Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

’’బాబూ పేపర్ పారేసి వెళ్లకు… రోజూ నా చేతికే పేపర్ ఇవ్వు ప్లీజ్…’’

March 6, 2025 by M S R

.

ఒక వాట్సాప్ పోస్టు కనెక్ట్ అయ్యేలా ఉంది… రెక్కలొచ్చిన పిల్లలు ఎక్కడో ఎగిరిపోయారు… ఒంటరిగా ఇక్కడే మిగిలిపోయే తల్లి పక్షో, తండ్రి పక్షో… ఏ రాత్రికి ఏ అవసరం వస్తుందో తెలియదు…

ఒకవేళ ఏ రాత్రిపూటో ఏ స్ట్రోకో వస్తే..? తెల్లవారి కాదు, ఆ మరుసటి రోజు కాదు… చుట్టుపక్కల వాళ్లు ఎవరైనా వాసన వస్తే పోలీసులకు చెబితే గానీ… ఆ తలుపులు తెరుచుకోవు, ఆ దేహం ఏ స్థితిలో ఉందో తెలియదు… జపాన్‌లో ఇలాంటి అనామక మరణాలు బోలెడు చదివాం కదా…

Ads

రాను రాను మన సమాజానికీ ఈ దురవస్థ తప్పదు… అనివార్యం ఐనా సరే… అందుకే ఈ పోస్టు బాగున్నట్టనిపించింది… చదివి నవ్వుతారో, ఆలోచనలో పడతారో, ఆందోళన చెందుతారో మీ ఇష్టం.. ఆ పోస్టు ఇదుగో…



‘‘నేను వార్తాపత్రికను డెలివరీ చేస్తున్న ఇళ్లలో ఒక ఇంటి మెయిల్‌బాక్స్ తాళం వేసి ఉంది, అందువలన నేను వారి తలుపు తట్టాను…

మిస్టర్ ప్రసాద్ రావు.., అస్థిరమైన అడుగులతో నడుస్తున్న వృద్ధుడు, నెమ్మదిగా తలుపు తెరిచాడు… నేను అడిగాను, “సార్, మీ మెయిల్ బాక్స్ ఎంట్రన్స్ ఎందుకు బ్లాక్ చేయబడింది?”

ఉద్దేశపూర్వకంగానే బ్లాక్ చేశాను ’ అని బదులిచ్చారు.

ప్రసాదరావు చిరునవ్వుతో ఇలా చెప్పారు , “మీరు ప్రతిరోజూ వార్తాపత్రికను నాకు చేతికి అందించాలని నేను కోరుకుంటున్నాను … దయచేసి తలుపు తట్టండి లేదా బెల్ కొట్టి నాకు స్వయంగా ఇవ్వండి.”

నేను అయోమయంలో పడ్డాను, అలాగే అన్నాను, కానీ అది ఇద్దరికీ అసౌకర్యం మరియు సమయం వృధాగా అనిపిస్తుంది” అని జవాబిచ్చాను.

“అదేమీ ఫర్వాలేదు… ప్రతి నెలా మీకు రూ. 500/- అదనంగా ఇస్తాను” అన్నారు .

“మీరు తలుపు తడితే నేను తలుపు తీయలేని పరిస్థితిలో ఉండే రోజు ఎప్పుడైనా వస్తే, దయచేసి పోలీసులను పిలవండి!”

నేను షాక్ అయ్యి “ఎందుకు?” అని అడిగాను.

“నా భార్య చనిపోయింది, నా కొడుకు విదేశాల్లో భార్యా పిల్లలతో స్థిరపడ్డాడు. మా కన్నా మా పిల్లలు పైకి ఎదగాలని కష్టపడి పైచదువులు విదేశాల్లో చదివవించాము.

ప్రస్తుతం నేను ఇక్కడ ఒంటరిగా జీవిస్తున్నాను, నాకు ఏ సమయం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికి తెలుసు?”… ఆలా చెబుతున్నపుడు నేను చెమర్చిన ఆ వృద్దుడి కళ్ళు చూశాను.

ఆయన ఇంకా ఇలా అన్నారు , “నేను వార్తాపత్రికను చదవలేను… నాకు చూపు మందగించింది …. తలుపు చప్పుడు లేదా డోర్‌బెల్ మోగిన శబ్దం వినడానికి నేను ఎదురు చూస్తూ ఉంటాను … తెలిసిన వ్యక్తిని చూడటానికి మరియు కొన్ని మాటలు వారి నోటి వెంట విని ఆ రోజు గడపడాని ప్రయత్నం చేస్తూ ఉంటాను !”

అతను చేతులు జోడించి, “చిన్నా , దయచేసి నాకు ఒక చిన్న సహాయం చేయి ! ఇదిగో నా కొడుకు ఓవర్సీస్ ఫోన్ నంబర్… ఒకరోజు మీరు తలుపు తట్టినపుడు, నా నుండి ఎటువంటి సమాధానం రాకపోతే , దయచేసి నా కొడుకుకు ఫోన్ చేసి విషయం తెలియజేయండి…” అన్నాడు.

ఇది చదివిన తరువాత నాకు నా కర్తవ్యం అర్ధం అయ్యింది , మా స్నేహితుల సర్కిల్‌లో కూడా చాలా మంది ఇళ్లలో ఒంటరిగా ఉన్న వృద్ధులు ఉన్నారు …

వృద్ధాప్యంలో ఉన్న వారు ప్రతి రోజు గుడ్ మార్నింగ్ మెసేజెస్ , వాట్సాప్‌లో ఎందుకు పంపుతారని మీరు ఆశ్చర్యపోవచ్చు/ విసుగు చెందవచ్చు. ఈ ముసోలోళ్ళకి పనీ పాటా ఏమి లేదు, ఉదయం 4 గంటల నుండే గుడ్ మార్నింగ్ మెస్సేజ్‌లు పెడతారు అనుకుంటూ ఉంటాము.

వాస్తవానికి, ఈ ఉదయం మరియు సాయంత్రం శుభాకాంక్షల యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ….. ఇది భూమి మీద తమ ఉనికిని తెలియజేసే నిశ్శబ్ద సందేశం… ఈ రోజుకి మేము ఇంకా బతికే ఉన్నాము అని తెలియజేసే చేదు నిజం…. దయచేసి పెద్ద వాళ్ల గుడ్ మార్నింగ్ మెస్సేజ్‌లను ఇబ్బందిగా తీసుకోవద్దు. మనం కూడా అదే స్థితికి ఏదో ఒక రోజు వస్తాము… ఎవరైనా ఒంటరి వృద్ధులు కనిపిస్తే పలకరించండి, యోగక్షేమం కనుక్కొండి, అదీ సమాజం బాధ్యతే….



 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions