Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓ ప్రధాని మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసినట్టు… రోడ్రిగో కథే వేరు…

May 15, 2025 by M S R

.

ఒక ప్రధాని… తరువాత ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిస్తే… పోనీ, ఒక ముఖ్యమంత్రి… తరువాత తనే ఓ పంచాయతీ సర్పంచిగా పోటీ చేసి గెలిస్తే… అదుగో అలాగే ఉంది రోడ్రిగో డ్యుటెర్టో పరిస్థితి…

రోడ్రిగో అంటే తెలుసు కదా… ఫిలిప్పీన్స్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు డ్రగ్స్ మీద యుద్ధం ప్రకటించాడు… అదొక రకం బుల్‌డోజర్ యుద్ధం… కేసులు పెట్టడం, విచారించడం, శిక్షించడం వంటివేమీ ఉండవ్…

Ads

పోలీసులకు సందేహాలొస్తే చాలు, ఎవరైనా డ్రగ్స్ పెడ్లర్ అని చెబితే చాలు… వెళ్లడం, కాల్చేయడం… వేల మందిని అలా ఖతం చేశాడు… వేల మందితో జైళ్లు కిటకిట… ఈ యుద్దంలో మొత్తం 12 వేల మంది దాకా మరణించగా, నేషనల్ పోలీసు కాల్పుల్లోనే 2,555 మంది నేలకొరిగినట్టు హ్యూమన్ రైట్స్ వాచ్ ప్రకటించింది…

సరే, అన్ని రోజులూ ఒకలా ఉండవు కదా… అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) ఈ అరాచక మానవ హక్కుల ఉల్లంఘనను సీరియస్‌గా తీసుకుంది… ప్రస్తుతం నిర్బంధంలో ఉన్నాడు… కుటుంబం మొత్తం రాజకీయాల్లోనే యాక్టివ్ అయిపోయింది… నిర్బంధంలోనే ఉంటూ రోడ్రిగో తన సొంత నగరం దవావ్ మున్సిపల్ ఎన్నికల్లో నిలబడ్డాడు… ప్రత్యర్థికన్నా 8 రెట్లు వోట్లతో గెలిచాడు…

ఇప్పటిదాకా మేయర్‌గా ఉన్న తన చిన్న కొడుకు సెబాస్టియన్‌ను డిప్యూటీ మేయర్‌గా ప్రకటించారు… (ఫిలిప్పీన్స్ ప్రజాప్రతినిధుల ఎన్నికల విధానం కాస్త డిఫరెంటు)… పెద్ద కొడుకు పాలో ప్రతినిధుల సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు…

బిడ్డ పేరు సారా డ్యుటెర్టో… నిధుల దుర్వినియోగం, అధ్యక్షుడు ఫెర్డినాండ్, ఆయన భార్య, సభాధ్యక్షుడిపై హత్యాప్రయత్నం ఆరోపణలున్నాయి ఆమెపై… వచ్చే జులైలో ఆమె అభిశంసనను ఎదుర్కొనాల్సి ఉంది… ఈ స్థితిలో సోదరులు, తండ్రి ప్రజాప్రతినిధులుగా తిరిగి ఎన్నిక కావడం, జనం కూడా ఆ కుటుంబం పట్ల ఆదరణ చూపిస్తుండటం ఆమెకు ఇప్పుడు పెద్ద రిలీఫ్…

ఒకవేళ ఆమెను నిర్దోషిగా విడుదలవాలంటే 24 మందిలో 9 మంది సెనేటర్లు ఆమెకు మద్దతుగా వోటు వేయాలి… లేకపోతే ఆమెను శాశ్వతంగా ఎన్నికలకు అనర్హురాలిగా ప్రకటిస్తారు… ఇప్పుడు జనంలో తమ కుటుంబం పట్ల మళ్లీ ఆదరణ పెరిగినందున 9 వోట్లు వస్తాయని ఆమె నమ్మకం…

ప్రస్తుతం 12 స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి… వాటి ఫలితాలు ఫిలిప్పీన్స్ రాజకీయాలను మార్చేసే అవకాశాలున్నాయి…

అంతేకాదు, 2028 లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో ఆమె బలమైన పోటీదారు కాబోతోంది… అన్నీ అనుకున్నట్టు జరిగితే 2028లో రోడ్రిగో కుటుంబం పాలనలోకి వచ్చేస్తుంది ఫిలిప్పీన్స్… అదీ సంగతి…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సింగ్ గీతం – బోలెడు బ్లండర్స్, అది ఎక్కడెక్కడ దెబ్బతిన్నదంటే..?
  • కాళ్లల్లో కట్టెలు – ఆత్మరక్షణలో కిషన్‌రెడ్డి – తేలిపోయిన పేలవ వివరణ
  • BRS + Janasena + BJP … తెలంగాణ ద్వేషి పవన్ గోకుతూనే ఉన్నాడు…
  • అంతటి సిల్క్ సయ్యా అనడిగితే… నై అనే బావమరిది ఎవడుంటాడు..?
  • అనుకున్నదే – రక్తికట్టని ‘సింగ్ గీతం’ – మరీ దయనీయం వసూళ్లు
  • A Global Traveller — మోడీ టూర్ల సెంచరీ — 78 దేశాల పర్యటనలు
  • రాజకీయ కలకలం – ఠాక్రేకు మరో భంగపాటు? – జార్ఖండ్‌లో మరో ఘట్టం
  • BJD — పట్నాయక్ పార్టీ మనుగడే ప్రశ్నార్థకం — వారసుల్లేరు, నాయకుల్లేరు
  • Pepsi Blunder — ఓ మార్కెటింగ్ తొందరపాటు — దేశమంతా అల్లర్లు
  • ఆరుట్ల స్కూల్ — ప్రతి సర్కారు బడి ఇలా మారిపోతే ఎంత బాగుండు..!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions