Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కాదంటే కొంప మేడిగడ్డ బరాజే… అందుకే డీలిమిటేషన్‌కు సై… జై…

November 29, 2026 by M S R

.

జగన్ తన మీద  ఉన్న అక్రమాస్తుల కేసుల భయంతో డీలిమిటేషన్ సహా ఏ బిల్లు ప్రవేశపెట్టినా ఎన్డీయేకు జై అంటాడు… పైకి ఏం చెప్పినా సరే, అమిత్ షా ఎదుట మోకరిల్లడం… తన ప్రబల ప్రత్యర్థి చంద్రబాబు, పవన్ కల్యాణ్ బాటలోనే తను… కాకపోతే వాళ్లు అధికార కూటమిలో భాగస్వాములు…

మరి కేసీయార్ పార్టీ అనగా బీఆర్ఎస్, ఒకానొక కాలంలో టీఆర్ఎస్ ఎందుకు సాగిలబడుతోంది అమిత్ షా రాజకీయం ఎదుట..? ఇది పెద్ద ప్రశ్న కదా… ఈ పార్టీకి లోకసభలో ఎవరూ లేరు… జనం ఛీత్కరించడంతో ఒక్క సీటూ రాలేదు… రాజ్యసభలో అప్పట్లో తెలుచుకున్న 3 సీట్లు ఉన్నాయి… మేం డీలిమిటేషన్‌కు సై అంటున్నాడు కేసీయార్… ఎందుకు..?

Ads

ఒక డీఎంకే ఎన్డీయే వైపు మొగ్గుతోంది అంటే ఓ కారణం ఉంది… కాంగ్రెస్ పార్టీ తన దోస్తీని బంగాళాఖాతంలో తొక్కేసి, టీవీకే విజయ్ పక్కన చేరింది కాబట్టి…. కాంగ్రెస్ స్నేహం ఎంత అవిశ్వసనీయమో తెలిసొచ్చింది కాబట్టి, ఇండి కూటమిని అర్జెంటుగా వదిలిపెట్టేసి, అమిత్ షా మాటలకు సై అనేసింది… ఓ బలమైన కారణముంది తనకు…

ఒక శరద్ పవార్ సై అన్నాడంటే… ఇక తను పోయేలోపు, తన కూతురు సుప్రియా సూలేకు పగ్గాలు అప్పగించి, చీలిపోయిన సొంత పార్టీ చీలికలను ఒక్కటి చేసి, కనీసం మహారాష్ట్రలో తన పార్టీ ఉనికిని కాపాడుకునే ఆలోచన ఉంది తనకు…

ఒక జేడీఎస్ సై అంటున్నదంటే… కాంగ్రెస్‌ను తట్టుకుని, తన ఉనికిని నిలబెట్టుకుని, బీజేపీతో కలిసి కర్నాటకలో కాస్త రాజకీయ పలుకుబడిని, ఫాయిదాను పొందాలనే స్వార్థం ఉంది తనకు… ఇలా దేశవ్యాప్తంగా ప్రతి పార్టీకి ఒక్కో రాజకీయ కారణం ఉంది… ఈక్వేషన్లున్నాయి… మరి బీఆర్ఎస్‌కు ఏముంది.,.?

తెల్లారిలేస్తే తన మైకు నమస్తే తెలంగాణలో… బీఆర్ఎస్‌కు 100 శాతం లోకసభ సీట్లు, కేంద్రంలో సంకీర్ణం వస్తే, ఇక కేసీయార్ ఫామ్ హౌజు బందిఖానా విడిచి, ఢిల్లీలో చక్రం తిప్పాలనే ఓ వింత జాతీయ విధానం వల్లెవేస్తోంది… నథింగ్ డూయింగ్, బీజేపీతో కలిసేది లేదంటూ పాడుతుంది ఓ పాట… కానీ..?

ktr delimitation

డీలిమిటేషన్‌కు సై అంటోంది… ఉన్న మూడు రాజ్యసభ ఓట్లు అమిత్ షా చెప్పినట్టే అని ప్రకటిస్తోంది… కారణం..? రెండు ప్రధాన కోణాలు…

1. జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఓ విలువ లేదు, వీళ్లనెవరూ మద్దతు అడిగేవాళ్లు లేరు… ఎటో ఒకవైపు ఉండకుండా, తటస్థంగా ఉండలేదు… ఉన్నా ఎవరూ పట్టించుకోరు… పేరుకు సౌత్ ప్రాతినిధ్యం అంటూ ఏవేవో కుంటి సాకులు చెప్పినా సరే… భవిష్యత్తులో బీజేపీతో కలిసి ప్రయాణించాలనే ప్రయత్నాలు, అవసరమైతే బీజేపీలో  పార్టీని నిమజ్జనం చేసేందుకు రెడీ కాబట్టి… ఆ ప్రయత్నాలు దెబ్బతినొద్దు కాబట్టి డీలిమిటేషన్‌కు సై అనే పాట…

2. భయం… ఇదే ప్రధాన కారణం… మెడపై ఆల్రెడీ కాళేశ్వరం సీబీఐ కత్తి వేలాడుతూనే ఉంది… విద్యుత్తు అక్రమాల కత్తి రెడీగా ఉంది… ఫార్ములా వన్ కత్తి వారసుడి మెడపై ఉంది… రేపోమాపో ఫోన్ ట్యాపింగ్ కత్తులూ మెడలపై వేలాడబోతున్నాయి… అలా బోలెడు… ఇప్పటిదాకా జగన్‌పై కరుణ చూపిస్తున్నట్టే కేటీయార్- కేసీయార్ మీద కూడా చూపిస్తున్నాడు అమిత్ షా…

పుసుక్కున అమిత్ షాకు కోపమొస్తే కొంప మేడిగడ్డ బరాజ్ అయ్యే డేంజరుంది… అందుకని అన్నీ మూసుకుని డీలిమిటేషన్‌కు సై, జై అనడమే… పెద్ద పెద్ద విశ్లేషణలు అక్కర్లేదు… అసలు కారణం… భయం, భయం, భయం…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కాదంటే కొంప మేడిగడ్డ బరాజే… అందుకే డీలిమిటేషన్‌కు సై… జై…
  • పాపం సోనియా..! చివరకు స్టాలిన్ దయ కోసం వెంపర్లాట..!!
  • జాతీయ వేదికపై సాఫ్ట్‌బాల్‌… తెలంగాణ బాలికలకు భలే చాన్స్…
  • డేటా సెంటర్లలో దేశంలోనే రెండో స్థానం… కొత్త జీసీసీల్లో హైదరాబాద్ అగ్రస్థానం…
  • వాయుసేన విన్యాసాలు … ఫ్యూచర్ సిటీలో భారీ రక్షా ఎక్స్‌పో…
  • లోకేష్ & పవన్.., అన్నమయ్యను తెలుగు ప్రతీకగా ప్రకటించండి…
  • ఓ క్షుద్ర మోసం ! బిడ్డ మనసు మార్చడానికి ‘క్షుద్ర పూజలు’..!
  • కత్తులు లేవు… రక్తపాతం లేదు… అయినా గుండెను తాకే ‘ఓ అమ్మ కథ..!
  • డీలిమిటేషన్‌తో మారిపోనున్న తెలంగాణ రాజకీయ ముఖచిత్రం!!
  • ఓహో… జగన్ యలహంక ప్యాలెస్ అసలు లీగల్ కథ ఇదన్నమాట!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions