతే…

ఒక సినిమా చూడాలా వద్దా అనేది ప్రేక్షకుడి చాయిస్… ఎవరూ నిర్బంధించలేరు, శాసించలేరు, ప్రశ్నించలేరు… అందుకే ప్రేక్షకదేవుళ్లు అనేది… సో, ముందు ఆ పరిణతి సాధించి, మాటల్ని దిద్దుకుని, అణకువ నేర్చుకుంటే, మంచి సినిమా తీస్తే, చూడాలని ప్రేక్షకుడికి అనిపిస్తే వస్తాడు… ఇది క్లియర్… ప్రేక్షకుడు ఎప్పుడూ దోషి కాదు... వినోదవ్యాపారంలో వినియోగదారుడు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కాలిపోయేది మా పర్సులు..! నీ గల్లాపెట్టె నిండకపోతే మాదా తప్పు..?!
  • సమాజం మారుతోంది- రియల్ హీరోలు ఎవరో గుర్తించి ప్రేమిస్తోంది !
  • రణ్‌బీర్‌ నోట తెలుగు పలికింది! బ్రహ్మ AI నేర్పిన ‘డబ్బింగ్ కళ !!
  • రాముడు తనే- సీత తనే..! మాటల్లేవ్… టాకీసులోనే లైవ్ బీజీఎం..!!
  • …. చివరకు మంత్రి ‘అక్షింతల’తో దత్తత వివాదానికి శుభం కార్డ్..!!
  • ఈ సీరియల్ కిల్లర్ ఓ క్రైమ్ రిపోర్టర్ – ఆ పత్రికకు ఎడిటర్- పబ్లిషర్…
  • ఈ ‘రామయణం’లో నాకు నచ్చిన నటుడు- వివేక్ విద్యుత్‌జిహ్వుడు!!
  • ఏం తక్కువైంది రెహమాన్ నీకు..? ఎందుకు ఈ సాకులు, ఈ శోకాలు..?
  • స్టార్ హీరోలకు దీటైన ‘మహాశక్తి’ … ఇలాంటి సినిమాలతోనే ‘కొడిగట్టేది’…
  • వీడియోకాన్ – దేశ బ్యాంకింగ్ చరిత్రలోనే అతి పెద్ద దివాలా కేసు !

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions