Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

G O A T … అనగా మేక, అనగా బకరా… అనగా తెలుగు ప్రేక్షకుడు..!!

November 12, 2026 by M S R

.

సర్వదమన్ బెనర్జీ… ఈ బెంగాలీ నటుడి పేరు వినగానే ఇండియన్ సినిమా తెరపై ఫస్ట్ సంస్కృత సినిమా ఆది శంకరాచార్యతోపాటు విశ్వనాథుడి క్లాసిక్ సిరివెన్నెల కూడా గుర్తొస్తుంది… అడపాదడపా తెలుగు సినిమాల్లో ఈమధ్య కనిపిస్తున్న ఈయనలోని నిజమైన నటుడిని తెలుగు దర్శకులు సమర్థంగా వాడుకోవడం లేదనిపిస్తుంది…

తెలుగు టీవీ సూపర్ స్టార్ సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన ‘గోట్’ (G.O.A.T) అనే సినిమాలోనూ ఈ బెనర్జీ ఉన్నాడు, జస్ట్, ఉన్నాడంటే ఉన్నాడు… ఓ సాదాసీదా తాత పాత్రలో… అసలు సుధీర్ ఇలాంటి సినిమాలు ఎందుకు చేస్తున్నాడో అర్థం కాదు, హీరో అనిపించుకోవడం కోసమేనా..? సాఫ్ట్‌వేర్ సుధీర్, గాలోడు ఫ్లాపులు… ఇప్పుడు గోట్ అదే బాటలో… నిజానికి సుధీర్‌ను హీరోగా పెట్టి సినిమా తీయడం అంటే జబర్దస్త్ స్కిట్ కాదు… ఆ తేడా వీళ్లకు అర్థం కావడం లేదు…

Ads

ఓ టీవీ కామెడీ స్కిట్ వేరు, ఓ సినిమా వేరు… చాలా చాలా తేడా ఉంటుంది… బలగం వేణు మాత్రమే జబర్దస్త్ నేపథ్యం నుంచి చక్కగా వెండితెరకు ట్రాన్స్‌ఫామయ్యాడు… మిగతా జబర్దస్త్ నటులు, దర్శకులు జస్ట్, ఆ జబర్దస్త్ వేదిక దగ్గరే ఆగిపోయారు… ఇదీ అంతే… అసలు సుధీర్ ఎంచుకునే కథల దగ్గరే తేడా ఉంది… ఎందుకంటే..?

goat movie

స్టార్ హీరోలు చేసే ఫైట్లు, పాటలనే ప్రస్తుత ప్రేక్షకుడు పట్టించుకోవడం లేదు పెద్దగా… అలాంటిది టీవీ నుంచి సిల్వర్ స్క్రీన్ మీదకు ఎదగడానికి ప్రయాసపడే నటుడు చేస్తే ఎవరు పట్టించుకుంటారు, నో డౌట్, సుధీర్ మంచి పర్‌ఫార్మర్… డాన్సుల్లో తన టైమింగ్ చాలా బాగుంటుంది… కానీ హీరో కాబట్టి ఖచ్చితంగా పాటలు, ఫైట్లు, ఎలివేషన్లు ఉండాలా..? అవి చేస్తేనే ‘హీరో మెటీరియలా..? ఆ రొటీన్ ఫార్ములాకు కాలం చెల్లి చాలా రోజులైంది సుధీరా… పైగా తెలుగు సినిమా హీరో అనగానే చిన్నాచితకా నేరాలతో అల్లరిచిల్లరగా తిరిగే జులాయి కేరక్టరేనా..? ఇక తెలుగు హీరో మారడా..?

మణిశర్మ కంపోజర్ అంటే ఆశ్చర్యం వేసింది… ఈ చిన్న సినిమాకు తను బాగానే అంగీకరించాడు అని… కానీ తనూ ఎవరో అసిస్టెంటుకు అప్పగించినట్టుంది… ఏమాత్రం పస లేదు… కథ విషయానికి వస్తే కోనసీమ నేపథ్యంలో 1983 వరల్డ్ కప్ తర్వాత పెరిగిన క్రికెట్ బెట్టింగ్ మాఫియా చుట్టూ అల్లుకున్న కథ ఇది… బలమైన సామాజిక అంశాన్ని తీసుకున్నా, దాన్ని సీరియస్ డ్రామాగా మలిచే ప్రయత్నం చేయకుండా… రాజ‌న్న, శంభో శివ శంభో, ఆర్‌.ఆర్‌.ఆర్‌, ఖైదీ సినిమాల నాలుగు స్పూఫులతో కామెడీకే ప్రయారిటీ ఇచ్చి, అటూఇటూ గాకుండా చేశాడు దర్శకుడు…

పోనీ, ఆనాటి 1983- 2010 వాతావరణం ఏమైనా కనిపించిందా సినిమాలో..? అదీ లేదు..! ఒక పాట, ఆ తర్వాత కామెడీ సీన్, ఆ వెంటనే ఒక ఫైట్ అన్నట్టుగా సన్నివేశాలను పేర్చుకుంటూ వెళ్లారు తప్ప ప్రజెంటేషన్‌లో ఎక్కడా కొత్తదనం కనిపించదు… ‘జబర్దస్త్’ స్కిట్‌లను వరుసగా పేర్చినట్లు అనిపిస్తుంది…

నో డౌట్, సుధీర్ సినిమా భారాన్ని మోసే ప్రయత్నం చేశాడు, దివ్యభారతి కూడా పర్లేదు… మిగతా నటులు కూడా వోకే… చివరగా… టైటిల్ గురించి… ‘గోట్’ పేరుతో ఆ మధ్య విజయ్‌ ఓ తమిళ సినిమా చేశాడు… అలాగే ‘ది గోట్‌ లైఫ్‌’ పేరుతో పృథ్వీరాజ్‌ సుకుమారన్ మలయాళ చిత్రం చేశాడు…

సో… ఇది సుధీర్‌ బాపతు తెలుగు ‘గోట్‌’ … మూవీ ట్యాగ్‌ లైన్‌ లో ‘గ్రేటెస్ట్ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’ అని చెప్పారు కానీ సినిమాలో ‘గోదావరి అవుట్‌ డోర్‌ యాక్టివిటీస్ ట్రస్ట్’ అర్థంలో దీనిని వాడారు… అంటే ఏమిటో దర్శకుడు వేదవ్యాస్‌‌కైనా అర్థమైందా..? గోట్ అంటే మేక, అంటే బకరా… అవును, అంతిమంగా ప్రేక్షకుడు ఇక్కడ ఓ బకరా..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • G O A T … అనగా మేక, అనగా బకరా… అనగా తెలుగు ప్రేక్షకుడు..!!
  • పాపం రెహమాన్ ! కచేరీలకు ఆదరణ కరువు ! చుట్టూ బోలెడు నెగెటివిటీ !!
  • Overhauling Telangana’s Schooling: A Bold Step Toward Educational Equity
  • పాఠశాల విద్య సంస్కరణలు- బీఆర్ఎస్‌కు చేతకానిది, రేవంత్ సంకల్పించినది!
  • 3200 కోట్ల మంది హిందూ దేవతలట… మమత పార్టీ ఎంపీ పిచ్చి కూతలు!!
  • పార్టీ పేరు దగ్గర మొదలైన కసరత్తులోపం… ఆవిర్భావ ప్రసంగం దాకా..!!
  • టీవీకే ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ రహస్య భేటీలు- దేనికంటే..?
  • పక్కా అర్హుడు! ప్రణబ్ ముఖర్జీ ప్రధాని పదవి ఆశించి ఉంటే తప్పేముంది…!
  • కావ్య అనిరుధ్ పెళ్లి … కరుణానిధి – రజినీకాంత్ కుటుంబాల వియ్యం !!
  • *మైనస్ పాయింట్స్‌గా చెప్పబడుతున్నవన్నీ నిజానికి ప్లస్ పాయింట్సే*

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions