.
Pardha Saradhi Upadrasta …. షేక్ హసీనా బంగ్లాదేశ్‌కు తిరిగి రావాలి అంటే…. షరతులతో కూడిన చర్చలు జరుపుతున్న భారత్….. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తిరిగి స్వదేశానికి పంపించే విషయంలో భారత్ రెండు కీలక షరతులు పెట్టినట్లు BBC బంగ్లా కథనం వెల్లడించింది.
న్యూఢిల్లీ, ఢాకా మధ్య తెరవెనుక దౌత్య చర్చల్లో ఈ రెండు అంశాలు కీలకంగా మారినట్లు సమాచారం… షరతు 1: బంగ్లాదేశ్ సైన్యమే బాధ్యత తీసుకోవాలి!
Ads
హసీనాను భారత్ నుంచి బంగ్లాదేశ్‌కు తీసుకెళ్లే బాధ్యతను బంగ్లాదేశ్ సైన్యం స్వయంగా చేపట్టాలని భారత్ మొదటి షరతు. బంగ్లాదేశ్ సైనిక విమానాన్ని పంపించి ఆమెను తీసుకెళ్లాలి లేదా ఇరు దేశాలు అంగీకరించిన నిర్దిష్ట సరిహద్దు ప్రాంతంలో బంగ్లాదేశ్ సైనిక అధికారులు ఆమెను స్వీకరించాలి. ఆమె తిరిగి వెళ్లిన తర్వాత వ్యక్తిగత భద్రతకు కూడా బంగ్లాదేశ్ సైన్యం హామీ ఇవ్వాలి . ఆమెను అప్పగించడం మాత్రమే కాకుండా, తిరిగి వెళ్లిన తర్వాత ఆమె ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేకుండా చూడాలన్నది భారత్ ఆలోచన
షరతు 2: న్యాయపరమైన హామీలు తప్పనిసరి!
2024 జూలైలో జరిగిన నిరసనల సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలకు సంబంధించి హసీనాకు విధించిన మరణశిక్షపై అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించాలని భారత్ షరతు. ఆమెకు న్యాయపరమైన అప్పీల్ అవకాశం ఉండాలి. మరోసారి నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ జరగాలి. అంతర్జాతీయ సమాజం, ప్రపంచ మీడియా పర్యవేక్షణలో న్యాయ ప్రక్రియ కొనసాగాలని భారత్ షరతు అని BBC బంగ్లా కథనం పేర్కొంది.

భారత్ ఆందోళన ఏమిటి?
హసీనాను ఎలాంటి న్యాయపరమైన అవకాశం లేకుండా మరణశిక్షకు గురిచేసే పరిస్థితిలో ఆమెను అప్పగించలేమన్నది భారత అధికారుల అభిప్రాయం. నమ్మి వచ్చిన ఆవిడను మళ్ళి నట్టేట్లే ముంచినట్లు బంగ్లాలో వదిలేయకూడదు అనేది భారత్ అభిప్రాయం .
ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే? బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ రెండు షరతులకు అంగీకరిస్తుందా?
బంగ్లాదేశ్ సైన్యం హసీనా తిరిగి రాకకు బాధ్యత తీసుకుంటుందా?
భారత్ – బంగ్లాదేశ్ దౌత్య సంబంధాల భవిష్యత్తును ప్రభావితం చేయగల కీలక పరిణామంగా ఈ చర్చలు మారుతున్నాయి.
గమనిక: ఇవి BBC బంగ్లా కథనం ఆధారంగా వెలువడిన నివేదికలు మాత్రమే. భారత్ అధికారికంగా ఈ రెండు షరతులను ప్రకటించినట్లు నిర్ధారణ కాలేదు.
— ఉపద్రష్ట పార్ధసారధి
#India #Bangladesh #SheikhHasina #IndiaBangladeshRelations #Diplomacy #BangladeshPolitics #BBCBangla
Share this Article