Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రాజకీయం వీథి నాటకమైతే…. కనిపించేవి ‘బావర్చి బిర్యానీ’ సీన్లే !!

November 29, 2026 by M S R

.

బావర్చిలో రాహుల్ గాంధీలో నిరుద్యోగులతో కలిసి బిర్యానీ తిన్నాడు… తప్పేముంది..? తను రాజకీయ నాయకుడు… ఆందోళనలో ఉన్న ఒక సెక్షన్‌లో ఉద్యోగాలపై తమ పార్టీ తరఫున ధీమా ఇచ్చే ఓ పొలిటికల్ పాజిటివ్ ప్రోగ్రాం అది… ప్రస్తుతం జాతీయ స్థాయిలో తను కాంగ్రెస్‌ను లీడ్ చేస్తున్నాడు… కానీ బీఆర్ఎస్ ఏం చేస్తోంది..?

ఓ వీథి నాటకంతో తనను కించపరచాలని అనుకుంది… మొత్తం మీడియాను ఆహ్వానించి, అదే బావర్చిలో రాహుల్ బొమ్మకు బిర్యానీ తినిపించే ప్రోగ్రాం పెట్టుకుంది… ఆహా, మాంచి క్రియేటివ్ నిరసన అని తనకుతానే భుజాలు చరుచుకుంది… కానీ అది ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ వాళ్లను రెచ్చగొట్టడం… కావాలని ఆవేశాల్ని పెంచి, మరింత ప్రచారం పొందే ఎత్తుగడ…

Ads

ప్రచారం కోసం జరిగే ఈ ప్రయాసల్లో… నాటకాల్లో అసలు ఇష్యూ ఎక్కడికో కొట్టుకుపోయి, కేవలం కొందరు పార్టీ వ్యక్తులు ప్రచారం పొందుతారు… అదే జరిగింది… తమ నాయకుడిని వ్యక్తిగతంగా కించపరచడం నచ్చని కొందరు కాంగ్రెస్ వ్యక్తులు ఆ ప్రోగ్రాంలోకి జొరబడి, తమ నిరసనను వ్యక్తం చేశారు… ఇరు వర్గాల ఘర్షణ… ఇక్కడ ఎవరిది తప్పు..? ముందు నాటకం మొదలుపెట్టిన వాళ్లదే కదా…

ktr

ప్రజాస్వామిక వాతావరణంలో తీవ్రంగా విభేదించుకోవచ్చు, విమర్శలు తప్పు కాదు, కానీ నాయకుల్ని వ్యక్తిగతంగా కించపరిచే వీథి నాటకాల స్థాయికి ఈ ప్రచార పోకడలు దిగజారితే… కేడర్‌లో ఆవేశకావేషాల్ని పెంచే ప్రయత్నాలు జరిగితే… బావర్చి వంటి సీన్లే కనిపిస్తాయి… రాజకీయ ప్రత్యర్థుల పట్ల గౌరవమే నాగరిక రాజకీయాలకు కనీస పునాది…

నిజానికి బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం ఆది నుంచీ ఓ అరాచకమే… అనేకానేక సైట్లు, చానెళ్లను కొనేసి, ఎవరెవరితోనో రేవంత్ రెడ్డిని, ఇతర ప్రత్యర్థులను వ్యక్తిగతంగా బూతులు తిట్టించి, దాన్నే జర్నలిజంగా ముద్రవేసి, జనంలోకి వదిలి… రాజకీయాల్ని పాతాళానికి దిగజార్చిన తీరు చూస్తూనే ఉన్నాం కదా… ఇదుగో ఈ బావర్చి వంటి ప్రోగ్రాంలతో దాన్ని మరింత లోతుకు తీసుకుపోవడం…

వాళ్ల అధినేత అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాలు రోజుకొకటి బయటపడుతుంటే… మొహం చెల్లక, జనంలోకి రాలేక, ఫామ్ హౌజులో పడుకున్నాడు… వారసురాల్ని పార్టీ నుంచి, కుటుంబం నుంచి తరిమేసి, వారసుడికి పగ్గాలు అప్పగించేశాడు… పరిణతి లేని ఇలాంటి ‘సోషల్ రాజకీయాలు’ అలవాటైన కేటీయార్ గ్రూపు తనను ఓ అపరిపక్వ నాయకుడిగా ఉంచేస్తున్నాయి తప్ప ‘ట్రూ లీడర్’‌గా పెంచలేకపోతోంది…

ఆమధ్య చూశాం కదా… అసెంబ్లీ ముందు కేటీయార్, హరీశ్‌రావు తదితరులు కావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి, పోలీసులు తమపై దాడిచేస్తున్నారనే ఓ సీన్ క్రియేట్ చేసి, దాన్ని ప్రచారం కోసం వాడుకోవడం… విజ్ఞత లేని వీథి రాజకీయం…

తమ పదేళ్ల అక్రమాల పాలనను జనం తిరస్కరించారనీ, కేసీయార్‌ను దిగిపొమ్మని, రేవంత్ రెడ్డికి పట్టం గట్టారనీ, కొంతకాలం వేచిచూడాలనీ లేదు… ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచే పింక్ మీడియా, సోషల్ మీడియా వ్యక్తిగత దాడి మొదలుపెట్టింది…

ప్రభుత్వ విధానాలపై చర్చిస్తే తప్పులేదు… ఆధారాలు దొరికితే విమర్శలు చేస్తే తప్పులేదు… విధానాల్లో లోపాలను ఎండగడితే తప్పులేదు… పరిపక్వ, హుందా రాజకీయంతో జనంలో చర్చలు పెడితే తప్పులేదు… కానీ రాజకీయాల్ని ప్రచారం కోసం సాగే వీథి నాటకాలుగా మారిస్తే… నాయకుల్ని వ్యక్తిగతంగా కించపరిచే పోకడల్లో సాగితే… అది ఏ వైపు నుంచి జరిగినా తప్పే..!!

జనం బీఆర్ఎస్‌కు ప్రతిపక్ష బాధ్యతను ఇచ్చారు… శాసనసభలో కూర్చుని చర్చించమన్నారు… కానీ వీథుల్లో ప్రచార విహారం చేయమని చెప్పలేదు… ఈ వివేచన లేకపోతే ఎలా..?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రాజకీయం వీథి నాటకమైతే…. కనిపించేవి ‘బావర్చి బిర్యానీ’ సీన్లే !!
  • హోప్‌లెస్ సీఎం విజయ్… హీరో గారి జ్ఞానశూన్యతపై ఇదీ చార్జ్‌షీట్…
  • దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలకు కేంద్రం పరిష్కారం చూపిందా?
  • ఉప్పూనిప్పూ కలయిక! హరీశ్ తదుపరి అడుగులపై మళ్లీ చర్చ!!
  • మధురై కార్తీకదీపం… ఇద్దరే ఇద్దరు… ఆరిపోకుండా చూశారు…
  • నేలపై మెతుకులు ఏరుకున్న ‘పెళ్లి భోజనం’! దిక్కుమాలిన పెళ్లి జాతర!!
  • పాకిస్థాన్ ఎడారుల్లో తెలుగు బంధువులు!
  • నెట్‌ఫ్లిక్స్ పాకిస్థానీ కంటెంట్ వివాదం! కేంద్రం ఊరుకోవాలా..?!
  • యూపీ సభా? బహిరంగసభా? డీలిమిటేషన్‌ పర్వంలో ఓ ఉపకథ!!
  • ఇండస్ట్రియల్ పాలసీ 2.0 … గ్లోబల్ సమ్మిట్ వేదికగా 11 కొత్త పాలసీలు!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions