ప్రోమో చూస్తుంటే… మొదట సందేహం కలిగింది… చూసింది నిజమేనా అని… మరోసారి, మరోసారి చూస్తే అప్పుడు నిజమే అనిపించింది… స్టిల్, అది నిజమేనా అనే సందేహమే మెదులుతోంది…
విషయం ఏమిటంటే..? అది తెలుగు ఇండియన్ ఐడల్ షో… ఆహా ఓటీటీలో ఓ రియాలిటీ షో… మూడో సీజన్ నడుస్తోంది… భారీగా ఖర్చు పెడుతున్నారు… మంచి ట్రెండింగ్‌లో ఉన్న షో… కంపోజర్ థమన్, సింగర్ కార్తీక్‌తోపాటు సింగర్ గీతామాధురి కూడా ఓ జడ్జి…
ఈసారి కంటెస్టెంట్లు మంచి మెరిటోరియస్… పాటల ఎంపిక పెద్దగా బాలేకపోయినా సరే, ఎంచుకున్న పాటల్ని మాత్రం ఇరగదీసేస్తున్నారు… ఇతర మ్యూజిక్ షోలతో పోలిస్తే ఈ షోలో ఆర్కెస్ట్రా/ మ్యూజిషియన్లకు కూడా మంచి గుర్తింపు ఇస్తుంటారు… ప్రతివారం ఒకరిని వేదిక మీదకు పిలిచి ఏదో ఓ గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చి అక్నాలెడ్జ్ చేస్తుంటారు…
Ads
ఈసారయితే ఒక్కొక్క మ్యూజిషియన్‌ను ఒక్కో పాటకు సింగర్ పక్కనే నిలబడో, కూర్చోబెట్టో… తబలా, మృదంగం, వయోలిన్, ఫ్లూట్, రిథమ్ ప్యాడ్స్, డ్రమ్స్ వాయించే కాన్సెప్టు తీసుకున్నారు… రియల్లీ గుడ్… ఆర్కెస్ట్రా టీమ్‌లో పవన్ అనే డ్రమ్మర్ ఉన్నాడు… డీజే టిల్లూ హెయిర్ స్టయిల్… తను నజీరుద్దీన్ పాటకు చాలా బాగా ప్యాడ్స్ వాయించేశాడు…
శివమణి తరువాత నువ్వేరా అని థమన్ సర్టిఫికెట్ ఇచ్చాడు… గీతామాధురేమో రిథమ్ ప్యాడ్స్ మీద పాట పాడావు అని మెచ్చుకుంది… అక్కడివరకూ వోకే, కానీ వేదిక మీదకు వెళ్లి హగ్ చేసుకుని, బుగ్గ మీద ముద్దుపెట్టింది… అదీ ఆశ్చర్యం అనిపించింది… పవన్ చిన్న పిల్లాడేమీ కాదు, ముద్దు చేసి, మురిపెంగా మెచ్చుకోవడానికి…
సెకండ్ సీజన్‌లో చిత్రవిచిత్రంగా జడ్జిమెంట్లు చెప్పి చిరాకు పుట్టించేది… వోకే, థమన్, కార్తీక్ వంటి సీనియర్ల మధ్యలో కూర్చుని జడ్జిమెంట్ చెప్పడంలో గందరగోళానికి గురవుతుందేమో అనిపించేది… ఈసారి పర్లేదు, తను బయట చాలా కచేరీలను నిర్వహిస్తుంటుంది… పాటలు, ఇన్‌స్ట్రుమెంట్లు, రాగాలు, శృతులు అన్నీ తెలుసు… కానీ ఓ మ్యూజిషియన్‌ను వేదిక మీద ముద్దుపెట్టుకోవడం కాస్త విభ్రమే… వాటీజ్ దిస్ గీతా..?
తన చర్యలో వెకిలితనమో, వెగటుతనమో ఏమీలేవు… కాకపోతే మరీ అలా అతిస్పందన అవసరం లేదు… కొన్ని సభామర్యాదలుంటాయి… ఐనా ఈమె చాలాసార్లు అర్థం కాదు… అదేమిటో..!! (పవన్‌తోపాటు రీల్స్, షార్ట్స్ చేసే వయోలినిస్ట్ కామాక్షి స్పందనేమిటో ప్రోమోలో కనిపించలేదు…)(ఈటీవీ ఢీ షోలో ప్రియమణి పిలిచి మరీ హగ్గులిచ్చేది, పూర్ణ బుగ్గలు కొరికేది… ఇప్పుడు గీతామాధురి కూడా… హేమిటో…)
భరత్ రాజ్, నజీరుద్దీన్ కలిసి రాబోయే పవన్ కల్యాణ్ ఓజి సినిమాకు ఓ పాట పాడారని, పవన్ కల్యాణ్ కూడా మెచ్చుకున్నాడనీ థమనే వెల్లడించాడు… గుడ్… తనే ఏదో ఇంటర్వ్యూలో చెబుతున్నాడు ఈమధ్య… తన హెక్టిక్ వర్క్ నడుమ ఇండియన్ ఐడల్ షోకు టైమ్ కేటాయించడానికి కారణం ఆటవిడుపు మాత్రమే కాదు, కొత్త టాలెంట్ అన్వేషణకూ ఉపయోగకరం అని… ఇది అదే…
టాప్ 6 అంటే… నిజంగానే టాప్ సిక్సే… వీరిలో విజేత ఎవరో తేల్చడం నిజంగా కష్టమే… అసలు టాప్ ఫైవ్ తేల్చడం కూడా కష్టమే… శ్రీకీర్తి, కీర్తన, నజీరుద్దీన్, అనిరుధ్, భరత్ రాజ్, స్కంధ… అందరూ అందరే… బహుశా కీర్తన, భరత్ రాజ్ నడుమ బలమైన పోటీ ఉంటుందేమో రాను రాను..!!
Share this Article