నిజానికి ఈ వార్తలన్నీ పాతవే… కొన్ని జాతీయ మీడియా న్యూస్ సైట్లు మళ్లీ ఎందుకు ఈమధ్య తెర మీదకు తీసుకొస్తున్నాయో తెలియదు… శ్రీదేవి చెల్లెలి గురించి..! నేను డీఎన్ఏ సైటులో చదివినట్టు గుర్తు… బోనీకపూర్ తాటతీస్తాడేమో తెలియదు గానీ… ఒకవేళ తను అత్యంత అధికంగా పిచ్చిగా ప్రేమించిన శ్రీదేవి బయోపిక్ గనుక రాంగోపాలవర్మ తీస్తే… అందులో శ్రీదేవికి దీటైన పాత్ర, ప్రాధాన్యం బహుశా ఆమె చెల్లెలి పాత్రకు కూడా ఇవ్వాల్సి ఉంటుందేమో… నిజానికి చాలామందికి శ్రీదేవి చెల్లెలి […]
రివ్యూలు కూడా ఫార్ములాలోనే ఇమడాలా..? ఇలా రివ్యూలు రాయలేమా..?!
Priyadarshini Krishna….. ఇంతకుముందు చాలాసార్లు నేను అన్నాను, మళ్ళీ చెప్తున్నాను… సినిమా రివ్యూ అంటే సినిమాలోని ఇతివృత్తం లేదా కథని విశ్లేషించడం, పాత్రల పోకడను, దర్శకుడు ఆయా పాత్రలని మలిచిన తీరుని , ఆయా పాత్రలను పోషించిన నటుల నటనాచాతుర్యాన్ని చర్చించడం కాదు. ప్రేక్షకునికి ఆ సినిమాని పూర్తిగా పరిచయం చెయ్యడం. సినిమాలోని వివిధ విభాగాలు ఆ సినిమాలో ఎలా మెరుగైన దృశ్యకావ్యంగా తీర్చిదిద్దాయి అనే అంశాలను చర్చించడాన్ని రివ్యూ అనాలి. ఇవాళ్టి వరకు తప్పడ్ సినిమాపై […]
పూజకు పనికిరాని పూలు… ఈ మొక్క నిలువెల్లా విషమే… నమిలితే పరలోకమే…
పూజకు పనికిరాని పువ్వు అంటూ ఏమి ఉంటుంది..? అన్నీ ఆ దేవుడు సృష్టించిన ప్రకృతి ప్రసాదాలే కదా అంటారా..? లేదు… దేవుడి నిర్ణయాలకన్నా దేవుడి పూజించేవాళ్ల నిర్ణయాలే అంతిమం… తిరుగు లేదు… విషయం ఏమిటంటే..? కేరళలో దాదాపు 2500 పైచిలుకు గుళ్లలో ఓ తరహా పూలను పూజకు నిషేధించారు… వాటి వాసన సోకకూడదు, ప్రసాదాల దగ్గర కనిపించకూడదు, దేవుడికి మాలలు వేయకూడదు… చివరకు విగ్రహంపై కూడా పడకూడదు… ఆ పూలే గన్నేరు పూలు… అదేమిటి..? గన్నేరు పప్పు […]
ఓ తారక్కా.. తీసుకొని రా బిందె! లక్షల కీర్తనల పురందరదాసు ..!
Sai Vamshi …. … తెలుగువాళ్లం త్యాగరాజు, అన్నమయ్య, రామదాసు గురించి మాట్లాడుకున్నంతగా కన్నడ వాగ్గేయకారులు పురందరదాసు గురించి ఎక్కువగా మాట్లాడుకోం! 1484లో పుట్టిన ఆయన 1564లో మరణించారు. 4.75 లక్షల కీర్తనలు రాసినట్టు ఉన్నా, ఇప్పుడు వెయ్యి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. తన కీర్తనలన్నీ అచ్చ కన్నడలోనే ఉండేందుకు ఆయన కృషి చేశారు. లోకంలోని ద్వేషం, క్రోధం, లోభం పోవాలంటే భక్తే సరైన మార్గం అని, దేవుడికి తనను తాను అర్పించుకున్నవాడు అన్నింటికీ అతీతుడవుతాడని ఆయన తన […]
సత్యదేవా హఠాత్తుగా ఏమైనది..? పర్ఫామెన్స్ మరీ ఇలా మారిందేమిటి…?!
సత్యదేవ్… నటనలో మెరిట్ ఉన్న బహుకొద్దిమంది తెలుగు హీరోల్లో ఒకడు… నో డౌట్… సరైన పాత్ర పడి, డిమాండ్ చేయాలే గానీ తన ఎఫర్ట్ మొత్తం పెట్టి న్యాయం చేయగలడు… చాన్నాళ్లుగా ఫ్లాపులు పడుతూనే ఉన్నా సరే ఈరోజుకూ తనకు అవకాశాలు వస్తున్నాయంటే విశేషమే… అఫ్కోర్స్, సినిమాను తను ఈజీగా లాగగలడు అనే నమ్మకమే కావచ్చు కూడా… ఇప్పుడు కృష్ణమ్మ అనే ఓ సినిమా వచ్చింది… మార్కెట్లో పెద్ద మంచి పేరున్న సినిమాలు ఏమీ లేవు… ఈ […]
ఆ తెలుగు టీవీ డిబేట్లాగే… ఈ ప్రతినిధి కూడా బభ్రాజమానం భజగోవిందం…
నారా రోహిత్ నటించిన ప్రతినిధి-2 సినిమా గురించి ఏదో రివ్యూ వంటి ఒపీనియన్ కూడా రాయాల్సి వస్తుందని అనుకోలేదు… దీనికి దర్శకుడిగా వ్యవహరించిన మూర్తి టిపికల్ టీవీ5 మార్క్ న్యూస్ ప్రజెంటర్… తన డిబేట్ల తీరు చూసినా, తనకు దీటుగాడు సాంబశివరావు తీరు చూసినా ఈ సినిమా గురించి పెద్ద భ్రమలేమీ ఉండనక్కర్లేదు… డిబేట్ ప్రజెంటర్ ఎలా ఉండకూడదో చెప్పడానికి మన తెలుగు చానెళ్లలో పలు కేరక్టర్లు సుప్రసిద్ధం… వీళ్లు నిజానికి మెయిన్ స్ట్రీమ్ జర్నలిజంలోనే ఉన్నారా..? […]
చివరకు పేలాలు, అటుకులు కూడా ఇండియా సరుకే కావాలట…
Pardha Saradhi Potluri …. “Please be a part of the Maldives’ tourism. Our economy depends on tourism” – Maldivian Govt appeals to Indian Tourists ! అడుక్కు తినండి వెధవల్లారా! అందుకే మన చుట్టూ ఉన్న దేశాలలో ఏం జరుగుతున్నదో తెలుసుకుంటూ ఉండాలి అని చెప్పేది! మోడీ మీద, భారత్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు గుర్తుకు రాలేదా? మీరు భారత్ మీద ఆధారపడి బ్రతుకుతున్నారు అని? చైనా […]
ఒకడిని మించి మరొకడు… ఒకరు నోరు మూస్తే మరొక నోరు బార్లా…
ఒకరు కాకపోతే మరొకరు… వ్యంగ్యంగానో, వెటకారంగానో చెప్పాలంటే కాంగ్రెస్ క్యాంపులోని బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు వీళ్లు… ఎవరు..? ఒక శామ్ పిట్రోడా, ఒక అధీర్ రంజన్ చౌదరి, ఒక శశి ధరూర్, ఒక దిగ్గీ రాజా, ఒక మణిశంకర్ అయ్యర్… ఇలా చాలా మొహాలు… ఏవో పిచ్చి కూతలు కూస్తారు, పార్టీని ఇరకాటంలో పడేస్తారు… పార్టీ పెద్దలు ఖండించలేక, సమర్థించలేక, వీళ్లను తన్ని తరిమేయలేక, పీకలేక అవస్థలు పడుతుంటారు… ఏదో అంకుల్ శామ్ లాంటోళ్లు తమంతట తామే […]
ఆనాటి చెలిమి ఒక కల… ఈనాటి విషం ఒక భ్రమ… భలే బంధాలు..!!
సాక్షిలో కేసీయార్ ఇంటర్వ్యూ పూర్తిగా చదవలేదు… రోజూ చెప్పే అబద్ధాలు, ఆత్మస్తుతి, పరనింద మాత్రమే కదా అనుకుని… పైగా చాన్నాళ్ల తరువాత టీవీ9 లో డిబేట్ పెట్టించుకుని, పక్కా స్క్రిప్టు ప్రకారం తను చెప్పదలుచుకున్నది అడిగించుకుని మరీ నాలుగు గంటలపాటు చెప్పాడు కదా, ఇంకా కొత్త విషయాలు ఏముంటాయిలే, చెప్పేవాడికి అడిగేవాడు లోకువ అనుకుని..! కానీ ఓ చిన్న వీడియో బిట్ వాట్సప్ గ్రూపుల్లో సర్క్యులేట్ అవుతోంది… చూస్తే కేసీయార్ ఆంధ్రజ్యోతి మీద నిప్పులు కక్కాడు అంటూ..! […]
‘రెండు ఘంటసాల వెయ్యి, సుశీలను కూడా పెట్టు, చివరలో సిధ్ శ్రీరాం…’
Ashok Vemulapalli…. సుశీల-ఘంటసాల (బజ్జీ-ఉగ్గానీ)… రాయలసీమ ఆతిథ్యం గురించి సినిమాల్లో చూడటం తప్ప ప్రత్యక్షంగా ఇవాళే చూసాను.. శతృవైనా ఇంటికి వస్తే కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తారని విన్నాను.. అక్కడ వాళ్లు చూపించే ప్రేమకే కడుపు నిండిపోతుంది.. కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారి ఇంటికి ఇవాళ వెళ్లినపుడు.. ముందు కడుపు నిండా తినండి తర్వాత మాట్లాడుకుందాం అన్నారు ఆయన.. నాకు అంతకుముందు అసలు పరిచయం లేదు.. మాతో పాటు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి […]
‘అంకుల్ శామ్’ పిట్రోడాకు తోడుగా మరొకడు… పిచ్చి కూతగాడు…
ఒక పోస్టు సింపుల్గా ఆసక్తికరంగా అనిపించింది… నలుగురు సినిమా తారల ఫోటోల్ని ఒక్కచోట ఫ్రేమ్ చేశారు… అందులో ఒకరు హేమమాలిని, మరొకరు మౌసమీ ఛటర్జీ, ఇంకొకరు జుహీ చావ్లా, వేరొకరు మాధురీ దీక్షిత్… వాటి కింద హేమమాలిని ఆఫ్రికన్ అనీ, మౌసమీ ఛటర్జీ చైనీస్ అనీ, జుహీ చావ్లా వైట్ అనీ, మాధురీ దీక్షిత్ అరబ్బు అనీ రాశారు… అర్థమైంది కదా… శామ్ పిట్రోడా పిచ్చి కూతలకు ఎవరో తమదైన స్టయిల్లో క్రియేటివ్ ప్రశ్నను ఎదురుదాడిగా సంధించాడని..! […]
హీరో తలకు దెబ్బ.., మెమొరీ లాస్, డేటా కరప్ట్… మళ్లీ దెబ్బ, డేటా రికవరీ…
Subramanyam Dogiparthi…. దసరా బుల్లోడు జైత్రయాత్ర కొనసాగుతూ ఉండగానే విడుదలయి , వంద రోజులు ఆడిన చక్కటి సెంటిమెంటల్ , మ్యూజికల్ హిట్ 1971 లో వచ్చిన ఈ పవిత్ర బంధం సినిమా … అక్కినేని- వాణిశ్రీ జోడీలో వచ్చిన మరో గొప్ప సినిమా … కృష్ణంరాజు ఇంకా విలన్ గానే హీరో చేతిలో దెబ్బలు తింటూనే ఉన్నాడు అప్పటికి … కాంచనకు కూడా ప్రేక్షకులు గుర్తుంచుకునే పాత్రే లభించింది ఇందులో… హీరోకి , హీరోయిన్ కి […]
ఓహో… అవి ఆడ ఫిరంగులై ఉంటాయి… అందుకే సివంగులై గర్జించాయి…
అప్పట్లో ఏదో సినిమాలో సుద్దాల అశోక్ తేజ అనబడే ఓ ఘన రాతగాడు ఓ పాట రాశాడు… అదిలా సాగుతుంది… “కాళ్లకి ఎండీ గజ్జెల్, లేకున్నా నడిస్తే ఘల్ ఘల్… కొప్పుల మల్లెల దండల్, లేకున్నా చెక్కిలి గిల్ గిల… రంగే లేని నా అంగీ, జడ తాకితే అయితది నల్లంగీ… మాటల ఘాటు లవంగి, మర్లపడితే అది సివంగి… తీగెలు లేని సారంగి, వాయించబోతే అది ఫిరంగి..’’ బోలెడు ఆశ్చర్యమేసింది… సుద్దాల కలం నుంచి పిచ్చి […]
అక్షరాలా కోటి భూత్ బంగ్లాలు… జస్ట్, అలా వదిలేస్తున్నారు వాటిని…
అకియా… అంటే పాడుబడిన ఇల్లు… భూత్ బంగ్లా… జపాన్లో..! ప్రస్తుతం ఇలాంటి అకియాలు ఆ దేశంలో అక్షరాలా కోటి… అంటే కోటి ఇళ్లున్నయ్, కానీ ఉండటానికి జనం లేరు… అవి అలా పఢావు పడిఉన్నయ్, పాడుబడి పోతున్నయ్… మరేం చేస్తుంది ఆ దేశం… పిల్లల్ని కనేవాళ్లు లేరు, కొత్త కుటుంబాలు లేవు, జనాభా వేగంగా పడిపోతోంది… మిగతా ప్రపంచం మొత్తానిది ఒక బాధ అయితే జపాన్ది మరో బాధ… అఫ్ కోర్స్, చైనా కూడా ఇలాంటి దిశలోనే […]
ఇవి కొత్త తరహా పెళ్లిళ్లు… కలిసే ఉంటారు- కాపురాలు చేయరు… మరి..?!
అప్పట్లో… అంటే వెంకటేష్ వంటి కమర్షియల్ హీరో సైతం కంట్రాక్టు మ్యారేజీ సబ్జెక్టు మీద, అత్యాచార బాధితురాలిని పెళ్లి చేసుకోవడం మీద కూడా సినిమాలు చేసిన బంగారు రోజుల్లో అన్నమాట… ఇప్పుడంటే బూతునాయుడు వంటి వెబ్ సీరీస్ చేసుకుంటున్నాడు… పూలదుకాణం స్థానంలో కట్టెల మండీ పెట్టుకున్నట్టు… తను అప్పట్లో ఓ సినిమాలో సౌందర్యను కంట్రాక్టు మ్యారేజీ చేసుకుంటాడు… (పవిత్రబంధం..? ఆరేడు ఇతర భాషల్లోకి కూడా అనువదించిబడి హిట్లు కూడా కొట్టింది…) వెంకటేష్ తండ్రి పాత్రను ఎస్పీ బాలు […]
రాహుల్ సభకు ఏమిటీ పూర్ రెస్పాన్స్..? ఏదో తేడా కొడుతున్నట్టుంది..!!
ఎక్కడో ఏదో తేడా కొడుతోంది… హైదరాబాద్లో రాహుల్ సభకు జనం లేకపోవడం ఖచ్చితంగా కాంగ్రెస్ ఆత్మసమీక్ష అవసరమని తెలియజెబుతోంది… రేవంత్ రెడ్డిని బలహీనపరచడానికి ఏమైనా ప్రయత్నాలా..? ఈ ఎన్నికల్లో సరైన సీట్లు రాకపోతే తనను బలిపెట్టాలనే ఆలోచనలా..? సభాస్థలికి జనం రాకపోవడంతో చాలాసేపు రాహుల్ వెయిట్ చేయాల్సి వచ్చింది… జన సమీకరణ దాకా ఎందుకు..? నగరంలోని కేడర్ సరిగ్గా హాజరైతే చాలు కదా సభాస్థలి నిండుగా కనిపించడానికి… నిజానికి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సిటీ, మెదక్ ప్రాంతాల్లో […]
ఐపీఎల్ క్రికెటర్లు..! ఓ అమ్మకపు సరుకు… బాధపడే అర్హత కూడా లేదు..!!
లక్నో ఐపీఎల్ టీం అధినేత (లక్నో సూపర్ జెయింట్స్) సంజీవ్ గోయెంకా హైదరాబాద్ ఐపీఎల్ టీం మీద ఘోరంగా ఓడిపోయాక తమ టీంలోని క్రికెటర్ కేఎల్ రాహుల్ మీద అరిచాడు, కేకలేశాడు, బహిరంగంగానే తూలనాడాడు… అందరూ చూశారు… రోజంతా మీడియా, సోషల్ మీడియా దీన్నే చర్చించింది… రాహుల్, అలా తిట్లు తింటావేమిట్రా, ఛల్, రిజైన్ చేయి, సిగ్గు లేదా, వెళ్లిపో అంటూ బోలెడు సలహాలు… తను ఆల్రెడీ ఒక ఒప్పందంలో బందీ అయ్యాడని తెలియదు పాపం… అలా […]
కొన్ని మోడీ మాత్రమే చేయగలిగాడు… కానీ కొన్నింటిలో సారు గారు ఫ్లాప్…
ఈరోజు పొద్దున అన్ని పత్రికల్లోనూ ఒక బీజేపీ యాడ్… ఫస్ట్ పేజీ… అందులో ఉన్నదేమిటయ్యా అంటే… అందరికీ ఉచిత వైద్యం, అవ్వాతాతల ఆరోగ్యానికి మన మోడీ గ్యారంటీ… 5 లక్షల వరకూ ఉచిత వైద్యం అనేది ఆ ప్రకటన సారాంశం… ఇది పాజిటివ్ ప్రచారం… కాంగ్రెసోళ్లు గెలిస్తే ముస్లింలకు మన ఆస్తులు పంచుతారు, పుస్తెలు కూడా మిగలనివ్వరు, అయోధ్య గుడికి బాబ్రీ లాక్ వేస్తారు దాకా ప్రధాని నెగెటివ్ ప్రచారం వెళ్లిపోయింది ఈసారి… అఫ్కోర్స్, రాజ్యాంగం రద్దు, […]
జీవితమంతా పని, సంపాదన మాత్రమేనా..? దేహం ఓ యంత్రమేనా..?
Veerendranath Yandamoori….. ఒలంపిక్స్ పరుగు పందెం జరుగుతోంది. మూడో బహుమతి పొందినవాడు భారతీయుడు. నాలుగవ స్థానంలో ఉన్నవాడు కూడా భారతీయుడే. మూడో స్థానం (కాంస్య పతకం) వచ్చిన వాడికి ప్రభుత్వం 50 లక్షలు బహుమతి ఇచ్చింది. ఉద్యోగం ఇచ్చింది..! స్టాటస్టిక్స్ చూస్తే మూడోవాడికీ, నాలుగోవాడికీ తేడా 0.01 సెకను మాత్రమే. స్ప్లిట్ సెకండ్ కి అంత విలువ ఉంది. దాన్నే ‘క్షణంలో వెయ్యవ వంతు’ అని రచయితలు అంటారు. ‘సమయాన్ని వృధా పరుచుకోవద్దు’ అంటే నా ఉద్దేశం […]
హీరో మారువేషం అంటేనే అది… ప్రేక్షకులు తప్ప ఎవరూ గుర్తుపట్టరు…
Subramanyam Dogiparthi…. రైతుల కష్టాల మీద , కార్మికుల కష్టాల మీద , పేదల పాట్ల మీద సినిమాలు వచ్చే ఒకనాటి రోజుల్లో వచ్చిన సినిమాలు ఇవి . 1971 లో బి ఏ సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన రైతుబిడ్డ సినిమాలో NTR , వాణిశ్రీలు జంటగా నటించారు . వంద రోజులు ఆడింది . ఇలాంటి కధాంశంతో మన తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి . ANR అర్ధాంగి , కృష్ణ పాడిపంటలు వగైరా . […]
- « Previous Page
- 1
- …
- 131
- 132
- 133
- 134
- 135
- …
- 484
- Next Page »