Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఏది అసలు..? ఏది నకిలీ..? ఓ మహాత్మా..!

January 9, 2021 by M S R

fake

సీన్ ఒన్ ——— ఐ టీ అధికారుల బృందం:- హలో! ఎవరండీ ఇంట్లో? మేము రియల్ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్లం. ఇది మా ఐ డి కార్డు. ఇది నోటీసు. తలుపులు తెరవండి. కిటికీలో నుండే ఎంత సేపు మాట్లాడతారు? ఇంటి యజమాని:- ఊరుకోండి. మాకు తెలియదా? మేము న్యూస్ ఛానల్స్ చూడమా? మా అమ్మాయి గూగుల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫోన్ నంబర్ పట్టుకుంది. ఆమెతో కనుక్కుని కన్ఫర్మ్ అయితే తలుపు తీస్తాం. […]

భలే వార్త..! ఓహ్… ఐటీ దాడులు, ఉల్టా దాడులు ఇలా కూడా ఉంటయా..?!

January 8, 2021 by M S R

nandi medaram

ముందుగా ఒక వార్త చదవండి… ఐటి శాఖ అధికారులపై దాడి… పెద్దపల్లి జిల్లా నందిమేడారంలో దారుణం… క్వారీలో తనిఖీకి వెళ్ళిన ఇద్దరు ఐటి అధికారులను చితకబాదిన సిబ్బంది… గాయాలతో కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిక… దాడికి పాల్పడ్డ ఇద్దరిని అరెస్ట్ చేసిన ధర్మారం పోలీసులు… పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం శివారులోని కంకర క్వారీలో దారుణం జరిగింది… క్వారీ నిర్వాహకులు ఆదాయపు పన్ను శాఖ అధికారులపై దాడి చేశారు… దాడిలో ఇద్దరు ఐటి శాఖ అధికారులు గాయపడ్డారు… వారిని […]

రామోజీ బాటలో జగన్..! తప్పదు, నష్టాలు నషాళానికి అంటితే అంతే…!!

January 8, 2021 by M S R

sakhsi

అధికారంలో ఉన్నాం కదా, బోలెడు మార్గాల నుంచి డబ్బు వస్తుంది… సాక్షికి నాలుగు పైసలు పడేస్తే చాలు…… ఇలా అనుకుంటే చివరకు పుట్టి మునిగిపోతుంది… మార్కెట్‌ను బట్టి ఆ దుకాణం నిర్వహణ ఉండాలి…… నష్టాలు నషాళానికి అంటితే తప్ప జగన్‌కు ఈ తత్వం బోధపడలేదు… దాంతో హడావుడిగా ఈనాడు బాట పట్టాడు… నిజం… తెలుగు పత్రికలన్నింటికీ ఈరోజుకూ ఈనాడే మార్గదర్శి… అవలక్షణాలకు, కాసిన్ని మంచి లక్షణాలకు కూడా…! అందరికీ తెలిసిందే కదా, పత్రికా పరిశ్రమ సంక్షోభంలో ఉందని…! […]

చెట్టు గొంతులో దిగి… ఏకు మేకవుతుంది..!

January 8, 2021 by M S R

nail free tree

“చెట్టునురా -చెలిమినిరా తరువునురా – తల్లినిరా నరికివేయబోకురా కరువు కోరుకోకురా అమ్మనురా అమ్మకురా కొడుకువురా కొట్టకురా —- నేలతల్లి గుండెలో విత్తనాల గొంతులో పసిపెదవుల నా గీతం ప్రకృతికి సుప్రభాతం మీకు నచ్చలేదటరా పచ్చనాకు సంగీతం —– చంటిపాప కాళ్లతో ఎదపై తన్నినా దీవెనగా తల్లి ఆనందాశ్రులు రాల్చినట్లు రాళ్లను విసరే మీకు పళ్ళను అందిస్తున్నా —– పనికిరాని గాలిని ప్రాణవాయువొనరించి కాలుష్యం నుండి మిమ్ము కాపాడాలి మా పుట్టుక నుండి మీపైనే కద జాలి —– […]

గువ్వ, మొగ్గ, మింగు, పత్తి, పులిహోర..! క్షమించండి… ఇవన్నీ ఇప్పుడు బూతులే…

January 8, 2021 by M S R

abusive

ఒక పదాన్ని దాని అసలు అర్థం గాకుండా… వ్యంగ్యం కోసమో, విమర్శ కోసమో వేరే అర్థంలో వాడితే… ఫాఫం, ఆ పదాల్ని నిజ అర్థంలో వాడటానికి కూడా భయమేసే పరిస్థితి..! అర్థం కాలేదా..? చెప్పుకుందాం… ఎందుకంటే…? వాటి అర్థాలు తెలిసో తెలియకో గానీ… ఈ తలతిక్క టీవీ షోలు చూసి, యూట్యూబ్ వీడియోలు చూసి, సినిమాలు చూసి… చాలామంది ఈమధ్య, ఆడవాళ్లతో సహా…. పీకినవ్ తీ, తొక్కేమీ కాదు, నీ బొక్క, తొక్కాతోలు… ఇలాంటి పదాలు యథేచ్ఛగా […]

కిలో పసుపు 4660 రూపాయలా..? ఇదేం అడ్డగోలు దోపిడీరా బాబోయ్…!

January 8, 2021 by M S R

lakadong

ఆచి… కాస్త పాపులర్ బ్రాండే… మీరు ఆన్‌లైన్‌లో తెప్పించుకుంటే… అరకిలో పసుపు 90 రూపాయలు… బ్రాండెడ్ గాకుండా మామూలు పసుపు పొడి కావాలంటే మీ కిరాణా షాపుల్లో, మాల్స్‌లో ఇంకా తక్కువ ధరకు కూడా… 150కు కూడా దొరుకుతుంది… అదే జిజిరియా బ్రాండ్ లకడోంగ్ పసుపు ఆర్డర్ ఇచ్చారనుకొండి… 150 గ్రాములకు 699 రూపాయలు అమెజాన్‌లో… అంటే 4660 రూపాయలు కిలోకు…! ఎక్కడ 150 రూపాయలు… ఎక్కడ 4660 రూపాయలు…! ఒక ఊరి ప్రశస్తిని కార్పొరేట్ కంపెనీలు […]

మాటీవీని దాటిన జీటీవీ..? తెలుగు టీవీ చానెళ్ల ఫైట్ ఇప్పుడు రక్తికట్టింది..!!

January 7, 2021 by M S R

telugu gec

మాటీవీని జీటీవీ దాటేసింది..! తెలుగు టీవీ సర్కిళ్లలో ఒక్కసారిగా విపరీతంగా ప్రచారం అవుతున్న వార్త ఇది… అంతేకాదు, జీ తెలుగు వాడు ఇదుగో ఇలా ఓ మెసేజ్ బాగా సర్క్యులేట్ చేస్తున్నాడు… డీజే పెట్టుకుని జీటీమ్స్ తీన్మార్ డాన్సులు చేస్తున్నయ్… ఫుల్ జోష్… నిజమే మరి… రేటింగ్స్ మాయగాడు మాటీవీని దాటేయడం అంటే మాటలా..? దాన్ని కొట్టేయడం అంటే మజాకా..? మాటీవీ మొహం పగిలిపోవడం అంటే పెద్ద వార్తే… అయితే..? ఇక్కడ కొన్ని తిరకాసులున్నయ్… అవి చెప్పుకుందాం.,. […]

పోతినేని రాముడు..! పరమ నిఖార్సయిన ఓ పాపులర్ ‘జాతీయ హీరో’…

January 7, 2021 by M S R

potineni ram

‘తదమ్’ అని 2019లో ఓ సినిమా వచ్చింది… తమిళం… అరుణ్ విజయ్ డబుల్ యాక్షన్… ఆ నిర్మాతకు టేస్టుంది కానీ కమర్షియల్ బుర్ర లేదు… జస్ట్, మన స్రవంతి రవికిషోర్‌కు రైట్స్ అమ్మేసి, వచ్చిన సొమ్ము చూసుకుని మురిసిపోయాడు… ప్చ్, అసలు రూపాయి సొమ్మును రకరకాలుగా యాభై రూపాయలకు అమ్ముకోవడంలో తమిళ వ్యాపారులు ప్రసిద్ధులు… ఫాఫం, ఈయనకు ఏమైందో… సరే, ఈ రవికిషోరుడు అదే సినిమాను మన పోతినేని రాముడు హీరోగా చుట్టేసి… ఇప్పుడు ఏకంగా ఏడు […]

పెద్దపెద్ద తోపు భజన జర్నలిస్టులకే ఒత్తులు, చుక్కలు తెలియవు… వీళ్లెంత..?!

January 7, 2021 by M S R

telugu

అసలు పెద్ద పెద్ద పత్రికల రిపోర్టర్లకే పొట్టచీరితే కాస్త మంచి భాషలో రాయడం తెలియదు… సబ్ ఎడిటర్లకే భాష తెలియదు… మస్తు జీతాలు తీసుకుంటున్న తోపు జర్నలిస్టులకే ఏ అక్షరం పొట్టలో చుక్క పెట్టాలో, దేనికి జట పెట్టాలో, దేనికి దీర్ఘం అవసరమో, ఎక్కడ స్పేస్ అవసరమో తెలియదు… అనవసర ప్రత్యయం అనే పదానికి అర్థం తెలిసినవాళ్లు మొత్తం జర్నలిస్టుల్లోనే అయదారుశాతం ఉండరు… ప్లీజ్, నవ్వొద్దు, నేను ఎవరినీ అవమానించడం లేదు… మేం తోపు ఎడిటర్లం అని […]

… చివరకు మాజీ పెళ్లాల గుండెల్ని కూడా కరిగిస్తోంది కరోనా..!!

January 7, 2021 by M S R

legal battle

అసలే కరోనా కాలం! వంద వద్దులే! యాభై కోట్లివ్వు చాలు! ఎంత చెట్టుకు అంత గాలి. పిండి కొద్దీ రొట్టె లాంటి సామెతలకు కరోనా టైమ్ లో బాగా పాపులారిటీ వస్తోంది. డబ్బున్నవారి కష్టాలు డబ్బున్నవారికే తెలుస్తాయి. వారు నాలుగు కోట్ల బెంట్లీ కారులో తిరుగుతుంటారు కానీ- ఆ నెల ఆ కారు నడిపే డ్రైవర్ కు జీతమివ్వడానికి ఆ కారులోనే వెళ్లి అప్పు అడగాల్సిన పరిస్థితి రావచ్చు. శిఖరం అంచు దాకా వెళ్లడం కష్టం. అక్కడే […]

అఖిలప్రియ కడుపుతో ఉంటే ఏంటట శ్రీమాన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణా..!?

January 7, 2021 by M S R

akhilapriya

భూమా అఖిలప్రియ చేసిన తప్పేమిటి..? ఇదీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశమైన చర్ఛ… అందరికీ తెలుసు… మొదట్లో వైఎస్ అనే పెద్దమనిషి భూమా నాగిరెడ్డి అనే ఓ రియల్ దందా పొలిటిషియన్‌కు మద్దతునిచ్చాడని..! ఏవీ సుబ్బారెడ్డి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు… వైసీపీలో చాలామంది పెద్దలకు, ప్రత్యేకించి సలహాదార్లకు శ్రేయోభిలాషులు… ఓ దశలో చుట్టరికాలు, వియ్యాలు కూడా… హైదరాబాద్ భూములపై గద్దలు, పడగ నీడలు… ఇందులో దాపరికం ఏమీ లేదు… నాగిరెడ్డి ముఠాలు తుపాకులు చేతబట్టి […]

థూమీబచె..! ఇదేం ఖర్మరా తండ్రీ… సంక్రాంతి పండుగ అంటే ఇదా..?

January 7, 2021 by M S R

etv22

ఒక ఈటీవీ లేదా ఒక మల్లెమాల యాజమాన్యాలకో… లేదా ఇంకెవరో టీవీ చానెల్ ప్రబుద్ధుడికో… అంత లోతయిన అవగాహన ఉంటుందని అనుకోలేం కానీ…. పండుగపూట కాసిన్ని మంచి ముచ్చట్లు చెప్పుకోవాలనే మినిమం సోయి మాత్రం ఉండాలి కదా…! ఈమాట అనడానికిముందు ఓ సంగతి చెప్పాలి… ప్రపంచవ్యాప్తంగా పత్రికలు ఇప్పుడు ఓ ట్రెండ్ పాటిస్తున్నయ్… ఓ పెద్ద పేలుడో, ప్రమాదమో, విపత్తో… వంద మంది మరణించవచ్చుగాక, రక్తం ఏరులైపారవచ్చుగాక… ఫస్ట్ పేజీలో ఆ నెత్తుటివాసన కనిపించకూడదు… మనిషిని డిస్టర్బ్ […]

ఫ్లోర్లు ఊడ్చి, టికెట్లు చింపి… చివరకు స్టార్ డైరెక్టర్‌గా ఎదిగి ‘చింపేశాడు’…

January 7, 2021 by M S R

das

….. By… Bharadwaja Rangavajhala…………………….   డిష్యుమ్ డిష్యుమ్ దాస్… భారత దేశ తొలి కౌబాయ్ సినిమా దర్శకుడైన దాస్ డిష్యుం డిష్యుం సినిమాలకు ట్రేట్‌మార్క్‌గా నిలబడిపోయారు. సౌతిండియాలో యాక్షన్ హీరో ఇమేజ్ కావాలంటే… ఎట్టి పరిస్థితుల్లోనూ దాస్ డైరక్షన్ లో చేసితీరాలి. అదీ ఆయన రేంజ్. కె.ఎస్.ఆర్ దాస్ సినిమాల్లో హీరో లెక్కలేనన్ని సాహసాలు చేస్తాడు. దాస్ జీవితంలో కూడా సాహసాలకు కొదవ లేదు. గుంటూరులో ఓ సినిమాహాల్లో బుక్కింగ్ క్లర్క్‌గా జీవితం ప్రారంభించిన దాస్ సినిమా […]

గిదేందివయా అర్విందూ… మీ పార్టీలకు ఒస్త అంటున్నా, గీ లెటర్లు ఏంది..?!

January 7, 2021 by M S R

dharmapuri arvind

‘‘మా డీఎస్, అదే భయ్, మన నిజామాబాద్ ధర్మపురి సీనన్న కొడుకు మంచిగ వ్యాపారంలో డెవలప్ అయ్యిండు, పాలిటిక్సులకు కూడా ఒచ్చిండు… మస్తు షైన్ అవుతున్నడు పిల్లగాడు అనుకుంటిమి… పోయిపోయి బీజేపీల దుంకిండు… పోనీలే, ఏ పార్టీ అయితే ఏంది అనుకుంటిమి..? మెల్లమెల్లగ డీఎస్ కూడా దూరం అయిపోతుండె… మన టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తే ఓ పంచాయితీ, ఉంచుకుంటే ఇంకో పంచాయితీ… పోతేపోనీలే అని ఇడిసిపెడితిమి… ఆమధ్య నన్ను మెచ్చుకుంట యాడనో మాట్లాడిండు, ఖుష్ అనిపించింది… […]

ఆ అమ్మాయి బీఎస్సీ (చేతబడి)… అల్లుడు గారేమో ఎంఎస్సీ (కాష్మోరా)….

January 7, 2021 by M S R

black-magic (1)

అబ్బాయి భూతాల డాక్టర్! అమ్మాయి పిశాచాల సర్జన్! ———————— ఇది పూర్తిగా దయ్యాలకు సంబంధించిన అకెడెమిక్ సబ్జెక్ట్. ఇష్టం లేనివారు, భయపడేవారు ఇక్కడితో చదవడం ఆపేయగలరు. భూత, ప్రేత, పిశాచ, శాకినీ, ఢాకిని…ఇలా దయ్యాల్లో ఎన్నో రకాలు. అన్ని దయ్యాలూ చెడ్డవి కావు. కొన్ని దయ్యాలే మంచివి కావు. విఠలాచార్య సినిమాలతో తెలుగులో దయ్యాలకు సెలెబ్రిటీ హోదా వచ్చింది. వంశపారంపార్యంగా మనకందిన విజ్ఞానం ప్రకారం- దయ్యం తెల్ల రంగు, లేదా బూడిద రంగుతో ఉంటుంది. కళ్లల్లో గుంతలు […]

ఓ తెలుగు అలెక్సా..! ఎట్లున్నవ్..?

January 6, 2021 by M S R

telugu alexa

గూగుల్ సెర్చ్ ఇంజిన్ లేకపోతే ఎన్ని బతుకు ఇంజిన్లు ఆగిపోయేవో? గుండు సూది నుండి అణుబాంబుల తయారీ వరకు ఏదడిగినా తడబడకుండా, సిగ్గులేకుండా టక్కుమని చెబుతుంది గూగుల్. సమాచార సముద్రాన్ని కొన్ని లక్షల, కోట్ల పేజీల్లో డేటాగా ఎక్కించి గూగుల్ సమాచార గుత్తాధిపత్యాన్ని సాధించింది. గూగుల్ లో లేనిదాన్ని ఇప్పుడు ప్రపంచం ఒప్పుకోని పరిస్థితి వచ్చేసింది. సాంకేతిక పరిజ్ఞానం మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరించే కొద్దీ అధునాతన ఆవిష్కరణలు, సరికొత్త పరికరాలు రావడం సహజం. అలా […]

డాన్స్ ప్లస్..! అంటే సర్కస్ ఫీట్లే కాదు… తెలుగు భాషపై పోట్లు కూడా…!!

January 6, 2021 by M S R

dance+1

మొన్నమొన్నటిదాకా సాగిన బిగ్‌బాస్ గురించి చెప్పి మళ్లీ విసిగించడం కాదు… అందులో అమ్మారాజశేఖర్ అనే కంటెస్టెంటు తన కిలికిలి భాషతో తెలుగు ప్రేక్షకుల దుంపతెంచాడు… ఆ నీచ బిగ్‌బాసుడికి ఆ భాష తెలుగులా వినిపించేది, మోనాల్‌ను మాత్రం తెలుగు నేర్చుకో అని ఉరిమేవాడు… హారిక, అభిజిత్‌లపై అరిచేవాడు… మన ఖర్మ అనుకున్నాం… రాజశేఖర్ బిగ్‌బాస్ వదిలేరోజున యావత్తు తెలుగు ప్రేక్షకజనం ఆనందాశ్రువులతో వీడ్కోలు పలికి పండుగ చేసుకున్నారు… ఎవరో అడిగారు ఫేస్‌బుక్‌లో… ‘‘ఒరేయ్ బిగ్‌బాసూ, చాలా భాషల్లో […]

ప్రజాశక్తి..! ఇదేం పాత్రికేయం..? మోడీ మీద ఇదేం బురద..?

January 6, 2021 by M S R

modi-vibhav-adani1

అంబానీ, ఆదానీ… ఈమధ్య పదే పదే వార్తల్లోకి వస్తున్న పేర్లు… రైతుల ఆందోళనల్లో ప్రముఖంగా వినవస్తున్న పేర్లు… మోడీ సర్కారు అంబానీలు, ఆదానీలకు జాతిసంపదను దోచిపెడుతున్నదనేది ఆరోపణ… ఉద్దేశపూర్వకంగా చేసే కొన్ని ప్రచారాలు ఎంత వేగంగా వ్యాప్తి చెందుతాయంటే… అంబానీతో మోడీ సర్కారు ఏదో ఒప్పందం కుదుర్చుకున్నదనే ప్రచారం పెరిగి పంజాబ్, హర్యానాల్లో రిలయెన్స్ మొబైల్ టవర్లను, రిటెయిల్ సెంటర్లను ధ్వంసం చేస్తున్నారు… జియో కనెక్షన్ల పోర్టింగ్ పెట్టిస్తున్నారు… ఓరి దేవుడోయ్, కంట్రాక్టు ఫార్మింగు మీద ఆసక్తే […]

జానారెడ్డొచ్చె మొదలాడు..! రేప్పొద్దున అందరూ అవే డిమాండ్లు చేస్తే..?!

January 6, 2021 by M S R

ఎవరో మిత్రుడు ఫేస్‌బుక్‌లో కామెంటినట్టుగానే… ‘‘ఈ కాంగ్రెసోళ్లు తెలంగాణ ఇవ్వడానికి పెద్ద టైం తీసుకోలేదు కానీ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడి ఎంపికకు మాత్రం తరాలు మారేట్టుంది…’’ వ్యంగ్యంగా చెప్పినా సరే, అందులో చాలా నిజం ఉంది… ఎన్నేళ్లయింది టీపీసీసీ అధ్యక్షుడిని మార్చాలని అనుకుని..! నన్ను తక్షణం తీసేసి, ఎవరో కొత్తాయనకు బాధ్యతలు ఇవ్వండి బాబోయ్ అని ఉత్తమకుమారుడే ఢిల్లీలో ఎఐసీసీ ఆఫీసు ఎదుట దీక్ష చేయడం బెటర్ అని జోకులు వినిపించే స్థాయిలో… కథ సాగుతూనే […]

అమితాబ్- రేఖ..! ఆహా…. ఆ జంట మరోసారి వెండితెరపై…!

January 5, 2021 by M S R

rekha-amitabh

అమితాబ్ బచ్చన్… రేఖ…! అసలు ఆ జంట పేరు వింటే, వాళ్లు నటించిన పాత హిందీ సినిమాలు తలుచుకుంటే సినిమా ప్రియులకు ఓ సంబరం… ఒకనాటి ప్రేమికులు… బహుశా నలభై ఏళ్లు దాటిపోయి ఉంటుంది… వాళ్ల బ్రేకప్ జరిగిపోయి..! ఎవరి బతుకులు వాళ్లవే… ఆ ప్రేమాయణంపై బోలెడు కథలు., వార్తలు, కథనాలు, యూట్యూబ్ వీడియోలు… ఎవరు ఏమైనా రాసుకోనీ… ఇన్నేళ్లలో పాత సంగతుల్ని వాళ్లిద్దరిలో ఎవరూ కెలికే ప్రసక్తే లేదు… ఏ ఇంటర్వ్యూల్లోనూ మాట్లాడేది లేదు… గౌరవప్రదమైన […]

  • « Previous Page
  • 1
  • …
  • 137
  • 138
  • 139
  • 140
  • 141
  • …
  • 158
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • సినిమాకు ఓ లేఖ ప్రాణం… ఆ లేఖ దగ్గరే తప్పుదొర్లితే…? అదే సీతారామం…!!
  • నిత్యమేనన్ చేసిన తప్పు…! ఆరేళ్ల క్రితమే వాడి వీపు పగలాల్సింది…!!
  • సింహాలు అమ్మబడును…! దివాలా తీసిన పాకిస్థాన్ సర్కారు పొదుపుపాట్లు..!!
  • నేషనల్ హెరాల్డ్ కేసు ప్రభావం వచ్చే కర్నాటక ఎన్నికల మీద…!
  • బాబ్బాబు… ప్లీజ్… మీరు వస్తుండండి..? పోనీ, నన్నే హైదరాబాద్ రమ్మంటారా..?!
  • టీవీ ప్రేక్షకుల్ని ఈటీవీ, మల్లెమాల పిచ్చోళ్లను చేసి, వెక్కిరించడమే ఇది…!!
  • మిస్సింగ్ గరల్ నంబర్ 166… తొమ్మిదేళ్ల ఓ అన్వేషణ కథ… ఓ పోలీస్ గ్రేట్‌నెస్…
  • ఓహ్… ఆత్రేయ రాసిన ఆ బర్త్‌డే పాటలో అంత ఫిలాసఫీ ఉందా..?
  • హీరోయిన్ కాదు, లేడీ డాన్… మాఫియా క్వీన్… గంగూబాయ్ మీద ఓ రీలుక్…!
  • కడువ..! ఓహ్.., ఇది మలయాళీ సినిమాయేనా..? ఆశ్చర్యంగా ఉందే…!

Archives

Copyright © 2022 · Muchata.com · Technology Support by CultNerds IT Solutions