.
చెరుకూరి రామోజీరావు జయంతి… నవంబరు 16… ప్రతి ఏటా దీన్ని ఆంధ్రప్రదేశ్ అధికార పండుగగా పరిగణిస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఓ అనూహ్య – అసాధారణ నిర్ణయం తీసుకున్నాడు… ఉత్తర్వులు కూడా జారీ అయిపోయాయి… ఇప్పుడు ఓ ప్రధాన ప్రశ్న తలెత్తుతోంది… రామోజీరావు తెలుగు జాతి ఏటేటా సెలబ్రేట్ చేసుకునేంత మహనీయుడా..? ఏ లక్షణాల్లో..? ప్రాతిపదికలు ఏమిటి..?
అసలు అధికారికంగా ఒక వ్యక్తి జయంతిని ప్రకటించాలంటే ఆ వ్యక్తి మహత్తును, మహనీయతను ఎవరు నిర్ధారించాలి..? ఏ కొలమానాల్లో..? అధికారంలో ఉన్నవాళ్లు అనుకుంటే సరిపోతుందా..? ఇవేమైనా జాతీయ సినిమా అవార్డులా..?
Ads
ఇదంతా ఎందుకంటే..? నో డౌట్… తనది అసాధారణ సక్సెస్ స్టోరీయే… కానీ దానికి చీకటి పార్శ్వాలూ ఉన్నయ్… అనేక వివాదాలు… ప్రత్యేకించి హిందూ యునైటెడ్ ఫ్యామిలీ పేరిట సేకరించిన వేల కోట్ల మార్గదర్శి డిపాజిట్లు… సుప్రీంకోర్టు దాకా విచారణలు… తను మరణించాడు కాబట్టి ఇక కేసు మూసివేయ బడింది గానీ తను నిర్దోషిగా ప్రకటించబడలేదు… ఈనాడు ఆఫీసుల కేసులు సరేసరి…

రామోజీ ఫిలిమ్ సిటీకి సంబంధించి భూముల యవ్వారంలోనూ బోలెడు ఆరోపణలు… మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఇష్యూల్లో ఇదే ఏపీ ప్రభుత్వం పెట్టిన కేసులు… ఏదో ముసలితనం, అనారోగ్యం పేరిట, తనతో బాగానే ఉంటున్నాడు కదానే సద్భావనతో కేసీయార్ అడ్డుపడ్డాడు గానీ లేకపోతే… జగన్ చంద్రబాబును జైలులో వేసినట్టుగానే రామోజీరావును కూడా లిఫ్ట్ చేసేవాడే… సరే, ఇప్పుడు తన ప్రభుత్వం లేదు, రేప్పొద్దున తను మళ్లీ ముఖ్యమంత్రి అయితే ‘ఈ అధికార పండుగ’ రద్దు కావడం ఖాయం…


సరే, ఈ వివాదాస్పద నేపథ్యాన్ని కాసేపు పక్కన పెడితే… తనకు భారత ప్రభుత్వం రెండో అత్యున్నత పౌరపురస్కారం పద్మవిభూషణ్ దక్కింది… అనేక రంగాల్లో విశేష కృషిని నిస్వార్థంగా ఏళ్ల తరబడీ సాగించిన చాలామందికి కూడా ఈ భాగ్యం దక్కదు… (ఏమో, చంద్రబాబు త్వరలో రామోజీరావుకు భారతరత్న ప్రకటించాలని కూడా తన కోరికను మోదీ ముందు పెడతాడేమో కూడా…)

ఇవన్నీ ఒకెత్తు… తన వ్యాపారాల్ని, ఆర్థిక సామ్రాజ్య విస్తరణను కాసేపు పక్కన పెడితే… తన ఖ్యాతి అనితర సాధ్యమైన అక్షర యజ్ఞం అని ఈనాడు భుజాలు చరుచుకుంటుంది కదా… కానీ అదెప్పుడైనా నిష్పక్షపాతంగా వ్యవహరించిందా..? మొన్నమొన్నటిదాకా కనీసం న్యూట్రల్ ముసుగైనా ఉండేది, ఇప్పుడు ‘పచ్చ రంగు కాగితాలే’ కదా… మరి నిస్వార్థ సమాజ హితం ఏమున్నట్టు..?

రామోజీరావు జయంతిని అధికార ఉత్సవంగా పరిగణించడంపై నాకేమీ అభ్యంతరం లేదు… వ్యతిరేకతా లేదు… కాకపోతే ఎవరి జయంతిని జాతి ఓ ఉత్సవంగా జరుపుకోవాలి, ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడానికి విహితమైన పద్ధతి ఏముందనేదే కీలక ప్రశ్న… అఫ్కోర్స్, చంద్రబాబు ప్రభుత్వానికి ఇలాంటి ప్రశ్నలంటే అస్సలు గిట్టవు… అది వేరే సంగతి..!!

పర్ సపోజ్, రేప్పొద్దున తెలంగాణలో గానీ, ఆంధ్రప్రదేశ్‌లో గానీ వేరే పార్టీల ప్రభుత్వాలు వచ్చి, ఎవరో వ్యక్తుల జయంతులను అధికార ఉత్సవాలుగా ప్రకటిస్తే..? ఇదెంతవరకు..? అనుసరించే మార్గం ఏమిటి..? జవాబు దొరకని ప్రశ్న ప్రస్తుతానికి..!!
- ఎవరి దాకో ఎందుకు..? చంద్రబాబు బాట చూపాడు కదా, జగన్ సీఎం గనుక అయ్యేపక్షంలో వైఎస్ జయంతిని కూడా ఇలాగే ప్రకటిస్తాడేమో, వైఎస్ జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకోవాలని మాత్రమే జగన్ 2019లో ఓ ఉత్తర్వు జారీ చేశాడు..! అది మాత్రం గుర్తుంది..!!
Share this Article