ఆయనే సీసీఎల్ఏ, ఆయనే చీఫ్ సెక్రెటరీ… ఫార్మాసిటీ ప్రకటనకు ముందే భార్య పేరిట 25 ఎకరాలు, బావమరిది 100 ఎకరాలు, బంధువులకూ భూకొనుగోళ్లు… వందల కోట్ల విలువ చేసే ఆ భూములే కాదు, ఓ ఐపీఎస్ ఏకంగా 200 ఎకరాలు కొన్నాడట… వీళ్లందరూ చాలా చౌకగా కొనుగోలు చేయడం అంటే ఆ రైతులను నిండా ముంచేయడం… దీన్ని మించిన మోసం మరొకటి ఉంటుందా..? వీళ్లే కాదు, నాయకులు, సీనియర్ అధికారులు కూడా ఎడాపెడా కొనేశారు… అందుకే రేవంత్ […]
ఇక్కడ ఓట్లు దిద్దబడును… కొత్త ప్రజాస్వామ్యం రుద్దబడును…
సునిశితమయిన హాస్యంతో గుండెలు మెలిపెట్టే విషయాలను చెప్పడంలో చెయి తిరిగిన రచయిత జి ఆర్ మహర్షి దాదాపు దశాబ్దం క్రితం ప్రజాస్వామ్యంలో ఎన్నికల విచిత్రాల మీద ఒక వ్యంగ్య వ్యాఖ్య రాశారు. అందులో- సాధారణ ఎన్నికల ప్రచారం హోరెత్తుతూ ఉంటుంది. సభలు, ర్యాలీలు, మైకులు, నినాదాలు, పొగడ్తలు, తిట్లతో ఊరూ వాడా ఊగిపోతూ ఉంది. ఒక ఊరి పక్కన అడవిలో జంతువులకు ఈ ఎన్నికల హడావుడి అంతా విచిత్రంగా అనిపిస్తుంది. ఏమిటిదంతా అని ఆరా తీస్తాయి. ప్రజాస్వామ్య […]
అచ్చంగా ఓ టీవీ సీరియల్… తోడికోడళ్ల ఈర్ష్యలు, కుట్రలు… ఈ సీఎం ఫ్యామిలీ కూడా…
సినిమాల్లో… ప్రత్యేకించి టీవీ సీరియళ్లలో చూస్తుంటాం కదా… ఒక్క ఇంట్లోనే అత్తాకోడళ్లు, తోడికోడళ్లు ఒకరిని ముంచడానికి మరొకరు, వీలైతే చంపడానికి కూడా కుట్రలు, ప్రయత్నాలు గట్రా… సోవాట్, ఇంటింటి రామాయణాలే కదా అంటారా..? సరే, ఆ చర్చలోకి ఇప్పుడెందుకు గానీ… జార్ఖండ్ ముక్తిమోర్చా, విభజన ఉద్యమనేత శిబూ సోరెన్ కుటుంబం మాత్రం అచ్చం అలాంటిదే… పలు అవినీతి, అక్రమాల ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన హేమంత్ సోరెన్ కథ తెలిసిందే కదా… తను దిగిపోయే సిట్యుయేషన్ వచ్చినప్పుడు […]
ఈ సినిమా పాటలో కృష్ణను ఎన్టీయార్ ఆవహించేస్తాడు… కాంచనను కూడా…!!
Subramanyam Dogiparthi…… 1968 లో వచ్చిన ఈ నేనంటే నేనే సినిమాలో కృష్ణ , కాంచనలకు పాటల షూటింగులో NTR ఆవహించాడు . గుంతలకిడి గుంతలకిడి గుమ్మా పాటలో మాట వీర పాపులర్ ఆరోజుల్లో . ఈ పాటలో కృష్ణ కాంచన పిర్రల్ని వాయించి వదలి పెట్టాడు . చివర్లో కాంచన కూడా కృష్ణ పిర్రల్ని వాయించేసింది . కృష్ణ , కాంచన ఇద్దరూ నటనా విహారం చేసారు . చాలా ఎనర్జిటిక్ గా , చలాకీగా […]
కొత్త సీఎంగా జార్ఖండ్ టైగర్… అసలు ఎవరీ చంపయ్ సోరెన్..? ఆ కుటుంబమేనా..?
అందరూ ఊహించినట్టుగా…. జార్ఖండ్ ముఖ్యమంత్రి కుర్చీని హేమంత్ సోరెన్ భార్య కల్పన సోరెన్ అధిరోహించడం లేదు… హఠాత్తుగా జార్ఖండ్ టైగర్ అని పిలవబడే చంపయ్ సోరెన్ ముఖ్యమంత్రిగా తెర మీదకు వచ్చాడు… ఇంట్రస్టింగు… నిజానికి అందరూ అనుకున్నదేమిటంటే… హేమంత్ తన కుర్చీని ఇంకెవరికీ ఇవ్వడు, తన భార్యనే మరో రబ్రీదేవిగా కుర్చీపై కూర్చోబెడతాడు అనుకున్నారు… రాజకీయంలో ఎప్పుడేం జరుగునో ఎవరూ చెప్పలేరు కదా… తెర వెనుక రాజకీయం ఏం జరిగిందో ఏమో గానీ చంపయ్ సోరెన్ పేరు […]
అయోధ్య ఆలయాన్ని వ్యతిరేకిస్తావా..? ముందు ఈ కాలనీ నుంచి వెళ్లిపో…!
ఆమె పేరు సురనా అయ్యర్… కాంగ్రెస్ లీడర్ మణిశంకరన్ అయ్యర్ బిడ్డ… తెలిసిన సమాచారం మేరకు ఆమె న్యాయవాది… చాలామంది లౌకికవాదుల్లాగే హిందూమతం అంటే ద్వేషం… సరే, ఆమె ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది… ఎందుకంటే..? మొన్న అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగింది కదా… దాన్ని వ్యతిరేకిస్తూ ఆమె జనవరి 20 నుంచి 23 వరకు నిరసన దీక్ష చేసింది… ఇదేమిటమ్మా అంటే… ఆలయ నిర్మాణానికి నిరసనగా ముస్లింలకు సంఘీభావంగా… హిందూవాదం, జాతీయవాదం పేరిట పెరుగుతున్న మత ఆధిపత్య […]
ప్రజల పాటకు గౌరవం… నందుల్లేవ్, సింహాల్లేవ్… ఇక గద్దర్ అవార్డులు…
గద్దర్ కి అత్యున్నత నీరాజనాలు… గద్దర్ మా లెజెండ్. మా బ్రాండ్. రాష్ట్ర అంబాసిడర్. ఇక నుంచి సినీ ప్రముఖులకు ఇచ్చే నంది అవార్డులే కాదు, కవులు కళాకారులకు ఇచ్చే అన్ని పురస్కారాలు గద్దర్ పేరిటనే ఇస్తాం… ఈ ఉగాది తోనే గద్దర్ పురస్కారాలు ప్రారంభం. వచ్చే ఏడు నుంచి గద్దర్ జయంతి రోజే వారి పేరిట పురస్కారాల ప్రధానం చేస్తాం. ఘనంగా స్మరించుకుంటాం. ఇది నా శాసనం. నా మాటే జీవో. మరో మాట. సభలో […]
*గుళ్లు అంటే పిక్నిక్ స్పాట్స్ కావు… టూరిస్ట్ ప్లేసులు కావు…*
వేరే మతానికి చెందిన వ్యక్తులు ఓ గుడి ఆవరణలోకి ప్రవేశించి, చేతుల్లో తమ పవిత్ర గ్రంథాన్ని పట్టుకుని ప్రార్థనలు చేయడానికి ప్రయత్నించారు… ఓ పిక్నిక్కు వచ్చినట్టుగా ఫోటోలు తీసుకుంటూ అక్కడే భోజనాలు చేయడానికి ప్రయత్నించారు,.. తమిళ మీడియాలో కూడా ఈ వార్తలు వచ్చాయి… అలాంటి పరమతస్తులను ఇదేమిటని ప్రశ్నిస్తే నాన్-హిందూస్ రావొద్దని ఎక్కడైనా రాసి ఉందా అని ఎదురు ప్రశ్నించారు… దీంతో సెంథిల్ కుమార్ అనే పిటిషనర్ కోర్టుకెక్కాడు… దుండిగల్ జిల్లాలోని అరుల్మిగు పళని దండాయుధపాణి గుడిలోకి […]
మీరు ఏమైనా ఇస్తారు సరే… ఇంతకీ తను మళ్లీ పాలిటిక్సులోకి వస్తానన్నాడా..?!
ఒక వార్త… ఏదో పత్రికలో కనిపించింది… ఎన్నికల వేడిలో చాలా గాసిప్స్ వస్తుంటాయి, చదవాలి, వదిలేయాలి… కానీ ఇది కాస్త ఇంట్రస్టింగు… ఎందుకంటే… మొన్ననే పద్మవిభూషణ్ పురస్కారం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం… అదే అందరికీ హాశ్చర్యం… సాధారణంగా పద్మవిభూషణ్ ఇస్తున్నారంటే ఏదో హిడెన్ ఎజెండా ఉంటుంది… ఊరికే పంచిపెట్టరు కదా… పైగా అయోధ్యకు ప్రత్యేక ఆహ్వానాలు పంపించారు… మరి బీజేపీ ఆశిస్తున్న ఫాయిదా ఏముంది అనేది చివరకు బీజేపీ ముఖ్యులకు కూడా అంతుపట్టడం లేదు… అసలు బీజేపీ […]
కుమారి ఆంటీకి రేవంత్ అండ… ఆమె జోలికి పోవద్దు… నేనూ వస్తా అక్కడికి…
రోడ్డు పక్కన ఓ చిన్న మెస్… రుచిగా, చౌకగా దొరుకుతూ ఉండటంతో చాలామంది ఆమె దగ్గర మీల్స్ చేసేవాళ్లు… ఎక్కడి నుంచో వచ్చింది, హైదరాబాదులో పొట్ట పోసుకుంటోంది… నిజానికి ఇలాంటి రోడ్డు పక్కన మెస్సులు హైదరాబాదులో వేలల్లో ఉంటాయి… కానీ ఎవడో సోషల్ మీడియా వాడు ఆమె దగ్గర మీల్స్ ఆహా ఓహో అని ఏదో వీడియో చేశాడు… పాపం, ఆమె కూడా తనకు ప్రచారం వస్తుంది కదా అనుకుందో, లేక ఎవరినీ కాదనలేక సమాధానాలు చెబుతూ […]
హీరోయిన్ షీలాతో నాటి ఎన్టీయార్ ఉక్కు రొమాన్స్… ఫాఫం, ఠారెత్తిపోయింది…
Subramanyam Dogiparthi…… ఈ సినిమా వచ్చిన రోజుల్లో ఒక జోక్ ఉండేది . NTR హీరోయిన్ షీలాల శృంగారం ఘట్టిగా ఉంటుంది . పత్రికలు కూడా వేలెత్తి చూపాయి . షూటింగ్ అంతా అయిపోయాక షీలా విరిగిపోయిన ఎముకల్ని రిపేరు చేయించుకోవటానికి హాస్పిటల్లో చేరిందని జోక్ ఉండేది . యన్ టి ఆరా ! మజాకా ! ప్రముఖ దర్శకులు యస్ డి లాల్ 1968 లో వచ్చిన ఈ నేనే మొనగాడ్ని సినిమాకు నిర్మాత , […]
ఆ కేరళ మంత్రి గారు ఆమె ఆస్తుల్ని సాంతం నాకేశాడు… పైకి శుద్ధపూస…
నటి శ్రీవిద్య ఆస్తులెక్కడ? గణేష్ కుమార్ ఏమయ్యాడు? (నటి శ్రీవిద్య అన్న శంకర్ రామన్ భార్య విజయలక్ష్మి ఇటీవల ఓ తమిళ యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆమె చెప్పిన విషయాలు ఇవి..) నటుడు కమల్‌హాసన్ శ్రీవిద్యను ప్రేమించి మోసం చేశారని, ఆఖరి రోజుల్లో శ్రీవిద్యను కుటుంబ సభ్యులు పట్టించుకోలేదని.. ఇలా రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. అవేమీ నిజం కాదు. నాకు శంకర్ రామన్‌తో 1981లో వివాహమైంది. అప్పటి నుంచి ఆ కుటుంబంలో నేను ఒక […]
ఆ నరుకుడు హోమం పూర్తయింది గానీ… ఇంతకీ నేనెవరిని..? నా పేరేమిటి..?
సలార్ సమీక్ష కాదిది… ప్రతిస్పందన… హీరో చేతి చావు కొన్ని అంతే. అలా జరిగిపోతాయి. దానికి కార్యకారణ సంబంధాలు; గ్రహచారాలు వెతుక్కుని లాభం లేదు. అలా రెండు మూడు చీకటి రాత్రుళ్లు ఆపి ఆపి ఓటీటీలో సలార్ సినిమాకు నేను గురయ్యాను. అనిమల్ సినిమాను ప్రత్యేక దృష్టితో చూడాలని స్వయం ప్రకటిత సినీ మేధావులు ప్రవచిస్తున్నారు. అలా కెజిఎఫ్ బ్రాండ్ ప్రశాంత్ నీల్ సినిమాలను కూడా ప్రత్యేక దృష్టితో చూడాలి. వయసు వల్ల వచ్చిన దృష్టి మాంద్యమో లేక […]
ఉడ్తా తెలంగాణ… కేసీయార్ పాలన సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్… కుళ్లబెట్టారు…
పాత సీఎస్ సోమేష్ భూబాగోతాలు… హెటిరో పార్థసారథికి వేల కోట్ల భూసంతర్పణ… వేల కోట్ల రైస్ మిల్లర్ల సీఎంఆర్ స్కాం… ఆదిలాబాద్ జిల్లాలో పాస్‌పోర్టుల స్కాం… టీఎస్పీఎస్సీ లీకేజీల కుట్రలు… 59 జీవో వందల ఎకరాల భూకబ్జాలు… మైండ్ బ్లాంకయ్యే కాలేశ్వరం మేత, కుంగుబాటు… కోటితప్పుల ధరణి స్కాం… రెరా బాలకృష్ణుడి వందల కోట్ల సంపాదన… హైవేలతో పాటు లక్షల ఎకరాల వ్యవసాయేతర భూములకు కూడా డబ్బులిచ్చిన రైతుబంధు… ఆమధ్య చెప్పుకున్నాం కదా… కేసీయార్ హయాంలో సాగిన […]
దక్షిణం సేమ్… ఉత్తరం సేమ్… దైవ భక్తి, మత విశ్వాసాల్లో ఏ తేడా లేదు…
ఇది చాన్నాళ్లుగా ఉన్నదే… దక్షిణ భారతానికీ, ఉత్తర భారతానికీ నడుమ పోలికలు, తేడాలు చెప్పుకోవడం… అనేక అంశాల్లో…! మత ఆచరణ, దేవుడు, భక్తి అనే విషయాలకు వస్తే దక్షిణ భారతంలో హేతువాదం, నాస్తికత్వం, ఆధునిక లౌకికవాదం గట్రా ఎక్కువనీ, కానీ ఉత్తర భారతంలో మూఢభక్తి, భక్తి, మతతత్వం, సంప్రదాయ ధోరణులు అధికమనే వాదనలు వినిపిస్తుంటాయి… అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఈ చర్చ మళ్లీ మొదలైంది… కానీ… నిజమేనా..? దిప్రింట్ వెబ్సైట్ దీనిపై ఓ ఆసక్తికరమైన కథనాన్ని పబ్లిష్ […]
తెలంగాణ అంటే తాగుడు కాదు… ఇదుగో ఈ హృద్యమైన పెళ్లితంతు కూడా…
ఆమధ్య దసరా సినిమా… ఫుల్లు తాగుడు నింపేశాడు దర్శకుడెవరో గానీ..! తెలంగాణ బొగ్గుగనుల నేపథ్యంలో కథ నడిపించినా సరే తెలంగాణ స్పెసిఫిక్ కల్చర్ పెద్దగా కనిపించలేదు… మాటలు, పాటల్లో కూడా కమర్షియల్ లైనే అగుపించింది… బలగం సినిమాలో కూడా తాగుడుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినా సరే… ఒక చావు, కుటుంబసభ్యుల మధ్య సంబంధాల పునరుద్దరణ స్టోరీ లైన్ కాబట్టి, అది పల్లె జనానికి కనెక్టయింది ప్రధానంగా… తెలంగాణ పల్లెలో అంత్యక్రియలు, పిట్టకు పెట్టుడు, పెద్ద కర్మ ఎట్సెట్రా […]
Uma Ilakkiya… రాముడి మీద అవాకులు చవాకులు… మరి డీఎంకే మనిషి కదా…
Uma Ilakkiya… ఈమె పేరు కాస్త ట్విట్టర్లో (ఎక్స్) సెర్చ్ చేయండి… ఈ పేరున్న ఆవిడ రాముడిని బూతులు తిడుతున్న వీడియో, వ్యాఖ్యలు చదవొచ్చు, చూడొచ్చు… అంతేనా… దేశోద్దారకుడు స్టాలిన్ నుంచి ఏదో పురస్కారం తీసుకుంటున్న ఫోటోలు, ఆ పక్కనే స్టాలిన్ రాజకీయ వారసుడు, సనాతన ధర్మ విరోధి ఉదయనిధి ప్లస్ ఒకరిద్దరు డీఎంకే పెద్దలూ కనిపిస్తారు… ఆమె స్వయం ప్రకటిత జర్నలిస్టు కమ్ యాంకర్ కమ్ యాక్టివిస్ట్ కమ్ వాటెవర్… డీఎంకే సన్నిహితురాలు… అదేదో పదవి […]
బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు..! కేసీయార్ తాజా అడుగులు, ఆలోచనలు అదే దిశలో..!!
రాజకీయాల్లో ఇది జరగదు, జరగడం కష్టం అంటూ ఏమీ ఉండవు… లుప్తమైన రాజకీయ విలువల వాతావరణంలో ఏదైనా సాధ్యమే… ప్రజాప్రతినిధుల కొనుగోళ్లలో, ప్రలోభపెట్టడంలో, లాగేయడంలో అటు కేంద్రంలో బీజేపీ, ఇటు రాష్ట్రంలో కేసీయార్ కొత్త కొత్త బెంచ్ మార్క్స్ క్రియేట్ చేసి పెట్టారు… అన్ని రాష్ట్రాల్లోనూ అధికారం కోసం ఆడే నంబర్లాటలో అసలు పార్టీలు మారడం అనేదే పెద్ద విశేషం కాకుండా పోయింది… ఓ వార్త కనిపించింది… రేవంత్ రెడ్డి సర్కారు తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి, […]
పిచ్చి రేగుతోంది..! ట్రూ… ‘పిచ్చి మందుల’ అమ్మకాల్లో భారీ పెరుగుదల..!!
జాతీయ స్థూల పిచ్చాభివృద్ధి… ఏమిటా పిచ్చి మాటలు ? అని విసుక్కుంటాం కానీ నిజానికి ఎవరి పిచ్చి వారికి అక్షరాలా ఆనందం; కొందరికి ఆ పిచ్చే పరమానందం; కొద్దిమందికి ఆ పిచ్చే బ్రహ్మానందం. మానసికశాస్త్రవేత్తలు నయం చేయగలమనుకునేది ఒక స్థాయి పిచ్చి . మానసిక వైద్యులు నయం చేయగలమనుకునేది తరువాత స్థాయి పిచ్చి . నిజానికి ఎవరూ నయం చేయలేనిదే అసలయిన పిచ్చి . ఇది అమూర్తం . మాటలకు అందీ…అందదు . చూపులకు కొద్దిగా అందుతుంది . […]
ఆ శంకరాభరణంలో శంకరశాస్త్రి భార్యే గనుక బతికే ఉండి ఉంటే..?
శంకరశాస్త్రి భార్య బతికే ఉంటే? ‘శంకరాభరణం’ చూశారుగా! అందులో శంకరశాస్త్రి భార్య బిడ్డను కనే సమయంలో మరణిస్తుంది. ఆయన మరో పెళ్లి చేసుకోకుండా కూతుర్ని పెంచుతాడు. ఆ సమయంలో వేశ్యా వృత్తి చేసుకునే ఇంట పుట్టిన తులసి ఆయన ఇంట్లో ఆశ్రయం పొందుతుంది. జనం అనుమానపడతారు. ఆయన్ని అవమానాలపాలు చేస్తారు. ఇదంతా గ్రహించిన తులసి ఆయనకు చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్లిపోతుంది. ఆపై కథ మనకు తెలుసు! ఒకవేళ శంకరశాస్త్రి భార్య బతికే ఉంటే ఆయన తులసిని […]
- « Previous Page
- 1
- …
- 137
- 138
- 139
- 140
- 141
- …
- 456
- Next Page »