Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

45 ఏళ్లనాటి ఈ సినిమాలో ‘సంధ్య థియేటర్ తొక్కిసలాట’ సీన్…!!

January 16, 2025 by M S R

.

Subramanyam Dogiparthi …… సినిమా వాళ్ళందరూ తాగుబోతులు , తిరుగుబోతులు కాదు అనే సందేశాన్ని జనానికి చెప్పాలనుకుని తీసిన సినిమా ఇది… సందేశాన్ని ఇవ్వాలని కాదు ; చెప్పాలని …

ఏది ఏమయినా దాసరి ఒక సినిమా మేన్యుఫేక్చరర్ . ఒక రోజులో కధను ఫైనలైజ్ చేయగలడు . డైలాగుల్ని ఎలాగూ ఆయన సెట్ల మీద వ్రాసేదే . ఇంక ఆయనకు టైం కావలసింది ప్రొడక్షన్ ప్లానింగుకు , ప్రొడక్షనుకు , పాటలు వ్రాయటానికి , వగైరా . ఈ సినిమాలో పాటల్ని కూడా ఆయనే వ్రాసుకున్నారు .

Ads

1981 లో వచ్చిన ఈ అద్దాలమేడ సినిమా ఓ పిక్నిక్కులాగా తీసి ఉండాలి . ఆల్మోస్ట్ సినిమా అంతా ఔట్ డోరే . ఔట్ డోర్ షూటింగుకు ఒక పల్లెటూరుకు వెళతారు . ఆ పల్లెలో ఓ అమ్మాయిని అప్పటికప్పుడు సినిమాలోకి తీసుకుంటారు . ఒక రాత్రి ఆమె మానభంగానికి గురవుతుంది .

ఆ పాపం చేసింది ఎవరో తెలియదు . సినిమా వాళ్ళల్లో ఎవరో ఒకరు అయి ఉంటారని ఊళ్ళో అందరూ సినిమా వాళ్ళ మీద ఎగబడి , నీరు, కరెంటు, ఆహారం బంద్ చేస్తారు . అందువలన యూనిట్లో ఒక కుర్రాడు చనిపోతాడు కూడా . యూనిట్లోని హీరోయిన్ని బందీని చేసి బలాత్కారం చేయబోతారు .

ఆ హీరోయిన్ మానాన్ని కాపాడటానికి తానే ఆ ఊరమ్మాయిని మానభంగం చేసానని దర్శకుడు దాసరి నెపం తన మీద వేసుకుంటాడు . అతన్ని సున్నంబొట్లు పెట్టి ఊళ్ళో ఊరేగించి కట్టేస్తారు . ఆ సమయంలో అసలు నేరస్థుడిని కనుక్కున్న ఆ ఊరమ్మాయి వాడిని చంపేస్తుంది . తప్పు చేసింది సినిమా వాళ్ళల్లో ఒకరు కాదు ; ఊళ్ళో వాడే అని బయటపడటంతో సినిమా వాళ్ళు ఊపిరి పీల్చుకుంటారు .

సినిమాల్లో సినిమా షూటింగులు , సినిమా వాళ్ళ గురించి తెలుసుకోవడం ప్రేక్షకులకు సరదాగా ఆసక్తిగా ఉంటుంది . అది దేవత కావచ్చు , శివరంజని కావచ్చు , మరొకటి కావచ్చు . ఈ సినిమాలో జయప్రద , శ్రీదేవి , గుమ్మడి అలాగే తళుక్కుమంటారు .

జయసుధ కూడా దాసరి ప్రేయసిగా , అతన్ని ప్రోత్సహించే మహిళగా నటిస్తుంది . మొన్న హైదరాబాదులో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో ఎలా అయితే రేవతి అనే స్త్రీ చనిపోయిందో , అలాగే ఈ సినిమాలో ఓ థియేటర్ వద్ద తొక్కిసలాటలో జయసుధ పాత్ర చనిపోతుంది .

కధ , స్క్రీన్ ప్లే , డైలాగులు , దర్శకత్వం , ప్రధాన పాత్ర అన్నీ మేన్యుఫేక్చరరే . మురళీమోహన్ , గీత , మోహన్ బాబు , అంబిక , ప్రభాకరరెడ్డి , గోకిన రామారావు , ఎర్ర నారాయణమూర్తి , నిర్మలమ్మ , సంగీత , ఇంకా చాలామంది నటించారు .

ఆస్థాన సంగీత దర్శకులు కాకుండా రాజన్ నాగేంద్ర ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు . ఒక్క నోరు మంచిదయితే ఊరు మంచిది పాటను మాత్రం రాజశ్రీ వ్రాసారు . మిగిలిన పాటలను అన్నీ మేన్యుఫేక్చరరే వ్రాసుకున్నారు .

తొలి చూపు ఒక పరిచయం , నా జీవిత గమనంలో ఒక నాయిక పుట్టింది , ఎదురు చూస్తున్నాను , తారలన్నీ మల్లెలయితే ఆ మల్లెలేమో సొంతమయితే మిగిలిన పాటలు . థియేటర్లో శ్రావ్యంగానే ఉన్నాయి .

తక్కువ బడ్జెటుతో తీయబడిన ఈ సినిమా బాగానే ఆడింది . బాక్సులు పగలకపోయినా , మరీ వెంటనే తిరిగి రాలేదు . సినిమా యూట్యూబులో ఉంది . దాసరి మార్క్ సినిమాల అభిమానులు ట్రై చేయవచ్చు . సినిమా మొదటి అరగంట స్లోగా ఉన్నా , తర్వాత తర్వాత పికప్ అయి సస్పెన్సుతో బాగానే ఉంటుంది .  #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పెను విధ్వంసం సృష్టించగల ఓ భారీ విపత్తు వేగంగా సమీపిస్తోంది..!!
  • ఆ కేన్సర్ స్పెషలిస్టు… రిటైరయ్యాక సిద్ధవైద్యంలోకి..! ఎందుకు, ఎవరు..?!
  • ఆమెపై హానీట్రాప్… పడిపోయింది… మన రహస్యాలన్నీ చెప్పేసింది…
  • పురూలియా…! అదొక పెద్ద మిస్టరీ… జవాబుల్లేవు… ఆశించడమూ వేస్ట్..!!
  • అందరూ రాజ్‌పుష్పలు కాలేరు పుష్పా… అనవసర ప్రయాస, అగౌరవం…
  • సాక్షిలో చైనా సరుకు..! ఈ కరణ్ థాపర్ ఘొప్ప వ్యాసం చెప్పేది ఇదే..!
  • ఒక ధర్మబద్ధ ఫ్యూడల్ నియంత..! ఒక బొబ్బిలి బ్రహ్మన్న పాత్ర…!
  • ఓ ధూర్త శతృవు… ఓ మూర్ఖ ప్రధాని… ఈ తరం చదవాల్సిన కథ…
  • ఎద్దులతో ఓ జంట అనుబంధం…! తమిళ సినిమాకు కాదేదీ కథకనర్హం..!
  • ఈ సైకో రేపిస్ట్ ఎన్ని హత్యాచారాలు చేస్తేనేం… ఇంకా బతికే ఉన్నాడు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions