.
పాపం సోనియా గాంధీ… పదేళ్లు పరోక్షంగా దేశాన్ని పాలించి… ఓ విదేశీయురాలు ఐఉండీ, దశాబ్దాలుగా జాతీయ రాజకీయాల్లో నిర్ణాయక శక్తిగా ఉన్న ఆమె ఇప్పుడు తప్పనిసరై పాపం… ఒక శరద్ పవార్ దగ్గరకు, ఒక స్టాలిన్ దగ్గరకు స్వయంగా వెళ్లి బతిమిలాడే దురవస్థ… అంతా రాహుల్ ఖర్మ, ఖర్గే సారథ్యం…
ఎన్సీసీ పవార్‌ను వదిలేయండి, పెద్ద సంఖ్యాబలం లేదు, జానేదేవ్, ఆయనేదో బిడ్డి వారసత్వం గురించిన ఆందోళనలో జయహో అమిత్ షా అని కీర్తిస్తున్నాడు… మరి స్టాలిన్..? యూపీఏకు కొన్నేళ్లుగా బలమైన మద్దతుదారు… కూటమిలోకి ఎవడొచ్చినా, ఎవడు పోయినా తను స్థిరంగా ఉన్నాడు… కానీ..?
Ads
తమిళనాడులో టీవీకే విజయ్‌కు ఎప్పుడైతే కాంగ్రెస్ అనాలోచితంగా మద్దతు ప్రకటించిందో… అది వేణుగోపాలా, అది ఖర్గేయా, అది మరెవరైనా సరే… జాతీయ రాజకీయాల కోణంలో పక్కా అనాలోచితం… నాయకత్వ లక్షణాలు ఏమాత్రం చూపించలేని రాహుల్ గాంధీ వైఫల్యం…
కరుణానిధి శిక్షణలో రాటుదేలిన స్టాలిన్ ఊరుకుంటాడా..? భగ్గుమన్నాడు… సందర్భం వచ్చింది… డీలిమిటేషన్ బిల్లుకు ఎన్డీయేకు మద్దతు అన్నాడు… అసలే అజ్ఞానపు పాలనతో భ్రష్టుపట్టిపోతున్న విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం వల్ల దానికి వచ్చేదేమీ లేదు… కానీ మూర్ఖపు నిర్ణయం… డీఎంకేను వదిలేయడం…

డీలిమిటేషన్ బిల్లు సమయానికి… గతంలో బీజేపీని వ్యతిరేకించిన డీఎంకే ఇప్పుడు అమిత్ షాకు జై అంటోంది… మిత్రధర్మాన్ని కాలరాచిన కాంగ్రెస్‌కు మద్దతు దేనికి అనే ఆత్మవిమర్శలో పడింది… డీలిమిటేషన్ బిల్లు పాసయితే కాంగ్రెస్‌కు ఓరకంగా మరణశాసనం… దాంతో సోనియా రంగంలోకి దిగింది తప్పనిసరై…
ప్లీజ్, ప్లీజ్… పవార్ భాయ్ ప్లీజ్, స్టాలిన్ భాయ్ ప్లీజ్ అంటోంది సోనియా… నేరుగా చెన్నై వెళ్తోంది… స్టాలిన్ తన తల్లి హాస్పిటల్‌లో ఉంటే అక్కడ ఉన్నాడు… సర్లే, 4 గంటలకు కలుద్దాం అన్నాడు… ఇక్కడ రెండు ఈక్వేషన్లు…
1. తను డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఉపసంహరిస్తే… కాంగ్రెస్ విజయ్ అనే ఓ అసమర్థ ముఖ్యమంత్రిని వదులుకోవాలి… ఇంట్రస్టింగు ఈక్వేషన్స్… చేయగలదా కాంగ్రెస్.,. చూడాలి…
2. లేదు, నేను అమిత్ షాకు మాటిచ్చాను అని స్టాలిన్ చెబితే… అసలు ఇండి కూటమే ఉండదు ఇక… మమత ప్రస్తుతం జీరో… స్టాలిన్ వదిలేస్తే… ఇక కాంగ్రెస్ కూటమి పని మటాష్…
ఏదో, కార్తీకదీపం శాపం విజయ్‌ను తగులుతున్నట్టే ఉంది… కానీ ఇక్కడ ఓ ముఖ్య విషయం… కర్నాటక సీఎం డీకే విజయకుమార్ గానీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గానీ ఈ విషయంలో చేయగలిగిందేమీ లేదు… ఎందుకంటే..?
విజయ్ జగన్ మనిషి… రేవంత్‌కైనా, డీకేకైనా తనతో పెద్ద ఆబ్లిగేషన్లు, రిలేషన్లు లేవు… విజయ్‌కు సరైన రాజకీయ మార్గదర్శకులు కూడా ఎవడూ లేడు… చేతులు, మూతులు కాలాక ఏం చేసినా వేస్టే..! అసలే స్టాలిన్, తన రాజకీయ అనుభవాన్ని మొత్తం ప్రదర్శిస్తున్నాడు… ఇప్పుడిక చూడాలి… అమిత్ షా చాణక్యమా..? సోనియా తప్పనిసరి సంప్రదింపులా..? ఈ సమీకరణంపైనే డీలిమిటేషన్ భవిష్యత్తు..!!
Share this Article