Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ ఇద్దరు నటడాక్టర్లు కలిసి ఎంత షో చేసినా… చివరకు బొమ్మ ఫ్లాపే..!!

November 26, 2026 by M S R

.

ఇద్దరు డాక్టర్లు… ఒకే స్టేజ్… కానీ బాక్సాఫీస్ వద్ద ఊహించని షాక్!
టాలీవుడ్, కోలీవుడ్ సినీ వర్గాల్లో ఒక దశలో సోషల్ మీడియా మొత్తం ఒకే చర్చతో వేడెక్కింది. “శ్రీలీల వచ్చేసింది… ఇక సాయి పల్లవి కథ క్లోజ్!” అంటూ నెటిజన్లు, సినీ విశ్లేషకులు పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు… నిజంగానే శ్రీలీల డాన్స్‌లో ఈజ్ కనిపిస్తుంది… సాయిపల్లవిని మించి…

ఇద్దరూ డాక్టర్ చదివిన వాళ్లే (సాయి పల్లవి మెడిసిన్ జార్జియాలో చదివితే, శ్రీలీల దేశీ ఎంబీబీఎస్)…  ఇద్దరూ డ్యాన్స్ ఫ్లోర్‌పై అడుగుపెడితే థియేటర్లు దద్దరిల్లిపోతాయి… ఒకవైపు సాయి పల్లవి తన సహజమైన గ్రేస్‌తో ‘రౌడీ బేబీ’గా సంచలనం సృష్టిస్తే, మరోవైపు శ్రీలీల తన మెరుపు వేగంతో యూత్‌ను ఉర్రూతలూగిస్తోంది… సాయి పల్లవి ఆచితూచి సినిమాలు చేస్తుండటం, శ్రీలీల వరుస సినిమాలతో దూసుకుపోతుండటంతో… ఇక సాయి పల్లవి స్థానాన్ని శ్రీలీల పూర్తిగా భర్తీ చేసిందని చాలామంది తీర్మానించేశారు…

Ads

సాయిపల్లవి

పోటీ కాదు… ఒకే ఫ్రేమ్‌లో అద్భుతం! బయట అభిమానులు వీరిద్దరినీ ప్రత్యర్థులుగా చూస్తున్న సమయంలో, అందరికీ దిమ్మతిరిగేలా ధనుష్ హీరోగా నటించిన ‘ఓమ్’ (OM) సినిమాలో వీరిద్దరూ కలిసి నటించడం ఒక సెన్సేషన్ అయింది… అంతేకాదు, సినిమా ప్రమోషన్లలో భాగంగా జరిగిన ఈవెంట్లో సాయి పల్లవి, శ్రీలీల ఒకే స్టేజ్‌పై కనిపించడం ఆ వేడుకకే హైలైట్‌గా నిలిచింది…

తమ మధ్య ఎలాంటి ఈగోలు, పోటీ లేవని చాటిచెబుతూ ఇద్దరూ కలిసి స్టేజ్‌పై డ్యాన్స్ చేయడంతో ఆడిటోరియం మొత్తం విజిల్స్‌తో మారుమోగిపోయింది… ఒకవైపు సాయి పల్లవి ఎనర్జీ, మరోవైపు శ్రీలీల గ్రేస్… ధనుష్ పక్కన ఈ ఇద్దరు డాక్టర్ల డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్ సాధించి, సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చాయి…

ఇంత హైప్ ఉన్నా… బాక్సాఫీస్ వద్ద నిరాశ!
ధనుష్ లాంటి స్టార్ హీరో, దానికి తోడు సాయి పల్లవి, శ్రీలీల లాంటి ఇద్దరు క్రేజీ డ్యాన్సర్లు ఒకే సినిమాలో ఉండటం, ప్రమోషన్లలో ఇద్దరూ కలిసి స్టేజ్ షేర్ చేసుకోవడంతో… థియేటర్ల వద్ద రికార్డులు బద్దలవ్వడం ఖాయమని అంతా భావించారు…

కానీ, సినిమా ప్రపంచంలో ఎప్పుడూ ఒకటే కఠినమైన నిజం పనిచేస్తుంది — ప్రమోషన్లు, స్టార్ కాస్ట్ థియేటర్‌కు జనాలను రప్పించగలవు కానీ, కథలో బలం లేకపోతే సినిమాను నిలబెట్టలేవు…

భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ఓమ్’ సినిమా, కథనం బలహీనంగా ఉండటం, ప్రేక్షకులను కట్టిపడేసే అంశాలు లోపించడంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది… ఇద్దరు టాప్ డ్యాన్సర్ల క్రేజ్ కూడా ఆ సినిమాను ఫ్లాప్ బారి నుంచి కాపాడలేకపోయింది… తుస్…

తెలుగులో ఎలాగోలా గట్టెక్కుతున్నా, తమిళంలో మాత్రం బ్రేక్ ఈవెన్‌కు నానా కష్టాలూ పడుతోంది సినిమా… సాయిపల్లవికి తన బాలీవుడ్ డెబ్యూ తరువాత ఇదొక ఫ్లాప్… శ్రీలీలకు ఎప్పటిలాగే మరో ఫ్లాప్… ధనుష్ ఫ్లాపులకు అతీతం కాబట్టి ఫరక్ పడదు…

సినిమా ఫలితం ఎలా ఉన్నా, ‘ఓమ్’ ప్రమోషన్ ఈవెంట్ మాత్రం అభిమానులకు ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది… ఒకరిని తగ్గించి మరొకరిని పెంచాలని చూసిన ప్రచారాలకు… ఇద్దరు ప్రతిభావంతులైన కళాకారులు ఒకరినొకరు గౌరవించుకుంటూ చేసిన ఆ డ్యాన్స్ ఒక గట్టి సమాధానం చెప్పింది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ ఇద్దరు నటడాక్టర్లు కలిసి ఎంత షో చేసినా… చివరకు బొమ్మ ఫ్లాపే..!!
  • తెలంగాణ కర్రసాముకు జాతీయ గుర్తింపు! ఖేలో ఇండియాలో చేర్పు!!
  • జోసెఫ్ విజయ్ తెలివైన డ్రామా- ఏకంగా సుప్రీంకోర్టుకే బురిడీ…
  • రాహుల్ చెప్పబోయే పేర్లు ఎవరివి..? గుర్తొస్తున్న చంద్రస్వామి పాత కథ !!
  • ఏకంగా అమెరికా భద్రత వ్యవస్థల్లోకే జొరబాటు..! ఏదో పెద్ద మిస్టరీ !!
  • విజయ్- త్రిష బంధం ఓకే… మరి మధ్యలోకి ఉదయనిధి ఎందుకొచ్చాడు?!
  • చిరంజీవికి ఎవరూ చెప్పినట్టు లేదు- ఆ ‘వర్స్’ అనే పదమే అశుభసంకేతం!!
  • కార్తీకదీపం కంట్రవర్సీ! ప్రభుత్వాన్ని కూల్చేస్తారా? ఆర్టికల్ 356 ఆషామాషీ కాదు!!
  • Suicidal – ఉక్రెయిన్ యుద్ధం.. రష్యాకు కనిపించని మహా విపత్తు!
  • ఎవరు ఈ మూర్తి..? ఏమిటి ఈ వెలి..? ఇదేం జర్నలిజం..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions