.
నిన్న మొత్తం మీడియా, పొలిటికల్ సర్కిళ్లలో ఒకటే చర్చ… కేసీయార్ తన పార్టీ పేరును బీఆర్ఎస్ నుంచి మళ్లీ టీఆర్ఎస్ అని మార్చబోతున్నాడా..? తనంతటతనే ‘జాతీయ ఆశలతో’ చంపేసుకున్న తెలంగాణ ఆత్మను పార్టీ పేరులో పునఃప్రతిష్టించనున్నాడా..?
నిన్న పార్టీ విస్తృత సమావేశంలో మాట్లాడుతూ… ‘‘టీఆర్ఎస్ఎల్పీ, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ’’ అని ప్రస్తావించాడు… ఉద్దేశపూర్వకంగానే పార్టీ శ్రేణులకు ఓ హింట్ ఇచ్చాడా..?
Ads
https://www.facebook.com/reel/1110655644336491
సీనియర్ జర్నలిస్టు శివప్రసాద్ ఏమంటాడంటే..? Trs .. not brs .. is it just a slip of tongue? Or change of mind ? అవును, అందరిలోనూ ఇదే ప్రశ్న… పార్టీ అధినేత తన పార్టీ పేరును పొరపాటుగా ఎలా ఉచ్ఛరిస్తాడు..? కావాలనే, భవిష్యత్తు పేరు మళ్లీ మార్పిడి సంకేతం ఇస్తున్నాడా..? ఎందుకు..? అవకాశం ఉందా..? ఇదీ చర్చ… ఎందుకంటే రాజకీయాల్లో యాదృచ్ఛికాలు ఉండవు… అలా చెప్పి, మళ్లీ సవరించుకోలేదు కూడా…
సోషల్ మీడియాలో చాలా పోస్టులు కనిపిస్తున్నాయి కేసీయార్ టీఆర్ఎస్ఎల్పీ, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనడం మీద..! ఈ సందర్భంగా ఓ వీడియో మరోసారి తెరమీదకు వచ్చింది… ఆఫ్ బీటుగా చెప్పుకోవాలంటే…
వీఐపీ, సెలబ్రిటీల జ్యోతిష్కుడు వేణుస్వామి గత అసెంబ్లీ ఎన్నికల తరువాత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇలా అన్నాడు…
https://www.facebook.com/reel/2308333186259880
బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ అని పేరు మార్చబోతున్నారా అని ఓ విలేకరి అడిగితే, నథింగ్ డూయింగ్, బీఆర్ఎస్ బీఆర్ఎస్‌గానే ఉంటుంది అన్నాడు కేసీయార్… వేణుస్వామిని లేడీ రిపోర్టర్ శ్రావణి అడిగితే… ‘‘టీఆర్ఎస్ ఎప్పుడైతే బీఆర్ఎస్ అయ్యిందో అప్పట్నుంచే పతనం స్టార్టయింది… తను పార్టీ పేరును మళ్లీ టీఆర్ఎస్ అని మార్చుకోకపోతే ఇంకా సమస్యలుంటాయి, వలసలుంటాయి, పార్టీ మనుగడే ఇబ్బందిలో పడుతుంది… పార్టీ భవిష్యత్తే అగమ్యగోచరంగా ఉంటుంది…
కేటీయార్‌కు ఏలిన్నాటి శని, కేసీయార్‌కు అష్టమ శని… అవి వెళ్లిపోతే… పార్టీ పేరు మళ్లీ టీఆర్ఎస్ అని మార్చుకుంటే… 2025 తరువాత పార్టీ మళ్లీ పుంజుకుంటుంది… లేకపోతే ఇక లేదు’’ అని చెప్పుకొచ్చాడు…
నిజంగానే కేసీయార్‌కు జాతకాలు, పూజలు, హోమాలు, యాగాల మీద ఆసక్తి ఎక్కువే… బలంగా నమ్ముతాడు… సో, అందుకే పార్టీ పేరు పునఃమార్పిడి ఆలోచిస్తున్నాడా..?
1) తన పార్టీ పుట్టుకకూ, జనంలో ఆదరణకూ కారణం తెలంగాణ కోసం పోరు… ఎప్పుడైతే తన పార్టీ పేరు నుంచి తెలంగాణ పేరును, తెలంగాణ ఆత్మను కత్తిరించుకున్నాడో చాలామందికి నచ్చలేదు, ఆ పార్టీలోనే చాలామంది పెదవి విరిచారు… మంచిది కాదన్నారు… అదే జరిగింది… ఇప్పుడు దాన్ని రివర్స్ చేయాలని అనుకుంటున్నాడా కేసీయార్..?
2) ఎప్పుడైతే సొంత రాష్ట్రంలోనే చతికిలపడ్డాక… వేరే రాష్ట్రాల్లో ఎంత ప్రయత్నించినా ఏమాత్రం ఫలితం లేకపోగా, కనీస ఉనికి ప్రదర్శన కూడా జరగక… ఇక జాతీయ రాజకీయాలు కేసీయార్‌కు అచ్చిరావు, తన వల్ల కాదు… వస్తే గిస్తే ఏవో లెక్కలతో మళ్లీ మోడీ తనను దగ్గరకు తీస్తాడేమో గత చేదు అనుభవాలు మరిచిపోయి, అంతేగానీ వేరే ఏ ఇతర పార్టీ దగ్గరకు రానివ్వదు… అందరి ఎన్నికల ఖర్చూ నేనే భరిస్తాను అని చెప్పినా సరే…
3) సో, ఇక తన పార్టీలో ‘భారత్’ అనే పదం అక్కర్లేదు... పీచే ముఢ్... మళ్లీ తెలంగాణ రాష్ట్ర సమితి అని పెట్టుకోవాలని అందుకే నిర్ణయించుకున్నాడా..? అందుకేనా అంత కీలక సమావేశంలో అలా మాట్లాడింది..?!
Share this Article