Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓ రాత్రి- ముసురు, చీకటి, చలి – ఓ బస్టాపులో ఆ ముగ్గురు… తరువాత?

November 27, 2026 by M S R

.

200 మంది బలంగా పోటీపడిన ఓ ఇంటర్వ్యూ… అందులో నైతికతను, స్పాంటేనిటీని, తెలివిని కూడా పరీక్షించే ఒక ప్రశ్న…

ఓ రాత్రి పూట… పొద్దుబోయింది… బలమైన ఈదురు గాలులు, ముసురు… ఉధృతంగా చలి… వాతావరణం ఇంకా క్లిష్టంగా మారుతోంది… వీథులన్నీ నిర్మానుష్యం… నువ్వు కారులో ఒక్కడివే వెళ్తున్నావు… నీతోపాటు ఒక్కరికి మాత్రం లిఫ్ట్ ఇవ్వగలవు…

Ads

ఓ బస్‌స్టాపులో ముగ్గురు వ్యక్తుల్ని చూశావు… ఒకరు ముసలామె… వణికిపోతోంది… ఆమెను సత్వరం ఇంటికి గానీ, హాస్పిటల్‌కు గానీ చేర్చకపోతే ఆమె పరిస్థితి ఏమిటో చెప్పలేం…

రెండో వ్యక్తి ఒకప్పుడు నిన్ను ప్రాణాపాయం నుంచి రక్షించాడు… తనకు ఎప్పుడూ ఆచరణలో థాంక్స్ చెప్పే అవకాశం రాలేదు… మూడో వ్యక్తి నువ్వు ఎన్నాళ్లుగానో కలలు కనే సౌందర్యరాశి… పక్కన నిలబడి, మాట్లాడితేనే పరవశించిపోతావు…

ఆ ముగ్గురిలో ఎవరికి లిఫ్ట్ ఇస్తావు..? గుర్తుంచుకో, ఒక్కరికి మాత్రమే లిఫ్ట్ ఇవ్వగలవు… రెండు సీట్ల నిండా వదిలేసే వీలు లేని లగేజీ… సో, ఇదీ ప్రశ్న…

ప్రాణాపాయంలో ఉన్న ముసలామెను వదిలేయడం నైతికత కాదు… మానవీయత కాదు… ప్రాణాపాయం నుంచి తనను గతంలో రక్షించిన ఆ స్నేహితుడినీ వదిలేసి పోలేడు… తన కలల సుందరిని ఆ క్లిష్ట వాతావరణం నుంచి రక్షించాలని గుండె కొట్టుకుంటోంది… ఏం చేయాలి..?
.
.
.
.
ఒక యువకుడు భలే సమాధానం చెప్పాడు… ‘‘నా ఫ్రెండ్‌కు కారు తాళాలు ఇచ్చేస్తా, ఆ ముసలామెను ఆమె ఇంట్లో గానీ, హాస్పిటల్‌లో గానీ చేర్చి, నీ ఇంటికి వెళ్లిపో అంటాను… కారు తరువాత పికప్ చేసుకుంటానని చెబుతా… నేను కారు దిగి, నా కలలరాణి పక్కనే కూర్చుని, తరువాత వచ్చే బస్సు కోసం ఎదురుచూస్తూ, ఆమెతో మాటకలుపుతా… ఏది జరిగితే అది జరగనీ…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఓ రాత్రి- ముసురు, చీకటి, చలి – ఓ బస్టాపులో ఆ ముగ్గురు… తరువాత?
  • వేణుస్వామీ, అంబానీ వచ్చేస్తున్నాడు ! ఆయన దేన్నీ వదలడు..!!
  • ఖేలో ఇండియా- ఖేలో తెలంగాణ … రాష్ట్రవ్యాప్తంగా 20 పోటీ వేదికలు
  • కేసీయార్ పాట మారింది- ట్యూన్ మారింది…. ఇప్పుడిక ‘హంగ్ రాగం !!
  • దేవుడా- ఓ మంచి దేవుడా… మాకెందుకయ్యా ఈ ఇండిగోను ఇచ్చావ్
  • మూడుసార్లు దెయ్యాన్ని చూశా! నరక ద్వారాలూ కనిపించాయి !!
  • పెద్ద నంబర్ గేమ్ మళ్లీ ! ఈసారి సినిమాలో చాలా ట్విస్టులు!!
  • అసలు అదొక పరమ భూస్వామ్య దుర్మార్గపు అణచివేత ప్రతిపాదిత చిత్రం
  • గుప్త దానం ‘బహిరంగ’ ప్రచారమైందెలా? ఫోటోలు, వీడియోల వెనుక అసలు కథ!
  • ఇక ఇండియాపై చైనా- పాక్ జాయింట్ ఉపగ్రహ నిఘా!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions