Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అబ్సర్డ్ ! ఈ సీత చుట్టూ అకారణంగా నెగెటివిటీని రుద్దేది కాషాయమే !!

July 31, 2026 by M S R

.

నిజమే, ఓ మిత్రుడు అన్నట్టు… అత్యంత నాసిరకం సరుకు ఆదిపురుష్‌ను కూడా నెత్తిన మోసినవాళ్లు ప్రస్తుతం రామాయణ్‌లో సీత పాత్ర పోషించిన సాయిపల్లవి చుట్టూ నెగెటివిటీని రుద్దుతున్నారు… కావాలని, సోషల్ మీడియాలో మీమ్స్, పోస్టులు, వీడియోలు ఎట్సెట్రా… ఓరకమైన కసి చూపిస్తున్నారు… మళ్లీ వారిలో సోకాల్డ్ జాతీయవాదులు, కాషాయవాదులు…

ఇందులో రావణుడిగా చేసిన యశ్‌ను ఎవ్వడూ ఏమీ అనడు… ఒరేయ్, నువ్వు డబ్బు పెట్టి నటిస్తున్న నీ టాక్సిక్ సినిమా ఛండాలం ఏమిట్రా అని అడగరు… ఇదే రామాయణంలో రాముడిగా చేసిన రణబీర్ కపూర్ యానిమల్ భ్రష్ట పాత్ర గురించీ ఎవరూ ఏమీ అడగరు… సాయిపల్లవి కదా అలుసు… ట్రెయిలర్ రిలీజ్ అయ్యాక మొత్తం చర్చలన్నీ ఆమె చుట్టే..!!

Ads

ఐరనీ ఏమిటంటే..? లేడీ పవర్ స్టార్, తెలంగాణ ఆడబిడ్డ అని మెచ్చిన నోళ్లు కూడా హఠాత్తుగా ‘ఎహె, ఈమె సీతా..? ఈమెకన్నా పక్కన చెలికత్తె బాగుంది, ఆ శూర్ఫణఖ బాగుంది, అసలు ఏం చూసి రావణుడు ఎత్తుకెళ్లాలి ఈమెను, అందుకే మొరాయిస్తాడు… అసలు వంకీల జుత్తు ఉంటుందా సీతకు..?’ ఇలాంటి అసంబద్ధ వ్యాఖ్యానాలతో ఆమెను, తద్వారా సీత పాత్రనూ పలుచన చేస్తున్నారు…

సాయిపల్లవి

అక్కడికి సీత ఒరిజినల్‌గా ఎలా ఉండేదో వీళ్లకు తెలుసు అన్నట్టుగా! ఎస్, అనేక రామాయణ గాథల్ని బట్టి శూర్పణఖ అద్భుతమైన అందగత్తె… సీత పాత్రను కూడా తమ ప్రాంతాల్లో సౌందర్యవతుల రూపాల్ని బట్టి ఊహించుకుంటారు… అదంతే… కొందరైతే ఈ సినిమాలో మండోదరి, కైకేయి, శూర్పణఖ సీతకన్నా బాగున్నారు సుమీ అని మెటికలు విరుస్తున్నారు, ఆ వేళ్లకు జెట్టలు పుట్ట, అసలు మండోదరి ఎక్కడ కనిపించిందిరా ట్రెయిలర్‌లో!

ఇక్కడ ఒక విషయం… ఎప్పుడూ సీత గానీ, ఏ పౌరాణిక పాత్ర గానీ ఒకేరకంగా ఉండి మెప్పించాలని ఏమీ లేదు, ఒకప్పుడు సీత అంటే అంజలీదేవే, మరెవ్వరూ ఆమె సాటి రాలేదు… కానీ అప్పటిదాకా వ్యాంప్ తరహా చెత్త పాత్రలు వేసిన నయనతార బాపు రామరాజ్యంలో సీతగా అద్భుతంగా చేసింది… ఎవరూ ఊహించలేదు… ఆ పాత్రతో ఇక కెరీర్ క్లోజ్ చేయాలని అనుకుంది, తరువాత కథ వేరులెండి…

అంతటి ఆదిపురుష్‌లో సీతగా చేసిన కృతి సనన్ ఏం బాగుంది..? సరే, ఈ సీత విషయానికొద్దాం… ఈ సోకాల్డ్ కాషాయవాదులు కోరుకునే జీవనశైలే సాయిపల్లవిది… పుట్టపర్తి సాయి భక్తురాలు… తనకుతాను కొన్ని కట్టుబాట్లు పెట్టుకుని మెసలుతోంది ఈ కంపు ఇండస్ట్రీలో… దాన్నీ వదిలేస్తే, ఎందుకు ఈమె మీద ఈ వ్యతిరేకత..?

తమిళంతో తనకు ప్రాబ్లం లేదు (నిజానికి బడగ ఆమె మాతృభాష), తండ్రి ఉద్యోగరీత్యా అక్కడ ఉండేవారు కాబట్టి మలయాళంతో ప్రాబ్లం లేదు, వివాదాల్లేవు… ఓసారి ఈమె ఏమన్నదంటే..? హింస ఏరూపమైనా ఖండనీయం కదా, గోహంతకుడి పేరిట హింసించినా, గోవులను హింసించినా హింసే కదా… మరో సందర్భంలో మనకు పాకిస్థానీలు టెర్రరిస్టులుగా, శత్రువుల్లా ఎలా కనిపిస్తారో, వాళ్లకు మన సైనికులు కూడా అలాగే కనిపిస్తారు కదా…

saipallavi

ఒక వ్యాఖ్యపై హైదరాబాదులో కేసు కూడా నమోదైంది… అబ్సర్డ్ కేసు… ఆమె అభిప్రాయం… నిజానికి కరెక్టే కదా… మనం ఐఎస్ఐని ఎలా భూతంలా చూస్తున్నామో, పాకిస్థాన్‌ కూడా మన ‘రా’ను అలాగే చిత్రీకరిస్తుంది… ఆమె వ్యాఖ్యల్లో దేశద్రోహం లేదు, ధర్మద్రోహం లేదు… ప్లెయిన్… కాకపోతే ఈ పిచ్చిది తనకు తెలియని భాషలో వ్యాఖ్యలు చేయకూడదు…

ఆమె తెలుగు ఈరోజుకూ ఇంటర్వ్యూల్లో, ప్రసంగాల్లో వింటుంటే అర్థం కాదు… రికార్డింగులో భట్టీ పట్టి డైలాగ్ చెప్పడం వేరు, కీలకమైన- సున్నితమైన విషయాల మీద ఇంటర్వ్యూల్లో, ప్రసంగాల్లో చెప్పడం వేరు… చివరగా… అసలు ధర్మ శతృవుల్ని వదిలేసి సాయిపల్లవి వంటి కేరక్టర్ల మీద నెగెటివిటీ స్ప్రెడ్ చేయడం అబ్సర్డిటీ… ఏదైతేనేం, ఏడ్చేవాడు ఏడుస్తూనే ఉంటాడు… ఆమె మాత్రం సాదాసీదా కేరక్టర్ల నుంచి ఏకంగా 4 వేల కోట్ల సినిమాలో, ఓ అద్భుతమైన పాత్ర దాకా ప్రయాణించింది..!!

saipallavi

చాలా ఆటోల వెనుక, లారీల వెనుక రాసి పెట్టి ఉంటుంది… ‘నీ ఏడుపే నా ఎదుగుదల’…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అబ్సర్డ్ ! ఈ సీత చుట్టూ అకారణంగా నెగెటివిటీని రుద్దేది కాషాయమే !!
  • సుమంత్‌ను ఫ్లాప్ కెరీర్ వెంటాడుతూనే ఉంది – ఖర్మ థియరీ !!
  • ఉన్నమాటే అన్నాడు – నాణ్యమైన సరుకు ఉత్పత్తే లేదు కదా…
  • చిన్న చిన్న ఆశ ! కొందరికి అస్సలు నచ్చదు – వాళ్లు చూడొద్దు !!
  • వాడు మొనగాడు – చేతిలో పార, గడ్డపార… కళ్లెదుట ఓ ‘దారి’…!
  • కేసీయార్ సార్, మీ విజ్ఞతపై ఇంకా నమ్మకముంది… మరి ఇదేం పోకడ !?
  • ప్రతి పనికీ పార్టీ ఆమోదమా? ఇవి సీఎం ముందరికాళ్లకు బంధాలు?
  • అనుకున్నదే ! బొద్దింకలకు జతగా క్రిమినల్స్ ! ఏదో ప్రిప్లాన్‌డ్ స్కెచ్ !!
  • రామాయణ్ దర్శకుడు నితేశ్ తివారీ నాకెక్కడ నిజంగా నచ్చాడంటే..!?
  • రక్తసంబంధాలు పెళుసుగా మారి… ఇంటింటికో ఇలాంటి కథ!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions