ఒక్క స్విచ్ నొక్కితే రెండు లైట్లు ఆరిపోయాయి! మొదటి బల్బు కవిత! రెండో బల్బు కేజ్రీవాల్! తనని అరెస్ట్ చేయటం అక్రమం అంటూ కవిత సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. మొన్న రాత్రి కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయక ముందే ఆప్ నాయకులు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు కేజ్రీవాల్ అరెస్ట్ అక్రమం అంటూ! నిన్న ఉదయం సెషన్ లో కవిత పిటిషన్ సుప్రీం కోర్టు డివిజన్ బెంచ్ ముందు విచారణకు వచ్చింది. కపిల్ సిబాల్ కవిత […]
కళాకారులు కొన్నిసార్లు కాకులవుతారెందుకో? తమ అసలు నలుపు తెలియరెందుకో?
… నలుగురు కూడిన చోట ఎవరి గురించైనా చెడ్డగా మాట్లాడుకుంటూ ఉంటే ‘లోకులు పలు కాకులు’ అంటాం! పాపం కాకులు ఏమి చేశాయి? కావ్.. కావ్ అని అనడం తప్ప! కొన్నిసార్లు కొందరు కళాకారులు కూడా అలా కాకులవుతారు. ఆ కాకులకంటే దారుణంగా అరుస్తుంటారు. తమ అసలు నలుపు తెలియక తమ అరుపుల్ని సమర్థించుకుంటూ ఉంటారు. … కేరళలోని త్రిసూర్ జిల్లాలో ఉన్న కళామండలం కళాకారులకు పుణ్యధామం. 1930లో వి.నారాయణ మీనన్ ఆ సంస్థను ప్రారంభించారు. అక్కడ […]
ఇది కదా చదివి పొంగిపోవాల్సిన వార్త! పదిమందికీ షేర్ చేయాల్సిన వార్త!
పోరాడితే పోయేదేమీ లేదు… ఒక తల్లీ కూతుళ్ల సాహసగాథ ఇది కదా చదవి పొంగిపోవాల్సిన వార్త! ఇది కదా చూసి అభినందించాల్సిన వార్త! ఇది కదా పదిమందికి షేర్ చేయాల్సిన వార్త! ఇంట్లో ఈగలకు, దోమలకు, నల్లులకు, బల్లులకు; వీధిలో పిల్లులకు, కుక్కలకు నిలువెల్లా వణికిపోయే మనం తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన వార్త ఇది. హైదరాబాద్ బేగంపేట అంటే నగరం నడి బొడ్డు. మధ్యాహ్నం ఒకటిన్నర అంటే పట్ట పగలు. గుమ్మం ముందు ఇద్దరు యువకులు తుపాకీ పట్టుకుని…ఏయ్! కదిలారో […]
బాపు ఫీల్ గుడ్ సినిమా… ఆ బాలనటుడే సినిమా మొత్తం మోశాడు…
Subramanyam Dogiparthi ……… బాలరాజు కథ… ఇది బాపు గారి సినిమా . బాగుంటుంది . సినిమా సింహ భాగం మహాబలిపురం నేపధ్యంలో సాగుతుంది . Feel Good Movie . మాస్టర్ ప్రభాకరే సినిమాకు కధానాయకుడు . ఆరిందాలాగా నటించాడు . Happy go lucky go character . బాల భారతంలో దుర్యోధనుడిగా నటించింది ఈ మాస్టర్ ప్రభాకరే . తమిళంలో హిట్టయిన వా రాజా వా సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా […]
కనువిప్పేమీ కాదు… మాల్దీవుల అధ్యక్షుడివి ధోకేబాజ్ మాటలు…
ముందుగా ఓ తాజా వార్త చదవండి… ‘‘మాల్దీవుల ప్రెసిడెంట్ మొహమ్మద్ ముయిజ్జూ తన స్టాండ్‌ను మార్చుకుని, భారతదేశం మాల్దీవులకు అత్యంత సన్నిహిత మిత్రుడు అని చెప్పాడు, మొహమ్మద్ ముయిజ్జూ ఇప్పుడు PM మోడీ నుండి రుణ విముక్తిని కోరుతున్నాడు, మాల్దీవులు గత సంవత్సరం చివరినాటికి భారతదేశానికి 400.9 మిలియన్లు బకాయిపడింది… మాల్దీవులకు సహాయం అందించడంలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తుంది, అత్యధిక సంఖ్యలో ప్రాజెక్టులను అమలు చేసింది…” అని అతను భారతదేశాన్ని ప్రశంసించాడు… మాల్దీవులు ఓ దీవి… […]
నా ఇంటి గడప తొక్కకుండా నా భర్తను కట్టడి చేయండి యువరానర్…
మిత్రుడు సూర్యప్రకాష్ జోశ్యుల వాల్ మీద కనిపించింది ఈ పాత వార్త… రూపవాణి పత్రికలో అనుకుంటా, పబ్లిషైంది… 1960 బాపతు సంచిక అయి ఉంటుంది… ఈమధ్య నటి జయలలిత అనుభవాలు, సినిమా నటి లక్ష్మి మీద ఆమె మాజీ భర్త చేసిన వ్యాఖ్యలు గట్రా చర్చనీయాంశమయ్యాయి… నాటి పాత ముచ్చట్లన్నీ వార్తల్లోకి వస్తున్నాయి… అఫ్కోర్స్, ఇప్పుడైతే మరీ సినిమా సెలబ్రిటీల ప్రేమలు, సహజీవనాలు, పెళ్లిళ్లు, బ్రేకప్పులు, విడాకులు, గృహహింస, కేసులు గట్రా కామన్ అయిపోయాయి… కానీ అప్పుడెప్పుడో […]
ఈ కవిత అరెస్టు సరే… ఆ తమిళ కనిమొళి 2జీ కేసుకూ కాళ్లొచ్చినయ్…
కేవలం విపక్ష పార్టీల మీదకే ఈడీలు, ఐటీలు, సీబీఐలను ఉసిగొల్పి, అరెస్టులు చేయించి, బీజేపీ ఏకపక్ష న్యాయాన్ని అమలు చేస్తోందనీ, తన పార్టీలో చేరితే హఠాత్తుగా సచ్చీలురైపోతున్నారనే విమర్శలు చాన్నాళ్లుగా ఉన్నవే… పోనీలే, అలాగైనా కొంతమంది అక్రమార్కులు బయటపడుతూ కటకటాల వెనక్కి చేరుతున్నారు కదానే అల్ప సంతోషం కొందరిది… హేమంత్ సోరెన్ అరెస్టు… కేజ్రీవాల్ అరెస్టు… కవిత అరెస్టు… ఈ వార్తల నడుమ మరో ముఖ్యమైన పరిణామం పెద్దగా ఫోకస్‌లోకి రాలేదు… అది డీఎంకేకు సంబంధించి…! టూజీ […]
‘‘ఆ బెడ్రూం మూలుగులు, నిట్టూర్పులు, పలవరింతలు ఆపించండి సార్’’
సాధారణంగా ఇరుగూపొరుగూ ఇళ్ల నడుమ గొడవలు పెద్ద విషయమేమీ కాదు… కామన్… కలిసే ఉంటారు లేదా కలహించుకుంటారు, వాళ్ల మీద వీళ్లు, వీళ్ల మీద వాళ్లు చాడీలు చెప్పుకుంటారు… నడుమ ఉండే గోడకు చెవులు అతికించుకుంటారు… ఉన్నవీ లేనివీ, ఉన్నవాటికి అతిశయోక్తులు, భూతద్దాలు గట్రా అతికించబడతాయి కూడా… వినేవాళ్లకూ ఓ సరదా, నవ్వుకుంటారు… ఇండిపెండెంట్ ఇళ్లకన్నా అపార్ట్మెంట్లలో ఇవి మరీ అధికం… కామన్ వాల్స్, కామన్ స్పేస్ ఎక్కువ… కామన్ సెన్స్ తక్కువ కదా… ఐనా సరే, […]
తెల్లని పైజామాలో మెల్లగా అతి సాదా సీదా మేరుపర్వతంలాగా వచ్చాడు
Taadi Prakash… అబూ శిఖరం అంచుల్లో …. Artist Mohan on Alltime Great Abu Abraham ……………………… శనివారం సాయంత్రంలో విశేషమేముంటుంది గనక!సవాలక్ష సాయంత్రాల్లో అదో బోరు సాయంత్రం.కానీ ఆఫీసు టేబుల్ మీది చెత్త మధ్య ఒక చిన్న మెసేజ్. “అబూ అబ్రహాం మిమ్మల్ని ఫోన్ చేయమన్నారు.” గుండె ఆగిందో తెలీదు. కొట్టుకుందో తెలీదు. హడావుడిగా ఫోన్ చేస్తే అవతలి నుంచొక గంభీరమైన గొంతు,యెహోవా మబ్బుల్లోంచి మాట్లాడినట్టుగా,గంటలో రమ్మన్నారాయన. వట్టి చేతుల్తో వెళ్ళేదేలా? త్వరత్వరగా ఓ […]
‘‘అరవింద్ కేజ్రీవాల్ పైకి కనిపించేంత ప్రజాస్వామ్య నాయకుడేమీ కాదు’’
కేజ్రివాల్ విజువల్ పర్సన్, విజన్ ఉన్న పర్సన్, సీ, లుకింగ్, బ్రైట్ లాంటి విజువల్ పదాలు ఆయన మాటల్లో తరచూ వినిపిస్తాయి. ఆయన కంటి కదలికలు, చేతుల కదలికలు కూడా అదే విషయాన్ని ధ్రువపరుస్తాయి. ఏ విషయం గురించైనా మాట్లాడేటప్పుడు ఆయన మొదట ఎడమవైపు పైకి చూసి తర్వాత నేరుగా చూస్తారు. అంటే ఆయన తన జ్ఞాపకాలు, అనుభవాల్లోంచి కావాల్సిన సమాచారాన్ని సేకరించి మాట్లాడుతున్నారని అర్ధం. అంతేకాదు ఆయన నిజాన్నే మాట్లాడుతున్నారని ఈ కంటి కదలికలు చెబుతాయి. […]
కన్నీటిని తుడిచి, సాయం చేసే ఆమె చేతులకు అవినీతి మరకలు…
సంపాదించుకున్న మంచి పేరు పోవడానికి, సమాజానికి మొహం చూపించుకోలేని స్థితికి రావడానికి ఏదో ఒక్క సంఘటన చాలు… ఏసీబీ వలలో మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిందనే ఫోటో, వార్త చూశాక అదే ఆశ్చర్యమేసింది… మంచి సమాజ సేవికగా, మంచి మనస్సున్న అధికారిణిగా సోషల్ మీడియాలో, మీడియాలో బాగా పాపులరైన ఆమె ఒక్కసారిగా అథఃపాతాళానికి పడిపోయినట్టుగా ఉంది… అఫ్ కోర్స్, అవినీతి వ్యవహారాలు ఉన్నవాళ్లు ఆ సంపాదనను పది మందికీ పంచకూడదని, మంచి మనస్సు ఉండకూడదని […]
మా ఫ్యాన్స్ ఆనందాన్ని కొలిచే త్రాసులు ఉంటే… కథ వేరే ఉండేది…
ఆనందమా! నువ్వెక్కడ? ప్రపంచంలో ఉన్న 195 దేశాల్లో 143 దేశాల 2023 సంవత్సరపు సంతోష సూచీని ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి(సస్టెయినబుల్ డెవెలప్మెంట్ సొల్యూషన్స్ నెట్ వర్క్) విభాగం లెక్కకట్టి…ఈ ఏడు(2024) అంతర్జాతీయ ఆనంద దినోత్సవం-మార్చి 20 సందర్భంగా విడుదల చేసింది. ఇందులో భారత దేశం 126 వ స్థానంలో ఉంది. అంటే మనకంటే కేవలం 125 దేశాలు మాత్రమే హాయిగా, ఆనందంగా ఉన్నాయని మనం ఆనందించవచ్చు! మన కింద 17 దేశాలు ఎప్పటికి ఆనందిస్తాయో అని మనం నైతికంగా […]
అవును… అన్నా హజారే చెప్పినట్టు మద్యం, అధికారం రెండూ మత్తెక్కించేవే…
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్‌ను అవినీతి, అక్రమ మద్యం పాలసీల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయగానే, నిజంగానే అందరి దృష్టీ ఒక్కసారి ఆయన గురువుగా భావించే అన్నా హజారే మీదకు మళ్లింది… 86 సంవత్సరాల వయస్సున్న ఆయన మొదటి నుంచీ అవినీతి వ్యతిరేక పోరాటం చేస్తున్నాడు… ఇదే కేజ్రీవాల్ తనతో కలిసి పనిచేశాడు… తరువాత విడిపోయి, ఆప్ పార్టీ పెట్టుకుని, మొదట ఢిల్లీలో, తరువాత పంజాబ్‌లో కూడా అధికారాన్ని సాధించాడు… ఏ అవినీతిపై తను […]
రుద్రకరణ్ ప్రతాప్… ఈయన మరో వేణుస్వామి… ఈడీ అరెస్టులపై మరో చర్చ..!
జ్యోతిష్కులపై ఎప్పుడూ ఓరకమైన విమర్శల దాడి జరుగుతూ ఉంటుంది… సోషల్ మీడియా విజృంభణ తరువాత ఇదింకా ఎక్కువైంది… ప్రత్యేకించి సెలబ్రిటీల జాతకాలను చెప్పే సెలబ్రిటీ జ్యోతిష్కులపై ఈ దాడి ఇంకా తీవ్రంగా ఉంటుంది… అదేసమయంలో ఆ నెగెటివ్ ప్రచారం కూడా వాళ్లు మరింత పాపులర్ కావడానికి ఉపయోగపడుతుంది… మరింత మందికి పరిచయం కావడానికి ఆస్కారమిస్తుంది… సరే, జోస్యాలు నిజమవుతాయ్, అబద్దమవుతాయ్… ఎవరూ ఖచ్చితమైన జోస్యాలు చెప్పలేరు… చెప్పిన జోస్యాల్లో ఎన్ని నిజమయ్యాయ్, స్ట్రయిక్ రేట్ ఎంత అనేదే […]
50 ఏళ్ల క్రితం… బాలీవుడ్ రేఖ తొలి సినిమా… ఆమె ఈమేనా అన్నట్టుగా…
Subramanyam Dogiparthi… ప్రముఖ బాలీవుడ్ నటి రేఖ హీరోయిన్ గా నటించిన మొదటి చిత్రం 1970 లో వచ్చిన ఈ అమ్మకోసం సినిమా . అప్పుడు ఆమెకు 15-16 సంవత్సరాల వయసు . కృష్ణంరాజు జోడీగా నటించింది . అప్పుడు గుండ్రటి మొహం ఆమె తల్లిలాగా . బొంబాయి వెళ్ళాక కోల మొహం అయింది . సినిమాలో చూసేటప్పుడు కూడా ఈమె రేఖనా అని అనుమానం వస్తుంది . బాలనటిగా రంగులరాట్నంలో కనిపించింది . చిన్ని బ్రదర్స్ […]
ఈ అమృతం అప్పాజీ గుర్తున్నాడా..? ఇండస్ట్రీ సరిగ్గా వాడుకోలేదేమో..!!
ఈ సినిమా ఎప్పుడొచ్చి పోయిందో గుర్తు లేదు గానీ… సినిమా పేరు సౌండ్ పార్టీ… బిగ్‌బాస్ ఫేమ్ వీజే సన్నీ ఇందులో హీరో… సినిమా ఫ్లాపో, హిట్టో తెలియదు గానీ… బిగ్‌బాస్ పాపులారిటీ నాకు తెలిసి ఏ కంటెస్టెంట్‌కూ పెద్దగా ఉపయోగపడదు… జస్ట్, కొన్నాళ్లు టీవీలో స్పెషల్ ప్రోగ్రామ్స్‌లో కనిపిస్తారు… ఆమధ్య సొహెయిల్ వేదిక మీద కన్నీళ్లు పెట్టుకున్న తీరు చూశాం కదా… ఈ సౌండ్ పార్టీ సినిమా కూడా సన్నీకి పెద్ద ఫ్లెచింగ్ అవుతుందని అనుకోలేం… […]
రాజకీయ క్షేత్రంలో కాంగ్రెస్‌పై బీజేపీ ఆర్థిక యుద్ధం…
రామరావణ యుద్ధం జరుగుతోంది… రావణుడు రాముడి బాణాలకు నిర్వీర్యుడయ్యాడు… రథం నుండి తూలి భూమి మీదకు పడిపోయిన రావణుడిని చూసి రాముడు “భయంకరమైన యుద్ధం చేశావు రావణా, నీ ఖడ్గం విరిగిపోయింది, నీ గుర్రాలు చనిపోయాయి. నీ సారధి మరణించాడు, నీ ధ్వజం కిందపడిపోయింది, నీ రథం ముక్కలయ్యింది, నీ చేతిలో ఉన్న కోదండం విరిగిపోయింది, నీ కిరీటం కింద పడిపోయింది, నీ చేతిలో ఒక్క ఆయుధం లేదు. ఇప్పటివరకూ నా వాళ్ళని పడగొట్టి బాగా అలసిపొయావు, నీ […]
25 ఏళ్లుగా ప్రతిరోజూ యోగా… పూర్తి శాకాహారం… ప్రతి సోమవారం ఉపవాసం…
సినిమా, టీవీ, క్రికెట్, పొలిటికల్ సెలబ్రిటీల గురించి కథలు రాస్తాం మనం… చదువుతాం… ఇన్ స్పిరేషన్ అనుకుంటాం… కానీ పేరొందిన సైంటిస్టులు, కంపెనీ సీఈవోలు, చైర్మన్లు, ఖతర్నాక్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ప్రత్యేకించి జడ్జిల గురించి మీడియా పెద్దగా పట్టించుకోదు… భిన్న రంగాల ప్రముఖుల జీవితాలు, జీవనశైలిపై ఇప్పుడిప్పుడే దృష్టిసారిస్తోంది… గుడ్… మన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు లీగల్ సర్కిళ్లలో మంచి పేరు ఉంది… సహజంగానే తన లైఫ్ స్టయిల్‌పై కూడా రీడర్స్‌కు ఆసక్తి ఉంటుంది… […]
కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచే ఢిల్లీ సీఎంగా పాలన కొనసాగించగలడా..?
ఈడీ అరెస్టు చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ భార్య సునీత తదుపరి ముఖ్యమంత్రి అవుతుందా..? ఈ ప్రశ్నకు సమాంతరంగా మరో ప్రశ్న ఉంది… కేజ్రీవాల్ జైలులో నుంచే ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తారా..? వరుసగా తొమ్మిదిసార్లు ఈడీ సమన్లకు స్పందించకపోవడంతో కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు, హైకోర్టులో తనకు ఏమీ రిలీఫ్ దక్కలేదు… అర్ధరాత్రయినా సరే, తమ కేసు వినాలని, కేజ్రీవాల్ అరెస్టును క్వాష్ చేయాలని సుప్రీంకోర్టు తలుపులు తట్టారు ఆప్ లీగల్ కౌన్సిల్… అరెస్టుకు ఈడీకి అధికారాలున్నయ్, తొమ్మిదిసార్లు […]
ఇచ్చట చవకగా ఫోన్ ట్యాపింగ్ చేయబడును..!
విలేఖరి:- సార్! మీకు ఈ ఏటి మేటి ఫోన్ ట్యాపింగ్ నైపుణ్య ప్రతిభా పురస్కారం వచ్చిన సందర్భంగా అభినందనలు. ఈ సందర్భంగా మిమ్మల్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. అన్ని విషయాలు ఓపెన్ గా మాట్లాడుకుందాం. ఫోన్ ట్యాపింగ్ నిపుణుడు:- తప్పకుండా. నా నైపుణ్యం లోకానికి తెలియాలి. నా నేర్పు ఇతరులకు స్ఫూర్తి కావాలి. ఊరూరా నాలా చవకగా, సులభంగా, వేగంగా ఎందరో ఫోన్ ట్యాపింగ్ నిపుణులు పుట్టుకురావాలి. వి:- ఫోన్ ట్యాపింగ్ ను ఒక వృత్తిగా ఎంచుకోవాలని […]
- « Previous Page
- 1
- …
- 119
- 120
- 121
- 122
- 123
- …
- 456
- Next Page »